For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

డార్క్ సర్కిల్స్ మాయం చేసే సీక్రె ట్ నేచురల్ రెమెడీస్

|

డార్క్ సర్కిల్స్ ముఖ అందాన్ని పాడు చేస్తుంది? బ్యూటీ ఎక్స్ పర్ట్స్ ప్రకారం 90శాతం మంది మహిళలు డార్క్ సర్కిల్స్ సమస్యతో బాధపడుతున్నారు. మరియు ఈ చర్మ సమస్యకు కారణం నిద్రలేమి, కాస్మోటిక్ , కొన్ని సందర్భాల్లో డీహైడ్రేషన్ కారణంగా కూడా డార్క్ సర్కిల్స్ కు కారణం అవుతుంది.

ఎప్పుడైతే శరీరంలో నీరు తగ్గిపోతాయో, అప్పుడు చర్మం చూడటానికి పేల్ గా మరియు డల్ గా కనబడుతుంది. . ముఖ్యంగా డీహైడ్రేషన్ కు మొదటి లక్షణం ముఖంలో కళ్ళ క్రింద నల్లని వలయాలు . . ఈ డార్క్ సర్కిల్స్ ను ఫ్రూట్స్ మరియు వెజిటేబుల్స్ తో లైట్ గా మార్చుకోవచ్చు.

ఈ క్రింది లిస్ట్ లో తెలిపిన కొన్ని సింపుల్ రెమెడీస్ ను మీ రెగ్యులర్ బ్యూటీ కిట్ లో చేర్చుకోవడంతో పాటు , ప్రతి రోజూ వాటిని కళ్ళ క్రింద అప్లై చేయడం వల్ల చాలా తక్కువ సమయంలోనే డార్క్ సర్కిల్స్ ను తేలికపరుస్తుంది. లైట్ గా మార్చుతుంది.

అలాగే బ్యూటీ ఎక్సపర్ట్స్ ప్రకారం ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ సెన్సిటివ్ స్కిన్ కు ఉపయోగించడానికి చాలా పవర్ ఫుల్ గా మరియు ఎఫెక్టివ్ గా ఉపయోగపడుతాయని తెలుపుతున్నారు . మీకు కనుక సాఫ్ట్ మరియు టెండర్ స్కిన్ ఉన్నట్లైతే ఈ రెమెడీస్ ఉపయోగించడం వల్ల వివిధ రకాల చర్మ సమస్యలను నివారించుకోవచ్చు.

మరి ఇంకెందుకు ఆలస్యం అన్ని రకాల చర్మ తత్వాలకు ఉపయోగపడే...డార్క్ సర్కిల్స్ ను నివారించుకోవడానికి సులభమైన సమ్మర్ టిప్స్ ను ఈ క్రింది స్లైడ్ ద్వారా తెలుసుకుందాం...

కీరదోసకాయ:

కీరదోసకాయ:

వేసవి సీజన్ లో కీరదోసకాయను ఉపయోగించడం వల్ల చర్మం కూల్ గా ఉంటుంది . దీన్ని తిన్నా లేదా చర్మానికి అప్లై చేసినా చర్మంను చల్లగా ఉంచుతుంది. ఇది శరీరాన్ని చల్లగా మార్చుతుంది. కీరదోసను స్లైగ్ గా కట్ చేసి 10 నిముషాలు ఫ్రిజ్ లో పెట్టాలి . తర్వాత బయటకు తీసికళ్ళ మీద కొద్దిసేపు పెట్టుకోవాలి. ఇలా ప్రతి రోజూ వారం పాటు చేస్తుంటే మంచి ఫలితం ఉంటుంది.

 బంగాళదుంప స్లైస్:

బంగాళదుంప స్లైస్:

డార్క్ సర్కిల్స్ ను నివారించడంలో బంగాళదుంప కూడా ఒక బెస్ట్ వెజిటేబుల్ . ఇది డార్క్ సర్కిల్స్ ను లైట్ చేస్తుంది . బంగాళదుంపలను లైట్ గా స్లైస్ గా కట్ చేసుకోవాలి . తర్వాత వీటిని కళ్ళ మీద కొద్దిసేపు పెట్టుకోవాలి. పొటాటాలోని రసం చర్మానికి బ్లీచింగ్ ఏజెంట్ లా పనిచేస్తుంది . దాంతో వలయాలు తేలికపరుస్తుంది.

రోజ్ పెటల్స్:

రోజ్ పెటల్స్:

చర్మానికి రోజ్ పెటల్స్ వండర్ ఫుల్ గా పనిచేస్తుంది. అన్ని రకాల చర్మ సమస్యలను నివారిస్తుంది. రోజ్ పెటల్స్ ను మెత్తగా పేస్ట్ చేసి ఆ రసాన్ని కళ్ళ క్రింద అప్లై చేసి మసాజ్ చేయాలి. 10 నిముషాలు డ్రై అయిన తర్వాత చల్లటి నీటితో ముఖం శుభ్రంగా కడుక్కోవాలి,. ఈ బ్యూటీ టిప్ వల్ల చర్మం కూడా మెరుస్తుంటుంది.

స్ట్రాబెర్రీ స్లైస్ :

స్ట్రాబెర్రీ స్లైస్ :

విటమిన్ సి అధికంగా ఉండే స్ట్రాబెర్రీస్ మీ చర్మానికి అప్లై చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ఇది డార్క్ సర్కిల్స్ ను మాయం చేయడం మాత్రమే కాదు . ఇది స్కిన్ కాంప్లెక్షన్ ను మెరుగుపరుస్తుంది.

 అలోవెర:

అలోవెర:

చర్మానికి కలబంద చాలా త్వరగా ఎపెక్టివ్ గా మార్పు తీసుకొస్తుంది. అందుకు మీరు చేయాల్సిందల్లా ఈ కలబంద రసాన్ని నల్లగా మారిన చర్మం, వలయాల మీద అప్లై చేయాలి. డ్రైగా మారిన తర్వాత చల్లటి నీటితో కడిగేసుకోవాలి. ఇలా రెండు రోజులకొకసారి చేస్తుంటే మంచి ఫలితం ఉంటుంది.

నిమ్మరసం :

నిమ్మరసం :

చర్మ సంరక్షణలో నిమ్మరసం ఒక క్లీనింగ్ ఏజెంట్. మీ చర్మం మంచి కలర్ రావాలంటే , నిమ్మరసాన్ని ప్రభావిత ప్రాంతంలో అప్లై చేసి 20 నిముషాల తర్వాత శుభ్రం చేసుకోవాలి. చల్లటి రోజ్ వాటర్ తో శుభ్రం చేసుకోవాలి.

తేనె:

తేనె:

ఒక టేబుల్ స్పూన్ తేనెకు కొద్దిగా ఓట్స్ పౌడర్ మిక్స్ చేసి ఈ పేస్ట్ ను ముఖానికి పట్టించాలి తర్వాత డార్క్ సర్కిల్లో బాగా మర్ధన చేయాలి. 15నిముషాల తర్వాత డ్రై అయిన తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకుంటే వలయాలు మాయం అవుతాయి.

బాదం ఆయిల్:

బాదం ఆయిల్:

బాదం ఆయిల్ అద్భుతంగా పనిచేస్తుంది. కొద్దిగా చేతి వేళ్లకు బాదం ఆయిల్ తీసుకొని కళ్ల క్రింది బాగంలో అప్లై చేయాలి. అప్లై చేసి సున్నితంగా మసాజ్ చేయాలి. ప్రతి రోజూ రాత్రి నిద్రించడానికి ముందు ఇలా చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. డార్క్ సర్కిల్స్ చాలా త్వరగా తగ్గుముఖం పడుతుంది.

టమోటో:

టమోటో:

టమోటా రసం కూడా చాలా మంచిది. ప్రతి రోజు టమోటా రసం రాసిన 20 నిమిషాల తర్వాత శుభ్రం చేయాలి. చల్లని నీరు లేదా చల్లని పాలను తీసుకోని కళ్ళను మూసుకొని రాసి 10 నిమిషాల తర్వాత శుభ్రం చేయాలి.

టీబ్యాగ్స్:

టీబ్యాగ్స్:

చల్లని టీ సంచులను మీ కళ్ళ కింద ప్రాంతంలో పెట్టడం వలన మీ కళ్ళ క్రింద ఉబ్బు తగ్గుతుంది.

నారింజ రసం

నారింజ రసం

నారింజ రసాన్ని వారంలో మూడు సార్లు రాసి 20 నిమిషాల తర్వాత శుభ్రం చేసుకోవాలి.

పైనాపిల్:

పైనాపిల్:

డార్క్ సర్కిల్స్ నివారించడంలో పైనాపిల్ చాలా గ్రేట్ గా సహాయపడుతుంది . పైనాపిల్ జ్యూస్ ను టర్మరిక్ పౌడర్ తో మిక్స్ చేసి , కళ్ల క్రింద అప్లై చేయాలి. దీన్ని ఒక గంట అలాగే ఉంచి తర్వాత కడిగేసుకోవాలి . ఈ చిట్కాను కొద్ది రోజులు అనుసరిస్తుంటే మంచి ఫలితం ఉంటుంది.

English summary

12 Ways To Treat Dark Circles In Summer

12 Ways To Treat Dark Circles In Summer ,Dark circles spoiling your beautiful face? According to beauty experts, more than 90 percent of women suffer from dark circles and the cause of this skin problem is due to the lack of sleep, the cosmetic you use and in some cases it is also due to dehydration.
Story first published: Wednesday, May 4, 2016, 11:12 [IST]
Desktop Bottom Promotion