For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బేబీ స్కిన్ పొందడానికి మ్యాంగో హోం రెమెడీస్

|

ఇది ఒక వండర్ ఫుల్ టైమ్ అని చెప్పవచ్చు. ఎందుకంటే ఈ సీజన్ లో సీజనల్ ఫ్రూట్స్ ఎక్కువగా దొరుకుతాయి. ఈ ఫ్రూట్స్ ను తినడం మాత్రమే మాత్రమే కాదు, వీటి ఏవిధంగా ఉపయోగించాలో కూడా తెలుసుకోవాలి. వేసవి సీజన్ లో చర్మం ఎక్కువగా సన్ రేస్ కు ప్రభావితం అయ్యి, సన్ రాషెస్, సన్ బర్న్ వంటి సమస్యలు ఏర్పడుతుంటాయి. సీజన్ బట్టి వచ్చే సమస్యలను ఎదుర్కోవడానికి సీజన్ బట్టి వచ్చే సీజనల్ ఫ్రూట్స్ కూడా మనకు ప్రకృతి ప్రసాదిస్తున్నాయి. వీటిని తినడం వల్ల చర్మంను హెల్తీగా ఉంచుకోవచ్చు.

ఒక సారి పాడైన చర్మ సౌందర్యం తిరిగి బేబీ స్కిన్ పొందడం అంత సులభమైన పనికాదు. టీవీలో వచ్చే మేకప్ రెమెడీస్ అన్నీ కూడా ఖరీదైనవిగా ఉంటాయి మరియు కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ ను కూడా కలిగి ఉంటాయి . కాబట్టి, వీటికి బదులుగా కొన్ని బెస్ట్ నేచురల్ హోం రెమెడీస్ ను ఉపయోగించినట్లైతే స్కిన్ హెల్తీగా ఉంచుతాయి. ముఖ్యంగా పచ్చి వాటిలో విటమిన్స్ మరియు న్యూట్రీషియన్స్ పుష్కలంగా ఉంటాయి. మరియు చాలా తక్కువ దుష్ప్రభావాలను కలిగి ఉంటుంది.

ముఖ్యంగా ఈ సీజన్ లో మనకు అందుబాటులో ఉండే మనకు ఇష్టమైన మామిడిపండ్లలో బీటాకెరోటిన్, నేచురల్ ఫ్రూట్ యాసిడ్స్ మరియు విటమిన్ సి ఇవన్నీ కూడా చర్మానికి చాలా మేలు చేస్తాయి . ఇవి చర్మాన్ని ఎక్స్ఫోయేట్ చేస్తాయి. మరియు ఇవి వేసవిలో వేడి గాలుల నుండి చర్మానికి రక్షణ కల్పిస్తాయి.

మీకు సమయం లేనప్పుడు వేసవి సీజన్ లో మీరు బేబీ స్కిన్ కోరుకుంటున్నట్లైతే మీకోసం ఒకన్ని ఉత్తమమైన హోం రెమెడీస్ ను మీకోసం ఈ క్రింది స్లైడ్ ద్వారా తెలుపుతున్నాము . మామిడిపండ్లు ఈ సీజన్ లో చాలా ఉపయోగకరంగా ఉన్నాయి. మరి పచ్చిమామిడి సౌందర్యానికి ఎలా ఉపయోగపడుతుంది. ఈ క్రింది స్లైడ్ ద్వారా తెలుసుకుందాం...

1. మామిడి మరియు తేనె ఫేస్ ప్యాక్:

1. మామిడి మరియు తేనె ఫేస్ ప్యాక్:

పచ్చిమామిడికాయ పేస్ట్ లేదా బాగా పండిన మామిడి పండ్ల యొక్క గుజ్జులో కొద్దిగా తేనె మిక్స్ చేసి ముఖానికి అప్లై చేసి, 20నిముషాల తర్వాత శుభ్రం చేసుకోవడం ద్వారా చర్మానికి తగినంత మాయిశ్చరైజర్ అందుతుంది. ఇంకా అవసరం అయితే అందులో కొద్దిగా బాదం ఆయిల్ కూడా మిక్స్ చేయవచ్చు. ఇలా చేయడం వల్ల మీరు బేబీ స్కిన్ పొందవచ్చు.

2. మ్యాంగో మడ్ మాస్క్:

2. మ్యాంగో మడ్ మాస్క్:

బాగా పండిన మామిడిపండ్ల గుజ్జు తీసుకొని అందులో కొద్దిగా క్లే లేదా ఓట్స్, తేనె మరియు పాలు వేసి మిక్స్ చేయాలి. ఈ పేస్ట్ ను ముఖానికి పట్టించి, తడి ఆరిన తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.

3. బ్లాక్ హెడ్స్ ను నివారిస్తుంది:

3. బ్లాక్ హెడ్స్ ను నివారిస్తుంది:

చర్మంలోని బ్లాక్ హెడ్స్ ను నివారించడానికి మ్యాంగో గుజ్జు గ్రేట్ గా సహాయపడుతుంది. అందుకోసం బాగా పండిన మామిడిపండ్ల గుజ్జులో పాల పొడి, తేనె వేసి బాగా మిక్స్ చేసి ముఖానికి పట్టించి స్ర్కబ్ చేయాలి. దీన్ని సర్క్యులర్ మోషన్ లో స్ర్కబ్ చేయడం వల్ల గ్లోయింగ్ స్కిన్ పొందవచ్చు.

4.యాంటీఏజింగ్ బెనిఫిట్స్:

4.యాంటీఏజింగ్ బెనిఫిట్స్:

మామిడిపండ్లలో యాంటీఆక్సిడెంట్స్ అధికంగా ఉంటాయి. వయస్సైన వారిలా కనబడనివ్వకుండా చర్మానికి రక్షణ కల్పిస్తుంది. అంతే కాదు, స్కిన్ క్యాన్సర్ కు కారణం అయ్యే సెల్స్ నుండి కూడా రక్షణ కల్పిస్తుంది. బాగా పండిన మామిడిపండ్ల గుజ్జును ముఖానికి పట్టిస్తే చాలు అందమైన చర్మ సౌందర్యం పొందవచ్చు.

5. మొటిమలు నివారించడంలో:

5. మొటిమలు నివారించడంలో:

పచ్చిమామిడికా జ్యూస్ అద్భుతమైన ఆస్ట్రిజెంట్. ఇది ముఖంలో మొటిమలు, మచ్చలు ఏర్పడకుండా చర్మ రక్షణకు సహాహపడుతుంది.

English summary

Home Remedies For Glowing Skin With Mango

We give you 5 of the best home remedies to bring your skin back to the glowing and smoother self in no time. Take the full advantage of this season as mangoes can be your fairy godmother for the skin. Just follow these simple yet effective home regime.
Story first published: Wednesday, May 27, 2015, 16:27 [IST]
Desktop Bottom Promotion