For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

నిమ్మతో పొందే కాస్మొటిక్ బెన్ఫిట్స్

By Swathi
|

అన్ని వర్గాల వారికి చేరువలో ఉంటుంది నిమ్మకాయ. ఇది ఆరోగ్యానికే కాదు.. అందానికి కూడా రకరకాలుగా ఉపయోగపడుతుంది. అయితే చాలామందికి నిమ్మకాయను బ్యూటీ ప్రొడక్ట్స్ వాడటానికి అపోహలు పడుతుంటారు. నిమ్మరసంలో సిట్రస్ ఉండటం వల్ల ఇది ముఖంపై మొటిమలు ఉన్న ప్రాంతాల్లో అప్లై చేసినప్పుడు కాస్త మంటగా అనిపిస్తుంది. దీనివల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్ కలుగుతాయేమో అని అనుమానాలు వ్యక్తం చేస్తుంటారు.

నిమ్మరసంతో జుట్టుకు కలిగే అదనపు ప్రయోజనాలు!

నిమ్మకాయను కాస్మెటిక్స్ లో ఉపయోగించాల్సిన అవసరం ఏమిటి ? బ్యూటీ సీక్రెట్స్ నిమ్మద్వారా ఎలా పొందవచ్చు అనే విషయంపై చాలా మందికి క్లారిటీ ఉండదు. నిమ్మలో ఎసిడిక్ గుణాలు, తక్కువ పీహెచ్ స్థాయి, విటమిన్ సి ఉంటాయి. అలాగూ ఇందులో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు కూడా చర్మ సమస్యలతో ఎఫెక్టివ్ గా పోరాడతాయి. నిమ్మరసం ద్వారా అనేక చర్మ సమస్యలకు గుడ్ బై చెప్పవచ్చు. అదెలాగో ఇప్పుడు చూద్దాం.

Benefits Of Lemon In Cosmetic

యాక్నే:
నిమ్మలో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు చర్మానికి క్లెన్సింగ్ ఎఫెక్ట్ నిస్తూ.. డర్ట్, డెడ్ స్కిన్ సెల్స్, వైడ్ హెడ్స్, బ్లాక్ హెడ్స్ తొలగించడానికి సహాయపడతాయి. అలాగే నిమ్మరసంలో ఉండే ఎసెన్షియల్ ఆయిల్స్ యాక్నేతో ఎఫెక్టివ్ గా పోరాడతాయి.

లెమన్ జ్యూస్ త్రాగుతున్నారా? ఐతే అందులోని సైడ్ ఎఫెక్ట్స్ తెలుసుకోండి...

జుట్టుకి బ్లీచింగ్ ఏజెంట్:
జుట్టు పొడిబారకుండా.. కాపాడటానికి నిమ్మరసం సహాయపడుతుంది. అయితే నిమ్మరసం జుట్టు సంరక్షణకు ఎక్కువ మోతాదులో వాడకూడదు. కాబట్టి.. కొబ్బరినూనెతో కలిపి వాడితే.. మంచి ప్రయోజనం ఉంటుంది. దీనివల్ల జుట్టులో సహజ నూనెలను కాపాడటమే కాకుండా.. కండిషనర్ లా పనిచేస్తుంది.

Benefits Of Lemon In Cosmetic

న్యాచురల్ డియోడరెంట్:
నిమ్మరసంలో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ చెమట వాసన నుంచి కాపాడతాయి. ఇది న్యాచురల్ డియోడరెంట్ లా ఉపయోగపడుతుంది. బ్యాక్టీరియాలతో పోరాడి శరీరం నుంచి దుర్వాసన రాకుండా చూస్తుంది. డియోడరెంట్ గా నిమ్మకాయ ఉపయోగించడం చాలా సింపుల్. నిమ్మకాయను కట్ చేసి.. చంక భాగంలో రుద్దుకోవడం వల్ల.. రోజంతా ఫ్రెష్ ఫీలింగ్ ఉంటుంది.

పురుషుల్లో చుండ్రు: నిమ్మతో నివారణా చిట్కాలు

ముడతలు ఎలా తొలగిస్తుంది ?:
నిమ్మరసాన్ని ఏదో ఒక రూపంలో తీసుకోవడం వల్ల చర్మంపై ముడతలు, గీతలు అరికట్టవచ్చు. నిమ్మతోపాటు విటమిన్ సి ఫ్రూట్స్ కూడా డైట్ లో చేర్చుకుంటే వయసు ఛాయలు మీ చర్మంలో కనిపించకుండా కాపాడుకోవచ్చు. ఉదయం లేదా రాత్రి నిమ్మరసాన్ని ముఖానికి అప్లై చేసి.. 10 నుంచి 30 నిమిషాలు అలానే వదిలేయాలి. తర్వాత క్లీన్ చేసుకోవడం వల్ల మ్యాజిక్ మీకే తెలుస్తుంది.

Benefits Of Lemon In Cosmetic

గోళ్లకు:
నిమ్మరసంలో చేతిగోళ్లు, కాలిగోళ్లు కాసేపు నానబెట్టడం వల్ల అవి బలంగా మారడంతోపాటు, గోళ్లు విరిగిపోకుండా.. అందంగా, ఆకర్షణీయంగా కనిపిస్తాయి. అలాగే ఫంగల్ ఇన్ఫెక్షన్స్, గోళ్ల రంగు మారడం వంటి సమస్యలను కూడా అరికడుతుంది.

Story first published: Friday, January 8, 2016, 16:16 [IST]
Desktop Bottom Promotion