For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

డ్రైగా...రఫ్ గా ఉండే స్కిన్ ను బేబీ సాఫ్ట్ స్కిన్ గా మార్చే 10 బెస్ట్ నేచురల్ ఆయిల్స్

|

సాధారనంగా కొంత మందిని చాలా దగ్గరగా చూసినట్లైతే చర్మం డ్రైగా లేదా ఆయిలీగా కనబడుతుంది. డ్రై స్కిన్ చారలు చారలుగా లేదా పొట్టు రాలినట్లుగా ఉండటం మాత్రమే కాదు, ముట్టుకుంటే చాలా రఫ్ గా అనిపిస్తుంది. ఇటు వంటి డ్రై స్కిన్ ను సాప్ట్ గా మార్చుకోవడానికి మాయిశ్చరైజర్స్ మాత్రమే సరిపోవు. కొన్ని బెస్ట్ అండ్ నేచురల్ ఆయిల్స్ ను ఉపయోగించడం వల్ల డ్రై అండ్ రఫ్ స్కిన్ ను నివారించుకోవచ్చు.

కొన్ని నేచురల్ ఆయిల్స్ చర్మానికి చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తాయి. ఇవి చర్మంలోనికి చొచ్చుకునిపోయి డీప్ గా మాయిశ్చరైజ్ చేస్తాయి. చర్మానికి తగినంత తేమను అందిస్తాయి. వాటర్ బేస్డ్ మాయిశ్చరైజర్స్ డ్రై అండ్ రఫ్ స్కిన్ ను నయం చేయడం గ్రేట్ గా సహాయపడుతాయి. చర్మం మరీ డ్రైగా ఉన్నట్లైతే , స్కిన్ ముట్టుకుంటే చాలు చాలా బాధాకరంగా అనిపిస్తుంది.

ఈ సమస్యను నివారించుకోవడానికి చాలా పద్దతులను అనుసరిస్తుంటారు. అయితే డ్రై స్కిన్ ఏర్పడటానికి ముందు నుండే జాగ్రత్తలు తీసుకుంటే, పరిస్థితి మరీ అంత తీవ్రంగా ఉండదు. కాబట్టి, మన రెగ్యులర్ బ్యూటీ కేర్ లో ఈ క్రింది సూచించిన కొన్ని నూనెలు చేర్చుకోవడం వల్ల డ్రై స్కిన్ ను నివారిస్తాయి. అలాగే చర్మం తేమగా, నిగనిగలాడుతూ సాప్ట్ గా మార్చుతాయి . ఈ నూనెలు చౌకైనవి మరియు సురక్షితమైనవి. మరింకెందుకు ఆలస్యం ఈ క్రింది సూచించిన ఆయిల్స్ ను ఫాలో అవ్వండి. మీ చర్మంను బేబీ స్కిన్ ఉన్నంత సాప్ట్ గా మార్చేసుకోండి...

కొబ్బరి నూనె:

కొబ్బరి నూనె:

కొబ్బరి నూనెను చర్మానికి మర్దన చేయడం వల్ల డ్రై స్కిన్ సమస్య ఉండదు, ఫ్లాకీ స్కిన్...చర్మ దురద వంటి సమస్యలు ఉండవు. కాబట్టి కొబ్బరి నూనె మీకు బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పొచ్చు.

ఆలివ్ ఆయిల్:

ఆలివ్ ఆయిల్:

ఆలివ్ ఆయిల్లో మినిరల్స్ మరియు న్యూట్రీషియన్స్ అధికంగా ఉన్నాయి. ఇవి చర్మానికి నేచురల్ లూబ్రికెంట్స్ గా పనిచేస్తాయి. ఇవి ఆక్సిజన్ ప్రొడక్షన్ ను ప్రోత్సహిస్తాయి. డ్రై స్కిన్ , రఫ్ స్కిన్ ను స్మూత్ గా మార్చుతాయి.

విటమిన్ ఇ ఆయిల్:

విటమిన్ ఇ ఆయిల్:

విటమిన్ ఇ ఆయిల్ క్యాప్స్యూల్స్ తీసుకుని వాటిని బ్రేక్ చేసి, చేతిలో నూనె వేసుకుని డ్రైస్కిన్ కు అప్లై చేస్తుంటే, ఫ్యూచర్ లో డ్రై స్కిన్ సమస్సే ఉండదు.

 ఆముదం:

ఆముదం:

ఆముదం అత్యంత ఔషధ విలువలున్న నూనె. అలాగే ఈ నూనెతో బ్యూటీ ప్రయోజనాలు కూడా ఎక్కువే..ఇది జుట్టుకు మరియు చర్మానికి చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. డ్రైస్కిన్ ను నివారించి చర్మంను సాప్ట్ గా మార్చుతుంది.

కోకో బట్టర్:

కోకో బట్టర్:

కోకో బీన్స్ ను కోకో బట్టర్ ను తయారుచేస్తారు. దీన్నీ వివిధ రకాల డ్రై స్కిన్ క్రీముల్లో ఉపయోగిస్తుంటారు. అంతే కాదు, డార్క్ ప్యాచెస్ ను కూడా నివారిస్తుంది.

ఆర్గాన్ ఆయిల్:

ఆర్గాన్ ఆయిల్:

ఆర్గాన్ ఆయిల్ డీప్ గా మాయిశ్చరైజర్ ను అందిస్తుంది. చర్మం దురదను మరియు రెడ్ నెస్ తగ్గిస్తుంది. చర్మానికి మసాజ్ చేయడానికి ముందు గోరువెచ్చగా వేడి చేయాలి.

బాదం ఆయిల్ :

బాదం ఆయిల్ :

బాదంలో ఆయిల్లోని గ్రేట్ బెనిఫిట్స్ గురించి అందరికి తెలుసు. ముఖ్యంగా ఈ నూనెలో విటమిన్ కంటెంట్ అధికంగా ఉంటుంది. అందువల్లే ఇది డ్రై స్కిన్ నివారించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది.

సాండిల్ వుడ్ ఆయిల్:

సాండిల్ వుడ్ ఆయిల్:

సాండిల్ ఉడ్ ఆయిల్ ను కొన్ని వేల సంవత్సరాల నుండి ఉపయోగిస్తున్నారు. ఇది చర్మ సమస్యలను నివారించడంలో గ్రేట్ ఆయిల్. ఇది చర్మం దురద, రెడ్ నెస్, డ్రై స్కిన్ ను నివారిస్తుంది.

 జోజోబ ఆయిల్:

జోజోబ ఆయిల్:

రెగ్యులర్ గా జోజోబ ఆయిల్ ను ఉపయోగిస్తే డ్రై స్కిన్ నివారించుకోవచ్చు. స్నానం చేసిన తర్వాత చర్మానికి అప్లై చేస్తే బేబీ సాప్ట్ స్కిన్ పొందుతారు.

ల్యావెండర్ ఆయిల్ :

ల్యావెండర్ ఆయిల్ :

డ్రై అండ్ రఫ్ స్కిన్ కు ఫర్ఫెక్ట్ ఆయిల్ ఇది. ఇది డ్రై స్కిన్ ను నయం చేస్తుంది. నాడీవ్యవస్థను ప్రశాంత పరుస్తుంది.

English summary

10 Best Natural Oils For Rough, Dry Skin

Some of us are bogged down by dry skin all year round. Dry skin is not only flaky, but is also rough to touch. And when you're affected by severely dry skin, mere moisturiser is just not enough. You have to switch to using some of the best oils for dry and rough skin.
Story first published: Tuesday, September 13, 2016, 17:09 [IST]
Desktop Bottom Promotion