For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

చైనీస్ నుంచి ప్రతి అమ్మాయి తెలుసుకోవాల్సిన బ్యూటీ సీక్రెట్

|

సహజంగా అందం, ఆరోగ్యం విషయంలో ఒక్కో దేశంలో ఒక్కో వైవిధ్యమైన సంస్కృతిని కలిగి ఉంటారు. కొన్ని సంప్రదాయాలు, పద్ధతులు మరియు భావాలు ఒక్కో దేశానికి ఒక్కోవిధంగా ప్రత్యేకంగా ఉంటాయి.

ఉదాహరణకు సంప్రదాయ ప్రకారం ఒక దేశంలో కట్టు, బొట్టు. అది మన ఇండియన్స్ కే చెల్లు. కొన్ని దేశాల్లో వీటి అంతగా ప్రాధాన్యతనివ్వరు . మన దేశంలో నుదుట బొట్టు తప్పనిసరిగా పెట్టుకుంటారు.

అదే విధంగా వేరే దేశాల్లో కూడా వారికంటే ఒక ప్రత్యేకమైన సంప్రదాయం, సంస్కృతి ఉంటుంది. ఆకట్టు బాట్లును వారి పురాతన కాలం నుండి అనుసరిస్తుంటారు. వారికుండే సంప్రదాయాలు ఇతర దేశాలకు తెలియపోవచ్చు. కట్టుబాట్లు,సంస్కృతి, సంప్రదాయాలు ఎన్ని ఉన్నా ఆడతనానికి, అందానికి ఒకటే ప్రాముఖ్యతను ఇస్తుంటారు.

అన్ని దేశాలలో నేచురల్ గా అందంగానే ఉంటారు. కొన్ని దేశాలల్లో ఆరోగ్యానికి ఏవిధంగా నేచురల్ రెమెడీస్ ను ఉపయోగిస్తుంటారో, అదేవిధంగా బ్యూటీ కోసం కూడా నేచురల్ ఆయుర్వేదిక్ రెమెడీస్ ను వారి పూర్వీకుల నుండి తర్వాత జనరేషన్ వారు కూడా ఫాలో అవుతుంటారు.

కొన్ని దేశాలలో ముఖ్యంగా ఆసియా దేశాలైన చైనా, జపాన్ ప్రజలను చూసినట్లైతే వారు చాలా డిఫరెంట్ గా , అందంగా, కలర్ ఫుల్ గా కనబడుతుంటారు. వారి రియల్ ఏజ్ కంటే చాలా యంగ్ గా కనబడుతుంటారు? మరి వారు అలా కనడటానికి గల రహస్యం ఏంటి అని మనకు ఆశ్చర్యం కలగవచ్చు.!

బహుషా వారు అద్భుతమైన బ్యూటీ సీక్రెట్స్ ను ఫాలో అవుతుండవచ్చు . ఈ విషయం మిగిలిన ప్రపంచ దేశాల ప్రజలకు తెలిసుండకపోవచ్చు. వారి పూర్వీకుల నుండి వారు నేర్చుకొన్ని కొన్ని బ్యూటీ సీక్రెట్స్ వల్లే వారి అంత యవ్వనంగా, అందంగా కనబడుటాకు కారణమయ్యుండవచ్చు . అలా వారు ఫాలో అయ్యే కొన్ని బ్యూటీ సీక్రెట్స్ ను మీకు పరిచయం చేస్తున్నాము...ఇవి మీకు తప్పకుండా ఉపయోగపడుతాయని ఆశిస్తున్నాము...

1. బియ్యం నీళ్ళు:

1. బియ్యం నీళ్ళు:

చైనీస్ మహిళలు బియ్యంను రెండు కప్పుల నీటిలో నానబెట్టి, ఆ నీటిని వడగట్టి, ముకానికి టోనర్ గా ఉపయోగిస్తారు. ఈ చిట్కాను ఫాలో అవ్వడం వల్ల స్కిన్ టైట్ గా మరియు ప్రకాశవంతమైన స్కిన్ టోన్ ను పొందుతారు.

2. పెసళ్ళు:

2. పెసళ్ళు:

చైనాలో, మహిళలు పెసరపిండి, లేదా పెసళ్లు పేస్ట్ ను ఫేస్ ప్యాక్ గా రెగ్యులర్ గా వేసుకుంటారు . చర్మం రంద్రాల్లో ఉండే బ్యాక్టీరియాను తొలగించడంలో పెసళ్ళు గ్రేట్ గా సహాయపడుతాయి . బ్యాక్టీరియాను నాశనం చేయడం వల్ల చర్మంలో ఇన్ఫ్లమేషన్ తగ్గుతుంది. దాంతో మొటిమలను నివారించుకోవచ్చు.

3. ఓయిస్ట్రెస్ సెల్స్:

3. ఓయిస్ట్రెస్ సెల్స్:

చైనీస్ స్కిన్ కేర్ లో కామన్ గా ఉపయోగించే పదార్థం ఓయిస్ట్రెస్ . దీన్ని మనం ఆన్ లైన్ లో కొనుగోలు చేసుకోవచ్చు,. ఓయిస్ట్రెస్ షెల్ పౌడర్ చర్మకణాలను పునరుత్తేజపరుస్తుంది, చర్మానికి మంచి పోషణ అందివ్వడంతో స్కిన్ కంప్లెక్షన్ మరింత బ్రైట్ గా పెరుగుతుంది.

4. గ్రీన్ టీ :

4. గ్రీన్ టీ :

చైనా మహిళలు గ్రీన్ టీ ఎక్కువగా నమ్ముతారు . ఎందుకంటే గ్రీన్ టీలోయాంటీఆక్సిడెంట్స్ అధికంగా ఉంటాయి, దాంతో ఇది స్కిన్ ఎలాసిటిని పెంచుతుంది . ఏర్లీ ఏజింగ్ లక్షణాలు, ముడుతలు, ఫైన్ లైన్స్ ను నివారిస్తుందని వారి నమ్మకం. అందుకే వారి రెగ్యులర్ బ్యూటీ రింజమ్ లో గ్రీన్ టీకి ఎక్కువ ప్రాధాన్యత ఉంది.

5. మసాజ్:

5. మసాజ్:

తరచూ బాడీ మరియు ఫేషియల్ మసాజ్ చేయించుకోవడం వల్ల శరీరంలో బ్లడ్ సర్క్యులేషన్ పెరుగుతుంది. స్కిన్ టైట్ గా మరియు సపెల్ గా ఉంటుంది . చైనీయులు మసాజ్ కు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. అందుకే వారు ఎప్పుడూ అందంగా , యవ్వనంగా, వారి రియల్ ఏజ్ కంటే తక్కువగా కనబడుతుంటారు.

6. పుదీనా ఆకులు:

6. పుదీనా ఆకులు:

చైనీ మహిళలు, స్కిన్ టోన్ మెరుగుపరుచుకోవడం కోసం పుదీనా మీద ఎక్కువగా ఆధారపడుతుంటారు. కొన్ని పుదీనా ఆకులను పేస్ట్ చేసి ముఖానికి పట్టిస్తారు. మింట్ పేస్ట్ ను ఫేషియల్ మాస్క్ గా ఉపయోగించడం వల్ల వారి స్కిన్ కాంప్లెక్షన్ మరింత ఫెయిర్ గా మారుతుంది.

7. పసుపు:

7. పసుపు:

పసుసు మన ఇండియాలో మాత్రమే పాపులర్ అవ్వలేదు, ఇందులోని గొప్ప ఔషధగుణాల వల్ల చైనాలో కూడా దీని వాడకం ఎక్కువ . చైనా మహిళ పసుపు స్కిన్ ఎక్సఫ్లోయేట్ చేయడంలో చాలా గ్రేట్ గా పనిచేస్తుందని, ఇంకా సాప్ట్ స్కిన్ టోన్ అందిస్తుందని చెబుతారు.

English summary

7 Beauty Secrets From China That Every Girl Should Know

Different countries have followed certain beauty regimens and have passed them on to the next generations. Now, we may have observed that people from the Asian countries like China and Japan have flawless skin and they appear much younger than their ages!
Story first published:Tuesday, May 31, 2016, 17:06 [IST]
Desktop Bottom Promotion