For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వృద్ధాప్య లక్షణాలను కనబడకుండా మెయింటైన్ చెయ్యడానికి సింపుల్ టిప్స్..!

|

ఎవరైనా సరే యవ్వనంలో ఉన్నప్పుడు చర్మం నిగనిగలాడూ ఉంటుంది. సాప్ట్ గా ...ప్రకాశవంతంగా ఉంటుంది. అదే వయస్సైయ్యే కొద్ది చర్మంలో ముడతలు, ఫైన్ లైన్స్, ఏజ్ స్పాట్స్, చర్మ వదులవ్వడం వంటి లక్షణాలు కనబడుతాయి. యంగ్ గా ..స్మార్ట్ గా కనబడాలనుకోవడం ప్రతి ఒక్క అమ్మాయికి డ్రీమ్. అందుకే మార్కెట్లో రోజురోజుకి బ్యూటీ ప్రొడక్ట్ కొన్ని వందలు...వేలలల్లో వచ్చిపడుతున్నాయి. చర్మం మీద వృద్దాప్య ఛాయలు కనబడకుండా మెయింటైన్ చేయడానికి మహిళలు చాలా ఖరీదైన, రిస్కీ ప్రొసీజర్స్ ను ఎంపిక చేసుకుంటుంటారు.

చర్మంలో వృద్ధాప్య ఛాయలు కనబడకుండా చేయడానికి కొన్ని నేచురల్ యాంటీ ఏజింగ్ రెమెడీస్ ఉన్నాయి . వాటినీ మీకోసం ఈ రోజు పరిచయం చేస్తున్నాము. వీటి రెగ్యులర్ హోం మేడ్ యాంటీ ఏజింగ్ రెమెడీస్ గా ఉపయోగించుకోవచ్చు. కెమికల్ ప్రొడక్ట్స్ ను ఉపయోగించడం వల్ల చర్మానికి హాని కలిగిస్తాయి. ముడుతలను నివారించుకోవడానికి ఉపయోగించే హానికరమైన కెమికల్స్ ప్రస్తుతానికి మార్పు కనిపించేట్లు చేసినా, దీర్ఘకాలంలో చర్మానికి హాని కలిగిస్తాయి. కాబట్టి, కెమికల్ ప్రొడక్ట్స్ బదులుగా నేచురల్ గా మనకు అందుబాటులో ఉండే ఎఫెక్టివ్ హోం రెమెడీస్ ను ఉపయోగించడం సురక్షితం.

వృద్ధాప్య లక్షణాలను కనబడనివ్వకుండా చేసే యాంటీ ఏజింగ్ రెమెడీస్ ఈ క్రింది విధంగా...

1. అవొకాడో ప్యాక్:

1. అవొకాడో ప్యాక్:

అవొకాడో ఫ్రూట్ ను మెత్తగా పేస్ట్ చేసి ఫేస్ కు మాస్క్ వేసుకోవడం వల్ల చర్మంలో వృద్ధాప్య లక్షణాలు కనబడవు. అవొకాడోను పేస్ట్ చేసి ముఖాని అప్లై చేసి 15 నిముషాల తర్వాత చల్లటి నీటితో కడిగేసుకోవాలి.

2. డల్ స్కిన్ కోసం తేనె:

2. డల్ స్కిన్ కోసం తేనె:

తేనె, నిమ్మరసం లేదా పెరుగు మిక్స్ చేయాలి. ఈ పేస్ట్ ను ముఖానికి అప్లై చేసి 15 నిముసాల తర్వాత శుభ్రం చేసుకోవాలి. ఇది చర్మానికి తగిన హైడ్రేషన్ అందిస్తుంది. ముడుతలను మాయం చేస్తుంది. చర్మం సాగకుండా, వదులు కాకుండా మెయింటైన్ చేస్తుంది. ముడుతలను నివారించడంలో బెస్ట్ ఫేస్ మాస్క్

3. డ్రై స్కిన్ కు ఆముదం:

3. డ్రై స్కిన్ కు ఆముదం:

ఆముదం స్కిన్ సాప్ట్ గా మార్చుతుంది. చర్మంలో కోల్పోయిన్ మాయిశ్చరైజర్ ను తిరిగి తీసుకొస్తుంది. ముడుతలను మాయం చేస్తుంది. చర్మాన్ని మెరిపిస్తుంది. రాత్రి నిద్రించే ముందు ఆముదం నూనెను చేతిలోకి తీసుకొని ముఖానికి అప్లై చేసి సున్నితంగా మసాజ్ చేయాలి. ఇది ముఖానికి బెస్ట్ యాంటీ ఏజింగ్ రెమెడీ..

4. ఎసెన్షియల్ ఆయిల్ ప్యాక్:

4. ఎసెన్షియల్ ఆయిల్ ప్యాక్:

జాస్మిన్ ఆయిల్ , సాండిల్ ఉడ్ ఆయిల్, రోజ్ ఆయిల్ లేదా ల్యావెండర్ ఆయిల్ తీసుకుని అన్నీ మిక్స్ చేసి, ముఖానికి అప్లై చేయాలి. వీటిలో ఉన్నగుణాలు, ఏజింగ్ లక్షణాలను నివారిస్తుంది. చర్మంలో బ్లడ్ సర్క్యులేషన్ పెంచుతుంది. చర్మం సాప్ట్ గా , కాంతివంతంగా మెరిసిపోతుంది.

5. ఫ్లవర్ మాస్క్:

5. ఫ్లవర్ మాస్క్:

రోజ్ పెటల్స్, బంతిపువ్వులు, చామంతి తీసుకుని, మెత్తగా పేస్ట్ చేయాలి. ఈ పేస్ట్ కు కొద్దిగా ఆలివ్ ఆయిల్ మిక్స్ చేసి ముఖానికి, మెడకు అప్లై చేయాలి. 20 నిముసాల తర్వాత చల్లటి నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. ఇది చర్మంను కాంతివంతంగా , సాప్ట్ గా మార్చుతుంది.

6. ఫ్రెష్ కోకనట్ మిల్క్ ప్యాక్:

6. ఫ్రెష్ కోకనట్ మిల్క్ ప్యాక్:

ఫ్రెష్ గా ఉండే కొబ్బరి తీసుకుని, తురిమి మిక్సీలో వేసి గ్రైండ్ చేసి పాలు తియ్యాలి. ఈ కోకనట్ మిల్క్ ను ముఖం మెడకు అప్లై చేయాలి. 15 నిముషాల తర్వాత మరో కోటింగ్ గా తిరిగి అప్లై చేయాలి. మరో 15 నిముసాల తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇది మీ చర్మాన్ని యంగ్ గా, యూత్ ఫుల్ గా మార్చుతుంది. ముడుతలను మాయం చేస్తుంది. ఇది బెస్ట్ హోం మేడ్ యాంటీఏజింగ్ హోం రెమెడీ.

7. పైనాపిల్ ప్యాక్ :

7. పైనాపిల్ ప్యాక్ :

పైనాపిల్ ముక్కలు తీసుకుని ముఖానికి అప్లై చేసి రబ్ చేయాలి. ఇందులో ఉండే ఎంజైమ్స్ స్కిన్ హైడ్రేట్ చేస్తుంది. చర్మంలో స్పాట్స్ తొలగిస్తుంది. ముడుతలను మాయం చేస్తుంది.

8. షుగర్ కేన్ జ్యూస్ , పసుపు ప్యాక్ :

8. షుగర్ కేన్ జ్యూస్ , పసుపు ప్యాక్ :

చెఱకు రసంలో కొద్దిగా పసుపు మిక్స్ చేసి, ముఖం, మెడకు అప్లై చేయాలి. 10 నిముషాల తర్వాత గోరువెచ్చని నీటితో ముఖం శుభ్రం చేసుకోవాలి. తర్వాత ఐస్ వాటర్ తో ముఖం శుభ్రం చేసుకోవాలి. ఇది చర్మంలో ముడుతలను మాయం చేస్తుంది.

English summary

10 Natural Anti Ageing Skin Care Solutions

Ageing of skin causes dullness, wrinkles, fine lines, age spots and sagged skin. To look young is a dream of every women. Most women go for costly and risky procedures to prevent ageing effects on skin.
Story first published:Saturday, October 15, 2016, 13:21 [IST]
Desktop Bottom Promotion