For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

టీ బ్యాగ్స్ తో అమేజింగ్ బ్యూటీ బెనిఫిట్స్

By Super
|

ప్రతి రోజూ టీ త్రాగే అలవాటుందా? ఖచ్చితంగా నూటికి 99శాతం మందికి ఈ అలవాటు ఉంటుంది. కొంత మందికి నిద్రలేవగానే టీ త్రాగందే దినచర్య ప్రారంభం చేయలేరు. టీ త్రాగుతారు సరే, టీ బ్యాగ్స్ ను ఏం చేస్తారు? అందుకు ఒక గొప్ప ప్రత్యామ్నాయ మార్గాలు చాలానే ఉన్నాయి.

టీ బ్యాగ్స్ తో అనేక ప్రయోజనాలున్నాయి. మీ అందాన్ని మెరుగుపరచుకోవడం మొదలు...ఆరోగ్యానికి...శానిటైజర్ గా బహు విధాలుగా ఉపయోగపడుతుంది. అదెలాగో తెలుసుకోవడం కోసమే ఈ ఆర్టికల్ మీకోసం..టీబ్యాగ్స్ ఉపయోగించి, అద్భుతమైన హోం రెమెడీస్ ను తయారుచేసుకోవచ్చు. మరి అవేంటో తెలుసుకోవాలంటే ఈ క్రింది విషయాలను చదవాల్సిందే...

సన్ బర్న్ నివారిస్తుంది:

సన్ బర్న్ నివారిస్తుంది:

వేడి వాతావరణంలో మరియు ట్రోపికల్ కంట్రీస్ ఇండియా, బాంగ్లాదేశ్ మరియు శ్రీలంకలలో జీవించే వారికి సన్ బర్న్ తగలడం చాలా సహజం. మీరు ప్రయాణం చేసే సమయంలో ఎన్ని సన్ స్క్రీన్స్ అప్లై చేసినా, లేదా గొడుగు వెంట తీసికెళ్ళినా..ఏదో ఒక విధంగా చర్మం సన్ బర్న్ కు గురికాకతప్పదు . అందుకు చాలా మంది నిపుణులు ఇంటికి చేరుకోగానే ముఖాన్ని శుభ్రం చేసుకోమని సలహాలిస్తుంటారు . అయితే చర్మం సూర్య రశ్మికి గురైనప్పుడు, టీబ్యాగ్స్ చాలా గ్రేట్ గా సహాయపడుతాయి. టీబ్యాగ్స్ ఉపయోగించిన తర్వాత వాటిని చల్లబరిచి సన్ బర్న్ గురైన చర్మం మీద జస్ట్ అప్లై చేయాలి. తర్వాత చల్లటి నీటితో కడిగేసుకోవడం వల్ల చాలా ఉపశమనం కలిగిస్తుంది. మరియు చల్లని టీ బ్యాగ్స్ మురియు అలోవెరా మంచి కాంబినేషన్

రాషెస్ ను తగ్గిస్తుంది :

రాషెస్ ను తగ్గిస్తుంది :

మీ చర్మం మీద దద్దుర్లు ఉన్నట్లైతే , ఈ సమస్యకు చాలా త్వరగా పరిష్కార మార్గం టీబ్యాగ్స్ . ముఖ్యంగా చర్మ వ్యాధులైన ఎక్జిమా వంటి చర్మవ్యాధులకు చాలా ఎఫెక్టివ్ హోం రెమెడీ . చాలా సింపుల్ గా చమోమెలీ టీ త్రాగడం వల్ల మరియు వాడిని టీ బ్యాగ్స్ చల్లబడిన తర్వాత ఎఫెక్టెడ్ ప్రదేశంలో టీబ్యాగ్స్ అప్లై చేయడం వల్ల మీరు ఖచ్చితంగా ఉపశమనం పొందుతారు

హెర్పస్ :

హెర్పస్ :

హెర్పస్ కూడా చల్లని టీబ్యాగ్స్ తక్షణ ఉపశమనం కలిగిస్తాయి . హెర్పస్ ప్రభావం ఉన్న ప్రదేశంలో చల్లటి టీ బ్యాగ్స్ ను అప్లై చేయాలి. టీబ్యాగ్స్ లో కనుగొన్న టానిక్ గాయాలను మాన్పుతుంది.

 డార్క్ సర్కిల్స్ ను తగ్గిస్తుంది:

డార్క్ సర్కిల్స్ ను తగ్గిస్తుంది:

డార్క్ సర్కిల్స్ నిజంగా విసుగును కలిగిస్తాయి . ఇవి మీ యొక్క అందాన్ని పాడుచేస్తాయి మరియు చాలా తక్కువ ఆకర్షణీయమైనవిగా చేస్తాయి. ఈ సమస్యకు ఒక ఎఫెక్టివ్ అండ్ స్మార్ట్ పరిష్కార మార్గం, చల్లటి టీ బ్యాగ్స్ ను నల్లని వలయాలున్న ప్రదేశంలో అప్లై చేయాలి

బ్యూటిఫుల్ అండ్ షైనీ హెయిర్ పొందడానికి :

బ్యూటిఫుల్ అండ్ షైనీ హెయిర్ పొందడానికి :

మీ జుట్టును బ్యూటిఫుల్ గా మరియు మంచి షైనింగ్ తో ఉంచుకోవాలంటే ? టీ బ్యాగ్స్ చాలా గ్రేట్ . ఒక బౌల్ నిండుగా నీళ్ళు తీసుకొని బాగా మరిగించి అందులో 4 టీ బ్యాగ్స్ ను డిప్ చేయాలి . 5 నిముషాలు టీ బ్యాగ్స్ డిప్ అయిన తర్వాత, టీ బ్యాగ్స్ తొలగించి, చల్లబడిన నీటితో తలస్నానం చేసుకోవాలి . హేర్బల్ టీ మీ జుట్టును హైలైట్ చేస్తుంది జుట్టు యొక్క నిర్మాణంను మెరుగుపరుస్తుంది.

ఫేషియల్ టోనర్ :

ఫేషియల్ టోనర్ :

మీ చర్మానికి మాయిశ్చరైజర్ ను టీబ్యాగ్స్ తో ఇంటివద్ద పట్టించుకోవచ్చు . అందుకు గ్రీన్ టీ ఉపయోగించుకోవచ్చు. మరిగే నీళ్ళలో 10 నిముషాలు టీ బ్యాగ్స్ డిప్ చేసి, తర్వాత చల్లబడిన తర్వాత ఆ నీటిని ముఖానికి కాటన్ తో అప్లై చేయాలి.

చర్మాన్ని సాప్ట్ గా మార్చుతుంది:

చర్మాన్ని సాప్ట్ గా మార్చుతుంది:

మీ చర్మం మరీ హార్ష్ గా ఉందా?మరి చాలా రఫ్ గా ఉన్న చర్మాన్ని సాప్ట్ గా మార్చడానికి టీ బ్యాగ్స్ ను ఉపయోగించుకోవచ్చు. స్నానం చేసే నీటిలో కొన్ని ఉపయోగించిన టీ బ్యాగ్స్ ను డిప్ చేసి, కొన్ని నిముషాలు అలాగే ఉంచాలి తర్వాత ఆ నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవడం వల్ల చర్మం సాఫ్ట్ గా మరియు స్మూత్ గా తయారవుతుంది.

 ఫేషియల్ :

ఫేషియల్ :

టీ బ్యాగ్స్ తో ఇంట్లోనే మంచి ఫేషియల్ ను చేసుకోవచ్చు . ఒక బౌల్ తీసుకొని అందులో హాట్ వాటర్ నింపాలి. తర్వాత అందులో టీబ్యాగ్స్ ను ఫిల్ చేయాలి. తర్వాత అందులో కాటన్ టవల్ ను డిప్ చేయాలి . నీరు బాగా పిండేసి, ఆ టవల్ ను ముఖం మీద వేసుకొని 10 నుండి 20 నిముషాలు అలాగే ఉంచుకోవడం వల్ల చర్మ రంద్రాలు టైట్ అవుతాయి మరియు చర్మం సాఫ్ట్ గా మరియు మెరుస్తుంటుంది.

English summary

Effective Home Remedies Using Tea Bag: Beauty Tips in Telugu

Effective Home Remedies Using Tea Bag: Beauty Tips in Telugu. Done drinking your cup of tea but wondering what to do with your tea bag? We have the ultimate solution for you!If you’re looking for ways in which you can improve your appearance and lifestyle using tea bags, you have come to the right destination.
Desktop Bottom Promotion