For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

చలికాలంలో చర్మ రక్షణకు చాలా సింపుల్ టిప్స్

|

వేసవికాలం గ్రేట్ అని చెప్పవచ్చు. ఎందుకంటే వేసవిలో మన చర్మం యంగ్ గా మరియు ఉత్తేజంగా ఉంటుంది . అయితే చలికాలంలో చర్మం డ్రైగా మరియు అసౌకర్యంగా ..చర్మ పగుళ్లతో దురద పెడుతూఉంటుంది.

చలికాలం మన శరీరానికి ముఖ్యంగా చర్మానికి ఎక్కువగా సమస్యలు తెచ్చిపెట్టే కాలంగా చెప్పకోవచ్చు. వేసవికాలంలో కంటే శీతాకాలంలో చర్మం డ్రైగా మారడం, మొటిమలు, ఇతర చర్మ సమస్యలు ఈ కాలంలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. వీటన్నింటి బారిన పడకుండా ఉండాలంటే చర్మాన్ని జాగ్రత్తగా కాపాడుకోవడం ఎంతో అవసరం.

శీతాకాలంలో చర్మ రక్షణకు: 10 టాప్ టిప్స్

అయితే మనం తెలిసీ తెలియకుండా చేసే కొన్ని పనుల వల్ల చలికాలంలో చర్మం మరింత పాడయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మరి, శీతాకాలంలో చెయ్యకూడని ఆ చిన్న పొరపాట్లు ఏంటో తెలుసుకున వాటికి దూరంగా ఉంటే చర్మం నవయవ్వనంగా..ఆరోగ్యంగా ఉంచుకోవచ్చువచ్చు.

1. నీరు ఎక్కువగా త్రాగాలి:

1. నీరు ఎక్కువగా త్రాగాలి:

చలికాలంలో నీరు ఎక్కువగా త్రాగడం వల్ల చర్మాన్ని హైడ్రేట్ చేసుకోవాలి. ఎక్కడికెళ్లినా వాటర్ బాటిల్ వెంటతీసుకెళ్లాలి . చాలా చలిగా ఉన్నప్పుడు హేర్బల్ టీ చాలా గ్రేట్ గా ఉంటుంది. చర్మానికి చాలా హెల్తీ గ్లో వస్తుంది. కాబట్టి, అప్పుడప్పుడు నీరు త్రాగుతూ చర్మానికి కావల్సినంత గ్లోను తీసుకురావచ్చు.

2. వేడిటినీటి స్నానం వద్దు:

2. వేడిటినీటి స్నానం వద్దు:

శీతాకాలంలో చలి ఎక్కువగా ఉంటుంది. కొంత మంది చలికి స్నానం మానేయాలనిపించినా..తప్పదు కాబట్టి చేసేవారు మనలో చాలామందే ఉంటారు. ఇలాంటి వారు చేసే పని బాగా వేడిగా ఉన్న నీటితో స్నానం చేయడం. అయితే ఇది మన చర్మ ఆరోగ్యానికి అస్సలు మంచిదికాదు. నీరు బాగా వేడిగా ఉన్నట్లైతే చర్మ కణాలకు నష్టాన్ని కలిగిస్తుంది. కాబట్టి చర్మంలోని తేమనంతా బయటకు పోయిన చర్మం మరింతగా పొడిబారిపోతుంది. అందుకే చలికాలంలో మరీ వేడిగా ఉన్న నీటితో కాకుండా గోరువెచ్చని నీటితో స్నానం చేయడం ఉత్తమం.

3. మాయిశ్చరైజర్ అవసరం:

3. మాయిశ్చరైజర్ అవసరం:

చలికాలంలో మాయిశ్చరైజర్ రాసుకోవడం అన్నది అందరూ కామన్ గా చేసేది. కానీ కొంతమంది ముఖ్యంగా ఆయిల్ స్కిన్ కలిగన వారు మాయిశ్చరై.ర్ రాసుకోవడానికి వెనుకాడతారు. దీనివల్ల తమ చర్మం జిడ్డు కారుతున్నట్లు గా కనిబడుతుందని భావిస్తుంటారు. అందుకే మాయిశ్చరైజర్ ని రాసుకోవడం మానేస్తుంటారు. కానీ శీతాకాలంలో మాయిశ్చైజర్ రాసుకోవడం తప్పనిసరి. ఈ క్రమంలో ఆయిల్ స్కిన్ ఉన్నవారు వాటర్ బేస్డ్ మాయిశ్చరైజర్ అప్లై చేసుకోవడం వల్ల చర్మం జిడ్డుగా అనిపించకుండా ఉంటుంది.

4. క్లెన్సింగ, టోనింగ్ , స్క్రబ్బింగ్ మితంగా:

4. క్లెన్సింగ, టోనింగ్ , స్క్రబ్బింగ్ మితంగా:

ఏకాలమైనా చర్మంపై తగిన శ్రద్ద తీసుకోవడం తప్పనిసరి. అందులో భాగంగా క్లెన్సింగ్, టోనింగ్, మాయిశ్చరైజింగ్ తో పాటు స్క్రబ్బింగ్ కూడా అవసరమే. కానీ ఇది మరీ ఎక్కువ కాకుండా జాగ్రత్తపడాల్సి ఉంటుంది. పదే పదే కాకుండా ఒకసారి చేసిన తర్వాత కనీసం రెండు వారాల గ్యాప్ ఉండే చూసుకోవాలి. ఆ తర్వాత తిరిగి స్క్రబ్బింగ్ చేసుకుంటే సరిపోతుంది. స్క్రబ్బింగ్ చేసేప్పుడు కూడా ఎక్కువసేపు కాకుండా దానికి ఎంత సమయం అవసరమో అంతే కేటాయించి చేయడం మంచిది. దీనివల్ల చర్మం పైపొర దెబ్బతినకుండా జాగ్రత్తపడవచ్చు.

5. హుమిడిఫైయర్:

5. హుమిడిఫైయర్:

చలికాలంలో తేమ శాతం తగ్గకుండా ఇళ్లలో హ్ముమిడిఫయర్లు ఏర్పాటు చేసుకుంటే మరీ మంచిది. హుమిడిఫైయర్ స్టీమ్ వల్ల చర్మం తేమగా ఉంటుంది, పగుళ్ళు ఏర్పడవు, డ్రైగా మారదు . లోకల్ స్టోర్స్ లో కూడా సిస్టమ్ ను కొనుగోలు చేయవచ్చు.

6. ఎక్సఫ్లోయేట్:

6. ఎక్సఫ్లోయేట్:

స్క్రబ్ మరియు ఫేషియల్ వల్ల డెడ్ స్కిన్ సెల్స్ తొలగిపోతాయి. ఈ రెగ్యులర్ జీవన శైలిలో వారానికొకసారి వేసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. చర్మం ఫ్రెష్ లా ఫీలవ్వడం మాత్రమే కాదు చర్మం డ్రై సెల్స్ నుండి ఉపశమనం కలిగించ చర్మం ఫ్రెష్ గా మారుతుంది.

7. సన్ స్క్రీన్ :

7. సన్ స్క్రీన్ :

చలికాలంలో ఎండ ఎక్కువగా ఉండదు కదా అని చాలామంది సన్ స్క్రీన్ లోషన్ రాసుకోవడం మానేస్తూ ఉంటారు. కానీ ఏ కాలమైనా యూవీ కిరణాల నుంచి మనల్ని మనం కాపాడుకోవడానికి సన్ స్క్రీన్ లోషన్ రాసుకోవడం తప్పనిసరి. ఇంటి నుండి బయటకు వెళ్లాలన్నా, కనీసన్ ఎస్ ఎఫ్ ఫి 15సన్ స్క్రీన్ లోషన్ అయినా అప్లై చేయాలి . ఇది చర్మానికి రక్షణ కల్పిస్తుంది.

8. గ్లౌజులు:

8. గ్లౌజులు:

ఇది చాలా సింపుల్ కానీ ఎఫెక్టివ్ గా పనిచేసత్ుంది. చలిలో కాళ్ళను చేతులను ఎందుకు ఎక్స్ఫోజ్ చేయడం చర్మానికి చీకాకు కలిగించని గ్లౌజులు మరియు సాక్సులను ఎంపిక చేసుకొని రెగ్యులర్ గా వేసుకోవాలి . ఉలన్ కు అలర్జీ అయితే, కాటన్ ను ధరించవచ్చు . ఇలా చేయడం వల్ల కాళ్ళు, చేతులు డ్రైగా మరియు వార్మ్ గా మారుతాయి .

9. ఫ్లాక్స్ సీడ్ ఆయిల్ :

9. ఫ్లాక్స్ సీడ్ ఆయిల్ :

ఫ్లాక్స్ సీడ్ ఆయిల్ రుచికరంగా లేకపోయినా.. చర్మానికి మాయిశ్చరైజర్ గా గ్రేట్ గా సహాయపడుతుంది . చర్మం లోపలి నుండి మాయిశ్చరైజర్ ను అందిస్తుంది. ఇందులో ఫ్యాటీ యాసిడ్స్ అధికంగా ఉంటాయి కాబట్టి మొత్తం స్కిన్ హెల్త్ కు సహాయపడుతుంది .

10. ఎసెన్షియల్ ఆయిల్స్:

10. ఎసెన్షియల్ ఆయిల్స్:

శీతాకాలంలో చర్మాన్ని పొడిబారకుండా కాపాడుకునేందుకు ఎసెన్షియల్ ఆయిల్స్ ని కూడా ఉపయోగించుకోవచ్చు. వీటిని రాసుకోవడం లేదా స్నానం చేసే నీటిలో వేసి స్నానం చేయడం వల్ల చర్మం పై ొక రక్షణ పొర ఏర్పడి తేమ బయటకు పోకుండా కాపాడుతుంది. అందుకు జోజోబా ఆయిల్ మరియు బాదం ఆయిల్ గ్రేట్ గా సహాయపడుతాయి.

English summary

TOP 10 Fall Winter Skin Care Tips for Glowing Skin

Summer time is great. Your skin feels young and alive. But as winter approaches your skin begins to dry and you feel uncomfortably and itchy. What do you do?
Story first published:Wednesday, December 9, 2015, 11:32 [IST]
Desktop Bottom Promotion