For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బియ్యం పిండితో.. చర్మానికి కలిగే అమేజింగ్ బెన్ఫిట్స్..!!

By Swathi
|

మెరిసే చర్మానికి చాలా రకాల క్రీములు, లోషన్స్ వాడి ఉంటారు. అయితే.. హోంమేడ్ ప్రొడక్ట్స్ ని ఖచ్చితంగా నిర్లక్ష్యం చేసి ఉంటారు. చాలామందికి హోం మేడ్ ప్రొడక్ట్స్ వల్ల పొందే అమేజింగ్ బెన్ఫిట్స్ తేలియదు. అలాగే.. హోంమేడ్ ప్రొడక్ట్స్ వల్ల.. అనవసర సైడ్ ఎఫెక్ట్స్ కి కూడా దూరంగా ఉండవచ్చు.

మార్కెట్ లో తయారు చేసే ప్రొడక్ట్స్ లో చాలా కెమికల్స్ ఉంటాయి. ఇవి.. త్వరగా ఫలితాన్ని ఇచ్చినప్పటికీ.. చర్మానికి మెల్లి మెల్లిగా హాని చేస్తాయి. బియ్యం పిండి చర్మానికి అద్భుతమైన ఫలితాలు ఇచ్చే హోం ప్రొడక్ట్స్ లో ఒకటి. కెమికల్ ప్రొడక్ట్స్ కంటే.. చాలా ఎఫెక్టివ్ ఫలితాన్నిస్తుంది బియ్యం పిండి.

చర్మానికి బియ్యం పిండి ఉపయోగించడం వల్ల అనేక ఫలితాలు పొందవచ్చు. బియ్యం పిండి ఉపయోగించడం కొత్తేమీ కాదు. పూర్వకాలం నుంచి.. దీన్ని చర్మ సంరక్షణకు ఉపయోగిస్తూ వస్తున్నారు. ఒకప్పుడు బ్లీచ్ లేనప్పుడు, ఫెయిర్ నెస్ క్రీములు, పౌడర్లు లేనప్పుడు.. కేవలం రైస్ ఫ్లోర్ ఉపయోగించి.. న్యాచురల్ స్కిన్ టోన్ పొందేవాళ్లు.

మరి బియ్యం పిండితో చర్మానికి పొందే అమేజింగ్ బెన్ఫిట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం..

ఆయిల్ పీల్చడానికి

ఆయిల్ పీల్చడానికి

ఆయిలీ స్కిన్ నివారించడానికి బియ్యం పిండి చక్కటి పరిష్కారం. కార్న్ స్టార్చ్, బియ్యం పిండి కలిపి పెట్టుకోవాలి. బయటకు వెళ్లాలి అనుకున్నప్పుడు ఫేస్ పౌడర్ లా దీన్ని ఉపయోగిస్తే.. అదనపు ఆయిల్ ని పీల్చుకుని.. ఫ్రెష్ లుక్ అందిస్తుంది.

మొటిమలు తగ్గించడానికి

మొటిమలు తగ్గించడానికి

బియ్యం పిండి, అలో వెరా జెల్, తేనె కలిపి పేస్ట్ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించాలి. 20 నిమిషాల తర్వాత.. శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల మొటిమలు, మచ్చలు తొలగిపోతాయి. నలుపుదనం కూడా తగ్గిపోతుంది.

స్క్రబ్

స్క్రబ్

ముఖానికి మాత్రమే కాదు.. బియ్యం పిండి.. ఎక్స్ ఫోలియేటర్ గా కూడా శరీరానికి పనిచేస్తుంది. బియ్యం పిండి, శనగపిండి, తేనె, పంచదార, కొబ్బరినూనె కలుపుకోవాలి. దీన్ని స్ర్కబ్ లా ఉపయోగిస్తే.. డెడ్ స్కిన్ సెల్స్ తొలగిపోయి.. చర్మం సాఫ్ట్ అండ్ స్మూత్ గా కనిపిస్తుంది.

చర్మాన్ని టైట్ గా చేస్తుంది

చర్మాన్ని టైట్ గా చేస్తుంది

వదులుగా మారిన చర్మాన్ని టైట్ చేయడంలో ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది బియ్యం పిండి. ఎగ్ వైట్, తేనె, కొద్దిగా బియ్యం పిండి కలుపుకుని.. ముఖానికి పట్టించాలి. అన్ని రకాల చర్మ తత్వం వాళ్లు ఈ ప్యాక్ ఉపయోగించవచ్చు. ఈ ప్యాక్ వల్ల ముడతలు, ఫైన్ లైన్స్ తొలగిపోతాయి.

స్కిన్ టోన్

స్కిన్ టోన్

బియ్యం పిండిని న్యాచురల్ స్కిన్ లైటెనింగ్ ఏజెంట్ గా చెప్పవచ్చు. బియ్యం పిండి, పాల పొడి, ఓట్ మీల్ కలిపి ప్యాక్ తయారు చేసుకోవాలి. ఈ ప్యాక్ ని అప్లై చేయడం వల్ల.. నిర్జీవంగా ఉన్న చర్మం.. బ్రైట్ గా, ఫ్రెష్ గా మారుతుంది. అదికూడా కేవలం 15 రోజుల్లో.

డార్క్ సర్కిల్స్ తొలగించడానికి

డార్క్ సర్కిల్స్ తొలగించడానికి

బాగా పండిన అరటిపండు, ఆముదం, బియ్యం పిండి కలిపి.. ప్యాక్ తయారు చేసుకుని కళ్లకింద అప్లై చేయాలి. ఇది.. కళ్ల కింద చర్మాన్ని స్మూత్ గా మార్చి.. నల్లటి వలయాలను ఎఫెక్టివ్ గా తొలగిస్తుంది.

గ్లోయింగ్ స్కిన్

గ్లోయింగ్ స్కిన్

బియ్యం పిండి, పెరుగు, యాపిల్ జ్యూస్, ఆరంజ్ జ్యూస్ కలిపి ప్యాక్ వేసుకోవాలి. ఇది డార్క్ స్పాట్స్ తొలగించి, నిర్జీవంగా మారిన చర్మాన్ని ప్రకాశవంతంగా మారుస్తుంది. అలాగే న్యాచురల్ గ్లో అందిస్తుంది.

English summary

Beauty Benefits Of Rice Flour For Skin

Beauty Benefits Of Rice Flour For Skin. For fair tone, you rely on several creams and lotions. However, it is a fact that you ignore the homemade products often.
Story first published:Tuesday, August 9, 2016, 15:27 [IST]
Desktop Bottom Promotion