For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

డూ ఇట్ యువర్ సెల్ఫ్: సెన్సిటివ్ స్కిన్ వారికి -బనానా అండ్ ఓట్ మీల్ ఫేస్ స్ర్కబ్

|

సాధారణంగా కొంత మంది చర్మం గమనించినట్లైతే చాలా సెన్సిటివ్ గా కనిపిస్తుంది ? అలాంటి వారు కాస్మోటిక్స్ ఉపయోగించడం వల్ల వెంటనే చర్మం రియాక్ట్ అవుతుంది? దాంతో చర్మంలో మంట, స్కిన్ రాషెస్, చర్మం ఎర్రగా మారడం వంటి లక్షణాలు కనబడుతాయి. అలాంటి సెన్సిటివ్ స్కిన్ ను మీరు కూడా కలిగి ఉన్నారా?

సమాధానం అవును అన్నట్లైతే , తప్పనిసరిగా ఈ ఆర్టికల్ మీకోసమే..ఖచ్చితంగా చదివి తెలుసుకోవాల్సిందే..
చాలా మందిలో స్కిన్ కండీషన్స్ లో సెన్సిటివ్ స్కిన్ అత్యంత సాధారణమైనది. ఈ సమస్యతో చాలా మంది బాధపడుతుంటారు. అందుకోసం వైద్యపరంగా ఎలాంటి మెడికేషన్స్ లేవు . ఇంకా కొంత మంది నిపుణులు కూడా ఈ విషయాన్ని అంగీకరించారు. సాధారణ చర్మం వారితో పోల్చితే సెన్సిటివ్ చర్మం ఉన్న వారు కొద్దిమందే అన్నవిషయాన్ని కూడా గుర్తించారు.

సెన్సిటివ్ స్కిన్ ఉన్నవారు , స్కిన్ హెల్తీగా మెయింటైన్ చేయడం కష్టం. కొన్ని రకాల చర్మ తత్వాలు, డెడ్ స్కిన్ సెల్స్ ఏర్పడటం, మొటిమలు సమస్యలు చాలా సాధారణంగా ఉంటాయి మరియు కొంత మందిలో చర్మంగా ఎర్రగా కందిపోవడం, దురద, మరియు ఇతర చర్మ సమస్యలుంటాయి.

DIY Banana And Oatmeal Face Scrub For Sensitive Skin

ఇలాంటి లక్షణాలున్న వారు , సెన్సిటివ్ స్కిన్ ను ఆరోగ్యంగా మరియు బ్యూటిఫుల్ గా మెయింటైన్ చేయడానికి కొన్ని సింపుల్ మార్గాలున్నాయి.అందుకు మీరు చేయాల్సిందల్లా చర్మానికి తగిన స్ర్కబ్ తో డెడ్ స్కిన్ సెల్స్ ను తొలగించుకోవచ్చు, మరియు అదే సమయంలో చర్మానికి తగిన మాయిశ్చరైజర్ ను అందివ్వొచ్చు . వీటి వల్ల ఎలాంటి హాని ఉండదు.

డెడ్ స్కిన్ తొలగించి, చర్మానికి తగినంత తేమను అందించి, చర్మం సమస్యలను మాయం చేసే అలాంటి స్క్రబ్బింగ్ హోం రెమెడీని ఈ రోజు మీకు పరిచయం చేస్తున్నాము.

ఫేస్ స్క్రబ్ కు కావల్సిన పదార్థాలు ప్రధానంగా రెండు. వాటిలో అరటి మరియు ఓట్ మీల్ . ఈ రెండు మన వంటగదిలోచాలా సులభంగా అందుబాటులో ఉండేవి.

ఈ రెండు నేచురల్ ఆహారాలు వల్ల డ్యామేజ్ స్కిన్ ను చర్మంలోపలి నుండి రిపేర్ చేస్తుంది. వీటిలో యాంటీ ఆక్సిడెంట్స్ మరియు యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షనాలు ఎక్కువగా ఉన్నాయి, ఈ పదార్థాలు సెన్సిటివ్ స్కిన్ కు హాని కలిగించవు. నిజానికి ఇవి చర్మాన్ని ఉత్తేజపరుస్తాయి.

మరి ఈ ఎఫెక్టివ్ హోం రెమెడీకి ఏం కావాలి, ఎలా తయారుచేయాలో తెలుసుకుందాం...

DIY Banana And Oatmeal Face Scrub For Sensitive Skin
కావాల్సిన పదార్థాలు:
3టేబుల్ స్పూన్ల ఓట్స్
1 బాగా పండిన అరటిపండు

ఉపయోగించే పద్దతి:
బాగా పండిన అరటిపండును మెత్తగా మ్యాష్ చేసి, అందులో ఓట్ మీల్ పౌడ్ మిక్స్ చేసి , ఈ పేస్ట్ ను ముఖానికి పట్టించి , బాగా స్ర్కబ్ చేయాలి. 10 నిముషాలు సున్నితంగా స్ర్కబ్ చేసిన తర్వాత అరగంట పాటు అలాగే వదిలేసి తర్వాత చల్లటి నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి.

English summary

DIY Banana And Oatmeal Face Scrub For Sensitive Skin

DIY Banana And Oatmeal Face Scrub For Sensitive Skin,Is your skin highly reactive to cosmetics or skin-care products? Does it tend to get red often or cause a burning sensation whenever you apply anything on it?
Story first published: Wednesday, May 18, 2016, 7:50 [IST]
Desktop Bottom Promotion