For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఆయిల్ స్కిన్ తో అందంగా కనబడుట లేదా?7 ఎఫెక్టివ్ హోం రెమెడీస్ ఇవిగో..

|

చర్మం సమస్యలో ఆయిల్ స్కిన్ ఒకటి. కొంత మంది ఎంత శుభ్రం చేసుకొన్నా, ఎన్ని కాస్మోటిక్స్ వాడిన, ఎన్ని ట్రీట్మెంట్స్ తీసుకున్నాముఖం జిడ్డుగా కనబడుతుంటుంది. అలాంటి వారిలో మీరూ ఒకరైతే ఖచ్చితం ఈ సమస్యను నివారించుకోవడానికి ప్రయత్నించాలి.

ఆయిల్ స్కిన్ ఉన్నవారి చర్మంలో సెబాసియస్ గ్రంథులు చర్మంలో ఎక్కువ ఆయిల్ ఉత్పత్తి చేయడం వల్ల చర్మం జిడ్డుగా మారుతుంది . దాంతో చర్మంలో జిడ్డుతో పాటు, డెడ్ స్కిన్ సెల్స్, మొటిమలు, మచ్చలు, బ్రేక్ అవుట్స్ వంటి ఇతర సమస్యలకు కారణమవుతుంది.

ఆయిల్ స్కిన్ నివారించుకోవడానికి ఉపయోగించే ప్రొడక్ట్స్ లో కెమికల్స్ అధికంగా ఉండటం వల్ల పరిస్థితి మరింత వరెస్ట్ గా మార్చుతుంది . స్కిన్ డ్యామేజ్ అవుతుంది . కాబట్టి, ఆయిల్ స్కిన్ నివారించుకోవడానికి కొన్ని పవర్ ఫుల్ హోం రెమెడీస్ ఉన్నాయి. వీటిని ఉపయోగించుకోవడం వల్ల ఆయిల్ స్కిన్ సమస్య ను నివారించుకోవచ్చు.

ఈ హోం రెమెడీస్ ను పురాతన కాలం నుండి ఉపయోగిస్తున్నాయి .ఇవి చర్మంలో ఎక్సెస్ ఆయిల్ ను గ్రహించి, ఇటువంటి చర్మ సమస్యకు గురిచేసే అవాంఛిత లక్షణాలను నివారిస్తుంది. ఈ నేచురల్ హోం రెమెడీస్ ధరతక్కువ, కెమికల్స్ ఉండవు. ఈ హోం రెమెడీస్ వల్ల ఆయిల్ స్కిన్ నివారించబడుతుంది.

ఆయిల్ స్కిన్ నివారించే హోం రెమెడీస్ ఏంటో తెలుసుకుందాం...

కలబంద:

కలబంద:

ఇది ఒక మెడిసినల్ ప్లాంట్ . ఇది చర్మంలోని ఎక్సెస్ ఆయిల్ ను గ్రహిస్తుంది . చర్మ రంద్రాలు తెరచుకొనేలా చేసి డెడ్ స్కిన్ సెల్స్ పెరగకుండా చేస్తుంది. అలోవెర జెల్ ను చర్మానికి అప్లై చేయడం వల్ల చర్మం ఫ్రెష్ గా కనబడుతుంది . మొటిమలు, మచ్చలను మాయం చేస్తుంది.

చల్లటి నీటితో ముఖం శుభ్రం చేసుకోవాలి:

చల్లటి నీటితో ముఖం శుభ్రం చేసుకోవాలి:

కొన్ని సందర్భాల్లో ఈ చర్మ సమస్యకి ఒక సింపుల్ చిట్కా . రోజులో అప్పుడప్పుడు ముఖంను చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి . ఇలా చేస్తుంటే చాలా వరకూ ఆయిల్ స్కిన్ నివారించబడుతుంది. ముఖంలో ఎక్సెస్ ఆయిల్ ను నివారిస్తుంది.

ఎక్స్ ఫ్లోయేట్ :

ఎక్స్ ఫ్లోయేట్ :

ఆయిల్ స్కిన్ నివారించడానికి ఎక్సఫ్లోయోట్ గ్రేట్ గా పనిచేస్తుంది. రెగ్యులర్ గా ఎక్స్ ఫ్లోయేట్ చేస్తుంటే చర్మంలో మంచి మార్పు వస్తుంది. ఆయిల్ స్కిన్ సమస్య తగ్గుతుంది . ఫ్రీరాడికల్స్ ను క్లియర్ చేస్తుంది . డెడ్ స్కిన్ సెల్స్ ను తొలగిస్తుంది. బేకింగ్ సోడా, ఆపిల్ సైడర్ వెనిగర్ వంటివి ఉపయోగించి నేచురల్ స్క్రబ్ ను తయారుచేసుకోవచ్చు.

ఫ్రూట్ ట్రీట్మెంట్:

ఫ్రూట్ ట్రీట్మెంట్:

ఫ్రూట్స్ లో ఆపిల్, ఆరెంజ్ వంటివి చర్మంలోని ఆయిల్ ను గ్రేట్ గా గ్రహించేస్తాయి. సిట్రస్ పండ్లలో స్మూతింగ్ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి . దాంతో మీ చర్మం ప్రకాశవంతంగా...రిఫ్రెష్ గా ఉంటుంది. ఈ ఫ్రూట్స్ ను ఉపయోగించడం వల్ల, ఆయిల్ స్కిన్ ను ఎఫెక్టివ్ గా నివారించుకోవచ్చు.

ఆపిల్ సైడర్ వెనిగర్:

ఆపిల్ సైడర్ వెనిగర్:

ఆపిల్ సైడర్ వెనిగర్ ను టోనర్ గా ఉపయోగించడం వల్ల ఆయిల్ స్కిన్ నివారించుకోవచ్చు . చర్మంలోని బ్యాక్టీరియాను నాశనం చేయడం వల్ల మొటిమలు, మచ్చల సమస్య ఉండదు,

నిమ్మరసం:

నిమ్మరసం:

నిమ్మరసం వండర్ ఫుల్ గా పనిచేస్తుంది . ఇది చర్మంలోని ఎక్సెస్ ఆయిల్ ను గ్రహిస్తుంది , బ్యాక్టీరియాతో పోరాడుతుంది ., మొటిమలు మచ్చలను తొలగిస్తుంది. సిట్రస్ లక్షణాలు చర్మంలో పిహెచ్ లెవల్స్ ను బ్యాలెన్స్ చేస్తుంది.

ఎగ్ వైట్ మాస్క్:

ఎగ్ వైట్ మాస్క్:

ఈ ఏజ్ ఓల్డ్ రెమెడీ ఆయిల్ స్కిన్ కు ఎక్కువ ప్రయోజనం అందిస్తుంది. ఎగ్ వైట్ ను మాస్క్ గా వేసుకోవాలి, ముఖ్యంగా ఈ సింపుల్ హోం రెమెడీ పవర్ ఫుల్ గా పనిచేస్తుంది. చర్మాన్ని స్మూత్ గా మరియు బ్యూటిఫుల్ మార్చుతుంది.

English summary

7 Most Effective Home Remedies For An Oily Skin

People who have an oily skin have larger sebaceous glands that can lead to an overproduction of oil. This in turn leads to other annoying skin conditions like clogged pores, build-up of dead skin cells, acne, breakouts, etc.
Story first published: Wednesday, June 1, 2016, 23:01 [IST]
Desktop Bottom Promotion