For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

స్కిన్ అలర్జీలు నివారించే.. సింపుల్ హోం రెమిడీస్

By Nutheti
|

శీతాకాలం వచ్చిందంటే.. చర్మంపై దురద, పొడిబారడం, రకరకాల చర్మ సమస్యలు వేధిస్తాయి. కొంతమందికి కాలంతో సంబంధం లేకుండా.. స్కిన్ అలర్జీలతో బాధపడుతుంటారు. దీర్ఘకాలిక, తాత్కాలిక చర్మ సమస్యలని రెండు రకాలుంటాయి. అయితే తాత్కాలిక చర్మ సమస్యలకు హోం రెమిడీస్ తోనే తగ్గించుకోవచ్చు.

చర్మం ఎర్రగా మారటం, దురదులు, వాపులు వంటి సమస్యలు అలర్జీలు. ఇలాంటి దురదలు నివారించడానికి ఇంట్లోనే చక్కటి ఈజీ పరిష్కారాలున్నాయి. సహజసిద్ధంగానే వీటిని నివారించడం వల్ల మంచి ఫలితాలు పొందవచ్చు. క్రీములు వాడినా.. తాత్కాలిక ఉపశమనం కలిగిస్తాయి. కానీ.. న్యాచురల్ గా హోం రెమిడీస్ ఫాలో అయితే.. మంచి ఫలితాలు ఉంటాయి.

కొబ్బరినూనె

కొబ్బరినూనె

సహజ సిద్ధమైన గుణాలు కలిగి ఉన్న కొబ్బరినూనె చర్మ సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. దురదగా ఉన్నప్రాంతంలో కొబ్బరినూనె రాసుకుంటే.. వెంటనే ఉపశమనం పొందవచ్చు.

ఆలివ్ ఆయిల్

ఆలివ్ ఆయిల్

అలర్జీలు ఉన్నప్పుడు ప్రభావిత ప్రాంతాల్లో ఆలివ్ ఆయిల్ తో మసాజ్ చేయడం వల్ల రిలాక్స్ గా ఉంటుంది. అంతేకాదు.. కొబ్బరినూనె, ఆలివ్ ఆయిల్ రెండింటిని కలిపి వాడితే.. మంచి ఫలితాలు పొందవచ్చు.

వేప

వేప

వేపలో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్, యాంటీ ఫంగల్ గుణాలు పుష్కలంగా ఉంటాయి. అనేక రకాల చర్మ సమస్యలకు వేప చక్కటి పరిష్కారం. మొటిమలు, గజ్జి, తామర వంటి సమస్యలు తగ్గించడానికి వేప బాగా పనిచేస్తుంది.

నల్ల మిరియాలు

నల్ల మిరియాలు

నల్లమిరియాల్లో డీ టాక్సీఫయర్ గా పనిచేస్తాయి. ఇది యాంటీ ఆక్సిడెంట్ గుణాలను కలిగి ఉండటం వల్ల చర్మ సమస్యలను ఈజీగా పరిష్కరిస్తుంది.

తేనె

తేనె

చర్మ సమస్యలతో పోరాడటానికి తేనె సహజసిద్ధంగా పనిచేస్తుంది. ముఖ్యంగా.. మొటిమలు తగ్గించడానికి తేనె చక్కటి పరిష్కారం. తేనె, దాల్చిన చెక్క కలిపి చర్మంపై రాసుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందవచ్చు.

నిమ్మకాయ

నిమ్మకాయ

నిమ్మకాయలో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. ఇది చర్మ సమస్యలతో పోరాడుతుంది. నిమ్మచెక్కను అలర్జీలు ఉన్న ప్లేస్ లో రాయడం వల్ల త్వరగా ఉపశమనం కలుగుతుంది.

కలబంద

కలబంద

చర్మ సమస్యలతో పోరాడటానికి కలబంద న్యాచురల్ రెమిడీ. చర్మంపై వచ్చే చిరాకులు, దురదుల ఉన్నప్పుడు కలబంద గుజ్జును రాసుకుంటే.. మంచి ఫలితం ఉంటుంది.

బొప్పాయి

బొప్పాయి

బొప్పాయిలో విటమిన్ ఏ, పపాయిన్ లు ఉంటాయి. ఇవి చర్మంలో డెడ్ సెల్స్ తొలగించడానికి సహాయపడతాయి. చర్మంపై ట్యాన్, మొటిమలు తొలగించాలంటే.. పచ్చి బొప్పాయి పండు గుజ్జు చర్మానికి రాసుకుంటే సరి.

నీళ్లు

నీళ్లు

నిత్యం సరిపడా నీళ్లు తాగితే.. రక్తప్రసరణ బాగా జరిగి విషపదార్థాలు బయటకుపోతాయి. ఈ విషపదార్థాలు శరీరంలో ఉంటే.. చర్మం పొడిబారుతుంది. కాబట్టి చర్మాన్ని హైడ్రేటెడ్ గా ఉంచుకోవాలి. అప్పుడు ఎలాంటి స్కిన్ అలర్జీలు మీ దరిచేరవు.

English summary

Home Remedies For Skin Allergies

You can get skin allergies due to many reasons. Be it the sun, fabric or some vegetable, your skin is extremely sensitive, and the chances of getting allergies are remarkably high.
Story first published: Wednesday, December 23, 2015, 15:17 [IST]
Desktop Bottom Promotion