For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

చర్మ కాంతిని మెరుగుపరిచే నేచురల్ ఆయుర్వేదిక్ స్కిన్ టోనర్స్

|

స్కిన్ క్లీనింగ్ మరియు ఎక్సఫ్లోయేటింగ్ తర్వాత స్కిన్ టోనర్ ను ఉపయోగిస్తుంటారు. స్కిన్ టోనర్ చర్మానికి ఒక రక్షణ కవచంలా సహాయపడుతుంది. మరియు చర్మ రంధ్రాలను శుభ్రం చేయడానికి సహాయపడుతుంది. ఇది చర్మంలోని డీప్ గా మాయిశ్చరైజ్ అవ్వడానికి సహాయపడుతుంది. చర్మానికి అవసరం అయ్యే పోషణను అందిస్తుంది. దాంతో చర్మం యొక్క స్థితి స్థాపకత పెరుగుతుంది. అలాగే స్కిన్ టోనర్ వల్ల చర్మంలో ఎలాంటి మొటిమలు, మచ్చలు మరియు ఇతర స్కిన్ ఇన్ఫెక్షన్స్ ను నిరోధించడానికి సహాయపడుతుంది.

ఇంకా స్కిన్ టోనర్ ను మేకప్ తొలగించడానికి సహాయపడుతుంది, మరియు చర్మంలోపలికి చొచ్చుకొని పోయి చర్మ రంద్రాలను శుభ్రపరుస్తుంది . కాబట్టి , రోజ్ వాటర్ వంటి స్కిన్ టోనర్ ను చర్మానికి ఉపయోగించుకోవచ్చు. రోజ్ వాటర్ కాకుండా మరికొన్ని ఎఫెక్టివ్ నేచురల్ స్కిన్ టోనర్స్ ను మనం ఇంట్లోనే తయారుచేసుకోవచ్చు.

కీరదోస, హజల్ నట్, చమోమైల్, లెమన్ ఆయిల్, రోజ్ ఆయిల్ మరియు రోజ్ వాటర్ వంటి ఫ్రెష్ నేచురల్ పదార్థాలతో ఇంట్లోనే స్కిన్ టోనర్ ను ఉపయోగించుకోవచ్చు . ఇలాంటి నేచురల్ స్కిన్ టోనర్స్ అన్ని రకాల చర్మ తత్వాలకు సహాయపడుతుంది . ఇంట్లోనే నేచురల్ స్కిన్ టోనర్స్ ను తయారుచేసుకోవడానికి వీటిని ఇతర పదార్థాలతో మిక్స్ చేసి తయారుచేసుకోవచ్చు. . మరి కాంతివంతమైన చర్మానికి నేచురల్ ఆయుర్వేదిక్ స్కిన్ టోనర్స్ ఏంటో ఒకసారి తెలుసుకుందాం...

1. తులసి టోనర్:

1. తులసి టోనర్:

తులసి ఆకులను మెత్తగా చేసి, పేస్ట్ ను అరకప్పు వేడి నీటిలో వేసి, బాగా మిక్స్ చేసి ఫిల్టర్ చేసుకోవాలి. ఈ నీటికి ఒక చెంచా అలోవెర జెల్ మిక్స్ చేయాలి . తర్వాత ఈ నీటిని ముఖానికి పట్టించవచ్చు లేదా నేరుగా త్రాగవచ్చు. ఈ నేచురల్ హోం మేడ్ టోనర్ మొటిమలును మరియు మచ్చలను నివారిస్తుంది.

2. మెంతులతో టోనర్:

2. మెంతులతో టోనర్:

గుప్పెడు మెంతులను వేడినీటిలో వేసి ఉడికించాలి. బాగా మరిగించిన తర్వాత నీటిని వేరే బౌల్లోనికి ఫిల్టర్ చేసుకోవాలి. చల్లారిన తర్వాత ఫేస్ టోనర్ గా ఉపయోగించుకోవాలి.

3. పసుపుటోనర్:

3. పసుపుటోనర్:

ఒక చెంచా పసుపును 3 చెంచాల నిమ్మరసంతో మిక్స్ చేసి దానికి 1/4కప్పు వేడి నీళ్ళు చేర్చి మిక్స్ చేయాలి. ఈ మిశ్రమాన్ని స్కిన్ టోనర్ గా ఉపయోగించుకోవచ్చు.

4. హనీ టోనర్:

4. హనీ టోనర్:

ఒక చెంచా తేనె మరియు ఒక చెంచా నిమ్మరసంలో కొద్దిగా ఎగ్ వైట్ వేసి మిక్స్ చేసి ముఖానికి అప్లై చేసి 15 నిముషాల తర్వాత శుభ్రం చేసుకోవడం వల్ల ఇది చర్మ రంద్రాలను శుభ్రపరిచి, రంధ్రాలు మూసుకొనేలా చేసి చర్మాన్ని టైట్ గా మార్చుతుంది. ఇంకా ముడుతలను నివారిస్తుంది. స్కిన్ ఎలాసిటి మెరుగుపరుస్తుంది మరియు చర్మానికి అవసరం అయ్యే పోషణను అందిస్తుంది.

5. కీరదోస-క్యారెట్ టోనర్:

5. కీరదోస-క్యారెట్ టోనర్:

గుప్పెడు పుదీనా ఆకులను వేడి నీటిలో వేసి బాయిల్ చేయాలి. దీనికి 3 చెంచాలి కీరదోస రసాన్ని, రెండు చెంచాల క్యారెట్ రసాన్ని మిక్స్ చేసి ఐస్ ట్రేలో పోసి ఫ్రీజ్ చేయాలి. ఒక్కసారి ఐస్ క్యూబ్స్ ఏర్పడిన తర్వాత ఈ ఐస్ ముక్కలతో ముఖం మీద మర్దన చేయాలి.

6. టమోటో జ్యూస్ టోనర్:

6. టమోటో జ్యూస్ టోనర్:

మూడు చెంచాల టమోటో జ్యూస్ లో ఒక చెంచా తేనె మిక్స్ చేసి ముఖానికి పట్టించి ఫేస్ కు టోనర్ గా అప్లై చేయాలి. ఇది మొటిమలను మరియు మచ్చలను నివారిస్తుంది. మరియు ఇది డల్ స్కిన్ కు ఒక ఎఫెక్టివ్ హోం రెమెడీ.

7. పుదీనా మరియు వేపతో టోనర్:

7. పుదీనా మరియు వేపతో టోనర్:

గుప్పెడు పుదీనా మరియు గుప్పెడు వేపఆకులను తీసుకొని నీటిలో వేసి 15నిముషాలు బాయిల్ చేయాలి. తర్వాత ఫిల్టర్ చేసి స్ప్రే బాటిల్లో స్టోర్ చేసుకొని ముఖానికి టోనర్ గా ఉపయోగించాలి . ఈ ఫేస్ట్ టోనర్ అన్ని రకాల ఇన్ఫెక్షన్స్ మరియు మొటిమలను నివారిస్తుంది.

English summary

Make Your Own Face Toner At Home

Skin toners must be used after cleansing and exfoliating. Skin toners help in forming a protective layer on the skin and cleanse the skin pores from within. It helps in deep moisturisation and provides nourishment to the skin, as it increases the skin's permeability.
Story first published: Tuesday, November 17, 2015, 11:26 [IST]
Desktop Bottom Promotion