స్మూత్ స్కిన్

స్మూత్ స్కిన్

గంధం పొడిలో కావాల్సిన మోతాదులో పచ్చిపాలు కలిపి.. ముఖానికి అప్లై చేసుకోవాలి. ఆరిన తర్వాత చల్లటినీటితో శుభ్రం చేసుకోవాలి. పాలు చర్మాన్ని స్మూత్ గా మారిస్తే.. గంధం.. చర్మం మెరిసేలా చేస్తుంది. డ్రై స్కిన్ ఉన్నవాళ్లు ఈ ప్యాక్ అప్లై చేస్తూ ఉండాలి.

స్క్రబ్

స్క్రబ్

రెండు టేబుల్ స్పూన్ పపాయ గుజ్జు, ఒక స్పూన్ బియ్యం పిండి, రెండు స్పూన్ల తేనె, కొద్దిగా చక్కెర పొడి తీసుకుని.. అన్నింటినీ బాగా మిక్స్ చేయాలి. ఈ మిశ్రమంతో.. ముఖాన్ని 5నిమిషాలు పాటు స్క్రబ్ చేసుకోవాలి. ఇవి.. బ్లాక్ హెడ్స్ ని తేలికగా తొలగిస్తాయి.

టమోటా

టమోటా

టమోటాలో బీటా కెరోటిన్, లైకోపిన్ ఉంటుంది. ఇది.. చర్మాన్ని బ్రైట్ గా, టోన్డ్ గా మార్చేస్తుంది. టమోటాను రెండు ముక్కలుగా కట్ చేసి.. దానిపై పంచదార చల్లాలి. ఇప్పుడు ఈ టమోటా ముక్కతో.. ముఖంపై గుండ్రంగా స్క్రబ్ చేయాలి. ఇలా 10 నిమిషాలు చేసి శుభ్రం చేసుకుంటే.. నిర్జీవమైనత చర్మం కాంతివంతంగా మారుతుంది.

 క్లెన్సింగ్

క్లెన్సింగ్

ఓట్ మీల్, పెరుగు రెండింటినీ సమానంగా తీసుకుని.. కొద్దిగా వేడి చేయాలి. ఇప్పుడు తేనె కలిపి.. పేస్ట్ తయారు చేసుకోవాలి. ఈ ప్యాక్ ని ముఖానికి పట్టించి 10 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. అంతే.. ఇది క్లెన్సింగ్ లా పనిచేసి.. చర్మానికి నిగారింపు అందిస్తుంది.

ఫేస్ ప్యాక్

ఫేస్ ప్యాక్

పండుగ అంటే.. ఆ పని ఈ పని అంటూ హడావుడిగా ఉంటారు. కాబట్టి.. తేలికగా చర్మాన్ని మెరిపించాలంటే.. సింపుల్ ప్యాక్ అప్లై చేయాలి. తేనె, నిమ్మరసం రెండూ సమానంగా తీసుకుని ముఖానికి ప్యాక్ లా అప్లై చేయాలి. ఆరిన తర్వాత.. చల్లటినీటితో శుభ్రం చేసుకుంటే.. వెంటనే చర్మంలో కాంతిని గమనించవచ్చు.

మోచేతులు

మోచేతులు

ముఖం, శరీరం అంతా బాగానే ఉన్నా కొంతమందికి మోచేతులు, మోకాళ్లు నల్లగా మారి అసహ్యంగా ఉంటాయి. ఇలాంటి సమస్య ఉన్నవాళ్లు.. మినప్పును రాత్రంతతా నానబెట్టాలి. ఉదయం పేస్ట్ చేసుకోవాలి. అందులో కాస్త బొప్పాయి గుజ్జు కలిపి.. మోకాళ్లు, మోచేతులకు అప్లై చేయాలి. ఆరిన తర్వాత శుభ్రం చేసుకుంటే.. నలుపుదనం పోతుంది.

అరటిపండు

అరటిపండు

బాగా పండిన అరటిపండు తీసుకుని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. అందులోకి ఒక టేబుల్ స్పూన్ తేనె, చిటికెడు పసుపు కలిపి.. ముఖానికి పట్టించాలి. ఈ హోంమేడ్ ఫేస్ ప్యాక్ ఆరిన తర్వాత స్క్రబ్ చేసి శుభ్రం చేసుకోవాలి.

Read more about: beauty skin care diwali beauty tips home remedies బ్యూటి అందం స్కిన్ కేర్ చర్మ సంరక్షణ బ్యూటి టిప్స్ హోం రెమిడీస్
English summary

Diwali special: Tips to make your skin glow

Diwali special: Tips to make your skin glow. While you spruce up your home and shop till you drop in these hectic days before Diwali.
Story first published: Monday, October 17, 2016, 18:00 [IST]
 
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X