For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

డార్క్ లేదా బ్లాక్ లిప్స్ ను నివారించే 15 బ్యూటీ టిప్స్

|

సాధారణంగా అందం అనాగానే తెల్లగా ఉండటం మాత్రమే కాదు, ముక్కు, మూతి, కళ్ళు, పెదాలు ఇవన్నీ కూడా వాటికవే ఒక ప్రత్యేక స్థాన్ని కల్పించుకుంటాయి. మనందరం ముఖంలో కళ్ళ అందంతో పాటు, పెదాలకు కూడా ప్రత్యేక శ్రద్ద చాలా అవసరం. మనందరం కూడా మన పెదాలు పింక్ గా మరియు ఎటువంటి స్పాట్స్ లేకుండా అందంగా ...సాఫ్ట్ గా ...పింక్ కలర్ లో ఉండాలని కోరుకుంటాం. పెదాలు, కళ్ళకు అందంగా కనబడాలనే కాదు, ఆరోగ్యంగా కూడా ఉంచుకోవాలి. డార్క్ లిప్స్ అందాన్ని హరించడమే కాదు, ఆకృతిని కూడా పాడుచేస్తాయి. డార్క్ లిప్స్(పెదాలు నల్లగా)మారడానికి చాలా కారణాలే ఉన్నాయి. అందులో ముఖ్యంగా ధూమపానం. సిగరెట్ తాగడం వల్ల పెదాల మీద ఉండే చాలా సున్నితమైన చర్మాన్ని బర్న్ చేయడం వల్ల పెదాలు డార్క్ గా మారుతాయి.

పెదాల పిగ్మెంటేషన్ లేదా బ్లాక్ లిప్స్ అసాధారణ సమస్య. పెదాలు డార్క్ గా లేదా నల్లగా మారడానికి కారణం సరైన కేర్ తీసుకోకపోవడడం మరియు అనారోగ్యకరమైన లైఫ్ స్టైల్ . ఈ కారణాల వల్ల పెదాల్లో నేచురల్ కలర్ తగ్గిపోతుంది. దాంతో పెదాలు డార్క్ గా లేదా బ్లాక్ గా మారుతాయి. పెదవులపై ఏర్పడిన మృతకణాల వల్ల పెదాలు నల్లగా మారిపోయి జీవంలేనట్లు ఉంటాయి. దీనికి చింతించాల్సిన అవసరం లేదు. పెదాల పై పేరుకు పోయిన మృతకణాలను మృదువుగా తొలగించడం ద్వారా తిరిగి రంగును సంతరించుకోవచ్చు. సున్నితమైన, మృదువైన, గులాభి రంగు పెదాల కోసం కొన్ని సాధారణ హోమ్‌ రెమిడీస్‌ ఉన్నాయి. ఆ చిట్కాలను ఎలా, ఎప్పుడు మరియు ఎంత మోతాదులో వాడాలో ఇప్పుడు చూద్ధాం....

స్మోక్ కు ఫుల్ స్టాప్ పెట్టాలి:

స్మోక్ కు ఫుల్ స్టాప్ పెట్టాలి:

స్మోక్ చేయడం వల్ల సిగరెట్స్ లో ఉండే నికోటిన్ పెదాలను డార్క్ గా మార్చుతుంది. దాంతో పెదాల రంగు మారుతుంది. అంతే కాదు దీర్ఘం కాలం స్మోకింగ్ వల్ల క్యాన్సర్ మరియు ఇతర ప్రమాదకర వ్యాధులకు దారితీస్తుంది.

కాఫీ తక్కువ తాగాలి:

కాఫీ తక్కువ తాగాలి:

కాఫీ మరియు టీ లు ఎక్కువగా తాగడం వల్ల దంతాల మీద ఎక్కువగా మరకలు పడుతాయి . కాబట్టి కాఫీలలో కూడా కెఫిన్ ఉంటుంది కాబట్టి, కాఫీ మరియు టీలను తాగడం తగ్గించాలి.

ఎండలో తిరగడం తగ్గించాలి:

ఎండలో తిరగడం తగ్గించాలి:

ఎండలో ఎక్కువ సమయం గడపడం వల్ల కూడా పెదాలు డార్క్ గా మారుతాయి . పెదాల మీద మెలనిన్ పిగ్మెంట్ పెరుగుతుంది. అందుకు ఎస్ఎఫ్ పి లేదా యూవీ ప్రోడక్ట్స్ క్రీములను పెదాల నలుపు తగ్గించుకోవడానికి ఉపయోగించుకోవచ్చు .

లిప్ స్టిక్:

లిప్ స్టిక్:

లిప్ స్టిక్ ఎక్కువగా ఉపయోగించడం, లేదా ఎక్కువ కాలం లిప్ స్టిక్స్ ఉపయోగించడం మరియు లిప్ కాస్మోటిక్స్ ఉపయోగించడం , లోయర్ క్వాలిటీ లిప్ స్టిక్స్ ఉపయోగిండం వల్ల కూడా పెదాలు నల్లగా మారుతాయి. కాబట్టి, అవసరమయినప్పుడు మాత్రమే లిప్ స్టిక్ వాడాలి. మరియు అవి కూడా బ్రాండెడ్ లిప్ స్టిక్స్ అయితే మంచి ఫలితం ఉంటుంది.

నేచురల్ లిప్ స్క్రబ్:

నేచురల్ లిప్ స్క్రబ్:

వారంలో ఒకసారి పెదాల మీద డెడ్ స్కిన్ సెల్స్ ను మరియు డ్రై స్కిన్ తొలగించుకోవాలి . బ్లడ్ సర్క్యులేషన్ మెరుగుపరుచుకోవాలి. అందుకోసం ఒక టీస్పూన్ పంచదారలో కొద్దిగా ఆలివ్ ఆియల్ మిక్స్ చేసి పెదాలకు అప్లై చేసి స్క్రబ్ చేయడం వల్ల పెదాలు మాయిశ్చరైజర్ గా మారుతాయి.

 ఎక్స్ఫోయేషన్:

ఎక్స్ఫోయేషన్:

బేబీ టూత్ బ్రెష్ మీద వాజిలిన్ వేసి పెదాల మీద స్మూత్ గా మర్దన చేయాలి . ఈ చిట్కాను రెగ్యులర్ గా ఫాలో అవ్వొచ్చు.

అన్ని వేళలా పెదాలు తేమగా ఉంచుకోవాలి:

అన్ని వేళలా పెదాలు తేమగా ఉంచుకోవాలి:

అన్ని వేళలా పెదాలను హైడ్రేషన్లో ఉంచుకోవాలి . దాంతో పెదాలకు ఎప్పుడూ నేచురల్ కలర్ ను కలిగి ఉంటాయి. అందుకు ఎక్కువగా నీళ్ళు తాగాలి . అలాగే వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉండే కీర, వాటర్ మెలోన్, ఆరెంజ్, గ్రేప్ ఫ్రూట్ మరియు లెమన్ వంటివి రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవాలి.

 పెదాలను సక్ చేయకూడదు:

పెదాలను సక్ చేయకూడదు:

పెదాలను కొరకడం లేదా తరచూ పెదాలను నాలుకతో తడపటం వంటి పనులు చేయకూడదని డెర్మటాలజిస్ట్ లు సూచిస్తున్నారు . ఇలాచేయడం వల్ల పెదాలు పొడిబారేలా చేస్తాయి డార్క్ నెస్ మరింత పెరుగుతుంది . కాబట్టి, ఈ అలవాటును మానుకోవాలి.

హెల్తీ డైట్ తీసుకోవాలి:

హెల్తీ డైట్ తీసుకోవాలి:

విటమిన్ లోపం వల్ల కూడా పెదాలు రంగు కోల్పోతాయి. అందువల్ల హెల్తీ డైట్ మరియు ఫ్రూట్స్, మరియు గ్రీన్ వెజిటేబుల్స్ ను ఎక్కువగా తీసుకోవాలి. విటమిన్ సి ఫుడ్స్ స్కిన్ పిగ్మెంటేషన్ నివారించడానికి గ్రేట్ గా సహాయపడుతాయి.

క్లోరిన్ వాటర్ ను నివారించాలి:

క్లోరిన్ వాటర్ ను నివారించాలి:

లిప్ పిగ్మేంటేషన్ కు క్లోరిన్ వాటర్ కూడా కారణమవుతుంది.

జెనెటిక్స్:

జెనెటిక్స్:

జన్యుపరమైన కారణంగా కూడా లిప్ పిగ్మెంటేషన్ కు కారణం అవుతుంది . కాబట్టి, పుట్టకతోనే పెదాలు నల్లగా ఉంటే వాటిని, మనం ఏం చేయలేము. కాస్మోటిక్ సర్జరీఒకటే మార్గం .

బాదం ఆయిల్

బాదం ఆయిల్

బాదం ఆయిల్ రాత్రి నిద్రించడానికి ముందు పెదాలకు బాదం ఆయిల్ ను అప్లై చేయడం వల్ల లిప్ డిస్ కలర్ ను తగ్గించుకోవచ్చు.

నిమ్మరసం-బాదం ఆయిల్

నిమ్మరసం-బాదం ఆయిల్

నిమ్మరసంలో కొద్దిగా బాదం ఆయిల్ మిక్స్ చేసి ఈ మిశ్రమాన్ని పెదాలకు పట్టించాలి.

కుకుంబర్ జ్యూస్

కుకుంబర్ జ్యూస్

ను రెగ్యులర్ గా అప్లై చేస్తుంటే డార్క్ లిప్స్ ను క్రమంగా తగ్గించుకోవచ్చు.

 గ్లిజరిన్ మరియు తేనె

గ్లిజరిన్ మరియు తేనె

మరో హోం రెమెడీ నిమ్మరసంలో కొద్దిగా గ్లిజరిన్ మరియు తేనె మిక్స్ చూసి , రాత్రి పడుకొనే ముందు పెదాలకు అప్లై చేయాలి.

English summary

15 Beauty Tips for Dark or Black Lips

15 Beauty Tips for Dark or Black Lips,The problem of pigmented, dark or black lips is not uncommon… especially when all of us crave for soft, smooth and pinkish lips.But why do the lips turn dark? Or we must say black?!?! Why does this so called lip discoloration happen?
Story first published: Thursday, May 12, 2016, 13:32 [IST]
Desktop Bottom Promotion