For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

చర్మ సౌందర్యం రెట్టింపు చేసే గ్రీన్ టీ -హానీ ఫేస్ ప్యాక్

|

సహజంగా ప్రతి ఒక్కరూ అందంగా మరియు ఆకర్షణీయంగా ఉండాలని కోరుకుంటారు. స్త్రీలు మాత్రమే కాదు, పురుషులు కూడా ఈ విషయంలో రాజీ పడరు. అందుకే అందంగా కనబడుట కోసం వివిధ రకాల బ్యూటీ ట్రీట్మెంట్స్ తీసుకోవడానికి బ్యూటీ సలోన్స్ మరియు బ్యూటీ పార్లర్ల చుట్టూ తిరుగుతుంటారు.

చాలా వరకూ కొన్ని సలూన్స్ లేదా పార్లర్స్ లో కొన్ని మంచి బ్యూటీట్రీట్మెంట్స్ నే అందిస్తున్నాయి. ముఖ్యంగా చర్మ సంరక్షణలో ఆరోగ్యకరమైన చర్మాన్ని పొందడానికి నేచురల్ గా అందంగా మరియు అట్రాక్టివ్ గా కనబడుటకు ఇష్టపడుతుంటారు. అందుకు ఎక్కడ చూసినా బ్యూటీ పార్లర్స్ మరియు బ్యూటీ సలోన్లూ పుట్టుకొస్తున్నాయి.

ప్రపంచంలో ఉండే డెర్మటాలిజిస్ట్ ల అభిప్రాయం ప్రకారం చాలా మంది హోం రెమెడీస్ ను ఉపచోగించి ఫేస్ ప్యాక్స్ మరియు ఫేషియల్ స్ర్కబ్స్ ను ఉపయోగిస్తున్నాయి. అన్ని రకాల ఫేస్ ప్యాక్ లు ఇప్పటికీ ప్రతి ఒక్కరూ ఉపయోగించి ఉంటారు. అలాంటి నేచురల్ ఫేస్ ప్యాక్స్ లో మరింత ఎఫెక్టివ్ గా పనిచేసే ఫేస్ ప్యాక్ గ్రీన్ టీ మరియు తేనె ఫేస్ ప్యాక్....

READ MORE: మహిళలు గ్రీన్ టీ ఖచ్చితంగా ఎందుకు త్రాగాలి...? రహస్యం ఏమిటి

నేచురల్ గా మనకు లభించిన గ్రీన్ టీ మరియు తేనెతో ఫేస్ ప్యాక్ వేసుకోవడం చాలా ఉత్తమం గా ఉంటుంది. ఈ ప్యాక్ తయారుచేసుకోవడం కూడా చాలా సులభం. ఈ రెండూ కూడా మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. ఈ రెండింటి మిశ్రమంతో ఫేస్ ప్యాక్ లను మరింతె ఎఫెక్టిగా తయారుచేసుకోవాలనుకుంటే మీకు దగ్గరలో ఉన్న బ్యూటీ సలోన్స్ ను సంప్రధించండి...

గ్రీన్ టీ మరియు తేనెతో తయారుచేసే ఫేస్ ప్యాక్ లను ముఖానికి వేసుకోవడానికి ముందు వాటిని యొక్క ప్రయోజనాలు మరియు ఏవిధంగా ఉపయోగించాలన్న విషయాన్ని తెలుసుకొన్న తర్వాత, రెగ్యులర్ గా వేసుకోవచ్చు.

READ MORE: త్వరగా మరియు ఎఫెక్టివ్ గా బరువు తగ్గించే గ్రీన్ టీ డైట్ ప్లాన్

మరి ఈ రెండింటి కాంబినేషన్ లో మీరు కూడా ఫేస్ ప్యాక్ వేసుకొని మీ చర్మ సౌందర్యాన్ని మెరుగుపరుచుకోవాలనుకుంటే , ఫేస్ ప్యాక్ కోసం ఉపయోగించే కొన్ని హోం రెమెడీస్ తో పాటు ఎలా తయారుచేసుకోవాలో చూద్దాం...

గ్రీన్ టీ మరియు ఆరెంజ్ జ్యూస్:

గ్రీన్ టీ మరియు ఆరెంజ్ జ్యూస్:

అరటేబుల్ స్పూన్ గ్రీన్ టీ మరియు ఒక చెంచా ఫ్రెష్ ఆరెంజ్ జ్యూస్ మిక్స్ చేసి ఈ మిశ్రమాన్ని మీ ముఖానికి అప్లై చేయాలి. 20నిముషాల తర్వాత నార్మల్ వాటర్ తో శుభ్రం చేయడం వల్ల చర్మం కాంతివంతంగా మారుతుంది.

తేనె మరియు గ్రీన్ టీ ఫేస్ ప్యాక్:

తేనె మరియు గ్రీన్ టీ ఫేస్ ప్యాక్:

తేనె మరియు గ్రీన్ టీ ఆకులను పేస్ట్ లా చేసి ముఖానికి పట్టించి 20నిముషాల తర్వాత శుభ్రం చేసుకోవాలి. ఇలా రెండు వారాల పాటు చేస్తే మంచి ఫలితం ఉంటుంది.

గ్రీన్ టీ మరియు ఎగ్ ఫేస్ మాస్క్:

గ్రీన్ టీ మరియు ఎగ్ ఫేస్ మాస్క్:

గ్రీన్ టీ మరియు ఎగ్ వైట్ లో చాలా అద్భుతమైన గుణాలున్నాయి . ఈ రెండింటి మిశ్రమంతో పేస్ట్ చేసి ముఖానికి పట్టించి అరగంట తర్వాత నార్మల్ వాటర్ తో శుభ్రం చేసుకోవాలి

గ్రీన్ టీ మరియు మిల్క్ క్రీమ్:

గ్రీన్ టీ మరియు మిల్క్ క్రీమ్:

ఈ ఫేస్ మాస్క్ చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది . డ్రై స్కిన్ నివారిస్తుంది . ఈ ఫేస్ మాస్క్ ను వారంలో రెండు సార్లు అప్లై చేసి ఫలితాన్ని మీరే గమనించండి.

గ్రీన్ టీ ఆకులు, తేనె మరియు ఆరెంజ్ తొక్క:

గ్రీన్ టీ ఆకులు, తేనె మరియు ఆరెంజ్ తొక్క:

గ్రీన్ టీ ఆకులు మరియు తేనె మిశ్రమానికి, ఆరెంజ్ తొక్క పొడిని మిక్స్ చేసి పేస్ట్ లా చేసి, ముఖానికి పట్టించాలి . తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.

గ్రీన్ టీ మరియు నీమ్ ఫేస్ మాస్:

గ్రీన్ టీ మరియు నీమ్ ఫేస్ మాస్:

గ్రీన్ టీ మరియు కొద్దిగా వేపాకులను నీటిలో వేసి బాగా మరిగించి ఆ నీటితో ముఖానికి ప్యాక్ లా రెండు మూడు సార్లు తడి ఆరిన వెంటవెంటనే అప్లై చేసి 20నిముషాల తర్వాత నార్మల్ వాటర్ తో శుభ్రం చేసుకోవాలి. ఇది చర్మానికి తగినంత కాంతి అందించి తర్వాత అందంగా ఫ్రెష్ గా కనబడుటకు సహాయపడుతుంది.

 గ్రీన్ టీ మరియు పంచదార:

గ్రీన్ టీ మరియు పంచదార:

ఒక చెంచా గ్రీన్ టీ మరియు ఒక చెంచా తేనె మరియు ఒక చెంచా షుగర్ తీసుకోవాలి మూడింటిని బాగా మిక్స్ చేయాలి. ఈ పేస్ట్ ను ముఖానికి అప్లై చేసి 15 నిముషాలు బాగా డ్రై అయిన తర్వాత నార్మల్ వాటర్ తో శుభ్రం చేసుకోవాలి . ఇది చర్మానికి ఎక్స్ ఫ్లోయేట్ చేస్తుంది మరియు అందంగా కనబడుటకు సహాయపడుతుంది.

 గ్రీన్ టీ మరియు కీరదోస జ్యూస్:

గ్రీన్ టీ మరియు కీరదోస జ్యూస్:

గ్రీన్ టీ ఆకులను వేడినీటిలో వేసి బాగా మరిగించాలి. తర్వాత ఒక టేబుల్ స్పూన్ కీరదోస జ్యూస్ వేసి బాగా మిక్స్ చేయాలి. ఈ రెండింటి మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి 15నిముషాల తర్వాత నార్మల్ వాటర్ తో శుభ్రం చేసుకోవాలి.

గ్రీన్ టీ, ఓట్స్ మరియు పాలతో ఫేస్ ప్యాక్:

గ్రీన్ టీ, ఓట్స్ మరియు పాలతో ఫేస్ ప్యాక్:

కొద్దిగా గ్రీన్ టీ ఆకులు 3చెంచాల పాలు, ఒక చెంచా ఓట్స్ తీసుకొని, మెత్తగా పేస్ట్ చేయాలి. ఈ పేస్ట్ ను మీ ముఖానికి పట్టించి 20నిముషాల తర్వాత నార్మల్ వాటర్ తో శుభ్రం చేసుకుంటే చర్మం ప్రకాశవంతంగా ఫ్రెష్ గా కొత్తగా కనబడుతుంది.

గ్రీన్ టీ మరియు తేనె ఫేస్ మాస్క్:

గ్రీన్ టీ మరియు తేనె ఫేస్ మాస్క్:

గ్రీన్ టీ బ్యాగ్స్ ను వేడినీటిలో డిప్ చేసి, కొద్దిసేపటి తర్వాత బయటకు తీసి అందులో తేనె మిక్స్ చేసి ముఖానికి, కాళ్ళ చేతులకు పట్టించి 10-15నిముషాలు మసాజ్ చేయాలి. బాగా డ్రై అయిన తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవడం వల్ల మీరు ఫ్రెష్ గా మరియు కాంతివంతంగా కనబడుతారు.

English summary

Top 10 Face Mask Recipes With Green Tea And Honey: Beauty Tips in Telugu

Face Mask Recipes With Green Tea And Honey: Beauty Tips in Telugu. Looking good and attractive has been a basic urge for everyone. Both men and women often share similar sentiments in this regard.
Desktop Bottom Promotion