For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వింటర్లో డ్రై స్కిన్ నివారణకు 10 మాయిశ్చరైజింగ్ రెమెడీస్

సీజన్ ఏదైనా డ్రై స్కిన్ నివారించుకోవడానికి అనేక మాయిశ్చరైజర్స్ అందుబాటులో ఉన్నాయి. అయితే కమర్షియల్ మాయిశ్చరైజర్స్ కంటే, హోం మేడ్ మాయిశ్చరైజర్స్ లో ఫ్రెష్ న్యూట్రీషియన్స్ అద్భుతమైన ఫలితాలను అందిస్తాయి.

By Lekhaka
|

చర్మ సమస్యల్లో డ్రై స్కిన్ ఒక్కటి. ముఖ్యంగా వింటర్లో డ్రైస్కిన్ సమస్యలు ఎక్కువ. డ్రై స్కిన్ వల్ల అందాన్ని కోల్పోతారు. చూడటానికి చర్మం నిర్జీవంగా, వయస్సైన వారిలా కనబడుతుంది. కాబట్టి అలాంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే, చర్మానికి తగిన హైడ్రేషన్ అవసరం.

చాలా మంది డ్రై స్కిన్ కు మాత్రమే మాయిశ్చరైజింగ్ అవసరమనుకుంటారు, కానీ ఆయిల్ స్కిన్, అన్ని రకాల కాంబినేషన్ స్కిన్ కు మాయిశ్చరైజింగ్ అవసరం. ముఖ్యంగా వింటర్ లో డ్రై స్కిన్ సమస్య ఎక్కువగా ఉంటుంది కాబట్టి శీతాకాలంలో మాయిశ్చరైజర్ తప్పనిసరి.

ఏ సీజన్ లో అయినా సరే చర్మం డ్రైగా మారకుండా మాయిశ్చరైజింగ్ ఉండేలా చూసుకోవాలి. ప్రతిరోజూ మాయిశ్చరైజింగ్ ను ఉపయోగించడం వల్ల చర్మంలో గ్లో కనిపిస్తుంది. డీప్ హైడ్రేషన్ అందుతుంది. సూర్యుని నుంచి వెలువడే యూవీకిరణాలు, డ్రై వింటర్ సీజన్, చర్మం డ్యామేజ్ అవ్వడానికి కారణమవుతుంది. చర్మంను మరింత డ్రైగా మారుస్తుంది. చర్మం పొడిగా మారడం వల్ల చర్మం మీద దురద, డ్రైప్యాచ్ లు, ఇతర చర్మ సమస్యలు, ఎదురవుతాయి. చర్మంలో సమస్యలు లేకుండా ఉండాలంటే రెగ్యులర్ మాయిశ్చరైజర్ అవసరం అవుతుంది.

సీజన్ ఏదైనా డ్రై స్కిన్ నివారించుకోవడానికి అనేక మాయిశ్చరైజర్స్ అందుబాటులో ఉన్నాయి. అయితే కమర్షియల్ మాయిశ్చరైజర్స్ కంటే, హోం మేడ్ మాయిశ్చరైజర్స్ లో ఫ్రెష్ న్యూట్రీషియన్స్ అద్భుతమైన ఫలితాలను అందిస్తాయి. అవేంటో ఒకసారి తెలుసుకుందాం..

హోం మేడ్ బట్టర్:

హోం మేడ్ బట్టర్:

హోం మేడ్ బట్టర్ అంటే మీకు తెలుసా? చాలా సింపుల్ గా తయారుచేసుకోవచ్చు. మజ్జిగ లేదా పెరుగు చిలికినప్పుడు పైన వెన్న తేలుతుంది. దీన్నే బట్టర్ అని పిలుస్తారు. దీన్ని ఒక బౌల్లోకి తీసుకుని నిల్వచేసుకోవచ్చు. ఈ బట్టర్ లో అనేక మాయిశ్చరైజింగ్ గుణాలున్నాయి. చర్మంను స్మూత్ గా మార్చుతుంది. బట్టర్ ను చర్మానికి అప్లై చేయడం వల్ల చర్మంకు ఫర్ఫెక్ట్ గ్లో అందిస్తుంది. ఫెయిర్ గా, ట్యాన్ ఫ్రీగా మారుస్తుంది.

బట్టర్ మిల్క్:

బట్టర్ మిల్క్:

బట్టర్ మిల్క్ లో న్యూట్రీషియన్స్ అధికంగా ఉన్నాయి. ఎక్స్టర్నల్ అప్లికేషన్స్ కు ఫర్ఫెక్ట్ గా మ్యాచ్ అవుతుంది. బట్టర్ మిల్క్ చాలా త్వరగా చర్మంలోకి ఇంకుతుంది . దాంతో చర్మం స్మూత్ గా , సాప్ట్ గా తయారవుతుంది. అడిషినల్ గా , చర్మంలో ముడుతలు, మచ్చలు లేకుండా నివారిస్తుంది.

మిల్క్ క్రీమ్ :

మిల్క్ క్రీమ్ :

డ్రై అండ్ డల్ స్కిన్ చూడటానికి చాలా అసహ్యంగా కనబడుతుంది. అయితే పరిష్కారం ఫ్రిజ్ లో ఉంది.తాజా పాలలో గ్లోయింగ్ స్కిన్ కావల్సిన లక్షణాలున్నాయి . మిల్క్ క్రీమ్ చర్మానికి ఫెయిర్ నెస్ అందిస్తుంది. డార్క్ సర్కిల్స్ ను అందిస్తుంది స్కిన్ టాన్ నివారిస్తుంది. మిల్క్ క్రీమ్ రెగ్యులర్ గా మసాజ్ చేయడం వల్ల డెఫ్ నెట్ గా మాయిశ్చరైజింగ్ లక్షణాలు అందిస్తుంది.

నువ్వుల నూనె:

నువ్వుల నూనె:

డ్రై మరియు దురద కలిగించే చర్మంకు డీప్ హైడ్రేషన్ అవసరం అవుతుంది. నువ్వుల నూనె కంటే మరింత బెటర్ గా ఏముంటుంది. నువ్వుల నూనె చర్మం మీద ఎక్కువ సమయం నిల్చి ఉండటం వల్ల చర్మంలో షైనింగ్, సాప్ట్ లుకు అందిస్తుంది. నువ్వుల నూనెను రెగ్యులర్ గా అప్లై చేయడం వల్ల అందుకు అడిషినల్ మాయిశ్చరైజింగ్ అవసరం లేదు. నువ్వుల నూనెను తలకు అప్లై చేయడం వల్ల స్మూత్ స్కిన్ పొందుతారు.

బాదం ఆయిల్:

బాదం ఆయిల్:

బాదం నూనెలో విటమిన్ ఇ, విటమిన్ ఎ అధికంగా ఉన్నాయి. ఇందులో అద్భుతమైన ఆరోమా వాసన మరియు గ్రేట్ మాయిశ్చరైజర్ గా పనిచేస్తుంది. మరో బెనిఫిట్ కూడా ఉంది, బాగా నిద్రపడుతుంది.

ఆలివ్ ఆయిల్:

ఆలివ్ ఆయిల్:

ఆలివ్ ఆయిల్ ఒక బెస్ట్ హోం రెమెడీ. డ్రై స్కిన్ కు మంచి మాయిశ్చరైజింగ్ గుణాలను అందిస్తుంది . చర్మ సమస్యలను నివారిస్తుంది. దీన్ని చర్మానికి అప్లై చేసి, మసాజ్ చేసుకోవాలి. దీన్ని రాత్రిల్లో అప్లై చేస్తే మరింత బెటర్ రిజల్ట్ పొందుతారు. మరుసటి రోజు స్నానం చేస్తే చాలా ఫ్రెష్ గా అనిపిస్తుంది.

ఫ్రెష్ కోల్డ్ మిల్క్:

ఫ్రెష్ కోల్డ్ మిల్క్:

ఫ్రెష్ గా ఉండే పాలను చర్మానికి అప్లై చేసి మసాజ్ చేయాలి. ఇలా చేయడం వల్ల అన్ని రకాల చర్మం హైడ్రేషన్ కు మారుతుంది. చల్లటి పాలు చాలా తర్వగా చర్మంలోకి ఇంకుతుంది.మరియు చర్మానికి ఎక్కువ మాయిశ్చరైజింగ్ గుణాలను అందిస్తుంది. ఒక గంట తర్వాత గోరువెచ్చని నీటితో స్నానం చేస్తే సరిపోతుంది.

కొబ్బరి నూనె:

కొబ్బరి నూనె:

కొబ్బరి నూనె డ్రై స్కిన్ నివారణకు ఎక్సలెంట్ హోం రెమెడీ , అన్ని రకాల చర్మ తత్వాలకు ఇది బెస్ట్ గా పనిచేస్తుంది. ఈ నూనెను వారానికొసారి అప్లై చేస్తే చాలు బెటర్ రిజల్ట్ ను అందిస్తుంది. రెగ్యులర్ గా అప్లై చేస్తే స్మూత్ గా సాప్ట్ స్కిన్ పొందుతారు. తర్వాత వేడినీటితో శుభ్రం చేసుకోవాలి.

క్యారెట్ జ్యూస్ మిల్క్ క్రీమ్:

క్యారెట్ జ్యూస్ మిల్క్ క్రీమ్:

క్యారెట్ జ్యూస్ లో స్మూతింగ్ గుణాలు అధికంగా ఉన్నాయి. ఇది చర్మానికి ఉత్తమమైనదని మీకు తెలుసా . క్యారెట్ లో విటమిన్ ఎ అధికంగా ఉంది , క్యారెట్ జ్యూస్ లో రెండు మూడు టీస్పూన్ల మిల్క్ క్రీమ్ జోడించి మిక్స్ చేసి అప్లై చేయాలి. కొన్ని నిముషాల తర్వాత మెత్తటి టవల్ తో తుడిచేయాలి.

అవోవెర:

అవోవెర:

ఇంట్లో ఒక అలోవెర మొక్క ఉంటే చాలు ఇది చాలా వేగంగా పెరుగుతుంది, ఇది హోం మాయిశ్చరైజర్ గా పనిచేస్తుంది. పై స్కిన్ తొలగించి లోపల ఉండే జెల్ ను స్పూన్ తో తీసుకోవాలి. తర్వాత మ్యాష్ చేయాలి. అలోవెర జెల్లో న్యూట్రీషియన్స్ అధికంగా ఉన్నాయి. విటమిన్ ఇ, విటమిన్ ఎలు అధికంగా ఉన్నాయి.

English summary

10 Home Remedies For Moisturising Skin

10 Home Remedies For Moisturising Skin. It is very important to keep your skin moist and well hydrated. Dry skin needs more moisturising than oily skin.
Desktop Bottom Promotion