For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

గ్లోయింగ్ స్కిన్ పొందడానికి 7 డిఫరెంట్ టైప్స్ కుకుంబర్ ఫేస్ మాస్క్ లు..!

కీరదోసకాయలో విటమిన్ ఎ, విటమిన్ సి, మరియు కెరోటిన్స్ అధికంగా ఉన్నాయి. ఇవన్నీ కలిసి పవర్ ఫుల్ యాంటీఆక్సిడెంట్స్ గా పనిచేస్తాయి. ఈ యాంటీఆక్సిడెంట్స్ డ్యామేజ్ స్కిన్ రిపేర్ చేస్తుంది, చర్మానికి మాయిశ్చర

|

ప్రస్తుతం ఉన్న ఈ మోడ్రన్ ప్రపంచంలో, ప్రతి ఒక్కరూ ఏదోఒక రకంగా కొత్తదనం కోరుకుంటారు. అందుకోసమే మార్కెట్లో ఏ ఒక్క ప్రొడక్ట్ కొత్తగా వచ్చినా..వాటన్నింటిని ఉపయోగించడానికి అత్యుత్సాహం చూపెడుతుంటారు. అలాగే అందానికి ఇంకాస్త అందంగా కనబడుటకు అదనపు మెరుగులు దిద్దుకోవడానికి ఫ్యాన్సీ స్పాలు కోసం పెద్ద మొత్తంలో ఖర్చు చేస్తుంటారు. అయితే మన వంటగదిలోని పదార్థాలు కూడా చర్మంలో ఇన్ స్టాంట్ గ్లోను తీసుకొస్తాయి. మన వంటగదిలో ఉండే హెల్తీ గ్రీన్ వెజిటేబుల్ కుకుంబర్. కీరదోసకాయతో మాస్క్ వేసుకోవడం వల్ల అద్భుతమైన గ్లోను అందిస్తుంది.

నిజానికి కెమికల్ ట్రీట్మెంట్స్ తాత్కాలిక ఫలితాలను మాత్రమే అందిస్తుంది, అంతే కాదు, దీర్ఘకాలంలో స్కిన్ డ్యామేజ్ చేస్తుంది. అందువల్ల హెర్బల్ పదార్థాలను ఉపయోగించడం వల్ల మంచి ఫలితాలను చూపుతుంది. నేచురల్ పదార్థాల వల్ల మార్పు కొద్దిగా ఆలస్యం అయినా, ఉత్తమ ఫలితాలను అందిస్తుంది.

కాబట్టి, ఎప్పుడు హెర్బల్ పదార్థాలను ఎంపిక చేసుకోవడమే మంచిది. హెర్బల్ కుకుంబర్ మాస్క్ గురించి మీరు వినే ఉంటారు. కీరదోసకాయలో వాటర్ కంటెంట్, ఫైబర్ అధికంగా ఉండటం వల్ల చర్మాన్ని కూల్ గా ..గ్లోయింగ్ గా మార్చుతుంది.

7 Cucumber Face Mask Recipes For Brighter Complexion!

కీరదోసకాయలో విటమిన్ ఎ, విటమిన్ సి, మరియు కెరోటిన్స్ అధికంగా ఉన్నాయి. ఇవన్నీ కలిసి పవర్ ఫుల్ యాంటీఆక్సిడెంట్స్ గా పనిచేస్తాయి. ఈ యాంటీఆక్సిడెంట్స్ డ్యామేజ్ స్కిన్ రిపేర్ చేస్తుంది, చర్మానికి మాయిశ్చరైజింగ్ గుణాలను అందిస్తుంది, కొత్త చర్మ కణాలను పునరుత్పత్తిని పెంచుతుంది. చర్మంను డ్యామేజ్ కారణమయ్యే ఫ్రీరాడికల్స్ ను క్రమబద్దం చేస్తుంది.

ఇంకా, కీరదోసకాయలో జియాక్సథిన్ మరియు లూటిన్ లు అధికంగా ఉన్నాయి, ఇవి చర్మంలో లోపలి లేయర్స్ వరకూ వెళ్ళి, చర్మాన్నిశుభ్రం చేస్తుంది. లూటిన్, డెడ్ స్కిన్ లేయర్స్ ను తొలగిస్తుంది. చర్మ రంద్రాలను మూసుకునేలా చేస్తుంది. చర్మంలో మచ్చలు, మార్క్స్ ను మాయం చేస్తుంది. స్కిన్ కు రేడియంట్ గ్లోను అందిస్తుంది.

కీరదోసకాయను చర్మానికి ఏవిధంగా ఉపయోగించాలో కొంచెం వివరంగా తెలుసుకుందాం..

స్కిన్ రిజువేటింగ్ మాస్క్ :

స్కిన్ రిజువేటింగ్ మాస్క్ :

1. ఒక టేబుల్ స్పూన్ ఫ్రెష్ గా తీసిన అలోవెర జెల్ ను, కీరదోసకాయ జ్యూస్ లో వేసి రెండూ బాగా కలగలిసే వరకూ మిక్స్ చేయాలి.

2. తర్వాత ఈ మిశ్రమాన్ని ముఖం మరియు మెడకు అప్లై చేయాలి.

3. ప్యాక్ వేసుకున్న 15 నిముషాల తర్వాత, స్కిన్ స్ట్రెచ్ అవ్వడం ప్రారంభమువుతుంది. అప్పుడు ప్లెయిన్ వాటర్ తో ముఖం వాష్ చేసుకోవాలి.

4. ఈ కీరదోసకాయ ఫేస్ మాస్క్ ను వారంలో రెండు సార్లు వేసుకుంటే స్కిన్ టోన్ బ్రైట్ గా మారుతుంది.

డెడ్ సెస్స్ తొలగించే ఫేస్ స్క్రబ్ :

డెడ్ సెస్స్ తొలగించే ఫేస్ స్క్రబ్ :

అరకప్పు నీటిలో బాదంను రాత్రంతా నానెబెట్టుకోవాలి.

తర్వాత రోజు ఉదయం వీటిని నీటితో సహాయ రఫ్ పేస్ట్ చేసుకోవాలి.

తర్వాత ఇందులో తేనె , కీరదోసకాయ జ్యూస్ మిక్స్ చేయాలి. మొత్తం మిశ్రమం పూర్తిగా కలిసే వరకూ కలగలుపుకోవాలి.

ఈ మిశ్రమాన్ని ముఖం, మెడకు అప్లై చేయాలి.

డ్రై అయిన తర్వాత కొద్దిగా నీళ్ళు చిలకరించి, తర్వాత స్ర్కబ్ చేసి ప్లెయిన్ వాటర్ తో వాష్ చేసుకోవాలి.

కళ్ళ ఉబ్బును తగ్గించే ప్యాక్:

కళ్ళ ఉబ్బును తగ్గించే ప్యాక్:

కీరదోసకాయలో ఆస్కార్బిక్ యాసిడ్స్ అధికంగా ఉంటాయి. ఇది చర్మంలో వాటర్ ను రిటెన్షన్ లెవల్స్ ను తగ్గించడం మాత్రమే కాదు, స్కార్స్ ను లైట్ గా మార్చుతుంది.

కీరదోసకాయను స్లైస్ గా కట్ చేయాలి. తర్వాత వీటిని 15 నిముషాల పాటు ఫ్రిజ్ లో ఉంచాలి.

15నిముషాల తర్వాత వీటిని బయటకు తీసి, కళ్ళ మీద పెట్టుకోవాలి. కీరదోసకాయలో చల్లదనం తగ్గే వరకూ కూర్చొని విశ్రాంతి తీసుకోవాలి.

ఇలా రెగ్యులర్ గా రిపీట్ చేయాలి.

స్కిన్ వైటనింగ్ మాస్క్ :

స్కిన్ వైటనింగ్ మాస్క్ :

ఒక టీస్పూన్ కీరదోసకాయ జ్యూస్ లో, సమంగా బంగాళదుంప రసం మిక్స్ చేసి, అందులో కొన్ని చుక్కల లెమన్ జ్యూస్ ను మిక్స్ చేయాలి.

ఈ మిశ్రమాన్ని రిఫ్రిజరేటర్ లో కొద్ది సేపు ఉంచాలి.

15నిముషాల తర్వాత ఫ్రిజ్ లో నుండి బయటకు తీసి ముఖానికి, మెడకు అప్లై చేసి, మసాజ్ చేయాలి.

ఈ హెర్బల్ మాస్క్ చర్మం మీద డ్రైగా మారి స్ట్రెచ్ అయ్యే వరకూ ఉండి తర్వాత ప్లెయిన్ వాటర్ తో శుభ్రం చేసుకోవాలి.

చర్మ రంద్రాలు టైట్ చేయడానికి:

చర్మ రంద్రాలు టైట్ చేయడానికి:

ఒక టేబుల్ స్పూన్ కీరదోసజ్యూస్ ను , మరో టేబుల్ స్పూన్ యాపిల్ సైడర్ వెనిగర్ తో మిక్స్ చేయాలి.

ఇప్పుడు ఈ మిశ్రమంలో కాటన్ పాడ్ డిప్ చేసి, కాటన్ తో ముఖం మొత్తం మర్దన చేయాలి. ఇది చర్మంలోకి పూర్తిగా ఇంకిన తర్వాత తిరిగి మరో కోట్ వేయాలి.

డ్రైగా మారిన తర్వాత శుభ్రం నార్మల్ వాటర్ తో శుభ్రం చేసుకోవాలి. ఈ మాస్క్ ను రెగ్యులర్ గా వేసుకుంటే చర్మ రంద్రాలు ష్రింక్ అవుతాయి.

గ్లోయింగ్ స్కిన్ మాస్క్ :

గ్లోయింగ్ స్కిన్ మాస్క్ :

ఒక టేబుల్ స్పూన్ గుమ్మడి కాయ పేస్ట్ .

అందులో ఒక టేబుల్ స్పూన్ కీరదోసకాయ జ్యూస్, ఒక టీస్పూన్ తేనె మిక్స్ చేయాలి.

ఈ రెండు పదార్థాలను ఫోర్క్ సహాయంతో బాగా మిక్స్ చేయాలి.

తర్వాత ఈ మిశ్రమాన్ని ముఖం, మెడకు అప్లై చేయాలి.

అరగంట తర్వాత స్ర్కబ్ చేసి, శుభ్రం చేసుకోవాలి.

యాంటీ బ్లిమిష్ మాస్క్:

యాంటీ బ్లిమిష్ మాస్క్:

ఒక టేబుల్ స్పూన్ కీరదోసకాయ జ్యూస్ కు కొద్దిగా నిమ్మరసం జోడించి, చిటికెడు పసుపు చేర్చాలి.

ఈ మూడు పదార్థాలు బాగా కలగలిసే వరకూ మిక్స్ చేయాలి.

ఈ మిశ్రమాన్ని ముఖం, మెడకు అప్లై చేయాలి.

ప్యాక్ వేసుకున్న తర్వాత పూర్తిగా డ్రై అయిన తర్వాత ప్లెయిన్ వాటర్ తో శుభ్రంగా కడిగేసుకోవాలి.

English summary

7 Cucumber Face Mask Recipes For Brighter Complexion!

It is amazing how people spend an exorbitant sum of money in fancy spas to get that enviable glow, when simple ingredients from the kitchen can do the same, only better! And the one ingredient we are in love with is cucumber face mask!
Desktop Bottom Promotion