For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ముక్కు ఆయిలీగా, జిడ్డుగా కనబడుతుంటే వీటిని అప్లై చేయండి...

|

కొంత మందిలో ఆయిల్ స్కిన్ చాలా ఇబ్బంది పెడుతుంటుంది. ముఖ్యంగా ఈ సమస్య వేసవిలో ఎక్కువగా ఉంటుంది. కొంత మందిలో సీజన్ తో సంబంధం లేకుండా అన్ని సీజన్స్ లోనూ ఇబ్బంది పెడుతుంటుంది. ఆయిల్ స్కిన్ వల్ల చర్మంలో అనేక సమస్యలు ఎదుర్కోవల్సి వస్తుంది. ఈ ఆయిల్ స్కిన్ నివారించుకోవడానికి ఎన్ని ట్రీట్మెంట్స్ ను చేసుకొన్న సమస్య మాత్రం ఎంతకీ తగ్గదు.

READ MORE: ఆయిల్ స్కిన్: నివారించే బెస్ట్ హోం రెమెడీస్

అయితే ఒక ఎఫెక్టివ్ మార్గం ఉన్నది. ఆయిల్ స్కిన్ ను సహజంగా నివారించుకోవాలని కోరుకుంటే, రోజులో ఎక్కువగా నీరు త్రాగాలి. దాంతో శరీరంలో హైడ్రేషన్ లో ఉంటుంది మరియు ముఖంను రోజులో రెండు మూడు సార్లు శుభ్రం చేస్తుంటే ముఖ చర్మంలో మురికి తొలగి ఫ్రెష్ గా ఉండవచ్చు.

READ MORE: మీ చర్మాన్ని ప్రకాశవంతము చేసే సుగంధ నూనెలు

ఆయిల్ స్కిన్ నేచురల్ పద్దతుల్లో నివారించుకోవడానికి మరో మార్గం, మన శరీరంలో ఉండే ఆయిల్ గ్లాండ్స్ (గ్రంథులు) ఎక్సెస్ ఆయిల్ ను ఉత్పత్తి చేయకుండా కొన్ని ప్రత్యేకమైన ఫుడ్స్ ను తీసుకోవాలి. మీరు ఆయిల్ స్కిన్ తో బాధపడుతుంటే, మీరు అనుసరించాల్సిన కొన్ని ఉత్తమ చిట్కాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి.

READ MORE: సహజ పద్దతుల్లో ఆయిల్ స్కిన్ నివారించడానికి 13 మార్గాలు

ముఖ్యంగా మన చర్మం ఎక్కువగా ప్రభావితం అయ్యేది ముక్కు ప్రాతంలో ఎక్కువ ఆయిలీగా ఉండి, జిడ్డుగా కనబడుతుంటుంది. ఈ జిడ్డు వల్ల ముక్కు మీద బ్లాక్ హెడ్స్ మరియు మొటిమలకు కారణం అవుతుంది. చాలా మందిలో ముఖం అంతా ఫ్రెష్ గా కనబడుతున్నా..ముక్కు మాత్రం జిడ్డుగా కనబడుతుంటుంది. అలాంటి వారికోసం కొన్ని ఎఫెక్టివ్ ఫేస్ ప్యాక్స్ ఉన్నాయి. వీటిని వేసుకోవడం వల్ల సమస్యను పరిష్కరించుకోవచ్చు. మరి ఆ ఫేస్ ప్యాక్స్ ఏంటో చూద్దాం...

స్ట్రాబెర్రీ క్రష్:

స్ట్రాబెర్రీ క్రష్:

ఆయిల్ స్కిన్ నివారించడంలో స్ట్రాబెర్రీ గొప్పగా సహాయపడుతుంది. ఇందులో విటమిన్ సి అధికంగా ఉండటం వల్ల చాలా ఎఫెక్టివ్ గా పనిచేసి సమస్యను త్వరగా నివారిస్తుంది. స్ట్రాబెర్రీని మెత్తగా చేసి ముఖానికి ప్యాక్ లా వేసి శుభ్రం చేయాలి. ఇలా వారంలో రెండు మూడు సార్లు చేస్తుంటే సమస్య పరిష్కారం అవుతుంది.

ఆప్రికాట్ పేస్ట్:

ఆప్రికాట్ పేస్ట్:

ఆప్రికాట్ ఫ్రూట్స్ ను మెత్తగా పేస్ట్ చేసి ఫేస్ కు ప్యాక్ లా వేసుకోవాలి. ఇది తడి ఆరిన తర్వాత కాటన్ క్లాత్ ను నీటిలో డిప్ చేసి తుడిచేసుకోవాలి. ఇది ముఖంలో ఎక్సెస్ ఆయిల్ ను తొలగిస్తుంది.

అవొకాడో ప్యాక్:

అవొకాడో ప్యాక్:

అవొకాడో ఆయిల్ స్కిన్ నివారించడంలో చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. దీన్ని మెత్తగా పేస్ట్ చేసి ముక్కకు ప్యాక్ లా వేసుకోవాలి. పేస్ట్ డ్రై అయిన తర్వాత పాలలో డిప్ చేసి కాటన్ వస్త్రంతో తుడిచేయాలి.

టమోటో:

టమోటో:

ముక్కు మీద ఉండే ఆయిల్ మరియు జిడ్డును తొలగించడంలో టమోటో పేస్ట్ గ్రేట్ గా సహాయపడుతుంది. టమోటోలో ఉండే విటమిన్ సి అందుకు గ్రేట్ గా సహాయపడుతుంది.

శెనగపిండి:

శెనగపిండి:

చర్మం ఫ్రెష్ గా మరియు బ్యూటిఫుల్ గా మార్చుకోవడానికి శెనగపిండిని మనం వివిధ రకాలుగా ఉపయోగిస్తుంటాం. ఒక చెంచా శెనగపిండిని రోజ్ వాటర్ మిక్స్ చేసి ముఖానికి అప్లై చేయాలి. డ్రై అయిన తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి.

 మిల్క్ క్రీమ్ ప్యాక్:

మిల్క్ క్రీమ్ ప్యాక్:

ఆయిల్ స్కిన్ నివారించడంలో పాలు ఒక ఎఫెక్టివ్ హోం రెమెడీ. పాలలో కాటన్ బాల్ డిప్ చేసి రాత్రి నిద్రించే ముందు ముక్కు మీద బాగా మర్దన చేసి తర్వాత నిద్రించి, ఉదయం లేవగానే చల్లటి నీటితో ముఖం వాష్ చేసుకోవాలి.

పెరుగు:

పెరుగు:

ముక్కు మీద ఆయిల్ మరియు జిడ్డును తొలగించడానికి ఇది మరో ఎఫెక్టివ్ హోం రెమెడీ. చల్లగా ఉండే పెరుగును ముక్కుకు అప్లై చేసి బాగా మసాజ్ చేయాలి. పెరుగులో ఉండే మంచి బ్యాక్టీరియా చర్మంలో జిడ్డు తొలగించి హెల్తీ అండ్ మెరుసేలా చేస్తుంది.

 ఆమ్లా జ్యూస్:

ఆమ్లా జ్యూస్:

ఉసిరికాయ రసంలో బ్యూటీ బెనిఫిట్స్ అధికంగానే ఉన్నాయి. ఆమ్లా జ్యూస్ తో మీ ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. ఆమ్లా జ్యూస్ తో ముఖం శుభ్రం చేసుకోవడం వల్ల మంచి గ్లోతో మెరుస్తుంటుంది.

పొటాటో స్కిన్:

పొటాటో స్కిన్:

బంగాళదుంపను రెండుగా కట్ చేసి ముఖం మీద పెట్టి మసాజ్ చేయాలి. బంగాళదుంపలోని రసం ఆయిల్ నెస్ ను తొలగించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది. దీన్ని పూర్తిగా ఆరే వరకూ ఉండి తర్వాత ముఖం గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.

అరటి తొక్క:

అరటి తొక్క:

ఆయిల్ స్కిన్ తొలగించడంలో అరటి తొక్క గ్రేట్ గా సహాయపడుతుంది. అరిపండు తిన్న తర్వాత తొక్కతో ముఖం మీద మర్ధన చేయడంవల్ల ఇది మంచి ఫలితం ఉంటుంది.

English summary

Ten Packs For An Oily Nose: Beauty Tips in Telugu

Oily skin can also be prevented by avoiding certain types of foods which encourage the oil glands to be produced in excess. However, if you are 'blessed' with oily skin here are some of the best tips to follow. The nose is the first to be affected with excess oil. The little pores on the nose are also prone to blackheads and acne due to the oil. These packs for an oily nose will help sort the problem.
Story first published: Wednesday, June 24, 2015, 13:17 [IST]
Desktop Bottom Promotion