For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

స్వచ్చమైన చర్మ సౌందర్యానికి బేకింగ్ సోడా ఫేస్ ఫ్యాక్

|

బేకింగ్ సోడా వినే ఉంటారు. ఇది వంటగదిలో ఉండే ఒక నిత్యవసర వస్తువు. ప్రతి ఇంటి వంటగదిలోనూ ఇది తప్పనిసరిగా ఉంటుంది. ఇంది వంటలకు మాత్రమే కాదు సౌందర్యానికి కూడా ఉపయోగించుకుంటారని మీకు తెలుసా?

అవును సౌందర్యాన్ని పెంపొందించడంలో బేకింగ్ సోడ గ్రేట్ గా సహాయపడుతుంది . మీరు ఒక స్వచ్చమైన చర్మ సౌందర్యం పొందడానికి, మీరు విలువైన స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ ను కొనాల్సిన అవసరం లేదు. వంటగదిలోని బేకింగ్ సోడ ఒక్కటుంటే చాలా అందాన్ని మెరుగుపరచుకోవడానికి. ఇది కొన్ని అద్భుతాలనే చేస్తుంది.

బేకింగ్ సోడా ఫేస్ మాస్క్ లో కొన్ని సౌందర్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి...ఎందుకంటే బేకింగ్ సోడా ఒక స్ట్రాంగ్ ఆస్ట్రిజెంట్ గా పనిచేస్తుంది. ఇది చర్మంలోని బ్యాక్టీరియా మరియు ఫంగల్ ఇన్ఫెక్షన్ నివారిస్తుంది. అంతే కాదు చర్మంలోని అదనపు నూనె(జిడ్డును)తొలగిస్తుంది. చర్మాన్ని శుభ్రం చేస్తుంది.

మీ ముఖంలో మొటిమలు మరియు మచ్చలు తొలగించడానికి మరియు ముఖంలో వాపు తగ్గించడానికి కూడా సహాయపడుతుంది.

మరి ఇన్ని ప్రయోజనాలు పొందాలంటే ఫేస్ ప్యాక్ ఏవిధంగా తయారుచేసుకోవాలి. ఎలా ఉపయోగించాలో ఈ క్రింది స్లైడ్ ద్వారా తెలుసుకుందాం...

1. మొటిమలు మరియు మచ్చలు తొలగించే బేకింగ్ సోడ:

1. మొటిమలు మరియు మచ్చలు తొలగించే బేకింగ్ సోడ:

ఒక చెంచా బేకింగ్ సోడాను ఒక చెంచా గందం పొడిలో వేసి, రోజ్ వాటర్ మిక్స్ చేసి పేస్ట్ లా చేసుకోవాలి . 5నిముషాలు అలాగే ఉంచి తర్వాత బేకింగ్ సోడా పేస్ట్ ను ముఖానికి అప్లై చేయాలి . 5 నిముషాలు అలాగే ఉండి తర్వాత ముఖాన్ని చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి.

2. బేకింగ్ సోడా బ్లాక్ హెడ్స్ నివారించడంలో ఎక్స్ ఫ్లోయేటర్ గా పనిచేస్తుంది :

2. బేకింగ్ సోడా బ్లాక్ హెడ్స్ నివారించడంలో ఎక్స్ ఫ్లోయేటర్ గా పనిచేస్తుంది :

ముందుగా మీ ముఖాన్ని గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. తర్వాత బేకింగ్ సోడా, తేనె మరియు ఉప్పును ఒక్కొక్కదాన్ని ఒక్కో చెంచా తీసుకొని, మూడింటిని మిక్స్ చేసి ముఖానికి ప్యాక్ లా వేసుకోవాలి . తర్వాత సర్కులర్ మోషన్లో మసాజ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల చర్మం లోతుగా శుభ్రపడుతుంది.

3. మొటిమలు మరియు మచ్చలను నివారిస్తుంది:

3. మొటిమలు మరియు మచ్చలను నివారిస్తుంది:

ఒక చిన్న బౌల్లో బేకింగ్ సోడా మరియు ఓట్స్ పౌడర్ మరయిు అలోవెర జెల్ వేసి కొద్దిగా గోరువెచ్చని నీళ్ళు మిక్స్ చేసి స్మూత్ గా పేస్ట్ లా చేసుకోవాలి. ఇలా చేసిన తర్వాత ముఖానికి ప్యాక్ లా వేసుకోవాలి. దీన్ని 5నిముషాలు అలాగే ఉంచుకొని తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి.

4. ముఖంలో జిడ్డు తొలగిస్తుంది మరియు కాంతిని పెంచుతుంది:

4. ముఖంలో జిడ్డు తొలగిస్తుంది మరియు కాంతిని పెంచుతుంది:

బాగా పండిన స్ట్రాబెర్రీని మెత్తగా చేసి అందులో ఒక చెంచా బేకింగ్ సోడా వేసి బాగా మిక్స్ చేయాలి. తర్వాత ముఖానికి పట్టించి 5నిముషాల తర్వాత సర్కులర్ మోషన్లో మసాజ్ చేసి తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల చర్మంలో మలినాలు తొలగిపోతాయి. జిడ్డు తొలగించబడుతుంది మరియు స్కిన్ కంప్లెక్షన్ నల్లని చర్మాన్ని తేలికపరిచి తెల్లగా కాంతివంతం చేస్తుంది.

5. డార్క్ స్పాట్స్ తొలగించడానికి :

5. డార్క్ స్పాట్స్ తొలగించడానికి :

ఒక చెంచా బేకింగ్ సోడాలో , ఒక చెంచా నిమ్మరసం, మరియు ఒక చెంచా గోరువెచ్చని నీరు మిక్స్ చేసి అందులో కాటన్ బాల్స్ డిప్ చేసి ముఖం మొత్తాన్ని తుడవాలి . 5నిముషాల తర్వాత ముఖం శుభ్రం చేసుకోవాలి. ఇది ఆయిల్ స్కిన్ మరియు మొటిమల చర్మానికి చాలా ఎఫెక్టివ్ గా పనిచేసి, సమస్యను నివారిస్తుంది.

English summary

Baking Soda Face Packs For Crystal Clear Skin

Baking soda face mask has many beauty benefits. Baking soda works as astringent properties. It kills bacteria and fungal infection on your skin. It cleanses and removes excess oil.
Story first published: Saturday, May 2, 2015, 16:50 [IST]
Desktop Bottom Promotion