For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పుదీనాతో ఫేస్ ప్యాక్స్ : చర్మం రంగులో తక్షణ మార్పులు

|

పుదీనా చాలా పాపులర్ అయినటువంటి హేర్బ్. ఎందుకంటే పురాతన కాలం నుండి పుదీనాలోని ఔధగుణాలను వివిధ రకాల జబ్బులను నివారించుకోవడంలో గ్రేట్ గా ఉపయోగించుకుంటున్నారు . ఒక్క ఆరోగ్యానికి మాత్రమే కాదు, చర్మ ఆరోగ్యానికి కూడా గ్రేట్ గా సహాయపడుతుంది . ఘాటైన వాసన కలిగిన రిఫ్రెషింగ్ హెర్బ్ ఇది . పుదీనాలో మెంతాల్ మరియు యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి.

చర్మ సంరక్షణను పొందడానికి ఇది ఒక మంచి హెర్బ్ అని చెప్పవచ్చు. అందువల్ల చాలా వరకూ ఎక్కువ కాస్మోటిక్స్ లో దీన్ని విరివిగా ఉపయోగిస్తున్నారు . ఫేష్ వాష్, లోషన్స్, షాంపుల, కండీషనర్స్ మరియు క్రీమ్స్ లో ఎక్కువగా ఉపయోగిస్తున్నారు . ఇది చాలా యాక్టివ్ పదార్థం. అందుకే చర్మ సంరక్షణలో అమేజింగ్ బెనిఫిట్స్ ను అందిస్తుంది.

మన రెగ్యులర్ వంటకాల్లో పుదీనాను ఎందుకు చేర్చుకోవాలి

ఇది క్లెన్సర్ గా, టోనర్ గా మరియు మాయిశ్చరైజర్ గా పనిచేస్తుంది. ఇది చర్మంలో రంధ్రాలను మచ్చలను నివారించడంలో గ్రేట్ గా సమాయపడుతుంది. యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు అన్ని రకాల మచ్చలు స్కార్ మార్స్ ను నివారించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది . ఇది స్మూతీ ఏజెంట్ గా పనిచేస్తుంది. పుదీనాలో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు అనేక స్కిన్ ఇన్ఫెక్షన్స్ ను నివారిస్తుంది.

పెప్పర్ మింట్ టీ లో గొప్ప ఆరోగ్యప్రయోజనాలు

పుదీనాలో వివిధ రకాల ఔషధగుణాలు, లక్షణాలు ఉన్నాయి . కాబట్టి, దీన్నిదినదినాభివ్రుద్ది గా చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవడానికి ఉపయోగించుకోవచ్చు . చర్మనానికి వివిధ రకాలుగా ఉపయోగపడే పుదీనాలో అనేక రకాల బ్యూటీ బెనిఫిట్స్ ఉన్నాయి. వాటిలో కొన్ని ముఖ్యమైన ప్రయోజనాలను ఈ క్రింది స్లైడ్ ద్వారా మీకు అందివ్వడం జరిగింది....

1.ఏజ్ స్పాట్స్ తగ్గిస్తుంది:

1.ఏజ్ స్పాట్స్ తగ్గిస్తుంది:

పుదీనా ఏజ్ స్పాట్స్ తగ్గించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది. చర్మానికి పుదీనా పేస్ట్ ను అప్లై చేయడం వల్ల ముఖంలో మచ్చలు మరియు పిగ్మెంటేషన్ ను తగ్గిస్తుంది.

2.మచ్చలను మాయం చేస్తుంది:

2.మచ్చలను మాయం చేస్తుంది:

పుదీనాలో ఉండే సాలిసిలిక్ యాసిడ్ ఒక ఎఫెక్టివ్ ట్రీట్మెంట్ గా పనిచేస్తుంది . ఇది మచ్చలను మరియు చారలను మాయం చేస్తుంది. పుదీనా ఆకులను మెత్తగా పేస్ట్ చేసి మచ్చలు, చారలున్న ప్రదేశంలో అప్లై చేయాలి. అరగంట తర్వాత శుభ్రం చేసుకుంటే మాయం అవుతాయి.

3.ముడుతలను మాయం చేస్తుందిం పుదీనా ఆకులు ముడుతలను మాయం చేస్తుంది.

3.ముడుతలను మాయం చేస్తుందిం పుదీనా ఆకులు ముడుతలను మాయం చేస్తుంది.

పుదీనా రసంలో కొద్దిగా పెరుగు మరియు తేనె మిక్స్ చేసి ఈ పేస్ట్ ను చర్మానికి అప్లై చేయాలి. అరగంట తర్వాత ముఖాన్ని చల్లటి నీటితో శుభ్రం చేసుకుంటే సరిపోతుంది. ముడుతలు మరియు ఫైన్ లైన్స్ నివారించబడుతుంది. మాస్క్ తడి ఆరిన తర్వాత కొద్దిగా నీళ్ళ చల్లుకొని బాగా మసాజ్ చేసి తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇది డెడ్ స్కిన్ సెల్స్ ను నివారిస్తుంది. మరియు చర్మ రంధ్రాలను శుభ్రం చేస్తుంది.

4.స్కిన్ ఎక్స్ ఫ్లోయేట్ చేస్తుంది:

4.స్కిన్ ఎక్స్ ఫ్లోయేట్ చేస్తుంది:

పుదీనా ఆకులు చర్మాన్ని ఎక్స్ ఫ్లోయేట్ చేస్తుంది . పుదీనా రసంలో ఓట్ మీల్ వేసి ఫేస్ మాస్క్ లా తయారుచేయాలి. ఈ మాస్క్ ను ముఖం మొత్తం అప్లై చేయాలి. కొద్ది పేపు మసాజ్ చేసి తర్వాత చల్లటి నీటితో శుభ్ర చేసుకుంటే చర్మంలోని డెడ్ స్కిన్ సెల్స్ తొలగిపోతాయి.

5.స్మూత్ స్కిన్:

5.స్మూత్ స్కిన్:

పుదీనా చర్మానికి చాలా కూలింగ్ ఎఫెక్ట్ ను కలిగిస్తుంది . ముఖానికి కీరదోస అప్లై చేసిన ఎలాంటి ఫీలింగ్ కలుగుతుందో అలాంటి భావన పుదీనా కూడా కలిగిస్తుంది. పుదీనా రసాన్ని ముఖానికి అప్లై చేసి 20 నిముషాల తర్వాత ముఖం శుభ్రం చేసుకోవాలి. ఇది మైనర్ ఇన్ఫెక్షన్స్ మరియు స్కిన్ బర్న్స్ నివారిస్తుంది.

6.స్కిన్ కలర్ ను బ్రైట్ చేస్తుంది:

6.స్కిన్ కలర్ ను బ్రైట్ చేస్తుంది:

ఇది నేచురల్ ఆస్ట్రిజెంట్ గా పనిచేయడం మాత్రమే కాదు ఇది చర్మాన్ని బ్రైట్ గా మార్చుతుంది . చర్మ రంగును మార్చుతుంది . పుదీనా మెత్తగా పేస్ట్ చేసి ముఖానికి పట్టించాలి . కొద్దిసమయం అలాగే వదిలేసి తర్వాత శుభ్రం చేసుకోవడం ద్వారా చర్మం మెరుస్తుంటుంది.

7.స్కిన్ ప్రోజ్ ను టైట్ చేస్తుంది:

7.స్కిన్ ప్రోజ్ ను టైట్ చేస్తుంది:

చర్మ శుభ్రపరిచే క్రమంలో తెరచుకొన్న చర్మ రంద్రాలను మూసుకొనేలా చేయడంలో ఇది గ్రేట్ గా పనిచేస్తుంది . పుదీనా రసానికి కొద్దిగా తేనె మిక్స్ చేసి, ఈ పేస్ట్ ను ముఖానికి అప్లై చేయాలి. కొద్ది సమయం తర్వాత శుభ్రం చేసుకోవాలి. ఈ పద్దతి వల్ల చర్మం శుభ్రపడి క్లీన్ అవ్వడం మాత్రమే కాకు చర్మంలోపల వరకూ శుభ్రం చేస్తుంది . వారానికొకసారి చేస్తుంటే మంచి ఫలితం ఉంటుంది.

English summary

Amazing Uses Of Mint For Skin

Mint is great herb when it comes to maintaining a good skin care regimen. Therefore, it is extensively used in a lot of cosmetic products, including facewashes, lotions, shampoos, conditioners and creams, as one of the active ingredients. There are some amazing benefits of mint for the skin.
Story first published: Thursday, January 7, 2016, 18:23 [IST]
Desktop Bottom Promotion