For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

స్కిన్ ట్యానింగ్ తొలగించుకోవడానికి 10 నేచురల్ రెమెడీస్

By Super Admin
|

స్కిన్ టానింగ్ అంటే చర్మం నల్లగా కమలడం లేదా నల్లగా ప్యాచ్ లుగా ఏర్పడటం. ఎండలో తిరగడం వల్ల పిగ్మెంటేషన్, స్కిన్ టానింగ్ కు గురి అవుతారు. స్కిన్ టానింగ్ సమస్య స్త్రీలు మాత్రమే కాదు, పురుషులు కూడా ఎదుర్కుంటారు. ఎంత సన్ స్ర్కీన్ ఉపయోగించినా అప్పుడప్పుడూ టాన్ కు గురి అవుతూనే ఉంటారు . కాబట్టి, రెగ్యులర్ గా నేచురల్ రెమెడీస్ ను ఉపయోగించడం వల్ల టానింగ్ సమస్యను నివారించుకోవచ్చు.

సన్ స్క్రీన్ చర్మానికి రక్షణ కల్పించడం మాత్రమే కాదు, ఇది సూర్యుని నుండి వెలువడే హానికరమైన యూవీ కిరణాల నుండి రక్షణ కల్పిస్తుంది.

యూవీకిరణాలు మన కళ్ళకు కనిపించవు. కానీ, మన చర్మాన్ని మాత్రం డార్క్ గా మార్చడంలో ఎక్కువ డ్యామేజ్ చేస్తాయి. ఇంకా దీనికి మించి ఎండకు ఎక్స్ పోజ్ అయ్యామంటే అది స్కిన్ క్యాన్సర్ కు దారితీస్తుంది. కాబట్టి, బయటకు వెళ్లడానికి ముందు సన్ స్ర్కీన్ లోషన్ తప్పనిసరిగా అప్లై చేయాలి.

చర్మానికి సన్ స్ర్కీన్ అప్లై చేయడం వల్ల చర్మం నలుపును పోగొడుతుంది, అయితే ఇప్పటికే చర్మం టానింగ్ కు గురైనట్లైతే , టానింగ్ ను నివారించుకోవడానికి ఇక్కడ సూచించిన హోం రెమెడీస్ ను ఉపయోగించడం మంచిది. ఇవి చర్మానికి సురక్షితమైనవి. వీటి వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఇంకా ఇంట్లోనే మనకు అందుబాటులో ఉంటాయి. అవేంటో తెలుసుకుందాం...

బట్టర్ మిల్క్:

బట్టర్ మిల్క్:

బట్టర్ మిల్క్ లో కొద్దిగా పసుపు మిక్స్ చేసి ముఖానికి అప్లై చేయడం వల్ల, ఇది చర్మంలో తక్షణ మార్పుతీసుకొస్తుంది. చర్మాన్ని రేడియంట్ గా సపెల్ గా మార్చుతుంది. ఇది ఒక బెస్ట్ నేచురల్ పదార్థం.

ఆరెంజ్ జ్యూస్ :

ఆరెంజ్ జ్యూస్ :

ఆరెంజ్ లో ఉండే విటమిన్ సి మరియు సిట్రిక్ యాసిడ్స్ ట్యాన్ తొలగించడంలో గ్రేట్ గా సహాయపడుతాయి . ఆరెంజ్ జ్యూస్ ను ముఖానికి మొత్తానికి అప్లై చేసి, డ్రై అయిన తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి.

శెనగపిండి:

శెనగపిండి:

చర్మం అందాన్ని మెరుగుపరుచుకోవడంలో బాగంగా కొన్ని శతాబ్దాల కాలం నుండి శెనగపిడిని సౌందర్య సాధనాలో ఉపయోగిస్తున్నారు. శెనగపిండిలో కొద్దిగా నీరు మిక్స్ చేసి ముఖానికి అప్లై చేసి స్ర్కబ్ చేయాలి. ఇది తక్షణం ట్యాన్ తొలగిస్తుంది.

పసుపు:

పసుపు:

పసుపులో అద్భుతమైన యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలున్నాయి. ఇది ట్యానింగ్ ను ఇన్ స్టాంట్ గా తొలగిస్తుంది. కేవలం పసుపులో కొద్దిగా పాలు మిక్స్ చేసి ప్యాక్ వేసుకోవాలి. డ్రై అయిన తర్వాత ముఖం శుభ్రం చేసుకోవాలి.

నిమ్మరసం:

నిమ్మరసం:

నిమ్మరసంలో విటమిన్ సి అధికంగా ఉంటుంది. ఇది స్ట్రాంగ్ నేచురల్ బ్లీచింగ్ ఏజెంట్ . ఇది స్కిన్ టోన్ ను కేవలం 15నిముషాల్లో నివారిస్తుంది. నిమ్మరసంను ముఖానికి అప్లై చేసి 15నిముషాల తర్వాత శుభ్రం చేసుకోవాలి.

టమోటోలు:

టమోటోలు:

టమోటోల్లో సిట్రిక్ యాసిడ్ ఎక్కువగా ఉంటుంది, లెమన్ కంటే ఎకకువగా ఉండటం వల్ల ఇది గ్రేట్ బ్లీచింగ్ ఏజెంట్ గా పనిచేస్తుంది. అందువల్ల సెన్సిటివ్ స్కిన్ ఉన్న వారు టమోటోను ఎంపిక చేసుకోవడం మంచిది. టమోటోను స్లైస్ గా కట్ చేసి ముఖానికి మర్ధన చేయాలి. జ్యూస్ డ్రై అయిన తర్వాత ముఖం చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి.

బంగాళదుంప:

బంగాళదుంప:

బంగాళదుంప కూడా గ్రేట్ బ్లీచింగ్ ఏజెంట్ . ఇది తక్షణ ఫలితాలను అందిస్తుంది. అయితే దీన్ని రెగ్యులర్ గా ఉపయోగించడం వల్ల చర్మాన్ని లైట్ గా మార్చుతుంది . పొటాటో స్లైస్ గా కట్ చేసి, ముఖానికి మర్దన చేసి, తడి ఆరిన తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకవాలి.

పెరుగు:

పెరుగు:

పెరుగు కూడా గొప్ప బ్లీచింగ్ ఏజెంట్, ట్యాన్ తొలగిస్తుంది.స్కిన్ కూల్ చేస్తుంది. చర్మం రంద్రాలను టైట్ చేసి, స్కిన్ టోన్ ను మెరుగుపరుస్తుంది. . పెరుగును ముఖానికి అప్లై చేసి 15 నిముషాల తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి.

బొప్పాయి:

బొప్పాయి:

బొప్పాయిలో విటిమన్ ఎ మరియు సిలు పుష్కలంగా ఉన్నాయి. ఇవి ట్యానింగ్ నివారించడంలో గొప్పగా సహాయపడుతాయి. బొప్పాయిని మెత్తగా గుజ్జులా చేసి, ముఖానికి మొత్తానికి అప్లై చేయాలి. ఇలా చేయడం వల్ల ట్యాన్ పూర్తిగా తొలగిపోతుంది.

కీరదోసకాయ :

కీరదోసకాయ :

స్కిన్ ట్యానింగ్ నివారించడంలో గ్రేట్ హోం రెమెడీ. ఎందుకంటే ఇందులోల కూలింగ్ ఎఫెక్ట్స్ కలించే గుణాలు ఎక్కువ, అలాగే బ్లీచింగ్ ఏజెంట్ గా పనిచేస్తుంది. అందుకే దీన్ని ముఖానికి అప్లై చేయాలి . ఇది చర్మాన్ని ఎక్స్ ఫ్లోయేట్ చేస్తుంది. కీరదోస పేస్ట్ లేదా రసాన్ని ముఖానికి అప్లై చేసి 15 నిముషాల తర్వాత ముఖం శుభ్రం చేసుకోవాలి.

English summary

10 Natural Ingredients To Get Rid Of Tan

Tanning is something that none of us can really escape from, whether men or women. People of all ages are victims of skin tan. Using sunscreen is a must to avoid tanning. Since tanning is so inevitable, it is a blessing to be able to use natural ingredients to get rid of tan at home.
Desktop Bottom Promotion