For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ముడుతలకు చెక్ పెట్టే అలోవెర ప్యాక్స్ ...

|

వయస్సు పెరిగే కొద్ది మహిళల చర్మంలో అనేక మార్పులు చోటు చేసుకుంటాయి . ఈ మార్పుల సహజ సిద్దంగా జరిగేవి. వీటి నుండి ఎవ్వరూ తప్పించుకోలేరు. ఎందుకంటే వయస్సుతో పాటు వచ్చే మార్పులు ప్రతి ఒక్కరిలో సహజంగా జరుగుతుంటాయి.

వయస్సు పెరిగే కొద్ది శరీంరలో వచ్చే మార్పులు జరుగుతాయి. ముందుగా చర్మంలో ముడుతలు, ఫైన్ లైన్స్, నిర్జీవమైన చర్మం మొదలగు లక్షణాలు కనబడుతాయి . ఈ లక్షణాలున్నప్పుడు మనల్ని కలవరపెడుతాయి . ఇటువంటి లక్షణాలు లైఫ్ లెస్ లుక్ తో కనబడేలా చేస్తాయి.

వయస్సైయినా పర్వాలేదు కానీ, ఆ లక్షణాలు ఏఒక్కరూ సహించలేరు. ముఖ్యంగా మహిళలు ఏ ఒక్క చిన్న మచ్చ కనిపించినా తెగ ఆందోళన పడిపోతూ వెంటనే అవి కనబడకుండా ఉండేందుకు ఏదేదో చేసేస్తుంటారు. వయస్సు పెరగడాన్ని ఆపు చేయలేమేమో కానీ, లక్షణాలు మాత్రం కనబడనివ్వకుండా కొన్ని మ్యాజిక్స్ చేయవచ్చు ముఖంలో ముడుతల కనబడకుండా చేసుకోవచ్చు .

వయస్సు పైబడే కొద్ది ముఖంలో కనిపించే మొదటి లక్షణం ముడుతలు , ఈ ముడుతలను కనబడనివ్వకుండా లేదా ముడుతలు ఏర్పకుండా చేయడానికి ఒక అద్భుతమైన మెడిసినల్ ప్లాంట్ గ్రేట్ గా సహాయపడుతుంది . దీన్ని కొన్ని సెంచురీల కాలం నుండి సౌందర్య సాధానాల్లో వినియోగిస్తున్నారు . ముఖంలో ముడుతలను నివారించడంలో కొన్ని అద్భుతాలను చేస్తుంది.

అలోవెరాలో విటమిన్స్, యాంటీఆక్సిడెంట్స్ మరియు ఫైటో న్యూట్రీయంట్స్ పుష్కలంగా ఉంటాయి . ఇది చర్మంను కాంతివంతంగా చేయడం గ్రేట్ గా సహాయపడుతుంది. వయస్సు పెరిగే కొద్ది చర్మంలో ఎలాసిటి తగ్గి చర్మం పల్చగా మారడం జరుగుతుంది . మహిళలు కొన్ని సంవత్సరాల నుండి ఈ హెర్బ్ ను స్కిన్ ఎలాసిటి పెంచుకోవడానికి ఉపయోగిస్తున్నారు . చర్మం మరింత అందంగా యూత్ ఫుల్ గా కనిపించడం కోసం ఉపయోగిస్తున్నారు.

మరి ఈ ఆర్టికల్లో 10 సింపుల్ అండ్ ఎఫెక్టివ్ రిసిపిలను ఉపయోగించి ముడతలను ఎలా మాయం చేసుకోవాలో తెలపడం జరిగింది . అవేంటో తెలుసుకోవాలంటే ఈ క్రింది స్లైడ్ క్లిక్ చేయాల్సిందే....

1. అలోవెర ఫేస్ ప్యాక్:

1. అలోవెర ఫేస్ ప్యాక్:

ఒక టేబుల్ స్పూన్ అలోవెర జెల్ , మరో టేబుల్ స్పూన్తేనె మరియు పాలు మూడు సమంగా తీసుకోవాలి. దీనికి కొన్ని చుక్కల రోజ్ వాటర్ మిక్స్ చేసి చిటికెడు పసుపు చేర్చి, దీన్ని ముఖానికి అప్లై చేయాలి .అరగంట తర్వాత గోరువెచ్చని నీటితో ముఖం శుభ్రం చేసుకోవాలి. ఇలా వారానికొకసారి వేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.

2. అలోవెర స్ర్కబ్:

2. అలోవెర స్ర్కబ్:

ఒక టేబుల్ స్పూన్ ఆలివ్ ఆయిల్ ను 1/4కప్పు అలోవెర జెల్లో మిక్స్ చేయాలి. అలాగే ఇందులో 1/4 బ్రౌన్ షుగర్ కూడా మిక్స్ చేయాలి. అన్నింటి మిక్స్ చేసి , ఈ పేస్ట్ ను ముఖం మొత్తం అప్లై చేయాలి. 20 నిముషాల తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ రిసిపిని వారంలో మూడు సార్లు ప్రయత్నిస్తే మంచి ఫలితం ఉంటుంది.

3. అలోవెర, పెరుగు మరియు కీరదోస:

3. అలోవెర, పెరుగు మరియు కీరదోస:

ఒక టేబుల్ స్పూన్ పెరుగులో 2 చెంచాలా అలోవెర జెల్ మిక్స్ చేసి , 3 కప్పులు కీరదోసరసంలో వేసి మిక్స్ చేయాలి. దీన్ని ముఖానికి అప్లై చేసి అరగంట తర్వాత శుభ్రం చేసుకోవాలి. గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవడం మంచిది. ఈ రిసిపిని వారంలో మూడు సార్లు వేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.

4. అలోవెర, ఆలివ్ ఆయిల్ మరియు గుడ్డు పచ్చసొన:

4. అలోవెర, ఆలివ్ ఆయిల్ మరియు గుడ్డు పచ్చసొన:

అలోవెర జెల్, ఆలివ్ ఆయిల్ మరియు ఒక గుడ్డులోని పచ్చసొన మూడింటిని సమంగా తీసుకొని బాగా మిక్స్ చేయాలి. ముడుతలున్న ప్రదేశంలో ఈ మిశ్రామన్ని అప్లై చేసి 20నిముషాలు స్ర్కబ్ చేయాలి . అరగంట తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ చిట్కాను వారంలో 3సార్లు చేస్తే మంచి ఫలితం ఉంటుంది .

5. అలోవెర మరియు విటమిన్ ఇ క్యాప్యూల్స్:

5. అలోవెర మరియు విటమిన్ ఇ క్యాప్యూల్స్:

విటమిన్ ఇ క్యాఫ్యూల్స్ ను బ్రేక్ చేసి అందులోని ఆయిల్ ను బయటకు తీసుకోవాలి. ఇప్పుడు అందులో అలోవెర జెల్ ను మిక్స్ చేసి , ముడుతలున్న ప్రదేశంలో అప్లై చేసి 20నిముషాలు మసాజ్ చేయాలి. తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి . ఇది ముడుతలను తగ్గించడంతో పాటు చర్మం కాంతివంతంగా మార్చుతుంది.

6. అలోవెర మరియు సీవీడ్ పౌడర్:

6. అలోవెర మరియు సీవీడ్ పౌడర్:

ఒక టేబుల్ స్పూన్ అలోవెర జెల్ మరియు ఒక టేబుల్ స్పూన్ సీవుడ్ పౌడర్ తీసుకొని , రెండింటిని బాగా మిక్స్ చేయాలి. ఈ పేస్ట్ ను ముడుతలున్న ప్రదేశంలో అప్లై చేయాలి. 20 నిముషాల తర్వాత శుభ్రం చేసుకోవాలి . ఈ పద్దతి వల్ల చర్మం డిటాక్సిఫై అవుతుంది. ముడుతలు మాయం అవుతాయి

7. అలోవెర, ద్రాక్ష మరియు తేనె:

7. అలోవెర, ద్రాక్ష మరియు తేనె:

ఒక టేబుల్ స్పూన్ అలోవెర జెల్ , ఒక టేబుల్ స్పూన్ తేనె , అరకప్పు ఫ్రెష్ గ్రేప్ జ్యూస్ తీసుకోవాలి. ఈ మూడింటిని మిక్స్ చేసి చర్మానికి అప్లై చేయాలి . అరగంట తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ పద్దతిని వారానికొకసారి చేసినా మంచి ఫలితం ఉంటుంది

8. అలోవెర మరియు నిమ్మ:

8. అలోవెర మరియు నిమ్మ:

ఒక టేబుల్ స్పూన్ అలోవెర జెల్ కు 2 ఒక టేబుల్ స్పూన్ల ఫ్రెష్ లెమన్ జ్యూస్ మిక్స్ చేయాలి. ఈ మిశ్రామన్ని ముడుతలున్న ప్రదేశంలో అప్లై చేసి 20 నిముషాల తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ ప్రొసెస్ ను రెగ్యులర్ గా చేయడం వల్ల తప్పనిసరిగా మార్పు చూస్తారు.

9.అలోవెర , తేనె మరియు ఓట్స్:

9.అలోవెర , తేనె మరియు ఓట్స్:

ఒక టేబుల్ స్పూన్ అలోవెర జెల్ , తేనె , ఓట్స్ మిక్స్ చేయాలి.ఈ పేస్ట్ ను ముడుతలున్న ప్రదేశంలో అప్లై చేసి 25నిముషాలు నిధానంగా మసాజ్ చేయాలి. తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.

10. అలోవెర పండిన బొప్పాయి:

10. అలోవెర పండిన బొప్పాయి:

ఒక టేబుల్ స్పూన్ అలోవెర జెల్ కు 2 టేబుల్ స్పూన్ల పండిన బొప్పాయి గుజ్జు మిక్స్ చేసి పేస్ట్ చేయాలి. అరగంట తర్వాత కోల్డ్ వాటర్ తో శుభ్రం చేసుకుంటే ముడుతలను మాయం చేసుకోవచ్చు.

English summary

10 Effective Aloe Vera Recipes To Treat Wrinkles

A medicinal plant, aloe vera, that has been used for a host of purposes since centuries, can work wonders to rid your face of the wrinkles. Aloe vera is rich in vitamins, antioxidants and phytonutrients, which makes it ideal for rejuvenating your face.
Desktop Bottom Promotion