For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఆపిల్ తో అందం..అందరికీ సొంతం..!!

ఆపిల్స్ లో ఉండే న్యూట్రీషియన్స్ ఆరోగ్యానికి మాత్రమే కాదు, చర్మ సంరక్షణకు కూడా సహాయపడుతుంది. చర్మాన్ని ఆరోగ్యంగా, క్లియర్ గా స్పాట్ లెస్ స్కిన్ పొందడానికి గ్రేట్ గా సహాయపడుతుంది. ఆపిల్స్ రెగ్యులర్ గా త

|

చర్మం బ్యూటిఫుల్ గా , స్పాట్ లెస్ గా క్లియర్ గా కనిపించాలంటే మొదట డెడ్ స్కిన్ ను తొలగించాలి. డెడ్ స్కిన్ సెల్స్ వల్ల ఉన్న అందం కాస్తా పాడవుతుంది.. ఇటువంటి స్కిన్ తొలగించడానికి కొద్దిగా ఎక్కువగానే కష్టపడాల్సివస్తుంది. డెడ్ స్కిన్ తొలగించడానికి ఆపిల్ ఫేస్ మాస్క్ ను ట్రై చేయాలని బ్యూటీషియన్స్ సూచిస్తున్నారు.

ఆపిల్స్ లో ఉండే న్యూట్రీషియన్స్ ఆరోగ్యానికి మాత్రమే కాదు, చర్మ సంరక్షణకు కూడా సహాయపడుతుంది. చర్మాన్ని ఆరోగ్యంగా, క్లియర్ గా స్పాట్ లెస్ స్కిన్ పొందడానికి గ్రేట్ గా సహాయపడుతుంది. ఆపిల్స్ రెగ్యులర్ గా తినడం వల్ల ఆకలి, ఆహారాల మీద తీవ్రమైన కోరికలను తగ్గిస్తుంది.

ఆపిల్స్ విటమిన్ ఎ, బి కాంప్లెక్స్, పుష్కలంగా ఉన్నాయి. ఇవి డెడ్ స్కిన్ సెల్స్ ను నివారిస్తాయి. అంతే కాదు చర్మంలోని రంద్రాలను క్లోజ్ అయ్యేలా చేస్తాయి. చర్మానికి రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది. దాంతో చర్మం క్లియర్ గా స్పాట్ లెస్ గా..అందంగా కనిపిస్తుంది.

ఆపిల్స్ లో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది స్కిన్ ఎలాసిటిని పెంచుతుంది. దాంతో చర్మం కొత్తగా కనబడుతుంది. ఇంకా ఆపిల్స్ ఉండే యాంటీఆక్సిడెంట్స్ యూవీ కిరణాలను నుండి స్కిన్ డ్యామేజ్ కాకుండా ప్రొటక్టివ్ లేయర్ గా పనిచేస్తుంది. డ్యామేజ్డ్ స్కిన్ సెల్స్ ను రిపేర్ చేస్తుంది. ఇంకా కొత్తగా చర్మ కణాలు ఏర్పడుటకు సహాయపడుతుంది.

7 Apple Face Mask Recipes To Clear Marks On Skin!

ఆపిల్స్ వల్ల చర్మ సౌందర్యానికి ఇంతకంటే ఏం కావాలి. అంటే పొరపాటే, ఇంకా..ఇంకా మరెన్నో ప్రయోజనాలున్నాయి. ఆపిల్స్ ఉండే నేచురల్ యాసిడ్స్ స్కిన్ ను డీప్ గా క్లీన్ చేయడంలో గ్రేట్ గా సహాయపడుతుంది. అంతేనా...చర్మంలో మచ్చలను , ఇన్ఫెక్షన్స్ ను నివారిస్తుంది. మొటిమలకు కారణమయ్యే బ్యాక్టీరియాను డ్రై అవుట్ చేస్తుంది.

ఇన్ని ప్రయోజనాలనున్న ఆపిల్స్ ను చర్మ సంరక్షణలో తప్పనిసరిగా ఉపయోగించాల్సిందే. ఈ ఆపిల్ హెర్బల్ మాస్క్ వల్ల చర్మంలో డార్క్ స్పాట్స్ తొలగిపోయి, క్లియర్ అండ్ గ్లోయింగ్ స్కిన్ పొందవచ్చు. అందుకు ఫేస్ ప్యాక్ లను వివిధ రకాలు ఎలా తయారుచేసుకోవాలి..ఎలా ఉపయోగించాలో తెలుసుకుందాం..

ఆయిల్ క్లెన్సింగ్ మాస్క్:

ఆయిల్ క్లెన్సింగ్ మాస్క్:

ఆయిల్ స్కిన్ వారికి ఇది ఫర్ఫెక్ట్ రెమెడీ. ఈ ఫేస్ మాస్క్ వల్ల చర్మంలో మలినాలు తొలగిపోతాయి, ఆయిల్ ఉత్పత్తిని తగ్గిస్తుంది. ఒక బౌల్ తీసుకుని అందులో ఆపిల్ తురుము, కొద్దిగా నిమ్మరసం, పెరుగు మిక్స్ చేయాలి. ఈ రెండింటిని బాగా కలగలిసే వరకూ పేస్ట్ చేయాలి. ఈ పేస్ట్ ను ముఖానికి, మెడకు అప్లై చేయాలి. అరగంట తర్వాత స్ర్కబ్ చేసి కడిగేసుకోవాలి.

 హైడ్రేటింగ్ మాస్క్:

హైడ్రేటింగ్ మాస్క్:

డ్రై స్కిన్ వారికి ఇది గ్రేట్ రెమెడీ. చర్మంలో డార్క్ స్పాట్స్, తొలగిస్తుంది. స్కిన్ కు తగిన హైడ్రేషన్ ను అందిస్తుంది. చర్మానికి కావల్సినంత తేమను అందిస్తుంది. అందుకు చేయాల్సిందల్లా, ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని, అందులో ఒక టేబుల్ స్పూన్ ఆపిల్ జ్యూస్, ఒక టేబుల్ స్పూన్ గ్లిజరిన్, మరియు తేనె మిక్స్ చేయాలి. ఈ పదార్థాలన్ని బాగా కలిసే వరకూ బ్లెండ్ చేయాలి. తరవ్ాత ఈ ప్యాక్ ను ముఖం, మెడకు అప్లై చేయాలి. ఇది చర్మంలోకి బాగా అ్బ్సార్బ్ అయిన తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి.

మొటిమలను క్లియర్ చేసే ఫేస్ మాస్క్ :

మొటిమలను క్లియర్ చేసే ఫేస్ మాస్క్ :

ఒక ఆపిల్లో సగం తీసుకుని తురుముకోవాలి. తర్వాత అందులో 2 టేబుల్ స్పూన్ల ఫ్యూర్ హాని మరియు 5 చుక్కల టీట్రీ ఆయిల్ ను మిక్స్ చేయాలి. దీన్ని నేరుగా మొటిమలను మీద అప్లై చేయాలి. అరగంట తర్వాత స్క్రబ్ చేసి, శుభ్రం చేసుకోవాలి. ఈ ఆపిల్ ఫేస్ మాస్క్ ను ప్రతి రోజూ అప్లై చేస్తుండాలి. మొటిలమలు పూర్తిగా తగ్గే వరకూ అప్లై చేయాలి.

 ఆపిల్ స్క్రబ్ :

ఆపిల్ స్క్రబ్ :

ఈ ఫేస్ మాస్క్ వల్ల చర్మంలో మలినాలు తొలగిపోతాయి. చర్మంలోపలి వరకూ చొచ్చొకుని పోయి, డెడ్ స్కిన్ సెల్స్ ను తొలగిస్తుంది. డెడ్ స్కిన్ లేయర్స్ కూడా తగ్గిస్తుంది. అందుకు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని, అందులో ఒక టేబుల్ స్పూన్ ఓట్ మీల్ పౌడర్, ఒక టేబుల్ స్పూన్ తేనె, ఆపిల్ జ్యూస్ మిక్స్ చేయాలి. అవసరమైతే కొద్దిగా రోజ్ వాటర్ కూడా మిక్స్ చేసి స్మూత్ గా పేస్ట్ గా మారిన తర్వాత ముఖానికి అప్లై చేయాలి. ఈ ప్యాక్ వేసుకున్న తర్వాత పూర్తిగా డ్రైగా మారిన తర్వాత కొన్నినీళ్ళు చిలకరించి సర్క్యులర్ మోషన్లో స్ర్కబ్ చేసి, తర్వాత ప్లెయిన్ వాటర్ తో శుభ్రం చేసుకోవాలి.

ఫేస్ టోనర్:

ఫేస్ టోనర్:

ఈ ఆపిల్ మాస్క్ వల్ల చర్మంలో పిహెచ్ లెవల్స్ బ్యాలెన్స్ అవుతాయి, సన్ బర్న్ నివారిస్తుంది. చర్మంలో మచ్చలను మాయం చేస్తుంది. కొన్ని చుక్కల ఆపిల్ సైడర్ వెనిగర్ తీసుకుని అందులో కాటన్ బాల్ డిప్ చేసి , ముఖం మొత్తం మర్దన చేయాలి. ఆరిన తర్వాత మరో కోట్ తిరిగి అప్లై చేయాలి. ఇలా చేయడం వల్ల స్కిన్ టోన్ మెరుగుపడుతుంది.

స్కిన్ రిపేరింగ్ మాస్క్ :

స్కిన్ రిపేరింగ్ మాస్క్ :

ఒక టేబుల్ స్పూన్ మ్యాష్ చేసిన ఆపిల్ పల్ప్ , ఒక టీస్పూన్ క్యారెట్ జ్యూస్, ఒక టీస్పూన్ ఆరెంజ్ జ్యూస్, 2 విటమిన్ ఇ క్యాప్స్యూల్స్, కొన్ని చుక్కల రోజ్ వాటర్ . ఈ పదార్థాలన్నింటిని ఒక మిక్సింగ్ బౌల్లో తీసుకుని, స్మూత్ గా పేస్ట్ చేయాలి. దీన్ని మైల్డ్ ఫేస్ వాష్ తో క్లీన్ చేసుకోవాలి. ఈ ఫేస్ మాస్క్ చర్మంలోకి బాగా ఇంకిన తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.

డార్క్ సర్కిల్స్ ను మాయం చేస్తుంది:

డార్క్ సర్కిల్స్ ను మాయం చేస్తుంది:

ఒక టేబుల్ స్పూన్ యాపిల్ సైడర్ వెనిగర్ లో కొన్ని చుక్కల బాదం ఆయిల్ మిక్స్ చేసి, బ్లెండ్ చేయాలి. తర్వాత కళ్ళక్రింది బాగంలో అప్లై చేయాలి. కళ్ళ చుట్టూ కూడా అప్లై చేయవచ్చు. అరగంట తర్వాత కాటన్ ప్యాడ్ తో క్లీన్ గా తుడవాలి. ఈ మిశ్రమాన్ని ఎయిర్ టైటనర్ డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకోవచ్చు.

English summary

7 Apple Face Mask Recipes To Clear Marks On Skin!

If you want to scrape off that dead skin layer, perk up your tired skin and revitalize your skin with some much-needed energy shot, we suggest you give apple face mask a try!
Story first published: Thursday, November 10, 2016, 16:40 [IST]
Desktop Bottom Promotion