For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

చిన్న వయసులోనే చర్మం ముడతలు పడటానికి షాకింగ్ రీజన్స్..!!

By Swathi
|

కొన్నిసార్లు ఫీలవుతూ ఉంటాం. ఈ యూత్ ఫుల్ లుక్, యూత్ ఫుల్ డేస్ ఎంజాయ్ మెంట్ అన్నీ కొంతకాలానికి మిస్ అవ్వాల్సి వస్తుందని. అలాగే.. ఈ ఫన్ తో పాటు, మన వయసు ఛాయలు మరింత ఇబ్బందిపెడతాయన్న ఆందోళన కూడా ఉంటుంది.

ఆకర్షణలో మార్పులు, ముడతలు, ఏజ్ స్పాట్స్ ఎక్కువగా యూత్ ఫుల్ లుక్ పై ప్రభావం చూపుతాయి. అయితే.. ఈ లక్షణాలన్నీ కనిపిస్తాయన్న ఆందోళన ప్రతి ఒక్కరిలో ఉంటుంది. కానీ.. సరైన హెల్త్ కేర్, చర్మ సంరక్షణ తీసుకోవడం వల్ల వయసు ఛాయలు కనిపించడాన్ని కొంతకాలం వరకు అడ్డుకోవడం సాధ్యమవుతుంది.

ముడతలు, ఫైన్ లైన్స్, ఏజ్ స్పాట్స్, పిగ్మెంటేషన్, సాగింగ్ స్కిన్ వంటి లక్షణాలన్నీ.. వయసు పెరిగిన లక్షణాలను సూచిస్తాయి. ఓల్డ్ గా కనిపించడం వల్ల కొన్ని పనులు చేయలేకపోతాం. నలుగురిలో ఇబ్బందిగా ఫీలవ్వాల్సి వస్తుంది.

అసమతుల్య ఆహారం, న్యూట్రీషన్, వ్యాయామం చేయకపోవడం, సరైన కేర్ తీసుకోకపోవడం వంటి కారణాల వల్ల చాలా మందిలో చాలా చిన్న వయసులోనే ఏజింగ్ సంకేతాలు కనిపిస్తాయి. ఇవే కాకుండా.. మరికొన్ని ప్రీమెచ్యూర్ స్కిన్ ఏజింగ్ కి కారణమవుతాయి. అవేంటో చూద్దాం..

ఎక్కువగా వ్యాయామం చేయడం

ఎక్కువగా వ్యాయామం చేయడం

వ్యాయామం శరీరానికి మంచిదే అయినప్పటికీ.. దానికి లిమిట్ ఉండాలి. అతిగా చేయడం వల్ల.. ఆక్సిజన్, బ్లడ్ ఫ్లో ఫేస్, శరీరంలోని కొన్ని భాగాలకు తగ్గుతుంది. దీనివల్ల చర్మంపై చిన్నవయసులోనే ముడతలు రావడానికి కారణమవుతుంది.

పని ఒత్తిడి

పని ఒత్తిడి

ముడతలు, లైన్స్ ఫేస్ పై రావడానికి ఒక ముఖ్యమైన కారణం స్ట్రెస్ ఫుల్ జాబ్. ముఖ్యంగా ఎక్కువ సమయం కంప్యూటర్ల ముందు గడపటం వల్ల.. చర్మంపై ముడతలు, ఫైన్ లైన్స్ ఏర్పడతాయి.

ఎయిర్ కండిషనింగ్

ఎయిర్ కండిషనింగ్

ఏసీల కింద ఎక్కువ సమయం గడపడం వల్ల.. చర్మం డ్రైగా మారి, ముడతలు, ఫైన్ లైన్స్ చిన్న వయసులోనే రావడానికి ఎక్కువ అవకాశాలుంటాయి. కాబట్టి అలర్ట్ గా ఉండండి.

సన్ గ్లాసెస్ ఉపయోగించకపోవడం

సన్ గ్లాసెస్ ఉపయోగించకపోవడం

ఎండలోకి వెళ్లినప్పుడు సన్ గ్లాసెస్ ఉపయోగించకపోవడం వల్ల.. కంటి చుట్టూ ఉండే సున్నితమైన టిష్యూ.. డ్యామేజ్ అవుతుంది. దీనివల్ల ఫైన్ లైన్స్, డార్క్ సర్కిల్స్ కంటి చుట్టూ ఏర్పడటానికి కారణమవుతుంది.

స్ట్రాతో తాగడం

స్ట్రాతో తాగడం

రెగ్యులర్ గా డ్రింక్స్, జ్యూస్ లు స్ట్రాతో తాగే అలవాటు ఉంటే.. స్ట్రా పెదాలపై హార్ట్ గా తగులుతుంది. దీనివల్ల నోటి చుట్టూ.. లైన్స్ ఏర్పడతాయి.

కాంటాక్ట్ లెన్స్ వాడటం

కాంటాక్ట్ లెన్స్ వాడటం

కాంటాక్ట్ లెన్స్ వాడటం వల్ల కళ్ల చుట్టూ ఉండే సున్నితమైన చర్మం లాగినట్టు అవుతుంది. రెగ్యులర్ గా ఇలా కాంటాక్ట్ లెన్స్ పెట్టుకుంటూ ఉంటే.. లైన్స్, ముడతలు ఏర్పడటం మొదలవుతాయి.

బరువు తగ్గడం

బరువు తగ్గడం

బరువు తగ్గడం అనేది చాలామందికి టార్గెట్ గా ఉంటోంది. అందుకే.. చాలా తేలికగా, త్వరగా ఎక్కువ బరువు తగ్గాలని భావిస్తారు. ఇలా చేయడం వల్ల చర్మం సాగుతుంది. దీనివల్ల పెద్దవాళ్లలా కనిపిస్తారు.

English summary

7 Shocking Causes For Early Skin Ageing!

7 Shocking Causes For Early Skin Ageing! None of us like to develop signs of ageing on our skin such as wrinkles, fine lines, age spots, pigmentation, sagging skin, etc.
Story first published: Friday, July 8, 2016, 11:05 [IST]
Desktop Bottom Promotion