For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ప్రకాశించే చర్మ సౌందర్యానికి ఆయుర్వేదం చెప్పే రహస్యాలు..

|

అందంగా కనబడుట కోసం ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటాము. ఎవరైనా అందంగా కనిపిస్తే చాలు , వారిలాగే మనమెందుకు లేమని, వారితో పోల్చుకుని బాధపడుతుంటారు. అందరూ కోరుకునేది ఒకటే హెల్తీ ఫేషియల్ స్కిన్ . అందంగా ఉంటే ఒక కాన్ఫిడెన్స్ పెరుగుతుంది.

చర్మ సౌందర్యాన్ని పెంచుకోవడానికి ఆయుర్వేదం చాలా ఉపయోగకరమైనది మరియు విజయవంతమైనది . అంటే అనుకున్నది చేరుతారు. ఆయుర్వేదంలో కొన్ని రకాల నేచురల్ ఫేస్ మాస్క్ లను తెలుసుకుంటే అశ్చర్యానికి గురి అవుతారు. ఈ ఆయుర్వేదిక్ ఫేస్ మాస్క్ చర్మంలో డల్ నెస్ ను నివారిస్తుంది. చర్మం మెరిసేలా చేస్తుంది మరియు ఆరోగ్యంగా ఉంచుతుంది.

ఆయుర్వేద ఫేస్ మాస్క్ తో చర్మం అందంగా, ప్రకాశవంతంగా మార్చుకోవడానికి కొన్ని నేచురల్ ఆయుర్వేదిక్ రెమెడీస్..

మ్యారిగోల్డ్ ఫేస్ మాస్క్:

మ్యారిగోల్డ్ ఫేస్ మాస్క్:

బంతిపువ్వులతో చర్మ సౌందర్యం రెట్టింపవుతుందంటే ఆశ్చర్యం కలుగుతుంది. బంతిపువ్వులు మనకు బాగా అందుబాటులో దొరుకుతాయి.ఫ్రెష్ గా ఉండే బంతిపువ్వులను తీసుకొచ్చి మెత్తగా పేస్ట్ చేసి అందులో కొన్ని పచ్చిపాలను వేసి, తేనె మిక్స్ చేయాలి. ఈ పేస్ట్ ను ముఖానికి అప్లై చేసి 15నిముషాల తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇది మంచి సువాసన కలిగి ఉండటం మాత్రమే కాదు , ఇందులో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ మరియు యాంటీసెప్టిక్ లక్షణాలు చర్మంలోని మొటిమలను జిడ్డును తొలగిస్తుంది. దీన్ని వారంలో ఒకటి రెండు సార్లు చేస్తుంటే మంచి ఫలితం ఉంటుంది. ఆయిల్ స్కిన్ కు ఇది పర్ఫెక్ట్ ఫేస్ ప్యాక్.

పసుపు మరియు బనానా ప్యాక్:

పసుపు మరియు బనానా ప్యాక్:

ప్రకాశించే చర్మానికి ఇది ఫర్ఫెక్ట్ హోం మేడ్ ఆయుర్వేదిక్ ఫేస్ ప్యాక్ . ముఖ్యంగా పెళ్ళిళ్ల సీజన్ లో ఈ ప్యాక్ వేసుకోవడం వల్ల పెళ్లికూతురి ముఖం మిళమిళ మెరిసిపోతుంటుంది. 4 చెంచాలా శెనగపించడిలో , అరచెంచా పసుపు వేసి మెత్తగా పేస్ట్ చేయాలి. ఇందులో కొద్దిగా పచ్చిపాలను కూడా మిక్స్ చేయవచ్చు . ఈ మిశ్రమాన్ని వారానికొకసారి అప్లై చేస్తే మంచి ఫలితం ఉంటుంది. స్కిన్ కాంప్లెక్షన్ మెరుగుపరుచుకోవచ్చు.

చదనం లేదా గంధం ఫేస్ మాస్క్:

చదనం లేదా గంధం ఫేస్ మాస్క్:

ఈ ఫేస్ మాస్క్ తయారీ కోసం సాండిల్ ఉడ్ స్టిక్ కంటే సాండిల్ వుడ్ పౌడర్ ను ఎంపిక చేసుకుని ఉపయోగించుకోవడం మంచిది. గంధంకు కొద్దిగా రోజ్ వాటర్ మిక్స్ చేసి ముఖానికి అప్లై చేసి 15నిముషాల తర్వాత అప్లై చేయాలి. తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకుంటే ముఖం ప్రకాశవంతంగా మెరిస్తుంటుంది. ఈ ఫేస్ ప్యాక్ వేసుకోవడం వల్ల మొటిమలు తగ్గుతాయి, ముఖంలో కాంతి పెరుగుతుంది.స్కిన్ సాప్ట్ అవుతుంది. వారంలో 5-6సార్లు చేస్తుంటే మరింత బెటర్ రిజల్ట్ వస్తుంది.

ఆరోమాటిక్ ఫేస్ మాస్క్:

ఆరోమాటిక్ ఫేస్ మాస్క్:

ఆరోమాటిక్ ఫేస్ మాస్క్ కోసం కావల్సినవి:

గందం పేస్ట్ కొద్దిగా

రోజ్ ఆయిల్ 2 చుక్కలు

ల్యావెండర్ ఆయిల్ 1 డ్రాప్

శెనగపిండి: 2tbsp

పసుపు: చిటికెడు

బట్టర్ మిల్క్: కొద్దిగా

పైన సూచించిన పదార్థాలన్ని మిక్స్ చేసి, ఈ పేస్ట్ ను ముఖానికి అప్లై చేయాలి.10-15నిముషాల తర్వాత శుభ్రం చేసుకోవాలి. వారానికొకసారి ఈ ప్యాక్ వేసుకోవడం వల్ల స్ట్రెస్ తగ్గించుకోవచ్చు. చర్మం యవ్వనంగా ప్రకాశంతంగా మార్చుకోవచ్చు,

ఆయుర్వేదిక్ స్ర్కబ్:

ఆయుర్వేదిక్ స్ర్కబ్:

ఒక టేబుల్ స్పూన్ బియ్యం పిండి మరియు గందం మిక్స్ చేయాలి. దీనికి అర చెంచా మిల్క్ పౌడర్ మరియు ఒక టేబుల్ స్పూన్ శెనగపిండి , రోజ్ వాటర్ మిక్స్ చేయాలి. మెత్తగా పేస్ట్ తయారయ్యాక , ఈ ఆయుర్వేదిక్ స్ర్కబ్ ను వారంలో ఒకటి లేదా రెండు సార్లు స్క్రబ్ చేయాలి.

తేనె మరియు లెమన్ మాస్క్ :

తేనె మరియు లెమన్ మాస్క్ :

హోం మేడ్ ఆయుర్వేదిక్ ఫేస్ మాస్క్ . ఇందులో యాంటీఆక్సిడెంట్ మరియు మాయిశ్చరైజింగ్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి . ఇది చర్మం శుభ్రం చేయడంలో మరియు చర్మాన్ని తేలికపరచడంలో గ్రేట్ గా సమాయపడుతుంది. ఒక టేబుల్ స్పూన్ ఆర్గానిక్ హనీ తీసుకుని దీనికి అరచెంచ నిమ్మరసం మిక్స్ చేసి ముఖానికి అప్లై చేయాలి. కళ్ళకు తప్పించి మిగిలిన ముఖ భాగం మొత్తం అప్లై చేసుకోవాలి. 15 నిముషాల తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ ప్యాక్ వల్ల చర్మం సాప్ట్ గా మరియు ప్రకాశవంతంగా తయారవుతుంది.

హెర్బల్ ప్యాక్:

హెర్బల్ ప్యాక్:

కొద్దిగా శెనగపిండి, చిటికెడు పసుపు మరియు కొన్ని చుక్కల నిమ్మరసం మిక్స్ చేయాలి. దీనికి పచ్చిపాలు లేదా రోజ్ వాటర్ మిక్స్ చేసి స్మూత్ ప్యాక్ లా తయారుచేసుకోవాలి. దీన్ని ముఖం మొత్తం అప్లై చేసి 10 నిముషాల తర్వాత శుభ్రం చేసుకోవాలి. చల్లటి నీటితో శుభ్రం చేసుకోవడం వల్ల స్కిన్ సాప్ట్ గా మరియు స్మూత్ గా ప్రకాశవంతంగా మార్చుకోవచ్చు. ఇది స్కిన్ టాన్ మరియు డెడ్ స్కిన్ సెల్స్ ను నివారించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది,

English summary

7 Ayurvedic Face Packs For Glowing Skin

When it comes to skin care, we often pay more emphasis to our face in comparison to other regions. We all wish for a healthy facial skin because it helps boost one’s confidence.
Story first published: Tuesday, July 5, 2016, 16:39 [IST]
Desktop Bottom Promotion