For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రాత్రికి రాత్రే మీ ముఖంలో మంచి షైనింగ్ పొందడానికి 6 సాధారణ మార్గాలు

By Super
|

నిగనిగలాడే చర్మం అంటే ఇష్టం లేనివారు ఎవరుంటారు? వేళకు నిద్ర, సరైన పౌష్టికాహారం, చక్కని వ్యాయామం తోపాటు చర్మతత్వానికి సరిపడే సరైన క్రీములు కాంతివంతమైన చర్మ సొంతంచేసుకోవడానికి దోహదపడతాయి. అయితే, మనలో అందరికీ ఈ విధానాలన్నీ ఎల్లవేళలా పాటించడం సాధ్యపడకపోవచ్చు.

READ MORE: కాంతివంతమైన చర్మ సౌందర్యానికి పెరుగుతో ఫేస్ ప్యాక్

సమయం చాలా తక్కువ, ఇలాంటివన్నీ నేనెక్కడ చెయ్యగలను, కానీ సహజమైన, సులభమైన మార్గాలుంటే బావుణ్ణు అనుకునే వారికోసం ఇవిగో ఈ చిట్కాలు. ఇవన్నీ ఒకసారి పరీక్షించి చక్కటి ఫలితాలను ఇస్తాయని ఋజువైనవే, మరింకెందుకు ఆలస్యం, మీరూ ట్రై చెయ్యండి.

 బియ్యం, నువ్వుల స్క్రబ్:

బియ్యం, నువ్వుల స్క్రబ్:

నువ్వులు, బియ్యం సరి సమానంగా తీసుకుని ఓ రాత్రంతా నానబెట్టాలి. మరుసటి రోజు ఉదయం నానబెట్టిన నువ్వులు, బియ్యాన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ పేస్టుని ముఖానికి, చర్మానికి రాసుకుని ఒకటి రెండు నిముషాల తర్వాత చల్లటి నీళ్ళతో కడిగేసుకోవాలి. నువ్వులు చర్మానికి చక్కటి తేమను అందించి మాయిశ్చరైజర్ లా పనిచేస్తాయి. బియ్యం పిండి చర్మం పై ఉన్న మృతకణాలను తొలగించడంలో ఉపయోగపడుతుంది. ఇలా ఈ బియ్యం, నువ్వుల పేస్టు మంచి బాడీ పాలిషింగ్ స్క్రబ్ గా పనిచేస్తుంది.

పడుకునేటప్పుడు స్లీపింగ్ ఫేస్ ప్యాక్ లు వాడండి:

పడుకునేటప్పుడు స్లీపింగ్ ఫేస్ ప్యాక్ లు వాడండి:

ప్రాహా బ్లాజం స్లీపింగ్ ఫేస్ ప్యాకులు మీరు నిద్రపోతున్న సమయంలో చర్మం పై పనిచేసి చర్మాన్ని కాంతివంతం చేయడంలో తోడ్పడతాయి. ఈ ప్రాహా ఉత్పత్తిని వాడే విధానం: ముందు ముఖాన్ని ఎటువంటి మేకప్ లేకుండా శుభ్రంగా చల్లటి నిటితో కడుక్కోవాలి. తేలికపాటి ఫేస్ వాష్ వాడవచ్చు.తడి లేకుండా మెత్తటి బట్టతో అద్దుకోవాలి. ఇప్పుడు ఈస్పూను కంటే తక్కువ పరిమాణంలో స్లీపింగ్ ప్యాక్ ను తీసుకుని చర్మానికి అప్ వర్డ్ స్ట్రోక్స్ తో పూయాలి. అంటే చర్మాన్ని పైకి తోస్తూ మసాజ్ చేయాలి. ఇలా చేయడం వల్ల చర్మం సాగి పోకుండా ఉంటుంది. ఈ స్లీపింగ్ ప్యాక్స్ చర్మంలోకి త్వరగా ఇంకిపోవడం వల్ల జిడ్డుగా అనిపించదు. మర్నాడు ఉదయం తేలికపాటి క్లెన్సర్, చల్లటి నీటిని ఉపయోగించి ముఖాన్ని కడుక్కోవాలి.

అద్భుతమైన నిగారింపునిచ్చే పాలు:

అద్భుతమైన నిగారింపునిచ్చే పాలు:

కాంతివంతమైన చర్మాన్ని ఇవ్వడంలో పాలు ప్రముఖ పాత్ర పోషిస్తాయి. రాత్రి నిద్రపోయే ముందు, కొవ్వు తక్కువగా ఉండే లో ఫ్యాట్ మిల్క్ ను కొద్దిగా ముఖంపై అప్ వర్డ్ స్ట్రోక్స్ తో, పాలన్నీ చర్మంలోకి ఇంకి పోయేలా తేలికగా మసాజ్ చేయ్యాలి. మర్నాడు ఉదయం లేవగానే మైల్డ్ ఫేస్ వాష్ తో ముఖాన్ని కడుక్కోవాలి. పాలు ముఖంపై ఉండే నల్లటి మచ్చల్ని పోగొట్టడంలో సహాయం చేస్తాయి, అలాగే చర్మానికి కావలసిన పోషకాలను అందిస్తాయి.

.స్క్రబ్ & మాయిశ్చరైజ్:

.స్క్రబ్ & మాయిశ్చరైజ్:

ముందు ముఖంపై ఎటువంటి మేకప్ లేకుండా శుభ్రంగా కడుక్కోవాలి. తేలికపాటి ఎక్స్ఫాలియేటర్ (మృతకణాలను తొలగించే స్క్రబ్) ఉపయోగించాలి. ఆ తర్వాత ఫుల్లర్స్ ఎర్త్, తేనె కలిపిన పేస్ట్ ని అప్లై చేసి 15 నిముషాలు ఉంచాలి. ఈ ప్యాక్ డ్రై అయిపోగానే కొద్దిగా తడిచేసుకుంటూ 2 నిముషాలు పాటు స్క్రబ్ చేసి చల్లటి నితితో కడిగెయ్యాలి. తడి లేకుండా చర్మాన్ని మెత్తటి బట్టతో తుడుచుకుని ఏదైనా నైట్ క్రీమ్ రాసుకుని పడుకోవాలి. మర్నాడు ఉదయం, తేలికపాటి ఎక్స్ఫాలియెటర్ తో ముఖాన్ని శుభ్రపరచుకోవాలి. ఇలా శుభ్రపరచాకా, ఇంకా నిగారింపు కావాలనుకుంటే, తేనె ప్యాక్ ను మళ్ళీ వేసుకోవచ్చు.

అందమైన కళ్ళ కోసం:

అందమైన కళ్ళ కోసం:

మరి చర్మాన్ని కాంతివంతం చేసుకుంటేనే సరిపోదు, కళ్ళు సైతం కళకళ్ళాడాలి. ఎక్కువసేపు కంప్యూటర్ స్క్రీన్ చూడడం, సరైన సమయానికి నిద్ర లేకపోవడం వల్ల కళ్ళ చుట్టూ నల్లటి వలయాలు రావడం సహజం. అంతే కాదు కళ్ళు ఎంతో కాంతి విహీనంగానూ అయిపోతాయి. మరి అలా వాడిపోయిన కళ్ళను తిరిగి తేజోవంతం చెయ్యాలంటే ఈ చిట్కాలు పాటించి చుడండి: రాత్రి పడుకునేటప్పుడు చక్కటి ఐ కాంటూర్ జెల్ వాడండి. ఇది కళ్ళచుట్టూ ఉన్న చర్మానికి చక్కటి తేమను అందిస్తుంది. అలాగే నిద్రపోయేటప్పుడు కళ్ళను కప్పి ఉంచే ఐ మాస్క్ కూడా వాడాలి. ఉదయం లేవగానే చల్లటి నీటితో కళ్ళను కడుకోవడాం మర్చిపోకండి.

ఇలా చేస్తే కళ్ళ చుట్టూ ఉండే నల్లటి వలయాలు మాయం అవ్వడమే కాదు, మీ కళ్ళు కూడా ఎంతో తాజాగా ఉంటాయనడంలో సందేహంలేదు.

ఫేస్ ఆయిల్స్:

ఫేస్ ఆయిల్స్:

శీతాకాలంలో స్వఛ్ఛమైన ఆయుర్వేద నూనెలు వాడడం వల్ల చర్మం కాంతివంతం అవుతుంది. పొడిబారినట్టుగా ఉండే డ్రై స్కిన్ ఉన్న వారు ఈ నూనెలను రాత్రిపుట రాసుకుని ఉదయం లేవగానే తేలికపాటి స్క్రబ్ తో కడిగేసుకుంటే సరిపోతుంది. ఇక సాధారణా చర్మం గలవారైతే, ఈ నూనెలను ఓ గంట పాటు రాసుకుని, తేలికపాటి స్క్రబ్ తో కడుక్కోవాలి. అలాగే పడుకునే ముందు ఫేస్ స్పిరిట్స్ వాడాలి. ఉదయం లేవగానే, parabens మరియు SLS లేని తేలికపాటి క్లిన్సర్, చల్లటి నీరు ఉపయోగించి కడుక్కుని ఫేస్ మిస్ట్ ని స్ప్రే చేసుకోవాలి.

English summary

Six Simple Ways To Make Skin Glow Overnight: Indian Beauty Tips in Telugu

Six Simple Ways To Make Skin Glow Overnight, Indian Beauty Tips in Telugu, Who doesn’t love glowing skin? A correct sleeping pattern, CTM routine, aintaining the right diet, exercising and using the right rejuvenating creams are the key mantras for getting glowing complexion.
Desktop Bottom Promotion