For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

చర్మ సౌందర్యానికి వేప పేస్ట్ తో మిరాకిల్ బెనిఫిట్స్ ..!!

|

వేప ఒక మిరికిల్ హెర్బ్. వేపాకు ఓ ఔషద మొక్క. వేపాకును మించిన ఔషధమేదీ లేదని మనం తరచూ వింటూనే ఉంటాం. ఇందులో అనేక ఆరోగ్య రహస్యాలు దాగున్నాయి. దీన్ని వండర్ లీఫ్ అని కూడా పిలుస్తారు. అందుకు దీన్ని ఆయుర్వేదంలో ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. వేపను వివిధ రకాలుగా ఉపయోగిస్తారు, నీమ్ వాటర్, నీమ్ హనీ, నీమ్ సోప్ మరియు నీమ్ ఆయిల్. అయితే అన్నింటికంటే స్వచ్చంగా, ఫ్రెష్ గా వేపఆకు పేస్ట్ ను ఉపయోగించడం వల్ల ఏసమస్యకైన తక్షణ ప్రభావం చూపుతుంది. నీమ్ పేస్ట్ తయారుచేయడం చాలా సులభ ఫ్రెష్ గా ఉన్న ఆకులను శుభ్రంగా కడిగి మెత్తగా పేస్ట్ చేయాలి. నీమ్ పౌడర్ కూడా మార్కెట్లో అందుబాటులో ఉంది. దీనికి కొద్దిగా నీరు జోడించి పేస్ట్ చేయాలి.

ఈపేస్ట్ ను చర్మానికి అప్లై చేయడం వల్ల అనేక స్కిన్ బెనిఫిట్స్ ను పొందవచ్చు . ఇది చర్మ సౌందర్యానికి కూడా ఉపయోగపడుతుందన్న విషయం చాలామందికి తెలియకపోవచ్చు. ఎన్నో రకాల ఔషద గుణాలున్న వేపాకులతో చర్మ సౌందర్యాన్ని కూడా మెరుగుపరచుకోవచ్చు. యాంటీబ్యాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, అనాల్జిక్, యాంటీఫంగల్ , యాంటీ సెప్టిక్ లక్షణాలు కలిగి ఉన్న వేపాకు మంచి ఆస్ట్రిజెంట్ గా కూడా పనిచేస్తుంది. జిడ్డు స్వభావంతో ఉండే చర్మం కలిగినవారికి వేపాకు అద్భుతంగా పనిచేస్తుంది.

దీనిలో ఉండే యాంటిసెప్టిక్‌ గుణాలు గాయాలను పెరగకుండా, వాటివలన చర్మానికి ఎటువంటి హాని జరగకుండా కాపాడతాయి. అంతేకాకుండా విషజ్వరాలను అదుపుచేయగల శక్తిని కూడా వేపాకు కలిగి ఉంటుంది. కమిలిన, ఎర్రగా కందిపోయిన చర్మానికి వేపాకు ఇట్టే ఉపశమనాన్ని కలిగిస్తుంది. చర్మానికి ఎంతో చల్లదనాన్ని కూడా ఇస్తుంది. కొన్ని జ్వరాలు వచ్చి తగ్గాక వేపాకును స్నానానికి వాడటం మన సంప్రదాయంలో గమనించవచ్చు.

ఇది చర్మసౌందర్యానికి ఎంతగానో ఉపయోగకరంగా ఉంటుంది. ముఖ్యంగా చెప్పా లంటే మహిళల చర్మతత్వానికి సరిపడే లక్షణాలు ఇందులో ఎక్కువగా ఉంటాయి. ముఖంపై ఎటువంటి చర్మసంబంధ సమస్యలు తలెత్తినా వాటి నివారణకు వేపాకు ఎంతగానో ఉపకరిస్తూ సౌందర్య సాధనంలా పనిచేస్తుంది. ముఖానికి నునుపైన మెరిసే ఛాయను ఇస్తుంది. వేప పేస్ట్ ను చర్మానికి అప్లై చేయడం వల్ల పొందే బ్యూటీ బెనిఫిట్స్ గురించి తెలుసుకుందాం..

1. స్కిన్ స్కార్స్ తొలగిస్తుంది:

1. స్కిన్ స్కార్స్ తొలగిస్తుంది:

మొటిమలు, మచ్చలు, బర్న్స్, మరియు గాయాల వల్ల ఏర్పడ్డ స్కార్స్ ను త్వరగా మాయం చేయడంలో వేప పేస్ట్ గ్రేట్ . స్కార్స్ ను త్వరగా కనబడనివ్వకుండా చేస్తుంది. అందుకోసం పేప పేస్ట్ లో కొద్దిగా పసుపు మిక్స్ చేసి రెగ్యులర్ గా స్కార్ మాయమయ్యే వరకూ అప్లై చేయాలి.

2. మొటిమలతో పోరాడుతుంది:

2. మొటిమలతో పోరాడుతుంది:

వేప పేస్ట్ స్కార్స్ మాత్రే మాయం చేయడం కాదు, ఇది మొటిమలను కూడా పూర్తిగా నివారిస్తుంది. మొటిమలు, మచ్చలు, బ్రేక్ అవుట్స్ ను తొలగిస్తుంది. అందుకు కొన్ని వేపఆకలు, తులసి ఆకులు తీసుకుని మెత్తగా పేస్ట్ చేసి అందులో కొద్దిగా రోజ్ వాటర్ మిక్స్ చేసి ముఖానికి అప్లై చేయాలి. తడి ఆరే వరకూ అలే ఉంచి తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇందులో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు చాలా ఎఫెక్టివ్ గా తొలగిస్తుంది.

3. స్కిన్ పిగ్మెంటేషన్:

3. స్కిన్ పిగ్మెంటేషన్:

స్కిన్ పిగ్మెంటేషన్ మరియు డి పిగ్మెంటేషన్ సమస్యలతో బాధపడే వారు . ఈ ఫేస్ ప్యాక్ ను ప్రయత్నించి చూడండి. ఇందులో కొద్దిగా శెనగపిండి, వేప పౌడర్ మిక్స్ చేసి పేస్ట్ చేసి అప్లై చేయాలి. దీన్ని ముఖం మొత్తం అప్లై చేసి 15 నిముషాల తర్వాత శుభ్రం చేసుకోవాలి. ఇలా చేసుకోవడం వల్ల స్కిన్ పిగ్మెంటేషన్ సమస్య ఉండదు.

4. ఆయిల్ కంట్రోల్ :

4. ఆయిల్ కంట్రోల్ :

ఆయిల్ స్కిన్ వారికి ఒక గుడ్ న్యూస్, వేప పేస్ట్ చర్మంలోని ఎక్సెస్ ఆయిల్ ను తగ్గిస్తుంది. వేపఆకులను మెత్తగా పేస్ట్ చేసి, అందులో కొద్దిగా పెరుగు, నిమ్మరసం మిక్స్ చేసి ముఖానికి అప్లై చేయాలి. 20 నిముషాల తర్వాత శుభ్రం చేసుకోవాలి.

5. మాయిశ్చరైజర్:

5. మాయిశ్చరైజర్:

ఆయిల్ స్కిన్ ఉన్న వారు వేప పేస్ట్ ను మాయిశ్చరైజర్ గా ఉపయోగించడం వల్ల ఇది సెబమ్ ను కంట్రోల్ చేస్తుంది. డ్రై స్కిన్ వారికి మంచి మాయిశ్చరైజర్ . నీమ్ లీవ్స్ పేస్ట్ చేసి, అందులో తేనె మిక్స్ చేసి ముఖానికి అప్లై చేయాలి. 15 నిముషాల తర్వాత శుభ్రం చేసుకోవాలి.

6. ఎక్స్ ఫ్లోయేట్ :

6. ఎక్స్ ఫ్లోయేట్ :

చర్మానికి ఇది ఉత్తమ ఎక్స్ ఫ్లోయేట్ గా పనిచేస్తుంది. డెడ్ స్కిన్ సెల్స్ ను తొలగిస్తుంది. దీనికి కొద్దిగా ఆరెంజ్ పౌడర్ మిక్స్ చేసి, కొన్ని చుక్కల ఆలివ్ ఆయిల్ కలిపి ముఖానికి పట్టించి 15నిముషాలు స్క్రబ్ చేయాలి. గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇది బ్లాక్ హెడ్స్ మరియు వైట్ హెడ్స్ ను తొలగిస్తుంది.

 క్లియర్ అండ్ గ్లోయింగ్ స్కిన్ అందిస్తుంది:

క్లియర్ అండ్ గ్లోయింగ్ స్కిన్ అందిస్తుంది:

నీమ్ లీవ్స్, రోజ్ పెటల్స్ తీసుకుని మెత్తగా పేస్గ్ చేయాలి. రోజ్ వాటర్ మిక్స్ చేసి ముఖానికి పట్టించి డ్రైగా మారిన తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ ప్యాక్ వల్ల చర్మం స్మూత్ గా...సాప్ట్ గా మరియు క్లియర్ గా మెరుస్తుంటుంది.

8. స్కిన్ ఇన్ఫెక్షన్స్ ను నివారిస్తుంది:

8. స్కిన్ ఇన్ఫెక్షన్స్ ను నివారిస్తుంది:

ఇందులో ఉండే యాంటీబ్యాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, అనాల్జిక్, యాంటీఫంగల్ , యాంటీ సెప్టిక్ లక్షణాలు స్కిన్ ఇన్ఫెక్షన్స్, ఎగ్జిమా మరియు పోరియాసిస్ వంటి స్కిన్ డిసీజ్ నివారించడంలో గ్రేట్ గా సహాయపడుతాయి.

9. యాంటీ ఏజింగ్ :

9. యాంటీ ఏజింగ్ :

వేప యాంటీఏజింగ్ లా పనిచేస్తుంది. వ్రుద్యాప్య లక్షణాలను పైకి కనబడనివ్వదు. ఇందులో రీజనరేటివ్ లక్షణాలు సహాయపడుతుంది. దీనికి కొద్దిగా సాండిల్ ఉడ్ పౌడర్ మిక్స్ చేసి ముఖానికి అప్లై చేయాలి. ఏజ్ కు సంబంధించిన స్కిన్ సమస్యలను నివారించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది.

10. స్కాల్ప్ ఇన్ఫెక్షన్స్ ను నివారిస్తుంది:

10. స్కాల్ప్ ఇన్ఫెక్షన్స్ ను నివారిస్తుంది:

షాంపు చేయడానికి ముందు నీమ్ పేస్ట్ ను తలకు పట్టించడం వల్ల, తలలో ఇన్ఫెక్షన్స్ ను నివారిస్తుంది. ఇందులో ఉండే యాంటీబ్యాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, అనాల్జిక్, యాంటీఫంగల్ , యాంటీ సెప్టిక్ లక్షణాలు చుండ్రు, ఇన్ఫెక్షన్స్ నివారించడంలో గ్రేట్ గా సహాయపడుతాయి.

English summary

10 Amazing Benefits Of Neem Paste On Your Skin

Neem is one of the miracle herbs that offer many health benefits. Also called as the ‘wonder leaf’, neem has many medicinal uses in Ayurveda. Its scientific name is Azadirachta Indica. In Indian households, neem is used in many forms, such as neem water, neem honey, neem soap, and neem oil. But the most convenient and common way to use neem is to make a paste of its leaves.
Desktop Bottom Promotion