For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ప్రకాశించే చర్మ సౌందర్యానికి హెర్బల్ చిట్కాలు: తెలుగు సౌందర్య చిట్కాలు

|

ప్రకాశవంతమైన చర్మం పొందాలని చాలా మంది టీనేజ్ గర్ల్స్ నుండి మద్యవయస్కు స్త్రీల వరకూ కోరుకుంటుంటారు! ముఖ సౌందర్యం తెల్లగా, అందంగా ఉండాలని కోరుకుంటారు. ఆ పిచ్చి వల్లే కనిపించే ప్రతి బ్యూటీ ప్రొడక్ట్ ఉపయోగించేస్తుంటారు . మన ముఖ సౌందర్యం లేదా హెల్తీ స్కిన్ పొందాలంటే చర్మం ఆరోగ్యంగా ఉండాలన్న వాస్తవికతను విస్మరిస్తుంటారు .

READ MORE: మిమ్మల్ని తెల్లగా మార్చే 20 నేచురల్ ఫేస్ ఫ్యాక్స్

ఎప్పుడైతే చర్మం ఆరోగ్యంగా ఉంటుందో అప్పడు తప్పనిసరిగా కాంతివంతంగా మెరుస్తుంటుంది. మార్కెట్లో మనకు అందుబాటులో ఉండే ప్యాక్డ్ ప్రొడక్ట్స్ బహిర్గతంగా మాత్రమే ప్రయోజనాలను అందిస్తాయి . అందుకోనూ కెమికల్స్ ఉపయోగించే తయారుచేసే ఈ ప్యాకింగ్ స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ దీర్ఘకాలంలో చర్మం సౌందర్యానికి అంత మంచిది కూడా కాదు. కాబట్టి హెర్బల్ పొడక్ట్స్ ను ఎంపిక చేసుకోవడం మంచిది!

READ MORE: ఎప్పటికీ యవ్వనస్తులుగానే ఉంచే 20 సూపర్ ఫుడ్స్..!

ఈ హెర్బల్ ప్రొడక్ట్స్ ను మీ వంటగదిలో ఉండే వంటింటి వస్తువలను ఉపయోగిచే తయారుచేసుకొని, కాంతివంతమైన చర్మం పొందడానికి ఉపయోగించుకోచ్చు! మరియు ఇవి దీర్ఘకాలంలో అద్భుతంగా పనిచేస్తాయి. ఇవి ఎపెక్టివ్ గా పనిచేయడానికి ఎక్కువ సమయం తీసుకొన్నా ఫలితం చాలా ఎఫెక్టివ్ గా ఉంటుంది మరియు చౌవకైనవి కూడా... మరి ఆ హేర్బల్ ప్రొడక్ట్స్ ఏంటో ఒక సారి చూద్దాం....

15 హెర్బల్ స్కిన్ కేర్ టిప్స్ : హెర్బల్ ప్రొడక్ట్స్ తో హేర్బల్ ఫేస్ ప్యాక్ ను వేసుకొని చర్మం కాంతివంతంగా ప్రకాశవంతంగా మార్చుకోవచ్చు...

ద్రాక్ష:

ద్రాక్ష:

మీ చర్మానికి మంచి కాంతిని తెప్పించాలంటే, కొన్ని ద్రాక్షపండ్లును తీసుకొని ముఖం మీద అప్లై చేసి బాగా మర్ధన చేయాలి. ద్రాక్ష బాగా మెత్తగా పొడి పొడిగా అయ్యే వరకు మసాజ్ చేసి 15నిముషాల తర్వాత ముఖం చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి.

 కీరదోకాయ జ్యూస్, గ్లిజరిన్ మరియు రోజ్ వాటర్ :

కీరదోకాయ జ్యూస్, గ్లిజరిన్ మరియు రోజ్ వాటర్ :

కీరదోసకాయ రసం, గ్లిజరిన్ మరియు రోజ్ వాటర్ మిక్స్ చేసి ముఖానికి పట్టించి 15నిముషాల తర్వాత శుభ్రం చేసుకోవడం వల్ల చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. లేదా ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి అలాగే బయటకు తిరిగి రాగనే ముఖం శుభ్రం చేసుకోవాలి.

 గందం, పసుపు మరియు పాలు :

గందం, పసుపు మరియు పాలు :

గందం పౌడర్ లో కొద్దిగా ససుపు, పాలు మిక్స్ చేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. దీన్ని ముఖానికి పట్టించి కొన్ని నిముషాల తర్వాత పాలతో ముఖాన్ని శుభ్రం చేసుకుంటే మంచి గ్లో వస్తుంది మరియు ఫ్రెష్ గా కనబడుతారు.

తేనె మరియు క్రీమ్ :

తేనె మరియు క్రీమ్ :

తేనెకు క్రీమ్ మిక్స్ చేయడం ఒక మంచి ఐడియా. ఈ రెండింటి యొక్క మిశ్రమంను ముఖానికి ప్యాక్ లా వేసుకోవడం వల్ల చర్మం సాఫ్ట్ గా మరియు కాంతివంతంగా కనిబడుతుంది. ముఖంగా వింటర్ సీజన్ కు ఈ ఫేస్ ప్యాక్ ఫర్ఫెక్ట్ గా ఉంటుంది

పాలు, ఉప్పు మరియు నిమ్మరసం:

పాలు, ఉప్పు మరియు నిమ్మరసం:

ఫ్రెష్ మిల్క్ లో చిటికెడు ఉప్పు కొద్దిగా నిమ్మరసం మిక్స్ చేసి, అందులో కాటన్ బాల్స్ డిప్ చేసి ముఖం మీద మర్దన చేయడం వల్ల చర్మ రంద్రాలు శుభ్రపడుతాయి.

టమోటో జ్యూస్ :

టమోటో జ్యూస్ :

టమోటో జ్యూస్ లో కొద్దిగి నిమ్మరసం పిండి ముఖానికి అప్లై చేయడం వల్ల ముఖం సాప్ట్ గా మరియు కాంతివంతంగా మారుతుంది..

పసుపు, గోధుమపిండి మరియు నువ్వుల నూనె:

పసుపు, గోధుమపిండి మరియు నువ్వుల నూనె:

పసుపు, గోధుమపిండి మరియు నువ్వుల నూనె వేసి పేస్ట్ లా తయారుచేయాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి కొద్దిసేపటి తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకుంటే అవాంచిత రోమాలు తొలగిపోతాయి.

క్యాబేజ్ జ్యూస్ మరియు తేనె:

క్యాబేజ్ జ్యూస్ మరియు తేనె:

క్యాబేజ్ జ్యూస్ కు కొద్దిగా తేనె మిక్స్ చేసి ముఖానికి పట్టించడం వల్ల ముఖంలో ముడుతలు తొలగిపోతాయి.

క్యారెట్ జ్యూస్ :

క్యారెట్ జ్యూస్ :

క్యారెట్ జ్యూస్ ను నేరుగా ముఖానికి పట్టించడం వల్ల, నేచురల్ గ్లో పొందడానికి ఇది గొప్పగా సహాయపడుతుంది.

 తేనె మరియు దాల్చిన చెక్క పౌడర్ :

తేనె మరియు దాల్చిన చెక్క పౌడర్ :

మూడు భాగాల తేనె మరియు ఒక పార్ట్ దాల్చిన చెక్క పొడి మిక్స్ చేసి దీన్ని ముఖం మీద ఉండే మొటిమలకు మీద అప్లై చేసి రాత్రంతా అలాగే ఉంచాలి. మొటిమలు మరియు మచ్చలు తొలగించడానికి ఇది ఒక ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది.

వేరుశెనగ నూనె మరియు నిమ్మరసం:

వేరుశెనగ నూనె మరియు నిమ్మరసం:

కొద్దిగా వేరుశెనగ నూనె తీసుకొని అందులో నిమ్మరసం మిక్స్ చేసి ముఖానికి ప్యాక్ లా వేసుకోవడం వల్ల ఇది మొటిమలు మరియు బ్లాక్ హెడ్స్ ను నివారిస్తుంది.

అలోవెర జ్యూస్ :

అలోవెర జ్యూస్ :

స్కిన్ పిగ్మెంటేషన్ మరియు సన్ రాషెస్ నివారించడంలో మరియు చర్మానికి తగినంత తేమను అందివ్వడంలో అలోవెరా జ్యూస్ గ్రేట్ గా సహాయపడుతుంది.

నెయ్యి మరియు గ్లిజరిన్ :

నెయ్యి మరియు గ్లిజరిన్ :

నెయ్యి మరియు గ్లిజరిన్ ఒక గ్రేట్ హోం మేడ్ మాయిశ్చరైజర్. దీన్ని ఫేస్ ప్యాక్ గా వేసుకొని శుభ్రం చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.

ముల్తాని మట్టి, రోజ్ పెటల్స్, వేప, తులసి మరియు రోజ్ వాటర్ :

ముల్తాని మట్టి, రోజ్ పెటల్స్, వేప, తులసి మరియు రోజ్ వాటర్ :

ముల్తాని మట్టి, రోజాపువ్వు రేకులు, వేప ఆకులు, తులసి ఆకులు మెత్తగా పేస్ట్ చేసి అందులో కొద్దిగా లెమన్ వాటర్ లేదా రోజ్ వాటర్ మిక్స్ చేసి ముఖానికి పట్టించి తర్వా త శుభ్రం చేసుకుంటే మంచి గ్లోయింగ్ స్కిన్ పొందవచ్చు.

ఆప్రికాట్ మరియు పెరుగు:

ఆప్రికాట్ మరియు పెరుగు:

ఆప్రికాట్ ఫ్రూట్ ను మెత్తగా పేస్ట్ చేసి అందులో కొద్దిగా పెరుగు వేసి బాగా మిక్స్ చేయాలి. ఇది చర్మానికి ఫ్రెష్ లుక్ ను అందిస్తుంది. మరయు తేనె చేర్చడం వల్ల ముఖంలో డ్రై నెస్ పోతుంది.

English summary

15 Herbal Beauty Tips For Glowing Skin: Beauty Tips in Telugu

Glowing skin is a craving that all we women suffer from! Such is our madness that we try every product that claims to give us glowing skin. We completely ignore the fact that glowing is an indication of our skin being healthy. And healthy skin is the only sure lasting way to have glowing skin.
Story first published: Wednesday, June 17, 2015, 12:00 [IST]
Desktop Bottom Promotion