For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

చర్మానికి హానికలిగించే 12 అలవాట్లు

|

మన శరీరంలో అత్యంత ముఖ్యమైన అవయవాల్లో ముఖ్యమైనది చర్మం. చర్మం మనకు ఒక రక్షణ కవచంగా ఉంటుంది. అనేక వ్యాధుల నుండి దుమ్మూ, ధూళి, చలి, ఎండ నుండి మన చర్మాన్నికి రక్షణ కవచంలా ఉపయోగపడుతుంది. అలా రక్షణ కవచంలా మనకు సహాయపడే చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవాలంటే హెల్తీ లైఫ్ స్టైల్ ను అనుసరించాలి.

మీ శరీరంలో అతి పెద్ద మరియు అతి త్వరగా ఎదిగే అవయవం మీ చర్మం.మీ శరీరానికి చర్మం రక్షణ కవచం.కానీ దురదృష్టవశాత్తూ చర్మానికి బయటనుండి అనేక రకాల పదార్ధాలు హానికలిగిస్తాయి. అదృష్టవశాత్తూ కింద పేర్కొనపడ్డ 12 పనులని చెయ్యకపోవడం ద్వారా మీ చర్మ సౌందర్యాన్నీ తద్వారా మీ అందాన్నీ కాపాడుకోవచ్చు.

అతిగా ఎండలో తిరగడం

అతిగా ఎండలో తిరగడం

ఒకప్పుడు ఎండలో తిరిగి శరీరం ఎంత టాన్ అయితే అంత ఫ్యాషన్ అనుకునేవారు కానీ మనకి ఇప్పుడు అది మంచిది కాదని తెలుసు.ఎండలో అతిగా తిరగడం ద్వారా రకరకాల చర్మ వ్యాధులు, క్యాన్సర్ లాంటి జబ్బులు కూడా వచ్చే అవకాశం ఉంది.సూర్యుడి నుండి వచ్చే యూవీ కొరణాలు కొంత మందిలో ఎలర్జీ రియాక్షన్స్ లేదా చర్మం కమిలేటట్లు చేస్తాయి.ఇంకా చర్మం మీద మచ్చలు(లివర్ స్పాట్స్,ఎసిటినిక్ కెరటోసిస్,సోలార్ ఎలాస్టోసిస్) కూడా వచ్చే అవకాశం ఉంది. మీ చర్మాన్ని ఈ హాని నుండి తప్పించాలనుకుంటే ఎండలో తిరగడం తగ్గించండి.

సన్ స్క్రీన్ అతికొద్దిగా వాడటం

సన్ స్క్రీన్ అతికొద్దిగా వాడటం

సన్ స్క్రీన్ విషయం లో పిసినారితనం వద్దు.సూర్యుడి యూవీ కిరణాలనుండి రక్షణ కావాలంటే దాదాపుగా మనకి ఒక చిన్న షాట్ గ్లాసుడు/ఒక ఔన్సు ఎస్ పీ ఎఫ్ 30 లేదా అంత కంటే ఎక్కువ ఉన్న సన్ స్క్రీన్ అవసరం .ఆకాశం మబ్బుగా ఉన్నా కూడా సూర్యుని నుండీ వచ్చే యూవీ కిరణాలు మీ చర్మానికి హాని కలిగిస్తాయి.

MOST READ:మీ రాశి ప్రకారం మీ సన్నిహిత సంబంధాల సమస్యలను తెలుసుకొనవచ్చా?

టానింగ్ బెడ్స్

టానింగ్ బెడ్స్

బయట సన్ టాన్ కోసం కూర్చుంటే ఎంత ప్రమాదమో పైన కప్పు ఉన్న టానింగ్ ప్రదేశాలు(ఇండోర్ టానింగ్) కూడ అంతే ప్రమాదకరం మీ చర్మానికి.ఇండోర్ టానింగ్ వల్ల యూవీ కిరణాలు అతి తక్కువ సమయం ఎక్కువ మోతాదులో లో మీ చర్మానికి తగలడం వల్ల చర్మ క్యాన్సర్లలోకెల్లా అతి ప్రమాదకరమైన మెలనోమా,బాసల్ సెల్ కార్సినోమా,స్క్వామస్(పొలుసులతో కూడిన) సెల్ కార్సినోమా లాంటి వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది.ఇంకా చర్మం చిన్న వయసులోనే వడలిపోవడం, ముడుతలు,వయసుతో వచ్చే మచ్చలు,చర్మ తత్వం లో మార్పులు వచ్చే అవకాశం కూడా మెండు. ఇండోర్ టానింగ్ టీనేజీ పిల్లలకి లేదా యుక్తవయసు వారికీ మెలనోమా కలగచేసే అవకాశం ఉంది కావున వారికి ఇండోర్ టానింగ్ అస్సలు మంచిది కాదు.

పొగ త్రాగడం

పొగ త్రాగడం

పొగ త్రాగడం వల్ల హృద్రోగాలు,ఊపిరితిత్తుల క్యాన్సర్,ఎంఫీసెమా, హార్ట్ స్ట్రోక్ వచ్చే ప్రమాదం ఉందని మనందరికీ తెలుసు.కానీ ఈ అలవాటు మీ చర్మానికి హాని కలిగించి చిన్న వయసులో చర్మం రంగు కోల్పోయేటట్లు చేస్తుందని తెలుసా?? పొగ త్రాగడం వల్ల రక్త ప్రసారం తగ్గి చర్మం ముడుతలుపడుతుంది.వాడిపోయి,నిస్తేజం గా ముడుతలుపడి ఉన్న చర్మాన్ని"సిగరెట్ స్కిన్" అంటారు.పొగ త్రాగడం వల్ల గాయాలు త్వరగా మానవు.ఇంకా సోరియాస్ కూడా రావచ్చు. ఒకవేళ సోరియాస్ ఉంటే దాని లక్షణాలు మరింత ఉధృతమవుతాయి పొగతాగేవారిలో. ఒకవేళ మీరు పొగ త్రాగని వారయితే కనుక ఇక పైన మొదలుపెట్టకండి.ఇప్పటికే పొగ తాగుతుంటే ఆ అలవాటు ని తక్షణం విడిచిపెట్టండి.పొగ త్రాగకపోవడం వల్ల మీ చర్మమే కాకుండా శరీరం అంతా కూడా దానివల్ల లాభం పొందుతుంది.

సరిపడని క్లెన్సర్ వాడకం

సరిపడని క్లెన్సర్ వాడకం

మీ ముఖానికి సరిపడని క్లెన్సర్ ని వాడకండి. మీ ముఖం మీది చర్మం శరీరం లో మిగతా భాగాల మీద కంటే సున్నితం గా ఉంటుంది. కనుక మీరు గాఢత తక్కువ ఉన్న క్లెన్సర్ ని వాడండి.సున్నితం గా ఉండి చర్మం మీద రాపిడి కలిగించని, ఆల్కాహాల్ లేని క్లెన్సర్నే మీ ముఖానికి వాడాలి.అలాగే క్లెన్సర్ వాడేటప్పుడు ముఖం మీద రుద్దకండి, ఇది సూనితమైన ముఖ చర్మాన్ని మరింత చికాకు పరుస్తుంది.క్లెన్సర్ వాడాకా సున్నితంగా ముఖం మీద అద్దండి. మీది ఆయిలీ మరియు యాక్నే వచ్చే అవకాశం ఉన్న చర్మం అయితే మీ క్లెన్సర్ లో నూనె లేకుండా , నాన్ కొమెడోజెనిక్(బ్లాక్ హెడ్స్ కలిగించని)క్లెన్సర్ని వాడండి. మీది పొడి చర్మం లేదా తరచూ దురద పెట్టే చర్మం అయితే క్లెన్సర్ తో ముఖం కడుక్కున్నాకా మాయిశ్చరైజర్ రాయాలి.రోజుకి రెండు సార్లు మాత్రమే ముఖం కడుక్కోవాలి.కానీ బాగా చెమట పడితే మాత్రం చర్మం మీద మరింత దురద రాకుండా వెంటనే ముఖం కడుక్కోవాలి.

చర్మాన్ని స్క్రబ్ చేయడం

చర్మాన్ని స్క్రబ్ చేయడం

ఇంతకుముందు చెప్పినట్లు సున్నితమైన ముఖ చర్మాన్ని స్క్రబ్ చెయ్యడం వల్ల చర్మానికి మరింత హాని జరిగి అసహ్యం గా కనిపిస్తుంది.ఒకవేళ మీకు కనుక యాక్నే సమస్య ఉంటే ముఖాన్ని రుద్దడం వల్ల అది మరింత జటిలమవుతుంది.ముఖం కడుక్కునేటప్పుడు వేళ్ళతో వలయాకారంలో రుద్దుతూ కడుక్కోవాలి.స్పాంజ్ లేదా వాష్ క్లాత్ కూడా మీ చర్మాన్ని మరింత చిరాకు పరచవచ్చు.గోరు వెచ్చని నీటితో కడుక్కుని సున్నితం గా ఆరేవరకూ అద్దండి.

MOST READ:మీకు ప్రత్యేకమైన టూత్ పేస్టు అవసరమని తెలిపే 4 లక్షణాలు

మొటిమలని గిల్లడం

మొటిమలని గిల్లడం

మొటిమని చూడగానే గిల్లాలనిపించడం సహజం,కానీ అలా చెయ్యద్దు.మొటిమని గిల్లడం, దానిలోని స్రావాలని పిండటం లాంటివి మీ యాక్నే సమస్య ని మరింత తీవ్రతరం చేస్తాయు. ఒకోసారి మచ్చలు కూడా పడచ్చు.మీ ముఖానికి తగ్గ క్లెన్సర్తో ముఖం కడుక్కుని మందుల షాపులో దొరికే బెంజాయిల్ పెరాక్సైడ్ లేదా శాలిక్ యాసిడ్ ఉన్న లోషన్ లని పూయండి.ఒకవేళ మీరు కొనుక్కుని వాడుతున్న మందులు పని చేయకపోతే చర్మ వ్యాధి నిపుణుడిని సంప్రదించండి.

ఒత్తిడి

ఒత్తిడి

ఒత్తిడికి గురయినప్పుడు మీకు మొటిమలు మరింతగా వస్తున్నాయని గమనించారా??లేదా మీకు ఇప్పటికే ఉన్న సోరియాసిస్ లేదా రొజేషియా లాంటి చర్మవ్యాధులు మరింత విజృంభిస్తాయి.ఒత్తిడి మీ చర్మాన్ని మరింత సున్నితం గా మార్చి వెంటనే రియాక్ట్ అయ్యేటట్లు చేస్తుంది.ఒత్తిడి వల్ల మీరు మీ చర్మానికి కావాల్సిన జాగ్రత్త కూడా తీసుకోకపోవడంతో చర్మం మరింత అందవిహీనం అవుతుంది.ఒత్తిడీ ఉన్నా కూడా మీ చర్మ సమ్రక్షణ మరువద్దు.సరైన సన్ స్క్రీన్ రాసుకుని మీకు సరిపోయే క్లెన్సర్ ని ఉపయోగించండి.మసాజ్,మెడిటేషన్,తగినంత నిద్ర పోవడం,సరిగా వేళకి తినడం, వ్యాయామం చెయ్యడం లేదా మీకు దగ్గరివారితో మాట్లాడటం లాంటి పద్ధతులని పాటించి ఒత్తిడిని తగ్గించుకోవడానికి ప్రయత్నించండి.

అతిగా శుబ్రపరచుకోవడం

అతిగా శుబ్రపరచుకోవడం

నిజం, ఒకోసారి మంచి పనైనా మీరు అదే పనిగా దానిని అతిగా చెయ్యవచ్చు.కెమికల్ పీల్ చేయించుకోవడం వల్ల మీ ముఖం లోని సన్నని గీతలు, ముడుతలు తగ్గి చర్మ అందం ఇనుమడించి , మీ మేని కాంతిని ప్రకాశవంతం చెయ్యచ్చు.కానీ కెమికల్ పీల్ ఫలితాలు చేసేవారి పనితనం మీద ఆధారపడిఉంటుంది. నిపుణులైన ప్లాస్టిక్ సర్జన్ లేదా డెర్మటాలజిస్ట్(చర్మ వ్యాధి నిపుణుడు)పర్యవేక్షణలో చెయ్యకపోతే ఇన్ ఫెక్షన్ రావచ్చు లేదా చర్మం మీద శార్వతంగా మచ్చ ఉండిపోవచ్చు. ఇంట్లో మనంతట మనం ముఖం మీద వేసి తీసుకునే "ఎట్ హోం పీల్స్" లేదా "మైక్రో డెర్మా ఎబ్రేషన్" ట్రీట్మెంట్స్ నిపుణుడి ఆధ్వర్యం లో చేసే వాటి కంటే సున్నితం గా ఉన్నాయి కదా అనిపించవచ్చు.కానీ వీటి వల్ల కూడా చర్మం కందే అవకాశం ఉంది.చర్మం పై పొర లేదా ఎపీడెర్మిస్ మీ చర్మం లోని తేమని కాపాడుతూ రక్షణ వలయం లా పని చేస్తుంది.తరచూ "ఎట్ హోం పీల్స్" లేదా "మైక్రో డెర్మా ఎబ్రేషన్" ట్రీట్మెంట్స్ చేసుకుంటుంటే సున్నీతమైన చర్మం వాచి మచ్చలు కూడా రావచ్చు. యాక్నే సమస్య తీవ్రతరం అయినా అవ్వచ్చు. అందువల్లె మీ చర్మ వ్యాధి నిపుణుడిని అడిగి కానీ సొంతం గా ఇంట్లో ఈ ట్రీట్మెంట్లని మొదలుపెట్టకండి.

అతిగా తినడం

అతిగా తినడం

అతిగా అస్సలు తినద్దు. బరువు పెరిగితే మీ నడుము చుట్టుకొలత పెరగడమే కాదు మీ చర్మం కూడా సాగుతుంది.తరచూ బరువు పెరుగుతోంటే చర్మం సాగుతుండటం వల్ల స్ట్రెచ్ మర్క్స్ ఏర్పడతాయి.మీరు బరువు తగ్గినా కానీ సాగిన మీ చర్మం పూర్వ రూపుని సంతరించుకోదు. ఇలాంటి చర్మాన్ని పూర్వరూపుకి తేవాలంటే ప్లాస్టిక్ సర్జరీనే మార్గం.స్థూలకాయులకి చర్మం ముడుతల్లో యీస్ట్ ఇన్ ఫెక్షన్స్,గాయాలు త్వరగా మానకపోవడం లాంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది.సంతుల ఆహారం తీసుకుంటూ ఆరోగ్య కరమైన బరువునీ తద్వారా ఆరోగ్యం తో నవనవలాడే చర్మాన్నీ పొందండి.

నిద్ర లేమి

నిద్ర లేమి

నిద్రని అస్సలు అశ్రద్ధ చెయ్యద్దు.చర్మానికి నిద్ర “బ్యూటీ రెస్ట్” లాంటిది.నిద్రపోయినప్పుడు మన చర్మం సూర్యరశ్మి,కాలుష్యం,అతి వేడి లేద చల్లటి ఉష్ణోగ్రతలు తదితరమైన చర్మ హానికారకాల నుండి దూరం గా ఉండి తిరిగి శక్తిని పొందుతుంది.తగినంత నిద్ర లేకపోతే కంటి కింద ఐ బ్యాగ్స్ వచ్చి చర్మం కళావిహీనమవుతుంది.చాలినంత నిద్ర పోకపోవడం వల్ల సన్ బర్న్ లాంటి వాటి నుండి కోలుకోవడానికి చర్మానికి చాలా సమయం పడుతుంది.నేషనల్ స్లీప్ ఫౌండేషన్ ప్రకారం పెద్దలకి ఏడు నుండీ తొమ్మిది గంటల నిద్ర అవసరం.

హెచ్చరిక సంకేతాలని అశ్రద్ధ చేయడం

హెచ్చరిక సంకేతాలని అశ్రద్ధ చేయడం

చర్మ కేన్సర్ హెచ్చరిక సంకేతాలని అశ్రద్ధ చెయ్యద్దు.కొత్తగా వచ్చిన పుట్టుమచ్చ మెలనోమ అనే అది ప్రమాదకర చర్మ క్యాన్సర్ కి సంకేతమవ్వచ్చు.నెలకొకసారయినా మీ చర్మాన్ని అపాదమస్తకమూ ఓసారి పరిశీలించాలని స్కిన్ కేన్సర్ ఫౌండేషన్ వారి సలహా. మీ చర్మాన్ని గురించి తెలుసుకోండి.ఒక కొత్త పుట్టుమచ్చ కనిపిస్తే జాగ్రత్తగా పరిశీలించండి, ఇంతకుముందు మీకున్న పుట్టు మచ్చలని ఈ కొత్త మచ్చతో పోల్చుకోండి.ఒక కొత్త పుట్టు మచ్చ కనిపిస్తే స్కిన్ కేన్సర్ ఫౌండేషన్ వారి సూచనలతో సరిచూసుకోండి.ఆ సూచనలేమిటంటే 1. పుట్టుమచ్చ ఆకారం సరిగా లేకపోవడం 2. వంకరటింకర చివర్లు 3. పుట్టుమచ్చ వ్యాసం పెద్దదిగా ఉండటం 4. పుట్టు మచ్చ ఆకారం క్రమంగా పెరగడం లేదా రంగు లేదా ఆకారం లో మార్పు ఇలా కొత్తగా వచ్చిన పుట్టుమచ్చని పరిశీలిస్తే వీటిల్లో మీకు ఏదైనా తేడా గా అనిపించినా లేదా మీ కుటుంబానికి చర్మ క్యాన్సర్ చరిత్ర ఉన్నా వెంటనే చర్మవ్యాధి నిపుణుడిని సంప్రదించండి.

English summary

12 Ways to Wreck Your Skin in Telugu

The largest and fastest growing organ in the body is your skin. Your skin is a protective barrier for your body, but it takes a lot of abuse from the outside elements.