For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

  గ్రేప్ జ్యూస్ లోని గ్రేట్ బ్యూటీ బెనిఫిట్స్

  By Sindhu
  |

  ద్రాక్షలో చాలా అద్భుతమైన ఆరోగ్య మరియు అందం ప్రయోజనాలు ఉన్నాయి. దీనిలో అల్జీమర్స్ వ్యాధికి నివారణకు తోడ్పడే రెస్వెట్రాల్ సమృద్దిగా ఉంటుంది. అంతేకాక కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది. అలాగే దీనిలో యూరిక్ ఆమ్లం ఉండుట వలన మీ మూత్రపిండాలకు మరియు గుండెకు చాలా మంచిదని నిరూపించబడింది.

  దీనిలో విటమిన్లు,పొటాషియం,కాల్షియం,ఇనుము వంటి వివిధ పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. ఇది మంచి ఆరోగ్యం మరియు మంచి చర్మంనకు సహాయపడుతుంది. మీకు ఈ పోషకాలు ఒక ఆరోగ్యకరమైన జీవితంనకు దోహదం చేస్తాయని తెలుసా?మీరు ద్రాక్ష రసం తీసుకొంటే జలుబు,దగ్గు,ఫ్లూ మొదలైన వాటిని వదిలించుకోవటానికి ఒక మంచి మార్గం.

  100 గ్రాముల ద్రాక్ష నుంచి 69 క్యాలరీల శక్తి అందితే కొలెస్ట్రాల్ జీరో శాతం ఉంటుందన్నారు. పైపెచ్చు. విటమిన్ సి, విటమిన్ ఎ, కెరోటిన్, రాగి, మెగ్నీషియం, బీకాంప్లెక్స్ విటమిన్లతో పాటు ప్రధాన ఎలక్ట్రోలైట్ అయిన పొటాషియం అధికంగా ఉంటుంది. అయితే, ద్రాక్ష పండ్లను ఆరగించే ముందు... నీటిలో శుభ్రంగా కడిగినట్టయితే, దానిపై పేర్కొన్న తెల్లని పొర వంటి రసాయన పదార్థం పోతుందంటున్నారు. ద్రాక్ష... పేరు వింటేనే తినాలనిపిస్తుంది. అంతటితో ఆగితే ఎలా! వాటి వల్ల ఆరోగ్యానికి... సౌందర్యానికి ఎంత మేలో తెలుసుకోవద్దూ!

  క్లెన్సింగ్ మాస్క్: మీ ముఖానికి ద్రాక్ష మాస్క్ వేసుకుంటే శుభ్రమైన మరియు ప్రకాశవంతమైన రూపాన్ని ఇస్తుంది. ఇది పొడి,నార్మల్ మరియు సున్నితమైనఅన్ని చర్మ రకాల కోసంఅనుకూలంగా ఉంటుంది. ద్రాక్ష రసం యాంటీ ఆక్సిడెంట్లకు ప్రసిద్ది చెందింది. మీచర్మంను మలినాల నుండి క్లియర్ చేస్తుంది. ప్లేట్లెట్లు పెంచడానికి మరియు మీ చర్మంను శుభ్రంగా మరియు తాజాగా ఉంచడానికి సహాయపడుతుంది.

  Beauty Benefits Of Grape Juice

  సన్ బర్న్ కి వ్యతిరేకంగా రక్షణ: ద్రాక్షరసంలో ఫ్లెవనాయిడ్స్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. మీ చర్మం నష్టం ఆపటానికిమరియు అధిక యూవీ రేడియేషన్ కు వ్యతిరేకంగా రక్షించటానికి సహాయపడుతుంది. సన్ బర్న్ ను నయంచేస్తుంది. మీ చర్మానికి ద్రాక్ష రసం రాసినప్పుడు సన్ బర్న్ కి వ్యతిరేకంగా చర్మంకు రక్షణగా పనిచేస్తుంది. మీరు సున్నితమైన చర్మం కలిగి ఉంటేద్రాక్ష రసంతో నయం చేయవచ్చు. సూర్యుడు యొక్క హానికరమైన యూవీ రేడియేషన్ నుంచి సహజ రక్షణగా ఉంటుంది.

  చర్మాన్నిరేడియంట్ గా మార్చుతుంది: మీరు ద్రాక్ష రసం తీసుకుంటే, నిజంగా మీ రక్తంనుక్లియర్ మరియు రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది. అదే విధంగా ద్రాక్ష రసంలోఇనుము ఎక్కువగా ఉండుట వల్ల రక్త శుధ్దికి మరియు చర్మానికి మంచిది. మీరు మంచి మొత్తంలో క్రమం తప్పకుండా స్వచ్ఛమైన ద్రాక్ష రసం తీసుకుంటే మొత్తంలో క్రమం తప్పకుండా స్వచ్చమైన ద్రాక్ష రసం తీసుకుంటే అప్పుడు మీ ధమనులలో రక్త శుధ్ది మరియు రక్త ప్రవాహం బాగుంటుంది. అలాగే రక్తప్రసరణ మెరుగుపడి మీ చర్మంను ఆరోగ్యంగా ఉంచుతుంది.

  యాంటీ ఏజింగ్ ఎలిమెంట్ గా పనిచేస్తుంది: మీకు ద్రాక్షరసం ఎక్స్ ఫ్లోట్ కు సహాయపడుతుంది. నిజానికి, మీకు మీచర్మంపై ద్రాక్ష రసం వంటకాలను రాస్తే ఎక్స్ ఫ్లోట్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. మీ చర్మంతో పాటు ఉండే డెడ్ స్కిన్ సెల్స్ ను తొలగించుటకు మరియు ముడుతలను తగ్గించడం చేస్తుంది. రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది. అంతేకాక మీ చర్మం స్థితిస్థాపకత ఉత్తమంగా ఉంటుంది. మీ చర్మం హైడ్రేట్ అయితే ద్రాక్షరసం సహజంగా మీ చర్మం తేమగా ఉంచుతుంది.

  చర్మంను తేమగా ఉంచతుంది: ద్రాక్ష రసం యొక్క అందం ప్రయోజనాలను తెలుసుకుంటే సరిపోదు. మీరు మీ చర్మం మరియు ద్రాక్షను స్వీయ ప్రయోజనకర క్రమంలో ఎలా ఉపయోగించాలో తెలుసుకోవాలి. మీ ముఖానికి ఒక టేబుల్ స్పూన్ ద్రాక్ష రసం రాసి,15 నిముషాల తర్వాత వెచ్చని నీటితో కడగాలి. అప్పుడు మీచర్మం తేమగా ఉంటుంది.

  కళ్ళకు మంచిది: కళ్లచుట్టూ డార్క్ వలయాలతో చూడటానికి అసహ్యకరంగా ఉన్నాయా? విత్తనాలు లేని ద్రాక్షను తీసుకుని కట్ చేసి మీ కనురెప్పల మీద ఉంచాలి. ఈ విధంగా చేయుట వలన మీ కళ్ళ చుట్టూ చర్మం మెరుగుపరచడానికి మరియు డార్క్ వలయాలను తగ్గించటానికి సహాయపడుతుంది.

  పొడి చర్మంను సున్నితంగా తయారుచేస్తుంది: ఒక స్పూన్ ద్రాక్ష రసం మరియు ఒక చెంచా గుడ్డు తెల్ల సొన కలిపి మీ ముఖం మీద రాయాలి. మీ ముఖంను కడగటానికి ముందుగా 10 నిముషాలు వదిలివేయండి. అప్పుడు మీ చర్మం పొడి తగ్గి సున్నితంగా మారుతుంది.

  English summary

  Beauty Benefits Of Grape Juice

  Grapes, they don’t just make the fine wines for you to have but, have some amazing health and beauty benefits too. They are good sources of Resveratrol which helps in curing Alzheimer’s disease. It also reduces cholesterol and uric acid thus proving to be good for your kidney and heart.
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more