For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఎర్రకందిపప్పు ఫేస్ ప్యాక్స్ తో.. అన్ని రకాల చర్మ సమస్యలు దూరం..!!

By Swathi
|

అందమైన చర్మానికి, ఆకర్షణీయమైన జుట్టు కోసం.. మన అమ్మలు, అమ్మమ్మలు చెప్పిన చిట్కాలను క్రమం తప్పకుండా పాటిస్తుంటాం. కానీ.. చిట్కాలను క్రమం తప్పకుండా పాటించకపోవడం వల్ల సమస్యలు మళ్లీ మళ్లీ వస్తుంటాయి.

ఎక్కువ సమయం తీసుకోకుండా, కొంత టైంలోనే అద్భుతమైన చర్మ సౌందర్యాన్ని పొందే సింపుల్ టిప్స్ కోసం వెతుకుతూ ఉంటారు. మరి.. అలాంటి గ్రాండ్ మా చిట్కాలలో ఎర్రకందిపప్పు ఒకటి. దీన్ని ఉపయోగించి.. అమేజింగ్ స్కిన్ పొందవచ్చు.

ఎర్రకందిపప్పులో చాలా పోషక విలువలు ఉంటాయి. విటమిన్స్, ప్రొటీన్స్, మినరల్స్ కందిపప్పులో పుష్కలంగా పొందవచ్చు. ఇవి చర్మానికి అద్భుతమైన సౌందర్యాన్నిస్తాయి. చర్మ రంధ్రాలను టైట్ చేయడం నుంచి, ముడతలు, ఫైన్ లైన్స్ తగ్గించడం వరకు సహాయపడతాయి.

ఎక్స్ ఫోలియేటింగ్ మాస్క్

ఎక్స్ ఫోలియేటింగ్ మాస్క్

ఈ మాస్క్ వల్ల డెడ్ స్కిన్ సెల్స్ తొలగించవచ్చు. స్మూత్ గా, లైట్ గా చర్మాన్ని పొందవచ్చు.

మాస్క్ తయారు చేసే విధానం

మాస్క్ తయారు చేసే విధానం

1 టేబుల్ స్పూన్ ఎర్రకందిపప్పుని నీటిలో రాత్రంతా నానబెట్టాలి. ఉదయం మెత్తటి పేస్ట్ చేసుకోవాలి. అందులో టేబుల్ స్పూన్ పాలు కలిపి.. శుభ్రం చేసుకున్న ముఖానికి పట్టించాలి. 15 నిమిషాల తర్వాత కడుక్కోవాలి.

స్కిన్ లైటెనింగ్ మాస్క్

స్కిన్ లైటెనింగ్ మాస్క్

ఈ మాస్క్ వల్ల చర్మంలో డ్రైనెస్ తగ్గించి.. రేడియంట్ స్కిన్ పొందవచ్చు. నల్లగా ప్యాచ్ లు ఏర్పడిన ట్యాన్ తొలగించి.. చర్మాన్ని ప్రకాశవంతంగా మార్చుకోవచ్చు.

తయారుచేసే విధానం

తయారుచేసే విధానం

1 టేబుల్ స్పూన్ తేనె, 1 టేబుల్ స్పూన్ ఎర్రకందిపప్పు పొడి కలపాలి. స్మూత్ గా పేస్ట్ చేసుకోవాలి. దీన్ని ముఖానికి, మెడకు పట్టించాలి. ఆరిన తర్వాత.. చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి.

హెయిర్ రిమూవల్ మాస్క్

హెయిర్ రిమూవల్ మాస్క్

హెయిర్ రిమూవ్ చేసుకోవడానికి రేజర్స్, రకరకాల క్రీమ్స్ ఉపయోగిస్తుంటారు. దీనివల్ల చర్మం డ్రైగా మారుతుంది. కాబట్టి న్యాచురల్ రెమిడీ ద్వారా ఎఫెక్టివ్ గా అన్ వాంటెడ్ హెయిర్ తొలగించవచ్చు.

తయారు చేసే విధానం

తయారు చేసే విధానం

1 టేబుల్ స్పూన్ ఎర్రకందిపప్పు, అంతే మోతాదులో బియ్యంపిండి, 1 టీస్పూన్ తేనె, కొన్ని చుక్కల ఆల్మండ్ ఆయిల్ కలుపుకోవాలి. దీన్ని ముఖంపై రాసుకోవాలి. ఆరిన తర్వాత.. బిగుసుకున్నట్టు అనిపించినప్పుడు.. కొన్ని వాటర్ ముఖంపై చల్లుకుని.. స్క్రబ్ చేసుకోవాలి.

యాక్నె మాస్క్

యాక్నె మాస్క్

ముఖంపై మొటిమలు నివారించడానికి ఎర్రకందిపప్పు మాస్క్ ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. చర్మాన్ని తెల్లగానూ మారుస్తుంది.

తయారు చేసే విధానం

తయారు చేసే విధానం

1 టేబుల్ స్పూన్ ఎర్రకందిపప్పు పేస్ట్, 1 టీస్పూన్ ఆరంజ్ పీల్ పౌడర్, 2టీస్పూన్ల దోసకాయ రసం కలుపుకోవాలి. దీన్ని మెత్తగా పేస్ట్ చేసి.. ముఖానికి పట్టించాలి. 25 నిమిషాల తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి.

నిర్జీవమైన చర్మానికి

నిర్జీవమైన చర్మానికి

నిర్జీవంగా మారిన చర్మానికి ఎన్ని క్రీములు, ఎంత మేకప్ వేసినా అందంగా కనిపించదు. ఎర్రకందిపప్పు మాస్క్ డల్ స్కిన్ ని గ్లోయింగ్ గా మారుస్తుంది.

తయారు చేసే విధానం

తయారు చేసే విధానం

వంద గ్రాముల ఎర్రకందిపప్పును రాత్రంతా పచ్చి పాలలో నానబెట్టాలి. ఉదయం మెత్తటి పేస్ట్ చేసుకోవాలి. దీన్ని ముఖానికి, మెడకు పట్టించాలి. 15 నుంచి 20 నిమిషాలు ఆరిన తర్వాత.. శుభ్రం చేసుకోవాలి.

English summary

5 Super-Effective Masoor Dal Face Packs For All Your Skin Problems!

5 Super-Effective Masoor Dal Face Packs For All Your Skin Problems! This nutty and earthy flavoured lentil has high nutritional value, is packed with essential vitamins, proteins and minerals that can literally transform your skin.
Story first published:Friday, August 19, 2016, 14:04 [IST]
Desktop Bottom Promotion