For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పెద్దవాళ్లకు కూడా బేబీ ఆయిల్ ఎలా ఉపయోగపడుతుంది ?

|

బేబీ ఆయిల్ చాలా మైల్డ్ గా ఉంటుంది. ఎలాంటి చర్మానికి ఇది ఉపయోగించడం చాలా మంచిది. సున్నిత చర్మతత్వం ఉన్న వాళ్లు బేబీ ఆయిల్ ఉపయోగించడం మంచిది. దీనివల్ల చర్మం చాలా సున్నితంగా, స్మూత్ గా మారుతుంది. జుట్టు ఆరోగ్యానికి, పోషణకు బేబీ ఆయిల్ చాలా బాగా ఉపయోగపడుతుంది. మాడుకి బేబీ ఆయిల్ రాయడం వల్ల చుండ్రు సమస్య తగ్గుతుంది. ఏదైనా ఇన్ఫక్షన్ ఉంటే.. బేబీ ఆయిల్ అప్లై చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. బేబీ ఆయిల్ చర్మానికి రాస్తే దురద, డ్రైనెస్ కూడా తగ్గిపోతుంది. ఆలివ్ ఆయిల్ ఉండే సుగుణాలన్నీ బేబీ ఆయిల్ లో ఉంటాయి.

బేబీ ఆయిల్ లో ఎసెన్షియల్ ఆయిల్స్ కలిపి వాడటం వల్ల చర్మం మరింత ఆరోగ్యంగా ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు. ఒక టేబుల్ స్పూన్ ఆల్మండ్ ఆయిల్ ని బేబీ ఆయిల్ తో కలిపి పట్టించుకుంటే.. వ్యాక్సింగ్ ద్వారా వచ్చే రాషెస్ తగ్గిపోతాయి. లావెండర్ ఆయిల్ కలపడం వల్ల నిర్జీవమైన చర్మం కాంతివంతంగా తయారవుతుంది. అంతేకాదు చర్మంపై ఉన్న మేకప్ తొలగించడానికి కూడా సహాయపడుతుంది. ఇంకా బేబీ ఆయిల్ పెద్దవాళ్లకు ఎలా ఉపయోగపడుతుందో తెలుసుకుందాం..

చర్మానికి పోషణ

చర్మానికి పోషణ

గోరువెచ్చని బేబీ ఆయిల్ ని పొడిబారిన చర్మానికి అప్లై చేయడం వల్ల చర్మానికి సరైన పోషణ అందుతుంది. బేబీ ఆయిల్ తో మసాజ్ చేయడం వల్ల చర్మం స్మూత్ గా మారుతుంది. వారానికి ఒకసారి ఇలా చేస్తే మంచి ఫలితం ఉంటుంది.

మెరిసే చర్మానికి

మెరిసే చర్మానికి

మీ చర్మం నిర్జీవంగా మారి ఇబ్బంది పెడుతుంటే.. బేబీ ఆయిల్ చక్కటి పరిష్కారం. జిడ్డుని తగ్గించి సహజ మెరుపు తీసుకురావడానికి ఇది సహాయపడుతుంది.

సున్నితమైన చర్మానికి

సున్నితమైన చర్మానికి

సెన్సిటివ్ చర్మానికి బేబీ ఆయిల్ ఉపయోగించడం చాలా మంచిది. ఇది చర్మం నిగారింపు సంతరించుకోవడానికే కాదు.. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మంచి ఫలితాలు ఇస్తుంది.

మస్కారా తొలగించడానికి

మస్కారా తొలగించడానికి

బేబీ ఆయిల్ మేకప్ రిమూవ్ చేయడానికి కూడా బాగా ఉపయోగపడుతుంది. రెండు చుక్కల బేబీ ఆయిల్ లో దూదిని ముంచి మేకప్ తొలగించడానికి ఉపయోగించాలి. మేకప్ తొలగించిన తర్వాత బేబీ ఆయిల్ తో ముఖంపై మసాజ్ చేస్తే బావుంటుంది.

గోళ్లకు

గోళ్లకు

బేబీ ఆయిల్ ఉపయోగించడం వల్ల గోళ్లు స్మూత్ గా, ఆరోగ్యంగా మారతాయి. గోళ్లకు ఈ ఆయిల్ అప్లై చేయడం వల్ల సహజ మెరుపు సంతరించుకుంటాయి.

కాలి పగుళ్లకు

కాలి పగుళ్లకు

గోరువెచ్చని బేబీ ఆయిల్ ని కాలి పగుళ్లకు రాయడం వల్ల త్వరగా ఉపశమనం పొందవచ్చు. ముందుగా పాదాలను వేడిగా ఉన్న సోప్ వాటర్ లో నాననివ్వాలి. తర్వాత పగుళ్లు ఉన్న ప్రాంతంలో స్ర్కబ్ చేసుకోవాలి. తర్వాత పాదాలను శుభ్రం చేసుకుని ఆరనివ్వాలి. తర్వాత వేడిగా బేబీ ఆయిల్ తో మసాజ్ చేసుకోవడం వల్ల పగుళ్లు తగ్గిపోతాయి.

జుట్టు సంరక్షణకు

జుట్టు సంరక్షణకు

జుట్టుని, మాడుని, కుదుళ్లను బేబీ ఆయిల్ తో మసాజ్ చేయడం వల్ల జుండ్రు సమస్య తగ్గిపోవడమే కాకుండా.. పొడిబారిన మాడుకి కూడా బాగా పనిచేస్తుంది. అంతేకాదు జుట్టుకి పోషణతో పాటు సహజ మెరుపుని అందిస్తుంది బేబీ ఆయిల్.

English summary

How Does Baby Oil Benefit Adult Skin? in telugu

Baby oil is mild in nature and it is the best oil to use on any type of skin. Adults should use baby oil if they have sensitive skin as it helps soothe the skin, making it supple and soft to touch.
Desktop Bottom Promotion