For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఫ్రెష్ అండ్ బ్రైట్ స్కిన్ పొందడానికి 10 హెర్బల్ ఫేస్ స్ప్రేలు

By Lekhaka
|

చర్మం ఆరోగ్యంగా ఉండాలంటే చర్మసంరక్షణ చాలా అవసరం. హానికరమైన యూవీ కిరణాల నుండి వెలువడే ఉష్ణోగ్రతను, వాతావరణంలో మార్పులు, దుమ్ము, ధూళి వంటి వాటన్నింటి నుండి శరీరాన్ని కాపాడుటకు చర్మం రక్షణ కవచంగా ఉంటుంది.

మానవ శరీరంలో అతి పెద్ద అవయం చర్మమే, బాడీ మొత్తం కప్పి ఉంచి, గాలి, వాన, చలి, ఎండ, దుమ్ము, ధూళిశరీరంలోకి చేరకుండా రక్షణ కవచంగా శరీరాన్ని కాపాడుతుంది.

శరీరానికి రక్షణ కవచంలా ఉండటం వల్ల వీటన్నింటిని ఎదుర్కోవడం వల్ల చర్మం నిర్జీవంగా , ముడతలతో, హైపర్ పిగ్మెంటేషన్, మొటిమలు, మచ్చలు, ఇతర చర్మ సమస్యలు వస్తాయి.

ఈ వీటన్నింటిని ఎదుర్కోవాలంటే, సరైన చర్మ సంరక్షణ చిట్కాలను పాటించాలి. చర్మ ఆరోగ్యానికి సరైన జాగ్రత్తలు తీసుకున్న్టట్లైతే స్కిన్ టోన్ కూడా మెరుగుపడుతుంది.

ఇక్కడ కొన్ని కూలింగ్ స్ప్రేస్ ను మీకోసం పరిచయం చేస్తున్నాము. డల్ గా అలసిన చర్మంను బ్రైట్ చేయడానికి ఇది సహాయపడుతుంది ..అవేంటో ఒకసారి తెలుసుకుందాం...

1. కీరదోస, రోజ్ వాటర్, అలోవెర:

1. కీరదోస, రోజ్ వాటర్, అలోవెర:

తొక్క తీసిన కీరదోసకాయ ఒకటి మెత్తగా పేస్ట్ చేసి అందులో నుండి జ్యూస్ తియ్యాలి,కీరదోసకాయ జ్యూస్ కు అరటీస్పూన్ నిమ్మరసం, ఒక టీస్పూన్ అలోవెర జ్యూస్ మిక్స్ చేసి, అరకప్పు డిస్టిల్ వాటర్, అరకప్పు రోజ్ వాటర్ ను కలిపి మొత్తం మిశ్రమాన్ని బాగా మిక్స్ చేయాలి. తర్వాత దీన్ని వడగట్టి, స్ప్రేబాటిల్లో నిల్వ చేసుకోవాలి. ఎప్పుడు అవసరమైతే అప్పుడు ఈ హేర్బల్ ఫేస్ స్ప్రేను వినియోగించుకోవచ్చు.

2. కర్పూరం, రోజ్ వాటర్:

2. కర్పూరం, రోజ్ వాటర్:

ఒక బాటిల్ రోజ్ వాటర్ లో , ఒక కప్పు నేచురల్ కర్పూరం పౌడర్ ను మిక్స్ చేయాలి. రెండూ బాగా కలగలిసే వరకూ మిక్స్ చేయాలి. ఇది స్కిన్ రిఫ్రెష్ చేయడానికి , మొటిమలను నివారించడానికి సహాయపడుతుంది.

3. చమోమెలీ టీ:

3. చమోమెలీ టీ:

డ్యామేజ్ అయిన చర్మంను తిరిగి పూర్వస్థితికి తీసుకురావడానికి చమోమెలీ టీ గ్రేట్ గా సహాయపడుతుంది. 100ml వాటర్ లో ఒక చమోమెలీ టీ బ్యాగ్ విడదీసి లోపలి పదార్థాన్ని వేసి బాగా ఉడికించాలి. తర్వాత దీన్ని చల్లారనిచ్చి, స్ప్రే బాటిల్లో నిల్వ చేసుకోవాలి. అవసరమైనప్పుడు దీన్ని చర్మానికి అప్లై చేసి 15 నిముషాల తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి.

4. గ్రీన్ టీ :

4. గ్రీన్ టీ :

డ్రై అండ్ డల్ స్కిన్ ను ట్రీట్ చేయడానికి గ్రీన్ టీ గ్రేట్ గా సహాయపడుతుంది. 100mlనీళ్ళలో ఒక గ్రీన్ టీ బ్యాగ్ వేసి 5 నిముషాలు బాగా ఉడికించాలి. తర్వాత చల్లార్చి, స్ప్రే బాటిల్లో నింపుకోవాలి. అవసరమైనప్పుడు దీన్ని చర్మానికి అప్లై చేసి, 15 నిముషాల తర్వాత శుభ్రం చేసుకోవాలి.

5. ల్యావెండర్ ఫేస్ స్ప్రే :

5. ల్యావెండర్ ఫేస్ స్ప్రే :

ల్యావెండర్ ఫేస్ స్ప్రే మీ చర్మాన్ని ప్రకాశవంతంగా మార్చుతుంది. 5 చుక్కల లావెండర్ ఎసెన్షియల్ ఆయిల్ ను స్పే చేసి, అందులో ఒక టీస్పూన్ హాజల్ మరియు ఒక కప్పు డిస్టిల్ వాటర్ మిక్స్ చేయాలి. దీన్ని స్ప్రే బాటిల్లో స్టోర్ చేసి పెట్టుకోవాలి. దీన్ని వాడే ముందు బాగా షేక్ చేసి తర్వాత ఉపయోగించాలి.

6. వేప:

6. వేప:

వేపలో మెడిసినల్ లక్షణాలు అధికంగా ఉన్నాయి. ఇది అన్ని రకాల చర్మ సమస్యలను ట్రీట్ చేస్తుంది. రెండు కప్పుల నీళ్ళులో ఒక కప్పు వేప ఆకులను వేసి, ఉడికించాలి. తర్వాత ఈ నీటిని వడగట్టి, నిల్వచేసుకోవాలి. దీన్ని రోజుకు రెండు మూడు సార్లు ఫేస్ స్ప్రే గా ఉపయోగించుకోవచ్చు.

7. ఆపిల్ సైడర్ వెనిగర్ :

7. ఆపిల్ సైడర్ వెనిగర్ :

ఆపిల్ సైడర్ వెనిగర్ చర్మంలో పిహెచ్ లెవల్స్ బ్యాలెన్స్ చేస్తుంది. స్కిన్ కంప్లెక్షన్ ను బ్రైట్ గా మార్చుతుంది. రెండు టేబుల్ స్పూన్ల ఆపిల్ సైడర్ వెనిగర్ ను 4 టేబుల్ స్పూన్ల డిస్టిల్ వాటర్ తో మిక్స్ చేసి అవసరమైనప్పుడు ఈ హేర్బల్ స్ప్రేను ఉపయోగించుకోవచ్చు.

8. మింట్ :

8. మింట్ :

పుదీనాలో యాంటీబ్యాక్టీరియల్ లక్షణాలు అధికంగా ఉన్నాయి. ఇది కొన్ని రకాల చర్మం సమస్యలను నివారించడంలో చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. రెండు కప్పులు పుదీనా ఆకులను బాగా శుభ్రంగా కడిగి, రెండు కప్పుల నీటిలో వేసి బాయిల్ చేయాలి, దీన్ని వడగట్టి, చల్లారనివ్వాలి. దీన్ని రోజుకు రెండు మూడు సార్లు ఉపయోగించుకోవచ్చు.

9. నిమ్మరసం :

9. నిమ్మరసం :

చర్మం వెంటనే ఫ్రెష్ అప్ చేసుకోవాలంటే నిమ్మరసం గ్రేట్ రెమెడీ. నిమ్మరసంను ముఖానికి అప్లై చేసుకోవచ్చు. లేదా దీనికి కొద్దిగా రోజ్ వాటర్ జోడించడం వల్ల మరింత బెటర్ రిజల్ట్ ను అందిస్తుంది. దీన్ని స్ప్రే బాటిల్లో స్టోర్ చేసుకుని, అవసరమైనప్పుడు ఉపయోగించుకోవచ్చు. ఇది చీపెస్ట్ ఎఫెక్టివ్ ఫేస్ స్ప్రే.

10. అలోవెర:

10. అలోవెర:

కలబదం మొక్క నుండి ఒక ఆకును తీసి, అందులో నుండి జెల్ ను తీసుకోవాలి. దీన్ని ముఖానికి అప్లై చేసి అరగంట తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇది చర్మానికి మాయిశ్చరైజింగ్ గుణాలను అందించే ఒక ఎఫెక్టివ్ హోం రెమెడీ. ఇది చర్మంలో ఫెయిర్ నెస్ ను పెంచుతుంది. స్కిన్ టోన్ మెరుగుపడుతుంది. అలసిన, నిర్జీవమైన చర్మం మెరుగుపడుతుంది.

English summary

10 Herbal Face Sprays For A Brighter-looking Skin

All these things take a toll on the skin and make it appear dull, wrinkly, with hyper-pigmentation, acne, freckles and a number of other skin-related issues.To deal with these issues, having a proper skin regimen is vital and a good skin care regimen begins with toning. So, here we have a list of 10 herbal cooling sprays that will instantly brighten up your dull tired skin. Take a look.
Story first published: Tuesday, November 29, 2016, 18:20 [IST]
Desktop Bottom Promotion