For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

డ్రై ఫ్రూట్ టోనర్స్ తో అమేజింగ్ లుక్

By Swathi
|

ఫేషియల్ టోనర్స్ అందాన్ని రెట్టింపు చేస్తాయి. అయితే డ్రై ఫ్రూట్ టోనర్స్ మరింత ఎఫెక్టివ్ ఫలితాన్నిస్తాయి. ఫేషియల్ టోనర్స్ చర్మాన్ని స్మూత్ గా మారుస్తాయి. శుభ్రం చేయడమే కాకుండా.. టెక్చర్ ని సాఫ్ట్ గా మారుస్తాయి.

dry fruit toner

మహిళల స్కిన్ కేర్ లో.. ఫేషియల్ టోనర్స్ ని భాగం చేసుకోవాలి. ముఖ్యంగా.. ఆయిలీ స్కిన్ తో ఉండే మహిళలు.. టోనర్స్ ని కంపల్సరీ ఉపయోగించాలి. అయితే.. న్యాచురల్ గా ఇంట్లో తయారు చేసుకునే టోనర్స్ చాలా ఎఫెక్టివ్ ఫలితాన్నిస్తాయి.

అయితే హోంమేడ్ ఫ్రూట్ టోనర్స్ ఈ రోజుల్లో ఎక్కువ పాపులర్ అయ్యాయి. స్కిన్ ఫ్రెండ్లీ ఫ్రూట్స్ ని ఎంచుకుంటే.. వండర్ ఫుల్ ఫలితాలు పొందవచ్చు. నిర్జీవంగా ఉన్న చర్మాన్ని ఆకర్షణీయంగా మారుస్తాయి. మరి.. డ్రై ఫ్రూట్ టోనర్స్ ఎలా చేసుకోవాలో చూద్దామా..

ఆరంజ్ జ్యూస్ టోనర్

ఆరంజ్ జ్యూస్ టోనర్

4 టేబుల్ స్పూన్ల ఆరంజ్ జ్యూస్, అంతే పరిమాణంలో నిమ్మరసం తీసుకోవాలి. కొన్ని చుక్కల ఎసెన్షియల్ ఆయిల్ మిక్స్ చేయాలి. అన్నింటినీ బాగా మిక్స్ చేసి.. స్ప్రే బాటిల్ భద్రపరుచుకోవాలి. దీన్ని రెగ్యులర్ గా ఉపయోగిస్తే.. మంచి ఫలితాలు పొందుతారు.

అవకాడో

అవకాడో

తాజా అవకాడో జ్యూస్ తీసి.. అందులో 3 టేబుల్ స్పూన్ల ఆముదం మిక్స్ చేయాలి. రెండింటినీ బాగా కలిపి.. ఈ మిశ్రమాన్ని ప్రతి రోజూ టోనర్ లా ఉపయోగిస్తే.. అద్భుత ఫలితాలు పొందవచ్చు.

బొప్పాయి

బొప్పాయి

6 ముక్కల తొక్క తీసిన బొప్పాయి, 3 టేబుల్ స్పూన్ల యాపిల్ సైడర్ వెనిగర్ కలిపి.. బాగా మిక్స్ చేయాలి. కాటన్ బాల్ ఉపయోగించి.. టోనర్ లా ముఖానికి పట్టించాలి.

స్ట్రాబెర్రీ

స్ట్రాబెర్రీ

గుప్పెడు స్ట్రాబెర్రీలు తీసుకుని.. మెత్తగా పేస్ట్ చేసుకుని.. నాలుగైదు చుక్కల రోజ్ వాటర్ మిక్స్ చేయాలి. అన్నింటినీ బాగా మిక్స్ చేసి.. బాటిల్ లో స్టోర్ చేసుకోవాలి. కాటన్ బాల్ ఉపయోగించి.. ముఖానికి టోనర్ లా అప్లై చేసుకోవాలి.

టమోటా

టమోటా

బాగా పండిన టమోటాల నుంచి రసం తీసి.. 3 టేబుల్ స్పూన్ల తేనె కలపాలి. ఈ మిశ్రమాన్ని బాగా మిక్స్ చేసి.. చర్మానికి ప్రతిరోజూ పట్టించుకుంటే.. అద్భుత ఫలితాలు పొందవచ్చు.

English summary

DIY Fruit Toners For Glowing Skin

DIY Fruit Toners For Glowing Skin. Facial toners have been making waves in the beauty community for the past few years.
Desktop Bottom Promotion