For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

టీనేజ్ లో ఎదురయ్యే చర్మ సమస్యలకు గుడ్ బై చెప్పిండిలా..

By Super
|

మీ చర్మం మీద శ్రద్ధతో తరచూ అద్దంలో మొహం చూసుకుంటూ ఉండే అబ్బాయిలు టీనేజ్ లోకి అడుగుపెట్టగానే.. రకరకాల చర్మ సమస్యలు ఎదుర్కొంటారు. టీనేజ్ లోకి ఎంటర్ అవగానే చర్మంలో అనేక మార్పులు కనిపిస్తాయి.

అయితే కంగారు పడకండి టీనేజ్ లో ఇవి చాలా కామన్. అందరూ టీనేజ్ లో పలురకాల మానసిక, శారీరక మార్పులకి గురవుతారు. ఈ మార్పులకి తోడు మీ చర్మం కూడా మార్పులకి లోనయితే కాస్త కంగారు పడటం సాధారణం. అందువల్ల మీరు భయపడాల్సిన అవసరం లేదు. అసలు టీనేజ్ లో వచ్చే చర్మ సమస్యలకి కారణం తెలుసుకుంటే వాటిని అధికమించడం చాలా తేలిక. కాబట్టి ఈ ఆర్టికిల్ ద్వారా టీనేజ్ లో వచ్చే 7 కామన్ స్కిన్ ప్రాబ్లమ్స్, వాటిని ఎలా అధికమించాలో తెలుసుకోవచ్చు.

సన్‌బర్న్

సన్‌బర్న్

ఎండకి చర్మం కమలడమనే సమస్య చాలా మంది టీనేజర్లను వేధించే సమస్య. ఎండలో ఎక్కువగా తిరగడం వల్ల అల్ట్రా వయోలెట్ కిరణాల ప్రభావానికి లోనయ్యి ఈ సమస్య తలెత్తుతుంది.

ఆయిలీ స్కిన్

ఆయిలీ స్కిన్

ఆయిలీ స్కిన్ అనేది ఎక్కువగా కనిపించే స్కిన్ ప్రాబ్లమ్స్. కొన్ని సార్లు ఇది వంశపారం పర్యం గా కూడా రావచ్చు. ఆయిలీ స్కిన్ లేదా జిడ్డు చర్మం నుంచి విముక్తి పొందాలంటే తక్కువ గాఢత ఉన్న క్లెన్సర్, మాయిశ్చరైజర్, ఆయిల్ ఫ్రీ కాస్మెటిక్స్ వాడాలి. అలాగే మార్కెట్లో దొరికే బ్లాటింగ్ పేపర్ లాంటి పేపర్ షీట్లు ఉపయోగించి మీ మొహాన్ని తరచూ అద్దుకుంటూ ఉంటే ఈ సమస్య తగ్గుముఖం పడుతుంది.

డ్రై స్కిన్

డ్రై స్కిన్

మీ చర్మంలో తేమ శాతం బాగా తక్కువైతే చర్మం పొడిబారుతుంది. డ్రై స్కిన్ ఉన్న వాళ్లల్లో చర్మం బాగా పొడిగా, పగుళ్లు ఉన్నట్లుగా ఉండి పొట్టులా రాలుతూ ఉంటుంది. ఎక్కువ మేకప్ వాడటం, ఎండలో ఎక్కువగా తిరగడం, పొడి వాతావరణం, ఎక్కువగా మొహం కడుక్కోవడం, గాఢత ఎక్కువ ఉన్న సబ్బులు ఉపయోగించడం, కొన్ని రకాల మందులు లేదా వ్యాధులవల్ల ఈ సమస్య ఎదురవుతుంది. దీనిని అరికట్టాలంటే వాసన లేని మాయిశ్చరైజర్ వాడుతూ, ఎండలో సాధ్యమైనంత తక్కువ తిరగాలి. అలాగే రోజుకి కనీసం 2 లీటర్ల మంచి నీళ్లు తాగడం వల్ల కూడా ఈ సమస్య నుంచి గట్టెక్కవచ్చు.

మచ్చలు

మచ్చలు

టీనేజ్ లో వేధించే మరో సమస్య మచ్చలు. దాదాపు ప్రతీ టీనేజర్ ఈ సమస్యని ఎదుర్కొంటారంటే అతిశయోక్తి కాదేమో. టీనేజ్ లో హార్మోన్ల ప్రభావం వల్ల చర్మ గ్రంధులు ఎక్కువగా నూనెని స్రవించడం వల్ల ఈ మచ్చలు వస్తాయి.

పులిపిర్లు

పులిపిర్లు

మీ చర్మపు రంగులోనే ఉండి వేళ్ళ మీదా, గోళ్ళ కిందా,అరికాళ్ళల్లో లేదా చేతుల వెనక వచ్చే చిన్న చిన్న కాయలాంటివి పులిపిర్లు. వైరల్ ఇంఫెక్షన్ వల్ల టీనేజర్లలో ఇవి వస్తాయి. కెమికల్ లేదా లేజర్ ట్రీట్మెంట్లు, లేదా ద్రవ నత్రజని ఉపయోగించి పులిపిరులని తీసేయడం వంటి రకరకాల ట్రీట్మెంట్లు అందుబాటులో ఉన్నాయి.

యాక్నే

యాక్నే

టీనేజీ పిల్లలని వేధించే మరో సమస్య యాక్నే. యవ్వన దశలో హార్మోన్ల స్థాయిలు పెరగడం వల్ల ఈ సమస్య తలెత్తుతుంది. హార్మోన్ల ప్రభావం వల్ల సెబాషియస్ గ్రంధులు వ్యాకోచించి ఎక్కువగా నూనెని స్రవించడం వల్ల చర్మానికి యాక్నే సమస్య వస్తుంది. ఈ సమస్య ని నివారించడానికి రకరకాల జెల్స్, క్రీములు, లోషన్ల్స్ అందుబాటులో ఉన్నాయి. ఇవి వాడటానికి ముందు మీరు ఒక మంచి స్కిన్ స్పెషలిస్ట్ ని సంప్రదించాలి. లేదా చక్కటి హోం రెమిడీస్ వాడితో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు.

ఎక్జీమా

ఎక్జీమా

టీనేజీ పిల్లలలో మరో ముఖ్య సమస్య ఎగ్జిమా. ఇది చర్మం మీద ఎర్రటి రాష్ రూపంలో వచ్చి బాగా దురద పెడుతుంది. సాధారణంగా ఎక్జీమా మోకాళ్ళు, మోచేతుల వద్ద వస్తుంది. సమస్య అధికమయితే తలలో, మొహం మీద కూడా కనిపిస్తుంది. స్నానం చేసిన వెంటనే లేదా స్విమ్మింగ్ చేశాక వాసన లేని మాయిశ్చరైజర్ చర్మానికి పట్టించాలి. కానీ దురద బాగా బాధిస్తోంటే మాత్రం నిపుణుడిని సంప్రదించడం మంచిది.

English summary

Dealing With Teenage Skin Problems

Dealing With Teenage Skin Problems. In our teenage years, we all go through a myriad of emotional as well as physical changes. In addition to these changes, you become even more distressed when you suffer from a number of skin problems.
Desktop Bottom Promotion