For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఎగ్ ఫేస్ ప్యాక్ లతో.. యంగ్ అండ్ డైనమిక్ లుక్..!!

ఎగ్స్ లో ప్రొటీన్లు ఉండటం వల్ల చర్మానికి చాలా సహాయపడతాయి. ఎలాస్టిసిటీని పెంచి.. డ్యామేజ్ అయిన స్కిన్ సెల్స్ ని రిపేర్ చేస్తాయి. ఇందులో బి2, బి3 వంటి విటమిన్స్ ఉండటం వల్ల చర్మాన్ని హైడ్రేట్ చేస్తాయి.

By Swathi
|

ఎగ్ లో ఉండే పోషకాల గురించి చాలామందికి తెలుసు. అలాగే.. ఎగ్ తో చర్మానికి కలిగే ప్రయోజనాలు కూడా తెలుసు. అయితే ఎగ్ ని ఎలా ఉపయోగించడం వల్ల యంగ్ లుక్ సొంతం చేసుకోవచ్చో తెలుసుకుందాం..

ఎగ్ ఫేస్ ప్యాక్ అంటే చాలా మందికి ఇష్టం ఉండదు. ఎందుకంటే.. ఎగ్ నుంచి వచ్చే వాసన నచ్చదు. అయితే.. ఎగ్ మాస్క్ లతో పొందే అమేజింగ్ స్కిన్ బెన్ఫిట్స్ తెలుసుకుంటే మాత్రం.. మీరు కూడా ఎగ్ మాస్క్ లను కంపల్సరీ ట్రై చేస్తారు.

egg masks

ఎగ్స్ లో ఎక్కువ ప్రొటీన్లు ఉండటం వల్ల చర్మానికి చాలా సహాయపడతాయి. ఎలాస్టిసిటీని పెంచి.. డ్యామేజ్ అయిన స్కిన్ సెల్స్ ని రిపేర్ చేస్తాయి. ఇందులో బి2, బి3 వంటి విటమిన్స్ ఉండటం వల్ల చర్మాన్ని హైడ్రేట్ చేస్తాయి. అలాగే.. ఫ్రీ రాడికల్స్ నుంచి ప్రొటెక్ట్ చేస్తాయి.

కోడిగుడ్డులో ఉండే జింక్.. చర్మంలో వయసు చాయలు రాకుండా అడ్డుకుంటాయి. అలాగే ఎగ్ లో వాటర్, ఫ్యాట్ ఉండటం వల్ల.. చర్మంలో మాయిశ్చరైజర్ లెవెల్స్ అలాగే ఉండటానికి సహాయపడుతుంది. చర్మం స్మూత్ గా కూడా మారుతుంది.

మరి ఇంకెందుకు ఆలస్యం.. ఇక వెంటనే.. ఎగ్ ఫేస్ మాస్క్స్ ఎలా తయారు చేసుకోవాలి, ఎలా ఉపయోగించాలో తెలుసుకుందాం.. ముడతలు రాకుండా, చర్మం యూత్ ఫుల్ లుక్ పొందడానికి.. ఎగ్ తో ఎలాంటి ఫేస్ ప్యాక్స్ వేసుకోవచ్చో తెలుసుకుందాం..

ఎగ్, పెరుగు, అవకాడో

ఎగ్, పెరుగు, అవకాడో

1గుడ్డులోని తెల్లసొన, ఒక టేబుల్ స్పూన్ అవకాడో, అంతే మోతాదులో పెరుగు మిక్స్ చేయాలి. అన్నింటినీ బాగా మిక్స్ చేసి.. ముఖానికి, మెడకు పట్టించాలి. ఆరిన తర్వాత.. నీటితో శుభ్రం చేసుకోవాలి. అంతే.. చర్మానికి మాయిశ్చరైజర్ అంది.. స్మూత్ గా మారుతుంది.

ఎగ్, తేనె

ఎగ్, తేనె

ఎగ్ వైట్. 1 టేబుల్ స్పూన్ తేనె మిక్స్ చేయాలి. రెండింటినీ బాగా మిక్స్ చేసుకోవాలి. ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత ఈ ప్యాక్ అప్లై చేయాలి. 30 నిమిషాల తర్వాత.. స్క్రబ్ చేసి శుభ్రం చేసుకోవాలి. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్.. చర్మాన్ని బ్రైట్ గా మారుస్తాయి.

ఎగ్, అరటిపండు, ఆల్మండ్ ఆయిల్

ఎగ్, అరటిపండు, ఆల్మండ్ ఆయిల్

1ఎగ్ వైట్, 1 టేబుల్ స్పూన్ అరటిపండు గుజ్జు, కొన్ని చుక్కల ఆల్మండ్ ఆయిల్ కలపాలి. అన్నింటినీ మిక్సీలో వేసి బ్లెండ్ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి మెడకు పట్టించాలి. 30 నిమిషాల తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల.. చర్మంలో మలినాలు బయటకుపోయి.. చర్మానికి కొత్తమెరుపుని అందిస్తుంది. అలాగే.. ఏజింగ్ ప్రాసెస్ ని స్లోగా మారుస్తుంది.

ఎగ్ వైట్, మట్టి

ఎగ్ వైట్, మట్టి

ఒక ఎగ్ లోని తెల్లసొన, 1 టీస్పూన్ ముల్తానీ మట్టి మిక్స్ చేసి.. ముఖానికి ప్యాక్ లా అప్లై చేయాలి. అరగంట తర్వాత.. చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇందులో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు.. మొటిమలు నివారించి.. చర్మాన్ని స్మూత్ గా మారుస్తాయి.

ఎగ్, క్యారట్

ఎగ్, క్యారట్

ఒక టేబుల్ స్పూన్ క్యారట్ జ్యూస్, ఒక ఎగ్ వైట్ తీసుకుని బాగా మిక్స్ చేయాలి. ఇందులో కాటన్ బాల్ ముంచి.. ముఖానికి రాసుకోవాలి. బాగా ఆరిపోయిన తర్వాత.. చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. అంతే.. వెంటనే చర్మంలో గ్లోయింగ్ పెరుగుతుంది.

ఎగ్ వైట్

ఎగ్ వైట్

కేవలం ఎగ్ వైట్ ని మాత్రమే.. ముఖానికి రాసుకోవాలి. బాగా ఆరిన తర్వాత.. చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. వారానికి రెండుసార్లు ఈ ప్యాక్ వేస్తే.. ముడతలు రాకుండా.. ఉంటాయి.

ఎగ్ వైట్, గ్లిజరిన్, తేనె

ఎగ్ వైట్, గ్లిజరిన్, తేనె

ఒక ఎగ్ వైట్, 1 టేబుల్ స్పూన్ తేనె, 1 టేబుల్ స్పూన్ గ్లిజరిన్ తీసుకోవాలి. అన్నింటినీ.. బాగా బ్లెండ్ చేసుకుని.. ఫేస్ కి అప్లై చేయాలి. చర్మం బిగుతుగా అనిపించిన తర్వాత.. నెమ్మదిగా పీల్ ఆఫ్ చేయాలి. అంతే.. ఈ హెర్బల్ ప్యాక్.. ఆయిల్ ప్రొడక్షన్ ని కంట్రోల్ చేసి.. స్కిన్ టోన్ ని పెంచుతుంది.

దోసకాయ, ఎగ్ వైట్

దోసకాయ, ఎగ్ వైట్

ఒక ఎగ్ వైట్, టేబుల్ స్పూన్ దోసకాయ రసం మిక్స్ చేసి.. ముఖానికి అప్లై చేయాలి. 15 నుంచి 30 నిమిషాల తర్వాత చల్లటినీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ ప్యాక్ మీ స్కిన్ టోన్ ని మెరుగుపరుస్తుంది.

యాపిల్, ఎగ్ వైట్

యాపిల్, ఎగ్ వైట్

యాపిల్ తొక్క తీసి.. గుజ్జు తీయాలి. అందులో ఎగ్ వైట్ మిక్స్ చేసి.. రెండింటినీ బాగా మిక్సీ పట్టుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి, మెడకు పట్టించి.. 30 నిమిషాలు ఆరనివ్వాలి. బాగా ఆరిన తర్వాత.. కొన్ని వాటర్ చిలకరించి.. బాగా స్క్రబ్ చేసుకోవాలి. తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి.

ఎగ్, శనగపిండి, నిమ్మరసం

ఎగ్, శనగపిండి, నిమ్మరసం

1 ఎగ్ వైట్, టీస్పూన్ శనగపిండి, కొన్ని చుక్కల నిమ్మరసం తీసుకుని.. పచ్చి పాలు మిక్స్ చేసి.. పేస్ట్ తయారు చేసుకోవాలి. పలుచగా.. ప్యాక్ అప్లై చేసుకోవాలి. చర్మం బిగుతుగా మారిన తర్వాత.. చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇది.. చర్మంలో పేరుకున్న దుమ్ము, ధూళిని క్లియర్ చేసి.. గ్లోయింగ్ అందిస్తుంది.

English summary

Can Egg Really Make You Look Younger?

Can Egg Really Make You Look Younger? We have heard so much about eggs and their magical properties for the skin that we just had to find out for ourselves if it is really what all that it claims to be!
Story first published: Thursday, October 13, 2016, 11:38 [IST]
Desktop Bottom Promotion