For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ముక్కు మీద మొటిమలు తొలగించడానికి 5 సాధారణ మార్గాలు

By Super
|

యుక్త వయసులో మొటిమలు రావడం సహజమే అయినప్పటికీ, మొటిమలు ఏర్పడగానే తాము అందవిహీనులమవుతున్నామని వారు భావిస్తారు. ముఖంలో మొటిమలను నివారించుకోవడానికి నానా తంటాలు పడాల్సి వస్తుంది. వివిద రకాల చిట్కాలను ముఖం పాడు చేసుకుంటుంటారు. మరి ముక్కు మీద మొటిమలు చిరాకుపెడుతుంటే ఏంచేయాలి?ముక్కు మీద మొటిమలను నివారించుకోవడం కొద్దిగా కష్టమైన పనే.

మార్కెట్‌లో లభించే రకరకాల క్రీములను, లోషన్‌లను రాయడం, మొటిమలను గిల్లడం మొదలైనవి చేయడంవల్ల అవి తగ్గకపోగా ఇన్‌ఫెక్షన్‌కు గురై చీము కారడం మచ్చలు ఏర్పడడం, గుంటలు పడటం జరుగుతుంది. సాధారణంగా మొటిమలు 12 నుంచి 24 ఏళ్ల వయసు వరకూ వస్తుంటాయి. కానీ కొందరిలో హార్మోన్ల అసమతుల్యత వల్ల తీవ్రమైన మానసిక ఒత్తిడివల్ల, స్ర్తిలలో బహిష్టులు సక్రమంగా లేకపోవడంవల్ల, కొన్నిరకాల మందుల దుష్ప్రభావాలవల్ల వయస్సుతో నిమిత్తం లేకుండా ఇవి వస్తుంటాయి.

మొటిమలు రాకుడా కొన్ని హోం రెమెడీస్ ఎఫెక్టివ్ గా పనిచేస్తాయి. కాస్మోటిక్స్ వాడటమే కాదు, ఆహారం విషయంలోనూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. మొటిమల నివారణకు చాలా చికిత్స పద్ధతులున్నాయి. అయితే మొటిమలు నయం కావడానికి కొంత సమయం పడుతుంది. చాలా వరకూ మొటిమల నివారణలో చికిత్స పద్ధతుల్లో రసాయనాలు అధికంగా వాడడం వల్ల ఒక సమస్యకు మరో సమస్యతోడవుతుంది. కాబట్టి రసాయన క్రీములు వాడటం కంటే కొన్ని ఇంటి చిట్కాలను పాటించి చర్మ సమస్యలను దూరం చేసుకోవచ్చు. అవి ఖచ్చితంగా మీ వంటగదిలోనే సులభంగా దొరికేటటువంటి వస్తువులతోనే మొటిమలు నయం చేసుకోవచ్చు.

 నిమ్మరసం:

నిమ్మరసం:

నిమ్మరసంను ఒక గిన్నెలోకి తీసుకొని అందులో కాటన్ బాల్ డిప్ చేసి ముక్కు మీద అప్లై చేసి అలాగే ఉంచాలి . నిమ్మరసంలో ఉండే అసిడిక్ వల్ల మొటిమలను మాయం చేయడంతో పాటు, మచ్చలు కూడా కనబడకుండాచేస్తుంది. నిమ్మరసం అప్లై చేసిన అరగంట తర్వాత శుభ్రం చేసుకోవాలి. తాజా నిమ్మరసం బెస్ట్ రెమెడీ. మరియు చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది

ఐస్ :

ఐస్ :

ముక్కు మీద మొటిమలను నివారించుకోవడానికి మరో ఎఫెక్టివ్ హోం రెమెడీ కొన్ని ఐస్ ముక్కలను కాటన్ క్లాత్ లో చుట్టు మొటిమలున్న ప్రదేశంలో ప్రెస్ చేయాలి. ఇలా 20నిముషాలు చేయడంవల్ల మంచి ఫలితం ఉంటుంది . ఇది ఇన్ఫ్లమేషన్ మరియు వాపు తగ్గిస్తుంది . మొటిమలన యొక్క సైజును తగ్గిస్తుంది.

టీట్రీ ఆయిల్ :

టీట్రీ ఆయిల్ :

మన్నికైనది మరియు ఎఫెక్టివ్ హోం రెమెడీ, మొటిమలను నివారించడంలో మరియు గ్రేట్ గా సహాయపడుతుంది మరియు టీట్రీ ఆయిల్ ను అప్లై చేసి 10నిముషాల తర్వాత శుభ్రం చేసుకోవాలి.

ఆపిల్ సైడర్ వెనిగర్ :

ఆపిల్ సైడర్ వెనిగర్ :

ఆపిల్ సైడర్ వెనిగర్ ను స్కిన్ కు అంత సామాన్యంగా ఉపయోగించరు. అయితే, మొటిమలు, చాలా పెద్దగా, ఎర్రగా, ఉబ్బనట్లైతే వాటిని తొలగించడానికి ఆపిల్ సైడర్ వెనిగర్ ను ఉపయోగించుకోవచ్చు ఆపిల్ సైడర్ వెనిగర్ లో కాటన్ బాల్స్ డిప్ చేసి కొద్ది సమయం తర్వాత శుభ్రం చేసుకోవాలి

 టూత్ పేస్ట్

టూత్ పేస్ట్

మరో ఎఫెక్టివ్ హోం రెమెడీ టూత్ పేస్ట్ . వైట్ కలర్ లో ఉండే జెల్ బేస్డ్ ను టూత్ పేస్ట్ ను ముక్కు మీద ఉన్న మొటిమల మీద అప్లై చేసి రాత్రంతా అలాగే ఉండనిచ్చి ఉదయాన్నే చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి . దాంతో మొటిమలు సైజ్ సగానికి సగం తగ్గిపోయి, పూర్తిగా మాయం అవుతాయి.

మౌత్ వాష్ :

మౌత్ వాష్ :

బాగా శుభ్రం చేసి కాటన్ క్లాత్ ను మౌత్ వాష్ లో డిప్ చేసి మొటిమల మీద అప్లై చేయాలి . 10నిముషాల తర్వాత శుభ్రం చేయడంవల్ల మంచి ఫలితం ఉంటుంది. ఇది ఇన్ఫ్లమేసన్ కూడా తగ్గిస్తుంది . ఇది యాస్ట్రిజెంట్ గా కూడా పనిచేస్తుంది

English summary

6 Simple Ways To Remove Pimples On The Nose

Acne is a skin problem that doesn't restrict to your cheeks. Acne is a formation of dead skin cells that blocks the skin pores. It can either affect the nose, chest, back, forehead etc. Getting rid of acne is very troublesome as all your beauty products and creams do not work wonders. You still have those small acne breakouts that horrify you.
Story first published: Thursday, December 10, 2015, 15:32 [IST]
Desktop Bottom Promotion