For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కళ్ళ క్రింద ముడుతలు, నల్లని వలయాలను నివారించే ఉత్తమ హోం రెమెడీలు

|

ళ్ళ క్రింది భాగంలో ముడుతలు ఉన్నాయంటే ముఖ అందాన్ని మరియు లుక్స్ ను పాడు చేసేస్తుంది. ఈ ముడుతలనేవి చర్మ సమస్యల్లో ఒకటి, ఇవి చిన్న వయస్సులోనే కనబడుటకు ప్రధాణ కారణం డ్రై స్కిన్ మరియు హానికరమైన సూర్యకిరణాలు ముఖం మరియు శరీరం మీద పడటం. వయస్సు పెరుగుట వల్ల కూడా కళ్ళ క్రింద ముడుతలు ఏర్పడుటకు ముఖ్య కారణం.

కళ్ళ క్రింద చర్మం చాలా సున్నితంగా ఉండటం వల్ల చాలా తర్వాత సులభంగా ముడుతలు మరియు ఫైన్ లైన్స్ ఏర్పడుటకు కారణం అవుతుంది . కాబట్టి, ఇలా కళ్ళ క్రింది నల్లని వలయాలు ఏర్పడాటానికి ముందే తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.

READ MORE: కంటి అలసట, ఒత్తిడి తగ్గించుకోవడానికి 10 మార్గాలు

కళ్ళ క్రింద నల్లని వలయాలు మరియు చారలను నివారించడం కోసం మహిళలు బ్యూటీ పార్లర్స్ మరియు కాస్మోటిక్స్ కోసం ఎక్కువగా డబ్బు ఖర్చు చేస్తుంటారు. ఇలా ఖర్చు చేసి తీసుకొనే ట్రీట్మెంట్స్ మరియు రసాయనిక ప్రొడక్ట్స్ కంటే మనం ఇంట్లో నేచురల్ గా ఉపయోగించే నేచురల్ ప్రొడక్ట్స్ మరింత ఎఫెక్టివ్ గా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా నివారిస్తాయి.

READ MORE:ముఖం మీద ముడుతలు కనిపిస్తే వయసు మళ్ళిందని బెంగా...?

అలాంటే ఎఫెక్టివ్ హోం రెమెడీస్ ను కొన్నింటిని మీకు ఈ రోజు పరిచయం చేస్తున్నాము. ఇవి ముఖంలో మచ్చలు మరియు నల్లని వలయాలను నివారించడంలో గొప్పగా సహాయపడుతాయి. మరి ఆ హోం రెమెడీస్ ఏంటో క్రింది స్లైడ్ ద్వారా తెలుసుకుందాం...

పైనాపిల్ జ్యూస్:

పైనాపిల్ జ్యూస్:

కొద్దిగా పైనాపిల్ జ్యూస్ ను కళ్ళక్రింద అప్లై చేయడం ద్వారా ముడుతలు చాలా ఎఫెక్టివ్ గా తొలగించబడుతుంది . ఇందులో బ్రొమైలిన్ అనే ఎంజైమ్స్ ఉండటం వల్ల ముడుతలను నేచురల్ తొలగించడంలో చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది.

 ఆముదం:

ఆముదం:

ఆముదం నూనెను కళ్ళ క్రింద అప్లై చేసి సున్నితమైన మసాజ్ చేయడం వల్ల కళ్ళ క్రింద ముడుతలను నివారించబడతాయి. ముడతలన్నీ తొలగించడంతో పాటు చర్మంను సాఫ్ట్ గా మార్చుతుంది.

రోజ్మెరీ ఆయిల్ :

రోజ్మెరీ ఆయిల్ :

కళ్ళ క్రింద ముడుతలను నివారించడంలో ఇది చాలా ఎఫెక్టివ్ ఎసెన్షియల్ ఆయిల్ . రోజ్మెరీ ఆయిల్ తో చాలా సున్నితంగా కళ్ళ క్రింద మర్ధన చేయడం వల్ల నల్లని వలయాలు మరియు సన్నని చారలు తొలగింపబడుతాయి . అంతే కాదు కళ్ళ క్రింద చర్మానికి అవసరం అయ్యే పోషణను అందిస్తుంది మరియు తేమగా ఉంచుతుంది.

 కీరదోసకాయ:

కీరదోసకాయ:

కీరదోసకాయను ముక్కలుగా కట్ చేసి కళ్ళక్రింది సున్నితంగా మసాజ్ చేయాలి. ఇలా చేయడం వల్ల కళ్ళ క్రింద నల్లని వలయాలు తొలగించడంతో పాటు మీ చర్మానికి తగినంత హైడ్రేషన్ అందిస్తుంది మరియు ఫైన్ లైన్స్ నివారించబడుతుంది . మరియు ముడుతలను నివారిస్తుంది .

తేనె మరియు అల్లం:

తేనె మరియు అల్లం:

అల్లం చర్మానికి అవసరం అయ్యే తేమను మరియు పోషణను అందిస్తుంది . చర్మం ముడుతలను నివారిస్తుంది మరియు కళ్ళ క్రింద రక్త ప్రసరణ జరగడానికి సహాయపడుతుంది. అల్లం పేస్ట్ లో కొద్దిగా తేనె మిక్స్ చేసి కళ్ళ క్రింది భాగంలో మసాజ్ చేయాలి . 15నిముషాల తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇది ముడుతలను నివారిస్తుంది.

 కొబ్బరి నూనె :

కొబ్బరి నూనె :

కొబ్బరి నూనెలో ఉండే ఫ్యాటీ యాసిడ్స్ చర్మానికి తగినంత తేమను అందిస్తుంది మరియు ముడతలను నివారిస్తుంది . స్వచ్చమైన కొబ్బరి నూనెను కళ్ళ క్రింది అప్లై చేసి మర్దన చేయాలి. ఇలా ప్రతి రోజూ చేస్తుంటే మంచి ఫలితం ఉంటుంది.

ఆలివ్ ఆయిల్:

ఆలివ్ ఆయిల్:

ఆలివ్ ఆయిల్ చర్మానికి తేమను, మాయిశ్చరైజర్ ను మరియు పోషణను అందిస్తుంది . కొద్దిగా ఆలివ్ ఆయిల్ ను కళ్ళ క్రింది భాగంలో అప్లై చేసి కొద్దిగా సున్నితమైన మసాజ్ ను అందివ్వాలి . ఇలా ఒక నెలరోజులు క్రమం తప్పకుండా చేస్తుంటే మంచి ఫలితం ఉంటుంది . కళ్ళ క్రింద నల్లని వలయాలను నివారించడానికి ఇది ఒక బెస్ట్ హోం రెమెడీ.

గుడ్డులోని తెల్ల సొన:

గుడ్డులోని తెల్ల సొన:

ఎగ్ వైట్ లో నేచురల్ ప్రోటీన్స్ అధికంగా ఉంటాయి మరియు ఇది చర్మం యొక్క ఎలాసిటిని పెంచుతుంది. మరియు ముడుతలను, చారలను నివారించి, చర్మాన్ని టైట్ చేస్తుంది. ఎగ్ వైట్ ను చర్మానికి అప్లై చేసి 15 నిముషాల తర్వాత శుభ్రం చేసుకోవాలి.

రోజ్ వాటర్ :

రోజ్ వాటర్ :

రోజ్ వాటర్ ను కళ్ళ క్రింది భాగంలో అప్లై చేయడం ద్వారా ఇది చర్మానికి పోషణను అందిస్తుంది మరియు తేమగా ఉంచుతుంది మరియు ముడుతలను నివారించబడుతుంది. కొద్దిగా రోజ్ వాటర్ ను తీసుకొని కాటన్ మీద వేసి కళ్ళ క్రింద అప్లై చేస్తే మంచి ఫలితం ఉంటుంది.

అవొకాడో:

అవొకాడో:

అవొకాడో మాయిశ్చరైజ్ గా పనిచేస్తుంది అలాగే చర్మానికి తగినంత తేమను అందిస్తుంది . అవొకాడో పేస్ట్ ను కళ్ళ క్రింది భాగంలో అప్లై చేయాలి . ఇది చర్మంలోని ముడుతలను సన్నని ఛారలను నివారిస్తుంది.

English summary

Home Remedies For Wrinkles And Fine Lines Under Eyes

Wrinkles under eyes can spoil your over all beauty and looks. They can appear prematurely on your face due to dry skin and harmful sun rays. Progressing age can also cause wrinkles under eyes.
Story first published: Thursday, April 30, 2015, 13:04 [IST]
Desktop Bottom Promotion