For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ముఖంలో డార్క్ స్పాట్స్ తో విసిగెత్తి పోయారా..ఇవిగో సులభ చిట్కాలు

|

బ్లాక్ హెడ్స్ తో విసిగిపోయారా? బ్లాక్ స్పాట్స్ ముఖంలో చాలా ఇబ్బంది కరంగా ఉంటాయి. ముఖ్యంగా ఫేర్ గా ఉన్న అమ్మాయిల్లో బ్లాక్ స్పాట్ వల్ల అందంగా కనబడుమేమో అన్న బెంగ పెట్టుకొంటుంటారు. ఈ బ్లాక్ స్పాట్స్ నివారించడానికి కొన్ని సింపుల్ హోం రెమెడీస్ ఉన్నాయి. ఈ సింపుల్ రెమెడీస్ నేచురల్ గా బ్లాక్ స్పాట్స్ ను నివారిస్తాయి. ఈ డార్క్ ప్యాచ్ లు చర్మంలో కలిసిపోయాలే చేస్తాయి. దాంతో మునపటి చర్మ సౌందర్యాన్ని పొందుతారు.

బ్లాక్ స్పాట్స్ చర్మంలో మెలనిన్ ఉత్పత్తి అధికమవ్వడం వల్ల ఏర్పడుతాయి. ముఖ్యంగా సూర్య రశ్మి వల్ల, ప్రెగ్నెన్సీ, మెడికేషన్స్, విటమిన్స్ లోపం, నిద్రలేమి మరియు ఒత్తిడి వల్ల కూడా బ్లాక్ స్పాట్స్ ఏర్పడుతాయి.

ఈ స్పాట్స్ మరియు ప్యాచెస్ చాలా అస్యహంగా కనబడుతూ ఉన్న అందాన్ని కాస్త పాడుచేస్తుంటాయి. వ్యక్తిగత సంతోషాన్ని దూరం చేస్తాయి . ఈ స్పాట్స్ అండ్ ప్యాచెస్ ను నివారించుకోవడానికి రసాయనిక ఉత్పత్తుల కంటే హోం రెమెడీస్ చాలా గ్రేట్ గా సహాయపడుతాయి. మరి ఆ హోం రెమెడీస్ ఏంటో ఒక సారి చూద్దాం...

ఓట్స్:

ఓట్స్:

స్కిన్ ఎక్స్ ఫ్లోయేట్ చేయడానికి ఓట్స్ చాలా అద్భుతమైనవి . ఓట్స్ ను పౌడర్ గా చేసి అందులో కొద్దిగా నిమ్మరసం మిక్స్ చేసి పేస్ట్ లా చేయాలి . ఈ మాస్క్ ను మీ ముఖానికి అప్లై చేయాలి . ఇది డార్క్ స్పాట్స్ ను లైట్ గా మార్చడం మాత్రమే కాదు, ఇది చర్మంను సాఫ్ట్ గా మరియు తేమగా ఉంచుతుంది.

నిమ్మరసం:

నిమ్మరసం:

నిమ్మరసం చర్మ సంరక్షణలో బ్లీచింగ్ ఏజెంట్ గా పనిచేస్తుంది. డార్క్ స్పాట్స్ ను మాయం చేస్తుంది. నల్ల మచ్చలున్న ప్రదేశంలో కొద్దిగా నిమ్మరసం పిండి, డ్రై అయిన తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రంగా కడిగేసుకోవాలి . ఇది డార్క్ స్పాట్స్ ను నివారించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది.

మజ్జిగ:

మజ్జిగ:

మజ్జిగలోని లాక్టిక్ యాసిడ్స్ చర్మానికి చాలా మంచిది. బట్టర్ మిల్క్ ను రెగ్యులర్ గా ఉపయోగిస్తుంటే డార్క్ స్పాట్స్ నివారించుకోవచ్చు . బట్టర్ మిల్క్ లో కాటన్ బాల్స్ డిప్ చేసి నల్ల మచ్చలున్న ముఖం మీద మర్ధన చేయాలి. ఇవి ముఖంలో నల్ల మచ్చలను తేలిక పరుస్తాయి. ఇలా కొన్ని రోజులు చేస్తుంటే మంచి ఫలితం ఉంటుంది.

కలబంద:

కలబంద:

ఇది బహుళ విధాలుగా ఉపయోగపడే బ్యూటీ ప్రొడక్ట్. కాలిన గాయాలను మాన్పడంతో పాటు, తెగిన గాయలను మరియు పగుళ్ళను నయం చేస్తుంది . అలాగే డార్క్ స్పాట్స్ ను కూడా నివారిస్తుంది . అందుకు ఫ్రెష్ గా ఉండే అలోవెర జ్యూస్ ను నల్ల మచ్చల మీద అప్లై చేసి డ్రై అయిన తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి.

బాదం:

బాదం:

బాదంలో ఉండే విటమిన్ ఇ చర్మ సంరక్షణకు గ్రేట్ గా సహాయపడుతుంది. బాదంను రాత్రి నీళ్ళలో వేసి నానబెట్టి, తర్వాత పేస్ట్ చేసి ఉదయం ముఖానికి పట్టించి స్ర్కబ్ చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. డార్క్ స్పాట్స్ ను తగ్గించి, చర్మంను కాంతివంతంగా మార్చుతుంది.

బంగాళదుంప:

బంగాళదుంప:

బంగళదుంపను డార్క్ సర్కిల్స్ నివారించుకోవడానికి ఉపయోగిస్తుంటారు. బంగాళ దుంప రసం నల్లమచ్చలతో పాటు, స్కిన్ ప్యాచ్ లను నివారిస్తుంది . బంగాళదుంప రసం పట్టించి, డ్రై అయిన తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి.

 ఉల్లిపాయ రసం:

ఉల్లిపాయ రసం:

డార్క్ స్పాట్స్ ఉన్న ప్రదేశంలో ఉల్లిపాయ రసాన్ని అప్లై చేసి, డ్రై అయిన తర్వాత మంచి నీటితో శుభ్రం చేసుకోవాలి. .ఉల్లిపాయ రసంలో ఉండే బ్లీచింగ్ ఏజెంట్స్ అందుకు గ్రేట్ గా సహాయపడుతాయి. ఉల్లిపాయ రసంలో కొద్దిగా నిమ్మరసం మిక్స్ చేసి తీసుకోవడం వల్ల ఫలితం మరింత ఎఫెక్టివ్ గా ఉంటుంది.

English summary

Best Home Remedies To Remove Dark Spots: Beauty Tips in Telugu

Best Home Remedies To Remove Dark Spots: Beauty Tips in TeluguAre you tired or worried about black spots? Well, there are simple treatments that you can try at home to naturally reduce these black spots. These dark patches can be easily lightened and removed to restore the glowing facial complexion.
Story first published: Saturday, October 31, 2015, 16:11 [IST]
Desktop Bottom Promotion