For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

డార్క్ స్పాట్స్ నివారణకు ఎఫెక్టివ్ హోంమేడ్ టిప్స్

|

డార్క్ స్పాట్స్(చర్మం మీద నల్ల మచ్చలు)చూడటానికి చాలా ఇబ్బందికరంగా ఉంటాయి. డార్క్ స్పాట్స్ కు ముఖ్య కారణం మొటిమలు మరియు మచ్చలు వీటి ద్వారానే చర్మం మీద అనేక మచ్చలు ఏర్పడుతుంటాయి. డార్క్ స్పాట్స్ ఏర్పడిన తర్వాత అంత సులభంగా తొలగిపోవు. డార్క్ స్పాట్స్ లో అధికంగా మెలనిన్ ఉండటం వల్ల ముఖంను నల్లగా మార్చేస్తాయి.

డార్క్ స్పాట్స్ అపక్రమమైన చారలను, మచ్చలను చర్మం మీద ఏర్పరుస్తుంది. ఫలితంగా చర్మం డల్ గా మరియు నిర్జీవంగా కనబడుతుంది . ఈ డార్క్ స్పాట్స్ చెడు లైఫ్ స్టైల్, మరియు ఆహారపు అలవాట్లు, దుమ్మ మరియు ధూళి, కాలుష్యం, హార్మోనుల ప్రభావం మరియు మొటిమలు, మచ్చలు ఇవన్నీకూడా డార్క్ స్పాట్స్ కు కారణం అవుతాయి. ఈ కారణాల వల్ల ఏర్పడ్డ డార్క్ స్పాట్స్ నివారించడం చాలా కష్టం అవుతుంది. అందువల్ల, ఈ డార్క్ స్పాట్స్ ను నివారించడానికి కొన్ని బ్యూటీ టిప్స్ ను అనుసరించాలి.

ముఖాన్నిఅందవిహీనంగా మార్చే నల్ల మచ్చల తొలగింపు ఇలా: క్లిక్ చేయండి

ఈ ఆర్టికల్లో కొన్ని నేచురల్ డార్క్ స్పాట్స్ బ్యూటీ టిప్స్ గురించి వివరించడం జరిగింది. ఈ చిట్కాల వల్ల డార్క్ స్పాట్స్ ను శాశ్వతంగా నివారించవచ్చు . దాంతో చర్మం ప్రకాశవంతంగా మరియు అందంగా మార్చుకోవచ్చు. ఈ డార్క్ స్పాట్స్ బ్యూటీ టిప్స్ ద్వారా చర్మం కాంతిని మెరుగుపరుచుకోవచ్చు. ఎటువంటి, మచ్చలు, మొటిమలు లేని ప్రకాశవంతమైన చర్మం ఛాయను పొందడానికి ఈ చిట్కాలను రెగ్యులర్ గా అనుసరించండి...

తేనె

తేనె

తేనె చర్మాన్ని స్మూత్ గా మార్చడంలో అద్భుతంగా సహాయపడుతుంది. ఇది చర్మంలో దుమ్ము, ధూళి, మలినాలను తొలగిస్తుంది. చర్మాన్ని క్లియర్ గా చేస్తుంది. మరియు చర్మ కణాల పునరుత్పత్తికి సహాయపడుతుంది. దాంతో పాత చర్మకణాలను నివారించబడి, కొత్త చర్మకణాలు ఏర్పడుట వల్ల చర్మం ప్రకాశవంతంగా మారుతుంది. అంతే కాదు, నల్లమచ్చలు, మొటిమలు నివారించి చర్మాన్ని తెల్లగా, కాంతివంతంగా మార్చుతుంది. అందువల్ల, డార్క్ స్పాట్స్ నివారించడానికి తేనెను రెగ్యులర్ గా ఉపయోగించడం మంచిది.

నిమ్మరసం:

నిమ్మరసం:

నిమ్మరసం నేచురల్ బ్లీచింగ్ ఏజెంట్. ఇది ముఖంలో డార్క్ స్పాట్స్ తగ్గిస్తుంది మరియు చర్మం కాంతివంతంగా మార్చుతుంది. నిమ్మరసాన్ని ముఖానికి నేరుగా పట్టించడం వల్ల స్కిన్ ఇరిటేషన్ కలగవచ్చు. కాబట్టి, నిమ్మరసాన్ని కొద్దిగా నీళ్ళు మిక్స్ చేసి అప్లై చేయాలి. లెమన్ జ్యూస్ ను ఫేస్ ప్యాక్ లలో జోడించవచ్చు. ఫలితంగా డార్క్ స్పాట్స్ ను నివారిస్తుంది.నిమ్మరసం రాసిన తర్వాత వెంటనే ఎండలో తిరగకపోవడం మంచిది. లేదంటే చర్మం నల్లగా మారే అవకాశం ఉంది.

పాలు మరియు పాల ఉత్పత్తులు:

పాలు మరియు పాల ఉత్పత్తులు:

పాలు మరియు పాల ఉత్పత్తులలో లాక్టిక్ యాసిడ్ అధికంగా ఉంటుంది. అంతే కాదు, ఇది డార్క్ స్పాట్స్ ను నివారిస్తుంది. అలాగే పాలలో ఉండే కొవ్వు చర్మాన్ని నునుపుగా మరియు సాఫ్ట్ గా మార్చుతుంది. కాబట్టి, మీరు పాలు, పాలక్రీమ్ లేదా పెరుగును నేరుగా చర్మానికి పట్టించవచ్చు అప్లై చేయవచ్చు. 10-15నిముషాలు అలాగే ఉండి తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. డార్క్ స్పాట్స్ ను నివారించడంలో ఇది చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది.

విటమిన్ ఇ

విటమిన్ ఇ

విటమిన్ ఇ చర్మానికి చాలా మంచిది. ఇది ఒక గొప్ప యాంటీఆక్సిడెంట్, ఇది చర్మంలో మరియు శరీరంలోని టాక్సిన్స్ ను నివారించడంలో అగొప్పగా సహాయపడుతుంది. విటమిన్ ఇను ఉపయోగించిన తర్వాత చర్మం చాలా తాజాగా మరియు ఫ్రెష్ గా కనబడుతుంది. కాబట్టి, విటమిన్ ఇ ఆయిల్ ను ముఖానికి పట్టించి రాత్రంతా అలాగే ఉంచి, ఉదయం శుభ్రం చేసుకోవచ్చు. విటమిన్ ఇ సప్లిమెంట్ ను కూడా అందుకు తీసుకోవచ్చు.

పసుపు

పసుపు

పసుపును రెగ్యులర్ గా ఉపయోగించడం వల్ల, డార్క్ స్పాట్స్ ను ఎఫెక్టివ్ గా తగ్గిస్తుంది మరియు చర్మం యొక్క రంగును ఎఫెక్టివ్ గా మార్చుతుంది. డార్క్ స్పాట్స్ ను నివారించడానికి పసుపు ఒక బ్యూటీ టిప్ మాత్రమే కాదు, చర్మంను నునుపుగా మరియు కాంతివంతంగా మార్చడానికి సహాయపడుతుంది మరియు పసుపులో ఉండే బ్యాక్టీరియల్ లక్షణాలు చర్మాన్ని మెటిమలను, మచ్చలను ఎఫెక్టివ్ గా మార్చుతుంది. కాబట్టి చర్మానికి సంబందించి అన్నిరకాల సమస్యలను నివారించడానికి పసుపును ఉపయోగించండి.

English summary

Skin Care Tips To Remove Dark Spots

Dark spots are bad, ugly and embarrassing. Acne and Pimples often leave back dark spots on the face. These spots are a pain as they do not go away easily. They have heavy melanin deposits which makes the face look ugly.
Desktop Bottom Promotion