For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

డూ ఇట్ యువర్ సెల్ఫ్ : డార్క్ సర్కిల్స్ నివారించే టమోటో & లెమన్ రిసిపి

|

మనిషిని చూడగానే ముందుగా ఆకర్షించేవి కళ్లు. ఆ కళ్లు నిశ్శబ్దంగానే ఎన్నెన్నో భావాలను పలికిస్తాయి. అటువంటి అందమైన కళ్లకింద... ఒత్తిడి కారణంగా నల్లటి వలయాలు(డార్క్ సర్కిల్స్) ఏర్పడతాయి. నల్లటి వలయాలతో నిస్తేజంగా ఉన్న కళ్లు ముఖ అందాన్ని పోగొట్టడమే కాదు, మనం తీవ్ర ఒత్తిడిలో ఉన్నామనే విషయాన్ని బహిర్గతం చేస్తాయి. ఇంగ్లీషులో డార్క్ సర్కిల్స్ అనే ఈ వలయాలు వయసు పైబడట్టుగా, అనారోగ్యంగా, అలసిపోయినట్టుగా బయటి వారికి తెలియజేస్తాయి.

డార్క్ సర్కిల్స్ (కళ్ళ చుట్టు, నల్లని వలయాలు)ఆకర్షణీయంగా లేని ఒక లోపం. ఇది పురుషుల్లో కూడా వారి అందాన్ని తగ్గిస్తుంది. చాలా సందర్భాల్లో నల్లని వలయాలకు ప్రధానకారణం అనారోగ్యకర జీవనశైలి. నల్లని వలయాలకు మరికొన్నిఇతర కారణాలు సూర్యరశ్మి, తగినంత నిద్రలేకపోవడం, నీరు తగినంత త్రాగకపోవడం, సరైన ఆహారం తీసుకోకపోవడం,డ్రై స్కిన్, ఏజింగ్, ఫిజికల్ స్ట్రెస్ మరియు కళ్ళను తరచూ రుద్దడం, జన్యుపరమైన కారణం అనిచెప్పవచ్చు. నల్లని వలయాలకు కారణాలు తెలుసుకొన్నట్లైతే వాటిని నివారించండానికి సమర్థవంతంగా చికిత్స అందించే అవకాశం ఉంటుంది. కొన్ని సందర్భాల్లో అధిక ఒత్తిడి మరియు నిద్రలేమి వల్ల కళ్ళ క్రింది నల్లని వలయాలకు ముఖ్యకారణం అవుతుంది కాబట్టి, మీ జీవనశైలిలో మార్పలు చేసుకోవడం ఎంతైన ఉంది. సరైన సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోలేదంటే ఇతర ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది.

కళ్ల కింద నల్లని వలయాలుంటే డల్‌గా కనిపిస్తాం.అందుకని వాటిని కన్‌సీలర్‌తో కవర్‌ చేసే ప్రయత్నం చేయకూడదు. ఈ నల్లటి వలయాలను తగ్గించడానికి ఇటీవల కాలంలో మార్కెట్లోకి రకరకాల క్రీమ్ లు వచ్చాయి. అయితే వాటిని రాయటం వల్ల ఉపశమనం ఉండదని, ఒత్తిడిని తగ్గించే సహజపద్దుతులని వాడటం వల్ల బ్లాక్ సర్కిల్స్ ను తగ్గించుకోవచ్చని నిపుణులు అంటున్నారు. నల్లటి వలయాలను తగ్గించేందుకు చాలా సహజపద్దతులు ఉన్నాయి.

అలాంటి సహజ పద్దతుల్లో ఒకటి చాలా సులభమైనది మీరు ఇంట్లోనే మీ వంటగదిలో వస్తువును ఉపయోగించి సొంతంగా తయారుచేసుకోవచ్చు . ఈ రెమెడీతో డార్క్ సర్కిల్స్ గ్రేట్ గా తొలగిపోతాయి.

ఇంట్లో తయారుచేసుకొనే ఈ హోం రెమెడీ చాలా ఎఫెక్టివ్ గా, సురక్షితంగా పనిచేస్తాయి. అవేంటంటే టమోటో మరియు నిమ్మరసం . ఈ రెండు పదార్థాలు నేచురల్ బ్లీచింగ్ పదార్థాలుగా పనిచేస్తాయి . ఈ రెండింటిని మిక్స్ చేయడం వల్ల చాలా వండర్ ఫుల్ గా పనిచేస్తాయి . దాంతో డార్క్ సర్కిల్స్ ను ఎఫెక్టివ్ గా తొలగిస్తాయి.

మరి డార్క్ సర్కిల్స్ నివారించడానికి కావల్సిన పదార్థాలు:
టమోటో గుజ్జు
లెమన్ జ్యూస్
శెనగపిండి

తయారుచేయు పద్దతి:
1. ఒక బౌల్ తీసుకొని అందులో ఫ్రెష్ గా ఉండే నిమ్మకాయ రసాన్ని పిండాలి, అలాగే ఒక టీస్పూన్ టమోటో గుజ్జు మరియు 1/4 శెనగపిండి , మూడింటిని మిక్స్ చేసి మెత్తగా పేస్ట్ చేయాలి.
2. తర్వాత ముఖం శుభ్రంగా కడుక్కుని, తేమలేకుండా టవల్ తో తుడిచి తర్వాత ఈ పేస్ట్ ను కళ్ళ క్రింద నల్లని వలయాలున్న ప్రదేశంలో అప్లై చేయాలి.. ఈ పేస్ట్ కళ్ళలోకి పడకుండా అప్లై చేసుకోవాలి. ఏదైనా అసౌకర్యంగా, మంట, దురదగా ఉంటే వెంటనే శుభ్రం చేసుకోవాలి..
3. ఇలా పేస్ట్ అప్లై చేసుకొన్న తర్వాత 20నిముషాలు రిలాక్స్ గా ఉండాలి.
4. 20 నిముషాల తర్వాత చల్లటి నీటితో శుభ్రంగా కడిగి సాప్ట్ టవల్ తో శుభ్రం చేసుకోవాలి.
ఈ హోం రెమెడీని మీరు తిరిగి మూడు నాలుగు రోజుకొకసారి ప్రయత్నించవచ్చు, ఒక వారంలోనే మార్పును మీరు గమనిస్తారు .

వీటితో పాటు మీరు గుర్తుంచుకోవల్సిన మరికొన్ని విషయాలు ఫ్రెష్ గా ఉండే నిమ్మకాయరసాన్ని మరియు టమోటోలను ఉపయోగించాలి . అలాగే పేస్ట్ మిగిలింది కాదా తర్వాత ఉపయోగించుకోవచ్చని నిల్వచేయకూడదు , ఎప్పుడు ప్యాక్ వేసుకోవాలన్ని ఫ్రెష్ గా తయారుచేసుకోవాలి.

అలాగే హెల్తీ డైట్ మరియు ఫ్రూట్ , వెజిటేబుల్స్ తీసుకోవాలి,. ఎక్కువ నీరు త్రాగాలి , కనీసం 8 గంటల నిద్ర తప్సనిసరి.

English summary

DIY: Tomato & Lemon Recipe To Cure Dark Circles Naturally

Dark circles are discolourations under your eyes, which make you look exhausted all the time.A various set of reasons can cause those dark circles to develop under your eyes. Like ageing, dry skin, herdity, unhealthy diet, physical stress, etc.
Story first published: Saturday, April 30, 2016, 10:40 [IST]