For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఫెయిర్ అండ్ గ్లో స్కిన్ పొందడానికి 10 నేచురల్ ఫేస్ ప్యాక్స్

|

అందంగా ఉండాలనే ఆతురతతో మహిళలు మార్కెట్లో వచ్చే ప్రతి బ్యూటీ ప్రొడక్ట్ కొంటుంటారు. అయితే ఫలితం మాత్రం అంతంత మాత్రంగానే ఉంటుంది. మన ఇండియన్ మహిళలు చాలా వరకూ ఛామన ఛాయను కలిగి ఉంటారు. ఛామన ఛాయను మరింత మెరుగుపరుచుకోవడానికి అనేక బ్యూటీ ట్రీట్మెంట్ తీసుకుంటుంటారు . నల్ల ఉన్న ముఖం మరియు మెడ మీద డార్క్ నెస్ తగ్గించేందుకు కొన్ని ఎఫెక్టివ్ ఫేస్ ప్యాక్ లను ఉపయోగించడం వల్ల ఫెయిర్ నెస్ ను పొందవచ్చు.

శాశ్వత చర్మ సౌందర్యంను మెరుగుపరుచుకోవడాని, అందంగా కనబడటానికి ఈ నేచురల్ ఫేస్ ప్యాక్ ను చేసుకోవచ్చు. ఈ ఫేస్ ప్యాక్ ల యొక్క గొప్పదనం ఏంటంటే ఎటువంటి చర్మ తత్వానికైనా ఉపయోగించవచ్చు. ఈ హేర్బల్ ఫేస్ ప్యాక్ లను ఉపయోగించడం వల్ల ముఖంలో ఫెయిర్ నెస్ వస్తుంది. అంతే కాదు మార్కెట్లో ఖరీదైన సౌందర్య ఉత్పత్తులను కొనే అవసరం ఉండదు.

ఫెయిర్ నెస్ పొందడానికి మరియు యవ్వనంగా కనబడాలంటే నేచురల్ పద్దతులను మాత్రమే ఉపయోగించాలిని నిపుణుల అభిప్రాయం.ఈ ఫేస్ ప్యాక్ లను ఉపయోగించి మీ ఫెయిర్ నెస్ ను పెంచుకొని మరింత అందంగా కనబడటానికి ప్రయత్నించండి.

 పసుపు ఫేస్ ప్యాక్:

పసుపు ఫేస్ ప్యాక్:

ఒక అద్భుతమైన మార్పును మీరు కోరుకుంటున్నట్లైతే, ఈ పదార్థంను మీరు ట్రై చేయవచ్చు. పసుపు చర్మఛాయను మెరుగుపరుస్తుంది. పసుపు, పాలు, తేనె మిక్స్ చేసి ఫేస్ ప్యాక్ లా వేసుకోవాలి. చాలా అద్భుతమైన ఫెయిర్ నెస్ స్కిన్ పొందవచ్చు. ఇంకా పసుపు మొటిమలను తొలగించి ముఖంలో నలుపుదనం పోగొడుతుంది.

సాండిల్ వుడ్ ఫేస్ ప్యాక్:

సాండిల్ వుడ్ ఫేస్ ప్యాక్:

చర్మం తెల్లగా పొందడానికి మరియు దోషరహిత చర్మం పొందడానికి సాండిల్ వుడ్(గంధం)పేస్ట్ ను ఉపయోగిస్తారు. గంధం పొడిని బాదంతో చేర్చి పొడి చేసుకోవాలి . ఈ రెండింటి మిశ్రమంను పాలతో మిక్స్ చేసి ముఖానికి ప్యాక్ వేసుకోవడం వల్ల చర్మం నునుపుగా, సున్నితంగా, ప్రకాశవంతంగా మార్చుతుంది.

 శెనగపిండి ఫేస్ ప్యాక్:

శెనగపిండి ఫేస్ ప్యాక్:

మరో గొప్ప హెర్బల్ రెమడీ శెనగపిండి. ఇది చర్మ ఛాయలో అద్భుతమైన మార్పును తీసుకొస్తుంది. శెనగిపండిని, పెరుగుతో మిక్స్ చేసి ముఖానికి ప్యాక్ లా వేసుకోవాలి. ఆరిన తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవడం వల్ల చర్మం యవ్వనంగా, నునుపుగా మారుతుంది.

ముల్తాని మట్టి:

ముల్తాని మట్టి:

ఈ పౌడర్ ను ఫుల్లర్స్ ఎర్త్ అని అంటారు. రోజ్ వాటర్ లో ముల్తాని మట్టిని మిక్స్ చేసి, ఈ పేస్ట్ ను ప్యాక్ లా వేసుకోవాలి. ఇది పొడిబారే వరకూ ఉండి తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.

 గోధుమపిండి ఫేస్ ప్యాక్ :

గోధుమపిండి ఫేస్ ప్యాక్ :

ఒక చెంచా గోధుమపిండి, రెండు చెంచాలా రోజ్ వాటర్ వేసి పేస్ట్ లా చేసి ముఖానికి పట్టించి 20నిముషాల తర్వాత శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల స్కిన్ కంప్లెక్షన్ (చర్మం యొక్క రంగు మెరుగు అవుతుంది. గోరువెచ్చని పాలతో శుభ్రం చేస్తే మరింత ఉత్తమ ఫలితం పొందవచ్చు.

పెరుగు ఫేస్ ప్యాక్:

పెరుగు ఫేస్ ప్యాక్:

పెరుగుతో ఫేస్ ప్యాక్ వేసుకోవడం వల్ల ఇది ఒక బ్లీచింగ్ ఏజెంట్ గా పనిచేస్తుంది. ఇది స్కిన్ కంప్లెక్షన్ ను మెరుగుపరుస్తుంది. మూడు చెంచాల పెరుగులో ఒక చెంచా ఓట్స్ చేర్చి బాగా మిక్స్ చేసి ముఖానికి ప్యాల్ లా వేసుకోవాలి. డ్రై అయిన తర్వాత ప్యాక్ ను ముఖం నుండి తొలగించడం వల్ల ఇది డెడ్ స్కిన్ సెల్స్ ను తొలగిస్తుంది..

నిమ్మరసం:

నిమ్మరసం:

స్కిన్ బ్లీచింగ్ లో అద్భుతంగా పనిచేసే వాటిలో నిమ్మరసం ఒకటి. సిట్రస్ పండ్లు, కాయలు, చర్మ ఛాయను మెరుగుపరిచే గుణాలు పుష్కలంగా ఉంటాయి. కాబట్టి తాజా నిమ్మకాయను కట్ చేసి ముఖం మరియు మెడ మీద మసాజ్ చేసి 10నిముషాలు అలాగే వదిలేసి తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి . ఈ ఫేషియల్ నెలలో మూడు సార్లు చేయడం వల్ల చర్మ మెరిసేలా చేస్తుంది. నిమ్మరసాన్ని పొడి చర్మం కలవారు ఉపయోగించకూడదు.

 టమోటో ఫేస్ ప్యాక్:

టమోటో ఫేస్ ప్యాక్:

ఈ ఎర్రటి టమోటోలో చర్మ రంగును మార్చే విటమిన్స్ పుష్కలంగా ఉన్నాయి. టమోటో మెత్తగా పేస్ట్ చేసి దానికి కొద్దిగా పాలు, పసుపు చేర్చి ముఖ్యానికి ప్యాక్ లా వేసుకోవాలి. మంచి చర్మ ఛాయను పొందడానికి ఇది ఒక అద్భుతమైన మార్గం. ఈ ప్యాక్ ను వారంలో రెండు మూడు సార్లు వేసుకోవచ్చు.

 ఓట్ మీల్ ఫేస్ ప్యాక్:

ఓట్ మీల్ ఫేస్ ప్యాక్:

నేచురల్ గా ఫెయిర్ నెస్ స్కిన్ పొందడానికి ఒక మంచి మార్గం ఓట్ మీల్. ఓట్ మీల్ ను ఫేస్ ప్యాక్ గా ఉపయోగించడం వల్ల ముఖంలో ఖచ్చితంగా మార్పు వస్తుంది. ఓట్ మీల్ పౌడర్ లో కొద్దిగా పాలు మిక్స్ చేసి, ఈ పేస్ట్ ను ముఖానికి ప్యాక్ లా వేయాలి. ఇలా క్రమంగా చేస్తుంటా చర్మం రంగులో తప్పకుండా మార్పు వస్తుంది.

అలోవెరా:

అలోవెరా:

కలబంద, చర్మానికి చాలా మేలు చేస్తుంది. ఇది చర్మ మీద నలుపును తగ్గిస్తుంది . ముఖం మీద ఏర్పడ్డ మచ్చలను తొలగిస్తుంది . తాజాగా ఉండే కలబంద కట్ చేసి దానిలోని జెల్ ను ప్రతి రోజూ రాత్రి నిద్రించే ముందు ముఖం, మెడకు అప్లై చేయాలి.

English summary

10 Natural Face packs increase Fairness

Face Packs To Make Skin Fair. Skin Care tips in Telugu. These face packs that make your skin fair have bleaching properties which enhance the skin tone.
Story first published: Saturday, April 23, 2016, 13:05 [IST]
Desktop Bottom Promotion