For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఒక్క రోజులో మొటిమలు మాయం చేసే ది బెస్ట్ హోం రెమెడీస్

|

మహిళలను మరియు అమ్మాయిలను ఎక్కువగా బాధించే సమస్య మొటమలు మచ్చలు. ఇంకా కొంత మంది పురుషులు కూడా మొటిమల సమస్యతో బాధపడుతుంటారు . మొటిమలను నివారించుకోవడానికి వేసుకొనే కొన్ని ఫేస్ మాస్కుల వల్ల ముఖం రెడ్ గా మరియు భయంకరంగా మార్చేస్తాయి. ఇలాంటి ఇబ్బంది కలిగించే మచ్చలను, స్కార్స్ ను నివారించుకోవడానికి మరియు మీలో నమ్మకం కలగడానికి కొన్నిగంటలు లేదా కొన్నిరోజులు పట్టవచ్చు.

ఆయిల్ ముఖం ఉన్న వారు మొటిమలు, మచ్చలకు ఎక్కువగా గురి అవుతుంటారు . ముఖంలో ఎక్కువ ఆయిల్స్ ఉన్నట్లైతే ఇది ఎక్కువ ఇన్ఫెక్షన్స్ కు మరియు మచ్చలకు దారితీస్తుంది . మరియు చర్మ రంద్రాలను కూడా బ్లాక్ చేస్తుంది. చర్మ రంద్రాల్లోప నిల్వ ఉండే ఆయిల్స్ వల్ల స్కిన్ ఇన్ఫెక్షన్స్ మరియు మొటిమలకు దారితీస్తుంది.

ఇలా మొటిమలు, మచ్చలున్న ముఖంతో నలుగురిలోకి పోవడానికి అమ్మాయిలు ఇబ్బంది పడుతుంటారు. ముఖ్యంగా ఏదైనా స్పెషల్ కార్యక్రమాలు, ఫంక్షన్స్, పార్టీలు ఉన్నప్పడు మరింత ఎక్కువ బాధపడుతుంటారు. మొటిమలను నివారించుకోవడానికి మెడికేటెడ్ క్రీములను ఉపయోగించడం అంత మంచి ఐడియా కాదు. ఇలాంటి క్రీములు లేదా ఆయిట్ మెంట్స్ కొన్ని వారాల పాటు ఉపయోగిస్తారు . దీర్ఘకాలంలో సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువగా ఉంటాయి. కాబట్టి, మొటిమలను నివారించుకోవడానికి నేచురల్ మార్గాలు అనేకం ఉన్నాయి.

మొటిమలు మరియు మచ్చలతో బాధపడే వారు వంటగదిలోనే వస్తువులతోనే చాలా త్వరగా వేగంగా మొటిమను తగ్గించుకోవచ్చు . మరి ఆ హోం రెమెడీస్ ఏంటో ఒకసారి తెలుసుకుందాం...

1. ఆవాలు మరియు తేనె:

1. ఆవాలు మరియు తేనె:

మొటిమలు మరియు మచ్చలను తొలగించడానికి ఆవాలు గ్రేట్ గా సహాయపడుతాయి . ఆవాలలో సాలిసిలిక్ యాసిడ్స్ అనే నేచురల్ కాంపోనెంట్ ఎక్కువగా ఉండటం వల్ల ఇది స్కిన్ ఇన్ఫెక్షన్స్ మరియు మొటిమలను నివారించడానికి ఇది ఒక బెస్ట్ హోం రెమెడీ. 1/4మస్టర్డ్ పౌడర్ లో ఒక చెంచా తేనె మిక్స్ చేసి ముఖానికి ప్యాక్ లా వేసుకోవాలి. 15నిముషాల తర్వాత శుభ్రం చేసుకోవాలి.

2. గ్రీన్ టీ ఐస్ క్యూబ్స్:

2. గ్రీన్ టీ ఐస్ క్యూబ్స్:

కొన్ని గ్రీన్ టీ ఆకులను నీటిలో వేసి బాగా మరిగించాలి. ఈ గ్రీన్ టీ వాటర్ చల్లారిన తర్వాత ఐస్ ట్రేలో పోసి ఫ్రీజర్ లో పెట్టాలి. గ్రీన్ టీ ఐస్ క్యూబ్స్ తయారవుతాయి. ఈ గ్రీన్ టీ ఐస్ క్యూబ్ తీసుకొని మొటిమలు మచ్చలున్న ప్రదేశంలో మర్ధన చేయాలి. మొటిమలు మాయం అవ్వడంతో పాటు, స్కిన్ ఇన్ఫ్లమేషన్ మరియు పఫీ ఐస్ ను నివారిస్తుంది.

3. టమోటో స్లైస్:

3. టమోటో స్లైస్:

టమోటోల్లో యాంటీఆక్సిడెంట్స్ ఉండటం వల్ల చర్మం మీద ఆస్ట్రిజెంట్ ప్రభావం కలిగి ఉంటుంది . ఇది అన్ని రకాల చర్మ సంబంధిత ఇన్ఫెక్షన్స్ నివారించడంలో ఇది ఒక బెస్ట్ హోం రెమెడీ. కొద్దిగా టమోటో రసంను ముఖానికి అప్లై చేసి మర్ధన చేయడం లేదా టమోటో స్లైస్ తో మొటిమల మీద మర్దన చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.

4. వెల్లుల్లి జ్యూస్:

4. వెల్లుల్లి జ్యూస్:

మొటిమలకు కారణం అయ్యే స్కిన్ ఇన్ఫెక్షన్స్ ను నాశనం చేస్తుంది. వెల్లుల్లిలో నయం చేసే గుణాలు మెండుగా ఉన్నాయి . మొటిమలు ఎక్కువగా బాధిస్తున్నా..లేదా మొటిమలు పెద్దగా కనబడుతున్నా. వాటి మీద వెల్లుల్లి రెబ్బల రసాన్ని అప్లై చేయాలి. ఒక వెల్లుల్లి పాయ తీసుకొని స్టోన్ మీద అరగదీసి, చిటికెడు రాసన్ని అప్లై చేయాలి. ఎక్కువగా అప్లై చేయకూడదు. .ఒక గంట తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇది చాలా ఎఫెక్టివ్ హోం రెమెడీ.

5. ఎగ్ వైట్ మాస్క్:

5. ఎగ్ వైట్ మాస్క్:

ఎగ్ వైట్ ను సపరేట్ గా తీసుకొని మొటిమల మీద అప్లై చేయాలి. 20 నిముషాల తర్వాత శుభ్రం చేసుకోవాలి. అలాగే ఎగ్ వైట్ అప్లై చేయడానికి ముందు నిమ్మరసం అప్లై చేయడం వల్ల నయం చేసే గుణాలు మరింత ఎఫెక్టివ్ గా పెరుగుతాయి.

6. ఆపిల్ సైడర్ వెనిగర్:

6. ఆపిల్ సైడర్ వెనిగర్:

మొటిమలను నివారించుకోవడానికి మరో నేచురల్ ట్రీట్మెంట్ ఆపిల్ సైడర్ వెనిగర్ . కాటన్ బాల్ ను ఆపిల్ సైడర్ వెనిగర్ లో డిప్ చేసి మొటిమల మీద ప్లేస్ చేయాలి. 5నిముషాల తర్వాత శుభ్రం చేసుకోవాలి. మొటిమలున్న ప్రదేశంలో మాత్రమే అప్లై చేయాలి. ఈచిట్కాను రోజులో మూడు నాలుగు సార్లు చేయొచ్చు.

7. క్లే అండ్ ఆయిల్స్:

7. క్లే అండ్ ఆయిల్స్:

ఒక చెంచా ఫుల్లర్స్ ఎర్త్ లో కొన్ని చుక్కల ల్యావెండర్ నూనె వేసి పేస్ట్ లా చేసి ముఖానికి పట్టించాలి. 10 నిముషాల తర్వాత మొటిమలు మాయం అవుతాయి.

8. నిమ్మరసం:

8. నిమ్మరసం:

నిమ్మరసంలో కొన్ని కాటన్ బాల్స్ డిప్ చేసి ముఖం మీద అప్లై చేయాలి. రాత్రంతా అలాగే ఉంచి మరుసటి రోజు ఉదయం శుభ్రం చేసుకోవాలి. రాత్రిలోనే బాగా డ్రై అయై రాలిపోతాయి.

English summary

Kitchen Remedies To Remove Pimples In Just One Day

Pimples and acne are a common concern for most girls and women too. Even some men may also suffer from this problem. They mask the beauty of your face, making it look red and somewhat scary to look at. It is the need of the hour to remove these embarrassing marks from your face and boost your self confidence.
Story first published:Saturday, December 5, 2015, 15:03 [IST]
Desktop Bottom Promotion