For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పవర్ ఫుల్ వేప ఫేస్ ప్యాక్ లతో న్యాచురల్ గ్లోయింగ్ స్కిన్..!!

By Swathi
|

మొటిమలు, మొటిమల మచ్చలు, ముక్కు దగ్గర ఆయిలీ స్కిన్, ఏజ్ స్పాట్స్ వంటి రకరకాల చర్మ సమస్యలకు అద్భుతమైన పరిష్కారం అందించే ఔషధ గుణాలున్న పదార్థం వేప. న్యాచురల్ ప్రాపర్టీస్ కలిగిన ఈ వేప ఫేస్ ప్యాక్స్.. చర్మానికి అమేజింగ్ లుక్ ని అందిస్తుంది.

వేపలో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ గునాలుంటాయి. ఇవి.. చర్మంలోని లోపలి లేయర్స్ ని కూడా క్లెన్స్ చేస్తాయి. చర్మ రంధ్రాలలోపలికి వెళ్లి.. మొటిమలు పూర్తీగా నయం కావడానికి సహాయపడతాయి. అలాగే వేపలో యాంటీ సెప్టిక్ గుణాలు కూడా ఉంటాయి. ఆయిల్ ప్రొడక్షన్ ని కంట్రోల్ చేసి.. యాక్నెని నివారిస్తుంది.

వేప మాత్రమే చాలా పవర్ ఫుల్ గా పనిచేస్తుంది. ఇక దాన్ని మరో హెర్బ్ తో కలిపి అప్లై చేయడం వల్ల చర్మానికి అద్భుతమైన ఫలితాన్ని అందిస్తుంది. ఇప్పుడు వేప వల్ల చర్మానికి కలిగే ప్రయోజనాలు అర్థం అయి ఉంటాయి. కాబట్టి.. వేప ఫేస్ ప్యాక్స్ ని ఎలా అప్లై చేయాలి, ఎలాంటి ఫలితాలు పొందవచ్చో తెలుసుకోండి.. ట్రై చేయండి..

వేప, రోజ్ వాటర్

వేప, రోజ్ వాటర్

చేతినిండా ఎండిన వేప ఆకులు తీసుకుని.. పౌడర్ చేయాలి. ఇందులో పేస్ట్ చేయడానికి కావాల్సినంత రోజ్ వాటర్ మిక్స్ చేయాలి. ముఖానికి, మెడకి పట్టించి 15 నిమిషాల తర్వాత శుభ్రం చేసుకోవాలి. ఈ ప్యాక్ చర్మంపై ఉండే మచ్చలు తొలగిస్తుంది.

వేప, తేనె

వేప, తేనె

చేతినిండా వేపాకులు తీసుకుని పేస్ట్ చేసుకోవాలి. అందులో టేబుల్ స్పూన్ తేనె కలపాలి. బాగా మిక్స్ చేసి.. ముఖానికి మెడకు పట్టించి.. 30 నిమిషాల తర్వాత శుభ్రం చేసుకోవాలి. ఇలా చేస్తే.. అలసిపోయి చర్మం నిగారింపు పొందుతుంది. ఆయిల్ ప్రొడక్షన్ ని కంట్రోల్ చేస్తుంది.

వేప, పెరుగు, పసుపు

వేప, పెరుగు, పసుపు

ఈ ఫేస్ ప్యాక్ ఆయిల్ కంట్రోలింగ్ ఏజెంట్ లా పనిచేస్తుంది. చర్మాన్ని క్లియర్ గా, మచ్చలు లేకుండా చేస్తుంది. 1 టీస్పూన్ వేప పౌడర్, 1 టేబుల్ స్పూన్ పెరుగు, చిటికెడు పసుపు కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి.. ఆరిన తర్వాత శుభ్రం చేసుకోవాలి.

వేప, శనగపిండి, పెరుగు

వేప, శనగపిండి, పెరుగు

ఒక టేబుల్ స్పూన్ శనగపిండి, ఒక టీ స్పూన్ వేప పొడి, కావాల్సినంత పెరుగు తీసుకుని అన్నింటినీ కలిపి పేస్ట్ చేసుకోవాలి. ముందుగా ముఖాన్ని క్లెన్స్ చేసి.. అప్లై చేయాలి. 15 నిమిషాలు ఆరిన తర్వాత.. శుభ్రం చేసుకోవాలి. ఇలా వారానికి రెండుసార్లు చేస్తే..మొటిమలు, మచ్చలు తగ్గిపోయి.. మెరిసే చర్మం పొందవచ్చు.

వేప, పపాయ

వేప, పపాయ

ఎంజైమ్స్, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు కలిగిన ఈ ఫేస్ ప్యాక్ చర్మం దుమ్ము తొలగిస్తుంది. చర్మానికి గ్లో అందిస్తుంది. బాగా పండిన పపాయ గుజ్జు తీసుకుని, ఒక టీ స్పూన్ వేప పౌడర్ కలపాలి. బాగా కలిపిన తర్వాత.. ముఖానికి, మెడకు పట్టించి.. 30 నిమిషాల తర్వాత శుభ్రం చేసుకోవాలి.

వేప, చందనం, పాలు

వేప, చందనం, పాలు

ఒక టీస్పూన్ చందనం, అరటీస్పూన్ వేప పొడి, కొద్దిగా పాలు కలిపి పేస్ట్ చేసుకోవాలి. ముఖానికి, మెడకు పట్టించాలి. 30 నిమిషాల తర్వాత.. నీళ్లు ఉపయోగించి.. స్ర్కబ్ చేస్తూ శుభ్రం చేసుకోవాలి. ఈ ప్యాక్ వల్ల చర్మం క్లెన్స్ అయి.. క్లియర్ గా కనిపిస్తుంది.

వేప, తులసి, తేనె

వేప, తులసి, తేనె

గుప్పెడు తులసి ఆకులు, వేప ఆకులు తీసుకుని.. ఎండలో ఆరబెట్టాలి. బాగా డ్రై అయిన తర్వాత పౌడర్ చేసుకోవాలి. ఒక టేబుల్ స్పూన్ తేనె కలిపి.. పేస్ట్ చేసుకుని ముఖానికి, మెడకు అప్లై చేయాలి. ఆరిన తర్వాత.. గుండ్రగా స్క్రబ్ చేసి.. శుభ్రం చేసుకోవాలి. ఈ ప్యాక్ మొటిమలకు కారణమయ్యే బ్యాక్టీరియాను నాశనం చేసి.. చర్మాన్ని హెల్తీగా ఉంచుతుంది.

వేప, వెనిగర్, తేనె

వేప, వెనిగర్, తేనె

1 టీస్పూన్ వేప పౌడర్, 1 టేబుల్ స్పూన్ యాపిల్ సైడర్ వెనిగర్, 1 టీస్పూన్ తేనె కలిపి పేస్ట్ చేసుకోవాలి. ముఖానికి అప్లై చేసి.. 30 నిమిషాల తర్వాత స్క్రబ్ చేస్తూ శుభ్రం చేసుకోవాలి. ఇది ముఖంపై మచ్చలు తొలగించి.. వారంలోనే కాంప్లెక్షన్ ని పెంచుతుంది.

వేప, బంగాళాదుంప, నిమ్మరసం

వేప, బంగాళాదుంప, నిమ్మరసం

వేపలో యాంటీ ఆక్సిడెంట్స్, యాంటీ ఫంగల్ గుణాలు.. మొటిమలు నివారించి, చర్మాన్ని తెల్లగా మారుస్తుంది. రాత్రంతా గోరువెచ్చని నీటిలో బంగాళాదుంపను నానబెట్టాలి. ఉదయం నీటిని వంపేయాలి. ఒక టీస్పూన్ నిమ్మరసం, 1 టీస్పూన్ వేప పౌడర్ కలపాలి. అన్నింటినీ బాగా బ్లెండ్ చేసి.. కాటన్ బాల్ తో ముఖంపై రాసుకోవాలి. 15 నిమిషాల తర్వాత శుభ్రం చేసుకోవాలి.

వేప, టమోటా

వేప, టమోటా

ఈ మాస్క్ లో బీటా కెరోటిన్, లైకోపిన్ ఉంటుంది. ఇది చర్మాన్ని ఫ్రీరాడికల్స్ నుంచి ప్రొటెక్ట్ చేస్తుంది. ట్యాన్ ని తొలగిస్తుంది. టమోటాని మెత్తటి పేస్ట్ లా చేసుకోవాలి. కొద్దిగా వేప పొడి చల్లుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి.. 15 నిమిషాల తర్వాత శుభ్రం చేసుకోవాలి.

వేప, రైస్ వాటర్

వేప, రైస్ వాటర్

వేపలో బ్లీచింగ్ గుణాలుంటాయి. అది చర్మాన్ని ఫెయిర్, క్లియర్, టైట్ గా మారుస్తుంది. 5 వేపాకులను, గుప్పెడు రోజ్ పెటల్స్, 5 చుక్కల ఆల్మండ్ ఆయిల్, కొన్ని చుక్కల రోజ్ వాటర్ ని మిక్స్ చేసి.. గ్రైండ్ చేయాలి. ఈ మాస్క్ ని అప్లై చేసి.. 20 నిమిషాల తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి.

వేప, అలోవెరా

వేప, అలోవెరా

చర్మంలోపల చేరుకున్న డర్ట్ ని తొలగించడంలో ఈ ప్యాక్ సహాయపడుతుంది. తక్షణమే.. చర్మాన్ని బ్రైట్ గా, క్లియర్ గా మారుస్తుంది. 1 టీస్పూన్ వేప పొడి, 2 టేబుల్ స్పూన్ అలోవెరా, కొన్ని చుక్కల రోజ్ వాటర్ కలపాలి. కాటన్ బాల్ ముంచి.. చర్మాన్ని తుడుచుకోవాలి. తర్వాత చర్మాన్ని మసాజ్ చేసి.. 15 నిమిషాల తర్వాత శుభ్రం చేసుకోవాలి.

English summary

12 Homemade Neem Face Packs For Clear and Natural Skin

12 Homemade Neem Face Masks For Clear Skin. From the pus-filled pimples, acne scars, oily T-zone to age-spots, just about all your skin problems can be taken care of with homemade neem face masks.
Story first published: Saturday, September 24, 2016, 16:34 [IST]
Desktop Bottom Promotion