For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వర్షాకాలంలో చర్మం కాంతివంతంగా, స్వచ్చంగా ఉంచే చిట్కాలు

By Mallikarjuna
|

వర్షకాలం మనకు వేడి నుండి ఉపశమనం కలిగిండం మాత్రమే కాదు, ఇది మంచి ఆహ్లాదకరమైన వాతావరణంను కూడా అందిస్తుంది. ఆహ్లాదరకమైన వాతావరణంతో పాటు, వర్షాలకు చర్మ సమస్యలు మరియు ఆరోగ్య సమస్యలు వస్తాయి. అందులో ముఖ్యంగా చర్మం పగుళ్ళు, స్కిన్ ఇన్ఫెక్షన్స్ మరియు చర్మ రంధ్రాలు మూసుకుపోవడం వంటి సమస్యలు వివిధ రకాలుగా ఉన్నాయి.

కాబట్టి, వర్షాకాంలో మంచి స్పష్టమైన మరియు హెల్తీ స్కిన్ కలిగి ఉండటానికి ఇక్కడ కొన్ని చిట్కాలు మీకోసం అంధిస్తున్నాం...

ప్రతి రెండు గంటలకొకసారి మీ ముఖాన్ని శుభ్రం చేసుకుంటుండాలి

ప్రతి రెండు గంటలకొకసారి మీ ముఖాన్ని శుభ్రం చేసుకుంటుండాలి

మీ చర్మం తత్వము ఎటువంటింది అని తెలుసుకోనక్కరలేదు. ప్రతి రెండు గంటలకొకసారి దుమ్ముధూళి చర్మంలో చేరుకోకుండా ఈ సీజన్లో ఈ సింపుల్ జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. ఇంకా మీరు ప్రతి సారి ముఖం కడుక్కోవడానికి బద్దంగా ఉన్నట్లైతే మీవ ద్ద వెట్ వైప్స్ ను ఉంచుకోవడం వల్ల అవసరం ఉన్నప్పుడు అంతా ముఖాన్ని శుభ్రంగా తుడుస్తుండవచ్చు. ఈ వర్షాకాలంలో మీ ముఖంను ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచుకోవడం కోసం ఒక మన్నికైన ఫేస్ వాష్ ను ఎంపిక చేసుకొని, ఉపయోగిస్తుండాలి.

టోనర్ తప్పనిసరి

టోనర్ తప్పనిసరి

ఈ సీజన్ లో మీ చర్మం ఎప్పుడూ తేమగా ఉంచుకోవడా చాలా అవసరం. అందుకోసం ఆల్కహాల్ లేనటువంటి టోనర్ ను ఎంపిక చేసుకొని రోజుకు రెండు సార్లు మీ చర్మానికి అప్లై చేస్తుండాలి. ఇలా చేయడం వల్ల మీ చర్మంలో పిహెచ్ ను సమతుల్యం చేస్తుంది . మరియు ఫర్ ఫెక్ట్ గా చర్మాన్ని కాంతివంతంగా మార్చుతుంది . ఈ సీజన్ లో మీ చర్మాన్ని హెల్తీగా మరియు క్లియర్ గా ఉంచడానికి అలోవెరజెల్ తో తయారుచేసిన టోనర్స్ ఎంపిక చేసుకోవడం ఉత్తమం.

నాణ్యమైన తేలికపాటి మాయిశ్చరైజర్ ను ఉపయోగించాలి

నాణ్యమైన తేలికపాటి మాయిశ్చరైజర్ ను ఉపయోగించాలి

ఈ సీజన్ లో తేమస్థాయి ఎక్కువగా ఉంటుంది. అందువల్ల, బారీ లోషన్లు మరియు క్రీములు అప్లై చేయడం నివారించాలి . ఇవి మీచర్మానికి అత్తుక్కొని మరింత జిడ్డుగా కనబడేలా చేస్తాయి. జిడ్డుగా లేనటువంటి వాటర్ లేదా జెల్ వంటి వాటిని ఉపయోగించవచ్చు.

ఆవిరి పట్టుడం:

ఆవిరి పట్టుడం:

చర్మంలో రంధ్రాలు తెరుచుకొని, చర్మంలోపల చేరిన దుమ్ముధూళి నిర్మూలించడానికి ముఖానికి ఆవిరి పట్టడం చాలా అవసరం. ఆవిరి పట్టిన తర్వాత, కొన్ని నిముషాలు అలాగే ఉండే, తర్వాత ఐస్ ముక్కలతో ముఖం మీద మర్దన చేసుసుకోవాలి. ఇలా చేయడం వల్ల తెరచుకొన్న చర్మ రంధ్రాలు, మూసుకోబడుతాయి.

వారానికి రెండు సార్లు ఎక్స్ ఫ్లోయేట్ చేసుకోవాలి:

వారానికి రెండు సార్లు ఎక్స్ ఫ్లోయేట్ చేసుకోవాలి:

చర్మంలోని అన్నింటికంటే పైపొర వర్షాలకు పొడిగా మారుతుంది. ఈ సమస్యను నివారించడానికి ఎక్స్ ఫ్లోయేట్ చేయడం వల్ల చర్మం నిర్జీవంను మరియు పిగ్మెంటేషన్ నివారించడానికి ఎక్స్ ఫ్లోయేట్ ఒక ఉత్తమ మార్గం. అందుకు వారానికి రెండు సార్లు బీడ్స్ తో స్ర్కబ్ చేయాలి. మరియు కెమికల్ గ్లైకోలిక్ పీల్ నెలకు రెండుసార్లు చేసుకోవడం వల్ల, ఆరోగ్యకరమైన మరియు కాంతి వంతమైన చర్మం అందిస్తుంది.

పుదీనా ఫేషియల్ మంచి ఉపాయం:

పుదీనా ఫేషియల్ మంచి ఉపాయం:

ఈ సీజన్ లో మీ చర్మానికి పుదీనా లేదా బొప్పాయి ఫేషియల్ ఉత్తమం. పుదీనా మీ ముఖానికి కూలింగ్ ఎపెక్ట్స్ ఇవ్వడం మాత్రమే కాదు, మీ ముఖానికి చల్లని ప్రభావాన్ని కలిగిస్తుంది, చర్మ రంధ్రాలను శుభ్రం చేస్తుంది, దాంతో చర్మ రంద్రాల పరిమాణం తగ్గుతుంది. పొడి చర్మం ఉన్నవారికి బొప్పాయి గొప్పగా సహాయపడుతుంది.అంతే కాదు ఇలి చర్మానికి మంచి పోషణను అందిస్తుంది మరియు చర్మాన్ని తేమగా ఉంచుతుంది.

Story first published: Saturday, July 12, 2014, 20:17 [IST]
Desktop Bottom Promotion