For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఆయిల్ స్కిన్ నివారణకు 10 ఎఫెక్టివ్ ఆయుర్వేద ట్రీట్మెంట్స్

|

ఆయిల్ స్కిన్ లేదా ఆయిల్ హెయిర్ తో బాధపడుతున్నారా? సీజనల్ గా కూడా ఆయిల్ స్కిన్ ఎక్కువవుతుంటుంది. వేసవిలో డెర్మటాలజీ సమస్యలు ఎక్కువగా ఉంటాయి, వేసవి వేడి వల్ల ఆయిల్ హెయిర్ మరియు ఆయిల్ స్కిన్ సమస్యలు ఎక్కువ అవుతాయి. ఆయిల్ హెయిర్ మరియు చుండ్రు వల్ల కూడా ఆయిల్ స్కిన్ పెరుగుతుంది. కాలుష్యం వల్ల మరియు ఇతర అన్ హైజీనిక్ కారణాల వల్ల కూడా చర్మం జిడ్డుగా మారుతుంది.

ఆయిల్ స్కిన్ కు కారణాలేవైనా, ఆయిల్ స్కిన్ నివారించుకోవడానికి కొన్ని ఆయుర్వేదిక్ రెమెడీస్ ఉన్నాయి . ఆయిల్ స్కిన్ నివారించుకోవడానికి ఇంట్లో ఉండే కొన్ని పదార్థాలే ఆయుర్వేదిక్ లక్షణాలను కలిగి ఉన్నాయి.ఇవి ఆయిల్ స్కిన్ నివారించడంలో చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తాయి. మరి ఆయిల్ స్కిన్ నివారించే హోం మేడ్ ఆయుర్వేదిక్ రెమెడీస్ ఏంటో తెలుసుకుందాం...

పాలు:

పాలు:

పాలలో ఉండే నయం చేసే గుణాలు, ఆయిల్ స్కిన్ నివారిస్తుంది. కాటన్ బాల్ ను పాలలో డిప్ చేసి ముఖానికి మర్ధన చేయాలి.ఇలా రోజుకు రెండు సార్లు, నిద్రించడానికి ముందు పాలలో ముంచిన కాటన్ తో రుద్దడం వల్ల ఆయిల్ స్కిన్ నివారించబడుతుంది.

 ఆరెంజ్ :

ఆరెంజ్ :

ఆరెంజ్ లో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది చర్మానికి చాలా మేలు చేస్తుంది. ఆరెంజ్ జ్యూస్ లో కాటన్ డిప్ చేసి దాంతో ముఖాన్ని శుభ్రం చేయాలి. ఆరెంజ్ జ్యూస్ ముఖం మీద కనీసం అరగంట ఉన్నించి తర్వాత శుభ్రం చేసుకోవాలి.

గంధం మరియు పసుపు:

గంధం మరియు పసుపు:

పసుపు, గందం రెండూ పేస్ట్ చేసి ముఖానికి, ఫోర్ హెడ్ మొత్తం అప్లై చేయాలి.(అవసరం అయితే కొద్దిగా నిమ్మరసం కూడా కలుపుకోవచ్చు). ఈ పేస్ట్ ను ముఖానికి అప్లై చేసిన 15నిముషాల తర్వాత ముఖం శుభ్రం చేసుకోవాలి.

అలోవెర:

అలోవెర:

అలోవెర చాలా సింపుల్ రెమెడీ, దీన్ని ఇంట్లోనే తయారుచేసుకోవచ్చు. ఆయిల్ స్కిన్ నివారించుకోవడానికి అలోవెర జెల్ ను ముఖానికి అప్లై చేయాలి. ఇది యాంటీ ఇన్ల్ఫమేటరీ ఏజెంట్ గా పనిచేస్తుంది.

తేనె:

తేనె:

తేనెను ఎక్కువగా ఆయిల్ హెయిర్ నివారణకు ఉపయోగిస్తుంటారు. ఒక గుడ్డులోని పచ్చసొన మరియు రెండు టేబుల్ స్పూన్ల తేనె మిక్స్ చేయాలి. దీనికి కొద్దిగా గోరువెచ్చని నీటిని మిక్స్ చేసి, ఈ పేస్ట్ ను నేరుగా తలకు అప్లై చేసి కొన్ని గంటలపాటు అలాగే వదిలేసి, తర్వాత గోరువెచ్చని నీటితో తలస్నానం చేయాలి.

నీళ్ళు:

నీళ్ళు:

నీరు గోరువెచ్చగా చేసి, అందులో కాటన్ ను డిప్ చేసి, కాటన్ తో ముఖం మొత్తం శుభ్రంగా తుడుచుకోవాలి. ఇలా చేయడం వల్ల చర్మం రంద్రాల్లో చేరిన మురికిని తొలగిస్తుంది. తర్వాత ఫ్రిజ్ లో కొద్దిగా ఐస్ ముక్కలు తీసుకొని ముఖం మొత్తం రబ్ చేయాలి . ఇలా రోజుకొకసారి కొన్ని వారాల పాటు క్రమం తప్పకుండా చేస్తుంటే మంచి ఫలితం ఉంటుంది.

 నిమ్మ మరియ ఎగ్:

నిమ్మ మరియ ఎగ్:

గుడ్డును కాంటినెంటల్ బ్రేక్ ఫాస్ట్ గా తీసుకుంటారు, గుడ్డు పచ్చసొనలో కొద్దిగా నిమ్మరసం మిక్స్ చేసి జుట్టుకు తలకు అప్లై చేయాలి. తలలో జిడ్డును తొలగించడానికి ఇది ఫర్ఫెక్ట్ హోం మేడ్ ఆయుర్వేదిక్ రెమెడీ . ఈ పేస్ట్ అప్లై చేసిన అరగంట తర్వాత తలస్నానం చేసుకోవాలి.

వేప:

వేప:

వేపఆకులను నీటిలో వేసి బాయిల్ చేయాలి. తర్వాత కూల్ చేయాలి. ఈ వాటర్ ను ముఖం మరియు తలను శుభ్రం చేసుకోవడానికి ఉపయోగించుకోవచ్చు. వేపఆకు స్ట్రాంగ్ వాసన కలిగి ఉంటుందనుకుంటే, వేపఆకులను నీటిలో వేసి మరిగించి ఆనీటిలో కాటన్ డిప్ చేసి , కాటన్ తో ముఖం మొత్తం శుభ్రం తుడుచుకోవాలి. ఆయిల్ స్కిన్ మరియు స్కాల్ఫ్ కు ఇది బెస్ట్ ఆయుర్వేదిక్ చిట్కా.

టీ డికాషన్:

టీ డికాషన్:

చల్లటి నీటిలో డిప్ చేసిన టీ బ్యాగ్ ను ముఖం మొత్తం టీ ఆకారనంలో మర్దన చేయాలి . . ఇందులో ఉండే టానిక్ యాసిడ్ ముఖంలో మచ్చలను , మూసుకుపోయిన రంద్రాలను శుభ్రం చేస్తుంది .

రోజ్ వాటర్ :

రోజ్ వాటర్ :

కొద్దిగా రోజ్ వాటర్ లో కాటన్ డిప్ చేసి, ముఖం మొత్తం శుభ్రంగా కడిగేసుకోవాలి. ఇది చర్మంలో ఆయిల్ బిల్డ్ కాకుండా చూడటం మాత్రమే కాదు, చర్మానికి చల్లదనాన్ని అందిస్తుంది,

English summary

10 Effective Ayurvedic Solutions For Oily Skin

The most common amongst these are oily hair and skin problems. Here are some easy Ayurvedic remedies for oily skin, with ingredients you probably already have lying around at home.
Desktop Bottom Promotion