For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

స్కిన్ క్యాన్సర్ గురించి మీకు తెలియని ఆశ్చర్యపరిచే వాస్తవాలు

By Super
|

చర్మ క్యాన్సర్ గురించి కొన్ని వాస్తవాలు తెలుసుకోవలసిన అవసరం ఎంతైనా ఉన్నది. చర్మ క్యాన్సర్ లో వివిధ రకాలు ఉన్నాయి, చాలావరకు సూర్యుడి యొక్క వేడి అధికంగా చర్మం మీద బహిర్గత ఫలితంగా వొస్తున్నవే.

చర్మ క్యాన్సర్లు మెలనోమా మరియు నాన్-మెలనోమా గ్రూపులుగా విభజింపబడ్డాయి. వీటిని ప్రారంభ దశల్లో కనుగొంటే వీటిని నయం చేయవచ్చు. చర్మ క్యాన్సర్ లక్షణాల గురించి తెలుసుకోవటం చాలా ముఖ్యం ఎందుకంటే సరిఅయిన చికిత్స తీసుకోవటం చాలా ముఖ్యం, లేదు అంటే అది మీ శరీరం యొక్క వివిధ ఇతర ప్రాంతాలకు వ్యాపించవచ్చు.

చర్మ క్యాన్సర్ మరణానికి కూడా దారితీస్తుంది అన్నది నిజం. ఒక నిర్దిష్టదశవరకు ఈ స్కిన్ క్యాన్సర్ లక్షణాలు పైకి కనపడవు. మెలనోమా వచ్చినప్పుడు, అది మీ చర్మంపైన ఏ ప్రాంతంలోనైనా కనపడవచ్చు.

చర్మ క్యాన్సర్లను నివారించటానికి, సూర్యరశ్మి చర్మానికి పరిమితంగా తగలనీయడం ఉత్తమం. ముఖ్యంగా వేసవి మధ్యాహ్నసమయంలో, మీరు ఇంట్లో ఉండడం ఉత్తమం.

నివారణ చర్యలు

నివారణ చర్యలు

సన్స్క్రీన్, సన్ గ్లాసెస్, సరైన బట్టలు ధరించటం మరియు శుభ్రమైన పడకలు వంటి కొన్ని నివారణ చర్యలు చర్మ క్యాన్సర్ నుండి బాధ తగ్గించడానికి సహాయపడతాయి.

చర్మం

చర్మం

చర్మ క్యాన్సర్ వలన ప్రమాదం ఫెయిర్ చర్మం ఉన్న ప్రజలకు ఎక్కువగా ఉంటుంది అని పరిశోధనలు చెపుతున్నాయి. కాబట్టి, తెల్లటి ఛాయతో ఉన్న వ్యక్తులు అన్ని నివారణ చర్యలను పాటించాలి.

చికిత్స

చికిత్స

రేడియేషన్ చికిత్స అవసరం ఉన్నవారికి హాని ఎక్కువగా జరిగే అవసరం ఉన్నది మరియు కాబట్టి, ఇటువంటి చికిత్సలు కొంతమంది ప్రజలకు సిఫార్సు చేయరు. స్త్రీలా, పురుషులా అన్న విషయానికి వచ్చినప్పుడు, స్త్రీల కంటే పురుషులకు ఈ చర్మ క్యాన్సర్ వొచ్చే అధిక అవకాశాలు ఉన్నాయి మరియు వయస్సు విషయానికి వచ్చినప్పుడు, ముసలివారికి ఈ చర్మ క్యాన్సర్ ప్రమాదం ఎక్కువగా ఉన్నది.

UV కిరణాలు

UV కిరణాలు

UV కిరణాలు చర్మ క్యాన్సర్ రావటానికి ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నాయి, కావున వాటిని పూర్తిగా నివారించటం ఉత్తమం. కఠినమైన సూర్యుడి కిరణాలను తగలకుండా చూసుకోవాలి మరియు టానింగ్ పడకలు వాడకూడదు.

జెనెటిక్స్

జెనెటిక్స్

ఎవరి పూర్వికులు చర్మ క్యాన్సర్లతో బాధపడ్డారో వారి వంశీకులకు ఈ ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి, ఈ క్యాన్సర్ప్ గురించి సమాచారాన్నిపూర్తిగా తెలుసుకోవాలంటే వారి కుటుంబ చరిత్ర గురించి తెలుసుకోవాలి.

పుట్టుమచ్చ

పుట్టుమచ్చ

కొన్ని రకాల మోల్స్ క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచవచ్చు, కాబట్టి వీటి గురించి జాగ్రత్తగా ఉండటం ఉత్తమం. అలాంటి సందర్భాలలో చర్మనిపుణుడిని సంప్రదించటం ముఖ్యం.

కెమికల్ ఎక్స్పోజరు

కెమికల్ ఎక్స్పోజరు

కొన్ని రకాల రసాయనాలు (ఉదాహరణకు ఆర్సెనిక్ వంటివి) చర్మ క్యాన్సర్ కారణమవుతున్నాయి. ఇటువంటి రసాయనాలు వాడేప్పుడు జాగ్రత్తగా ఉండటం ఉత్తమం.

English summary

Important Facts About Skin Cancer

Skin cancers are categorised as melanoma and non-melanoma groups. The former can be treated if it is detected in the initial stages. It is important to know about the signs of skin cancer because, if treatment is not offered on time, it may spread to various other areas of your body.
Story first published: Wednesday, May 13, 2015, 9:23 [IST]
Desktop Bottom Promotion