For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ప్రకాశవంతమైన చర్మ సౌందర్యాన్ని అందించే ఫ్రూట్ జ్యూసులు

|

ఎప్పటికైనా , ఎవరైనా వృద్ధాప్యంలోకి అడుగుపెట్టక తప్పదు. కానీ వ్రుద్ధాప్యంలో పడ్డాక కూడా 'మీకు ఇంత వయసున్నట్టు కనబడరు అనే మెచ్చుకోలు పొందామంటే అది మన ఆరోగ్యాన్నీ, ఆహారపు అలవాట్లను సూచిస్తుంది. ఇంకా అనవసరపు ఆందోళనలకు లోనుకాకుండా, పొల్యూషన్‌ బారినపడకుండా ఉంటే కాలాన్ని పది- పదిహేనేళ్లు వెనక్కు తిప్పుకోవచ్చు. అదెలాగో పరిశీలిద్దామా!

READ MORE: ఫ్రెష్ అండ్ యుత్ ఫుల్ స్కిన్ పొందాలంటే ఈ ఫుడ్ తినండి

సాధారణంగా గమనించినట్లైతే కొందరి చర్మం నున్నగా, సుతిమెత్తగా, బేబి స్కిన్ లా మెరిసిపోతూ, ఆరోగ్యంగా వుంటుంది. మరి కొందరిది పాలిపోయినట్లు ముఖంలో తేజస్సు లేకుండా కనిపిస్తుంది. ఎన్నో రకాల క్రీములు, ఎన్నో రకాల చిట్కాలు పాటించినా కూడా ఫలితం ఉండదు సరికదా.... మరిన్ని సమస్యలు గురిఅవుతుంటారు.

READ MORE: ఆయుష్యును పెంచుతాయి..అందాన్ని రెట్టింపు చేస్తాయి..!

దీనికి కారణం బయటి సమస్య మాత్రమే కాదు.. లోపలిది కూడా.. కాబట్టి పైపై రంగులు, మేకప్‌ మాత్రమే కాకుండా అంతర్గతంగా కూడా కాస్త జాగ్రత్త వహించాలి. ముఖ్యంగా మెరిసే చర్మం కోసం కూరగాయలు, పండ్లతో తయారు చేసేటటు వంటి జ్యూసులు ఎక్కువగా తీసుకోవాలి.

బొప్పాయి:

బొప్పాయి:

చూడగానే నోరూరించే బొప్పాయి పండులో తక్కువ కేలరీలుంటాయి. విటమిన్‌ సి ఎక్కువగా ఉంటుంది. తిరోజూ ఒక కప్పు బొప్పాయి ముక్కలు తింటే మంచిది. నిర్జీవమైన చర్మాన్ని కాంతి వంతంగా చేస్తుంది. బొప్పా యి గుజ్జు తో ఫేస్‌ ప్యాక్‌ కూడా వేసుకోవచ్చు. బొప్పాయి గుజ్జు, యాపిల్ గుజ్జు, అరటిపండు గుజ్జు, కమలాఫలం తీసుకొని అందులో అరచెంచా తేనె కలిపి ముఖానికి పట్టించాలి. ఇరవై నిమిషాల తర్వాత కడిగినట్లైతే చర్మం మెరుపును సంతరించుకుంటుంది.

దానిమ్మ:

దానిమ్మ:

దానిమ్మ రుచికి మాత్రమే కాదు. దానిమ్మ గింజల్లో యాంటిఆక్సిడెంట్స్ అధికంగా ఉండి శరీరాన్ని శుభ్రపరుస్తుంది. ఎరుపు రంగులో ఉండే దానిమ్మ మధుమేహగ్రస్తులకు చాలా మంచిది. రక్తంలో చక్కెర గణాంకాలు మెరుగుపరచడానికి సహాయం చేస్తుంది.

స్ట్రాబెర్రీ:

స్ట్రాబెర్రీ:

స్ట్రాబెరీస్ ఆరోగ్యానికే కాదు... అందానికి కూడా చాలా అద్భుతంగా పనిచేస్తుంది. చూడగానే నోరూరిస్తూ ఎర్రని రంగులో చిరుపులుపుతో, స్వీట్ గా స్వభావం కలిగి, చక్కటి ఆకారం కలిగినటువంటి పండు స్ట్రాబెరీ. ఈ ఫ్రూట్ తినడానికి మాత్రమే కాదు సౌదర్య సాధనంగా కూడా ఉపయోగించుకోవచ్చు. స్ట్రాబెరీలతో ఫేస్‌ మాస్క్‌ వేసుకుంటే ముఖానికి చక్కటి మెరుపు వస్తుంది. ముఖం మీద మచ్చలు తగ్గి ముఖం చంద్రబింబంలా వుంటుంది. చక్కటి నిగారింపు వస్తుంది. అంతేకాదు. దీని వలన ఫేస్‌ ప్రెష్‌ గా కనిపిస్తుంది.

అరటిపండు:

అరటిపండు:

అరటిలో పొటాషియం ఎక్కువగా ఉంటుంది. అరటి పండు ఆరోగ్యాన్ని, జీర్ణశక్తిని పెంచడమే కాదు. చర్మాన్ని శుభ్రపరచడంలో కూడా అద్భుతంగా పనిచేస్తుంది. కాబట్టి ప్రతి రోజూ రెగ్యులర్ ఒక అరటిపండు తినాలి. మరియు బనానా స్మూతిని రెగ్యురల్ డైట్ లో చేర్చుకోవచ్చు. పొడి చర్మానికి మాయిశ్చరైజర్ గా ఉపయోగపడటమే కాకుండా చర్మాన్ని టైట్ గా ఉంచుతుంది.

టమాటా:

టమాటా:

టమోటాల్లో క్యాల్షియం, ఫాస్ఫరస్, విటమిన్ సిలు పుష్కలంగా ఉన్నాయి. టమాటాలను మిక్సీలో వేసుకుని జ్యూస్‌లాగా చేసుకుని అందులో కొద్దిగా ఉప్పు లేదా చక్కెర వేసుకుని తీసుకుంటే చర్మానికి నిగారింపు వస్తుంది .అలాగే ఇది రక్తాన్ని శుద్ధి చేస్తుంది. ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. విటమిన్స్‌ కూడా లభిస్తాయి.

ఆపిల్‌ :

ఆపిల్‌ :

యాపిల్స్‌లో ఫైబర్ ఎక్కువగానూ, కొవ్వు పదార్థాలు అత్యల్పంగానూ ఉంటాయి. సోడియం తక్కువగానూ, పొటాషియం ఎక్కువగానూ ఉంటాయి. విటమిన్ సి అధిక మొత్తాల్లో ఉంటుంది. రోజూ ఒక ఆపిల్‌ తీసుకోవడం వల్ల అనారోగ్యానికి కారణమయ్యే వాటిని చాలా వరకు దూరం చేసుకోవచ్చు. ప్రతి రోజు ఆపిల్ తినడం వల్ల కొలెస్ట్రాల్ తగ్గుతుంది. చర్మ సంబధింత వ్యాధులను తగ్గిస్తుంది. యాపిల్‌లోని గుణాలు చర్మానికి మృదుత్వాన్ని ఇచ్చి మెరిసేలా చేస్తాయి.

పుచ్చకాయ:

పుచ్చకాయ:

90 శాతం నీరు వుండే కాయ పుచ్చకాయ. దాహార్తిని తీర్చడం తోపాటు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. శరీరానికి చలువను ఇస్తుంది. అందాన్ని ఇనుమడింపజేస్తుంది. పుచ్చకాయ జూసును తీసుకోవడం వల్ల చర్మం మరింత తేటగా మారుతుంది.

నారింజ/బత్తాయి:

నారింజ/బత్తాయి:

నారింజలో విటమిన్‌ సి ఎక్కువగా ఉంటుంది. ఇది సూర్యుని నుంచి వచ్చే అల్ట్రావయోలెట్‌ కిరణాల ప్రభావం చర్మంపై పడకుండా చేస్తుంది. చర్మం ముడుతలు పడకుండా, టైట్‌గా ఉంచే కొలాజిన్‌ ను ఉత్పత్తి చెయ్యడంలో సహాయపడుతుంది. ప్రతిరోజు ఒక నారింజను తినడం మంచిది. రోజుకు రెండు వందల గ్రాముల విటమిన్ సి అవసరమవుతుంది. నారింజ జ్యూస్‌ తాగడం కన్నా పండు రూపంలో తినడమే మంచిది. నారింజ తొనల గుజ్జు తీసుకుని అందులో కీరదోస కాయ తురుము, నాలుగైదు చుక్కల నిమ్మరసం, చెంచా తేనె లేదా కలబంద గుజ్జు కలిపి ముఖానికి పూతలా వేసుకొని పదిహేను నిమిషాల తర్వాత చల్లటి నీటితో కడిగేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని కళ్ళమీద కూడా పెట్టుకోవచ్చు.

జామకాయతో :

జామకాయతో :

జామకాయలో విటమిన్‌ 'ఏ' మరియు విటమిన్‌ 'సి' నిల్వలు అధికంగా ఉంటాయి. వీటి గింజలు కూడా ఒమేగా-3, ఒమేగా-6 కరుగని కొవ్వు ఆవ్లూలు, పీచు పదార్థాలు ఎక్కవగా కలిగి ఉంటాయి. ఒక జామపండులో విటమిన్‌ 'సి' నిల్వలు ఒక నారింజపండులో కన్నా నాలుగురెట్లు అధికంగా ఉంటాయి. జామకాయలో వుండే పోషకాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తా యి. ఆరోగ్య సంబంధిత వ్యాధులు నయమవుతాయి. క్రమంగా చర్మం నిగారింపు సంతరించుకుంటుంది.

నిమ్మ:

నిమ్మ:

ఇది చాలా విరవిగా దొరికే వంటింటి సామాగ్రి అని అందరికీ తెలిసిందే.నిమ్మకాయ ఆరోగ్యానికి దివ్వౌషదం అంతే కాదు. చర్మాన్ని శుభ్రపరచుటలో అత్యధిక సామర్థం కలిగిన గుణాలు కలిగి ఉన్నది. చర్మాన్ని శుభ్ర పరిచి ఫ్రెష్ గా ఉంచుతుంది. నిమ్మకాయను సౌందర్యాన్ని పెంచే ఖచ్చితమైన నేచురల్ బ్లీచ్ అని చెప్పవచ్చు. నిమ్మరసం ముఖానికి పట్టించడం ద్వారా ఎండకు కమిలిన చర్మాన్ని బాగు చేసి, ముఖంలో ఉన్న మొటిమలు మచ్చలను తొలగిస్తుంది.

పీచెస్:

పీచెస్:

ఇవి చూడటానికి ఆపిల్స్ లానే ఉంటాయి. కానీ ఆపిల్ కాదు. పీచెస్ ఆరోగ్యానికి మాత్రమే కాదు గ్లోయింగ్ స్కిన్ అందిస్తుంది. ఇది చర్మాన్ని శుభ్రపరిచి, బిగుతు చేయడానికి మాత్రమే కాదు, ముఖ కండరాలను బిగుతుగా ఉండేలా చేస్తుంది. అందుకు పీచెస్ పండ్ల మీద ఉన్న తొక్కను తొలగించి లోపల ఉన్న పదార్థంతో ముఖాన్ని బాగా మర్దన చేసుకోవాలి. దాంతో వెంటనే మీరు ఫ్రెష్ గా ఫీల్ అవ్వడమే కాకుండా చర్మం టైట్ గా అనిపిస్తుంది.

పైనాపిల్:

పైనాపిల్:

సువాననందించే పైనాపిల్ చర్మ సంరక్షణలో బాగా ఉపయోగపడుతుంది. ఇది చర్మాన్ని శుభ్రపచడమే కాకుండా నిర్జీవంగా మారిన, పొడి బారిన చర్మాన్ని తేజోవంతం చేసి, చర్మాన్ని నునుపు చేస్తుంది. పైనాపిల్ ముక్కలను ముఖం, శరీరం మీద కొద్దిసేపు రుద్ది స్నానం చేసినట్లైతే మీరు ఫ్రెష్ గా ఫీలవుతారు.

అవొకాడో :

అవొకాడో :

అవొకాడో చాలా మందికి తెలియదు. మన నిత్యం తినేటటువంటి పండ్లలో ఇది కూడా ఒక రకమైన పండే. పండు మాత్రమే కాదు చర్మ సౌందర్యాన్ని పెంచడంలో ఇది ఒక దివ్వౌషదం. ముఖ్యంగా పొడిబారిన చర్మం కలవారికి ఇది బాగా ఉపయోగపడుతుంది. పండును డైరెక్ట్ గా తినడవచ్చు. అలాగే ఇది ఇక అద్భుతమైన మాయిశ్చరైజర్ గా పనిచేస్తుంది. అందుకు చేయాల్సిందల్లా.... అవొకాడో పండును సగ భాగానికి కట్ చేసి మెత్తని పేస్ట్ లా చేసి ముఖానికి అప్లైచేసి పదిహేను నిముషాల తర్వాత శుభ్రం చేసుకోవాలి.

English summary

Top Fruits Juices for Glowing Skin: Beauty Tips in Telugu

Top Fruits Juices for Glowing Skin: Beauty Tips in Telugu. Simple lifestyle changes like incorporating fruits in your daily diet can give you glowing skin. Fruits help with Clear complexion; Skin rejuvenation, Natural hydration; Improvement of Skin texture and making the skin appear youthful and glowing.
Desktop Bottom Promotion