For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

సన్ రాషెస్ ను నివారించడానికి 8 నేచురల్ రెమెడీస్

|

వేసవి ప్రారంభమైనది, శీతల ప్రదేశాల్లో ఉండే వారికి ఏలాంటి సమస్య లేకున్నా, ఉష్ణమండల ప్రాతాలలో నివసించే వారు ఖచ్చితంగా సమస్యలుంటుంది. వాతావరణంలో వేడి, హుముడిటి వల్ల అనేక సమస్యలను తెచ్చిపెడుతుంది. వేసవి కాలంలో చాలా మంది స్కిన్ రాషెస్ కు దారితీస్తుంది. ముఖ్యంగా వేసవి సీజన్ లో ప్రిక్లీ హీట్ పౌడర్స్ కొద్దిగా ఉపశమనం కలిగించినా, అవి తక్షణ ప్రభావం చూపెడుతాయి కానీ, అంత ఎఫెక్టివ్ గా పనిచేయవు. కాబట్టి వాటి బదులు, శాస్వతంగా స్కిన్ రాషేస్ నుండి ఉపశమనం పొందడానికి కొన్ని ఉత్తమ హోం రెమెడీస్ ఉన్నాయి.

సన్ రాషెస్ ను నివారించుకోవడానికి కొన్ని విటమిన్స్ కూడా పనిచేస్తాయి. కాబట్టి, సన్ రాషెస్ నుండి విముక్తి పొందడానికి కొన్ని హోం రెమెడీస్ గురించి తెలుసుకొని ఉండాలి. ఇలా ముందుగా తెలుసుకొన్నట్లైతే వివిధ రకాల చర్మ సమస్యలతో పాటు ఇతర ఆరోగ్య సమస్యలను కూడా నివారించుకోవచ్చు . సన్ రాషెస్ ను నివారించుకోవడానికి కొన్ని నేచురల్ రెమెడీస్ ఈ క్రింది విధంగా ఉన్నాయి...

1. చల్లని లేదా ఐస్ కంప్రెసర్స్:

1. చల్లని లేదా ఐస్ కంప్రెసర్స్:

వేసవి సీజన్ లో వేడి వల్ల వచ్చే చర్మ సమస్యలు, చర్మం మీద దద్దర్లు నివారించుకోవడానికి, శాస్వత పరిష్కార మార్గం పొందడానికి కోల్డ్ లేదా ఐస్ కంప్రెసర్ గ్రేట్ గా సహాయపడుతుంది. చర్మం మీద సన్ రాషెస్ ఉన్న ప్రదేశంలో ఐస్ బ్యాగ్స్ లేదా ఐస్ క్యూబ్స్ ను ఉంచడం వల్ల చర్మానికి చల్లగా, సున్నితంగా దద్దుర్లు నుండి శాస్వత ప్రభావం చూపుతుంది.

2. అలొవెరా జ్యూస్ ను అప్లై చేయాలి:

2. అలొవెరా జ్యూస్ ను అప్లై చేయాలి:

వేసవిలో వేడి వల్ల చర్మం మీద ఏర్పడ రాషెస్ తగ్గించుకోవడానికి అలోవెర జెల్ ను చర్మం మొత్తం అప్లై చేస్తే చర్మ సమస్యల నుండి ఉపశమనం పొందవచ్చు.

3. బేకింగ్ సోడ్ మరియు రోజ్ వాటర్:

3. బేకింగ్ సోడ్ మరియు రోజ్ వాటర్:

బేకింగ్ సోడ మరియు రోజ్ వాటర్ ను సమంగా తీసుకొని బాగా మిక్స్ చేసి సన్ రాషెస్ ఏర్పడ్డ ప్రదేశంలో అప్లై చేస్తే తక్షణ ఉపశమనం కలుగుతుంది. చర్మం దురద మరియు బర్నింగ్ వంటి సమస్యలను నివారించుకోవచ్చు.

4. మన్నికైన టాల్కమ్ పౌడర్ :

4. మన్నికైన టాల్కమ్ పౌడర్ :

వేసవి సీజన్ లో టాల్కమ్ పౌడర్ ను ఉపయోగించడం చర్మ రక్షణకు చాలా ఉపయోగకరం. అలాంటి బెస్ట్ క్వాలిటి పౌడర్ ను ఎంపిక చేసుకొని చర్మం మీద దద్దుర్లు ఏర్పడ్డ ప్రదేశంలో వేస్తే తక్షణ ఉపవమనం కలుగుతుంది.

5. శెనగపిండి:

5. శెనగపిండి:

శెనగపిండి సౌందర్య ఉత్పత్తి. చర్మంలో మొటిమలు, మచ్చలను నివారించడం మాత్రమే కాదు, ఇది వేసవి కాలంలో స్కిన్ రాషెస్ నుండి తక్షణ ఉపశమనం కలిగించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది.

6. చల్లటి పాలు:

6. చల్లటి పాలు:

చల్లటి పాలను చర్మానికి అప్లై చేస్తే అద్బుతమైన ఎక్స్ ఫ్లోయేట్ గా పనిచేస్తుంది . పాలలో కాటన్ బాల్స్ ను డిప్ చేసి ముఖానికి అప్లై చేయాలి ఇలా ఒక రోజులో 8-10సార్లు చేసినట్లైతే సన్ రాషెస్ నుండి తక్షణ, శాస్వత ప్రభావం పొందవచ్చు.

7. ఆర్గానిక్ జ్యూస్ మరియు వైట్ ప్రోటీన్ :

7. ఆర్గానిక్ జ్యూస్ మరియు వైట్ ప్రోటీన్ :

గుడ్డు మరియు నిమ్మరసం మ్యాజికల్ ఎఫెక్ట్ ను అందిస్తుంది. సన్ రాషెస్ ను తొలగించడంలో ఈ రెండు గ్రేట్ గా సహాయపడుతాయి. ఇది ఒక మోస్ట్ పాపులర్ రెమెడీ.

8. ఫ్రూట్ ప్యాక్:

8. ఫ్రూట్ ప్యాక్:

మార్కెట్లో వివిధ రకాల ఫ్రూట్ ప్యాక్, మరియు స్కిన్ ప్యాక్ లు అందుబాటులో ఉన్నాయి. వాటన్నింకంటే, నేచురల్ గా స్కిన్ ప్యాక్స్ గ్రేట్ గా సహాయడపుతాయి . ఇంట్లో ఉండే పండ్లతో ముఖానికి లేదా స్కిన్ రాషెస్ జరిగిన ప్రదేశంలో అప్లై చేయడం వల్ల తక్షణ ఉపశమనం పొందవచ్చు.

English summary

8 Natural Remedies For Sun Rashes

The beginning of summer can be good and pleasing from the people living in the colder regions, but it can be extremely troublesome for the people living in the hotter temperature zones. It brings a huge amount of troubles.
Story first published: Friday, May 22, 2015, 12:24 [IST]
Desktop Bottom Promotion